loading

షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?

  • Home
  • Blog
  • షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?

షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?

డిసెంబర్ 26,2019 నాడు షష్ట గ్రహ కూటమిలో సంభవించిన సూర్య గ్రహణం జరిగిన తరుణంలో మానవాళికి జరుగబోవు దుష్పరిణామాలు శ్రీ C.V.S.చక్రపాణి గారు ముందుగానే వివరించడం జరిగింది.  వారి వద్ద ఉన్న ప్రాచీన కేరళ తాళపత్రముల నుండి సేకరించిన విషయంలో అతి భయంకరమైన వ్యాధులు మానవాళిని నాశనం చేయబోతోందని మరియు తీవ్రమైన భూకంపాలు, జల ప్రళయాలు సంభవించబోతున్నాయని ముందుగానే తెలియజేయటం జరిగింది. సరిగ్గా 60 సంవత్సరాల క్రితం అనగా 1959లో వికారి నామ సంవత్సరంలో ‘హంటా వైరస్’ అనే సూక్ష్మ క్రిమి మానవులకు సోకింది. ఈ వైరస్ కారణంగా ఎంత మంది మరణించారో లెక్కపెట్టలేకపోయారు. అప్పటివరకూ ‘హింది-చిన్ని భాయ్ భాయ్’ అని నినాదంతో మెలిగిన చైనీయులు, భవిష్యత్తులో భారతదేశంతో ఎలాంటి యుద్ధాలు ఉండవని ప్రకటించిన చైనీయులు, 1959 వికారి నామ సంవత్సరములో భారతదేశానికి మరియు చైనా దేశానికి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఆ తరువాత 1962 సంవత్సరంలో అష్టగ్రహ కూటమిలో జరిగిన సూర్య గ్రహణం తరువాత భారత దేశానికి మరియు చైనా దేశానికి మధ్య జరిగిన యుద్ధంలో భారత దేశం పరాజయం పాలైంది. ఆ తరువాత సరిగ్గా 2019లో జరిగిన షష్ట గ్రహ కూటమిలో కేతు గ్రస్త సూర్య గ్రహణం సంభవించింది. ఈ గ్రహణం సంభవించిన తరువాత నాలుగు రోజులకి కరోనా వైరస్ అనే మహమ్మారి మొదట చైనా దేశంలో సంభవించింది. ఎందుకనగా సూర్య గ్రహణం ధనూరాశిలో ఏర్పడింది. ధనూరాశి తూర్పు దిక్కును సూచిస్తుంది. అందుకే తూర్పు దేశం అయిన చైనాలో ఈ తెలియని వైరస్ తయారయ్యింది. మార్చి నెల 21 వరకు కుజుడు ధనూరాశిలోనే ఉన్నాడు. అందుకే ధనూరాశిలో సూర్య గ్రహణం జరిగిన తరువాత కుజుడు ఫిబ్రవరి నెలలో ధనూరాశిలోకి ప్రవేశించాడు. ఆ సమయం నుండి ఈ కరోనా అను అంటువ్యాధి ప్రపంచమంతా నెమ్మదిగా పాకటం మొదలయ్యింది. అయితే ఔషధ కారక గ్రహం మరియు భూమిని పరిపాలించే రవి ఏప్రిల్ 14,2020 ఉచ్చస్థానమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయం నుండి భూమి పై ఉన్న ప్రజలకు రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఈ వ్యాధి పూర్తిగా అంతరించిపోవడానికి జూన్ నెలలో వచ్చే సూర్య గ్రహణం పూర్తి కావాలి. మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం వ్యాధులు ప్రబలడానికి కారణాలు ఏమనగా గ్రహ కూటములు, గ్రహణాలు, వ్యాధుల వల్ల ఎలాంటి గ్రహ జాతకులు మృత్యువు పాలవుతున్నారు, ఎవరిది సాధారణ మరణం, ఎవరిది బలవన్మరణం, అసాధారణ మరణం ప్రాప్తిస్తుందో తెలిపేదే మెడికల్ ఆస్ట్రాలజి.

Solar Eclipse-2019                             

ఈ మెడికల్ ఆస్ట్రాలజి ద్వారా వ్యక్తుల జీవితంలో ఎదుర్కొనే దీర్ఘకాలిక వ్యాధులు తెలుసుకొని, ధన్వంతరీ శాస్త్రం ద్వారా పరిష్కారములు, నివారణలు, నిర్మూలనలు జరపవచ్చు.

  • 2020 మార్చి, మే, జూన్, సెప్టెంబర్ నెలలో అతి తీవ్రమైన భూకంపాలు సంభవించును.
  • ఏప్రిల్, మే, జూన్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో తీవ్రమైన పెను తుఫాను సంభవించును.

ఈ శార్వరి నామ సంవత్సరంలో జగన్మాత ప్రాతినిద్యం వహిస్తుంది. అందువల్ల ఆ జగన్మాతను కింది మంత్రముతో జపించడం వల్ల నవనాయకులు అనగా నవగ్రహాలు కొంత అనుకూలంగా ఉండటం జరుగుతుంది. కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల వ్యక్తులు దారుణమైన మానసిక, ఆరోగ్య, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ కలి ప్రభావాన్ని మానవులు తట్టుకోలేక సతమతమవుతారు. కలి ప్రభావాన్ని తగ్గించి కలిపురుషుని దృష్టిని మరల్చగల శక్తి, కాలాన్ని సైతం తన ఆధీనంలో ఉంచుకోగలిగిన శక్తి కాలభైరవునికి ఉంది. కలియుగంలో కలిపురుషుడు కలిగించే చెడు సంఘటనలను మానవులు ఎదుర్కొనే శక్తిని అష్ట భైరవులు ప్రసాదిస్తారు. సాత్విక పూజలు ఫలించే తరుణం ఇది కాదు. వామాచార విధానంలో ప్రతీ వ్యక్తి అష్ట భైరవ పూజలు జరుపుకొని శీఘ్రంగా ఇష్టకార్యసిద్ధి, గ్రహదోష దృష్టి, అవయోగాలు పరిష్కారమవుతాయి. ఈ తాంత్రిక పద్ధతులు శ్రీ C.V.S.చక్రపాణి గారి వేద నారాయణ అధర్వణ పీఠము నందు (పాలక్కాడ్-కేరళ, పాలమంగళం-ఆంధ్ర ప్రదేశ్) వారి తంత్ర పీఠము నందు గ్రహదోష పరిహారములు జరుగును. ఈ పీఠము నందు అత్యంత నిష్టగా, శ్రద్ధగా, శాస్త్రోక్తంగా, వామాచార విధానంలో నాగ దోష పరిహారములు జన్మకుండలిలో ఉన్న గ్రహదోషాల వల్ల వ్యక్తులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు ఈ తంత్ర పీఠములో పరిహారములు ఖచ్చితముగా జరుగును.

ఖచ్చితమైన మరియు సంపూర్ణమైన జ్యోతిష్య పరిశీలన పరిజ్ఞానం ఉన్నప్పుడే కదా దానికి పరిహారం చెప్పగలిగేది.

దైవజ్ఞ శ్రీ C.V.S.చక్రపాణి గారి పరిపూర్ణమైన జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానంతో, సంపూర్ణమైన విశ్వాసంతో జన్మకుండలి పరిశీలన చేసి మీకు గల యోగాలు, అవయోగాలు, పరిష్కారములు తెలిపి, పరిహారములు వీరి తంత్ర పీఠం నందు జరిపించి మాకు సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రాప్తింపజేయుటకు సంకల్పించారు.

ఈ శార్వరి నామ సంవత్సరంలో నాగ యక్షిణి అమ్మవారు సంవత్సరానికి సంవత్సర ఫలదాయకులకు ప్రాతినిద్యం వహించి ఉంటారు.

ఈ శార్వరి నామ సంవత్సరంలోనైనా సరే అందరూ గ్రహ దోషములు నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నాను. హైందవ ప్రజలందరూ శ్రీ శార్వరి అమ్మవారి అనుగ్రహం కటాక్షం పొందాలని సుఖసంతోషాలతో తలతూగాలని కోరుకుంటున్నాను.

     ఇట్లు

     వేద నారాయణ అధర్వణ తంత్ర పీఠం

     పాలమంగళం (ఆంధ్రప్రదేశ్)

     పాలక్కాడ్ (కేరళ)    

Email: chakrapani.vishnumaya@gmail.com                       Ph: 9846466430

Related Articles:

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X