జాతకంలో 6వ స్థానం అంటే కేవలం రుణాలు, రోగాలు, శత్రువులేనా? దీని వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి?
జన్మకుండలిలో 6,8, 12 వ స్థానాలను దుస్థానాలుగా ప్రస్తావిస్తారు. అయితే ఈ దుస్థానాల వల్ల ఎన్నో సమస్యలను జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ స్థానాలలో ఉన్న గ్రహాలను బట్టి, వాటి బలములను బట్టి, జాతకుడి యొక్క ఫలితములు ఆధారపడి ఉంటాయి. అష్టమ స్థానం గురించి నేను ఇదివరకే వివరించాను. దాని గురించి ఇక్కడ చదవండి. ఇప్పుడు 6వ స్థానం గురించి వివరిస్తాను.

జాతకంలో ఆరవ స్థానం దేనిని సూచిస్తుంది?
జన్మకుండలిలో 6వ స్థానమును శతృ, రోగ, ఋణ స్థానముగా చెప్పబడుతుంది. జాతకుడికి వచ్చే అనారోగ్య సమస్యలను, ఋణాలను, శతృవులను, కోర్టు సమస్యలను, జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఈ 6వ భావం తెలియజేస్తుంది. వీటితో పాటుగానే జాతకుడికి ఉన్న క్రమశిక్షణ, రోజు వారి బాధ్యతలు, జాతకుడు చేసే సేవలు, జాతకుడు ఎదుర్కొనే క్లిష్టమైన పరిస్థితులు, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం వంటి అంశాలను కూడా ఈ 6వ స్థానం తెలియజేస్తుంది.
సులభంగా చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను. ఉదాహరణకు, ఒక వ్యక్తి అప్పులు చేసి ఉంటాడు అనుకుందాము. కానీ దానిని తిరిగి చెల్లించడానికి ఆదాయం లేక, మళ్ళీ అప్పు చేయడం, అలా అప్పులు పెరుగుతూనే ఉంటాయి అనుకుందాం. మరి ఆ అప్పులను తిరిగి చెల్లించడానికి జాతకుడు ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు? ఆర్థిక బాధ్యతలను ఏ విధంగా నిర్వహించగలుగుతాడు?తోటి ఉద్యోగులతో లేదా పై అధికారులతో వీరికి ఏ విధమైన బంధం ఉంటుంది? ఏ విధమైన వివాదాలలో చిక్కుకుంటారు? ఇలాంటివి అన్నీ కూడా జాతకుడి యొక్క 6వ స్థానం ద్వారా తెలుస్తుంది.
జీవితంలో ఎక్కువగా దెబ్బ తీసే అంశాలలో అప్పులు, అనారోగ్య సమస్యలు, కోర్టు వివాదాలు, పోటీలు, శతృత్వాలు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ 6వ స్థానంలో పాప లేదా నీచ గ్రహం ఉన్నట్లైతే, జాతకుడికి ఈ సమస్యల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆ గ్రహ సంబంధిత మహాదశ, అంతర్దశ సమయాలలో ఎక్కువగా ఉంటుంది.
ఆరవ స్థానం ఉపచయ స్థానం కూడా!
ఆరవ స్థానం కేవలం శతృ, రోగ, ఋణ స్థానమే కాకుండా, ఉపచయ స్థానంగా కూడా చెప్పబడుతుంది. జీవితంలో ఎంత కష్టపడినా కూడా ఎందుకు విజయం రావడం లేదు? అన్న అంశాన్ని ఇదివరకే వివరించాను. ఇక్కడ చదవవవ్చు. ఉపచయం అంటే కాలక్రమేణా అభివృద్ధి చెందడం లేదా వృద్ధి చెందడం అని అర్థం. ఈ స్థానానికి సంబంధించిన ఫలితాలు జాతకుడి యొక్క వయస్సు, అనుభవం, ప్రయత్నం, పరిస్థితులను ఎదుర్కొనే విధానం ఆధారంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ అంశం తెలుసుకొనుటలో ఈ ఆరవ స్థానం కీలక పాత్రను పోషిస్తుంది.
ఆరవ స్థానం శత్రువులను మాత్రమే కాదు, వారిని ఎదుర్కొనే శక్తిని కూడా సూచిస్తుంది
ఆరవ స్థానం శతృవులను కూడా సూచిస్తుంది అని చెప్పుకున్నాము కదా. అయితే, మనకు శత్రువులు ఉన్నారు అంటే, వారు తప్పక మనకు హాని కలుగజేస్తారు అని అర్థం కాదు. జాతకుడు తన శతృవులను జయించగలడా? శత్రువుల చేతిలో మోసపోతాడా? ఈ అంశాలు అన్నీ కూడా ఈ ఆరవ స్థానం ద్వారా తెలుసుకోవచ్చును. కానీ నేటి ఆధునిక జీవితంలో శత్రుత్వం, పోటీ అనేవి అనేక రూపాల్లో కనిపిస్తాయి.
ఉద్యోగంలో సహోద్యోగులతో ఎదురయ్యే పోటీ, వ్యాపారంలో పోటీదారుల నుంచి ఎదురయ్యే సవాళ్లు, కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు, పోటీ పరీక్షల్లో ఇతర అభ్యర్థులతో పోటీ, మన ఎదుగుదలకు అడ్డంకిగా మారే వ్యక్తులు లేదా పరిస్థితులు, మనల్ని దెబ్బ తీయాలని మనపై చేసే కుట్రలు, మనపై చేసే అభిచార కర్మలు అనగా చేతబడులు, మనపై చేసే పన్నాగాలు వంటివి అన్నీ కూడా ఈ ఆరవ స్థానం తెలియజేస్తుంది. శతృవుల చేతిలో జాతకుడు దెబ్బ తింటాడా? లేక శతృవులను జయిస్తాడా? అన్న అంశములు కూడా జన్మకుండలిలోని ఈ ఆరవ స్థానమే తెలియజేస్తుంది.
శతృవులను జయించడానికి ఏ విధమైన గ్రహస్థితి ఉండాలి?
జన్మకుండలిలో ఆరవ స్థానం అనుకూలంగా ఉండి, ఆరవ స్థానాధిపతి కూడా బలంగా ఉన్నప్పుడు జాతకులకు ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం, పోటీలో నిలబడే శక్తి ఉంటుంది. ప్రత్యర్థులు ఉన్నప్పటికీ వారిని తెలివిగా, ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఈ విధమైన గ్రహస్థితి ఉన్న జాతకులు తమ శతృవుల పై విజయం సాధిస్తారు.
మరి మీ జన్మకుండలిలో ఆరవ స్థానం మీ ఋణ, శత్రు, రోగముల గురించి ఏమి చెబుతోంది? ఇది తెలియాలంటే నిష్ణాతులైన జ్యోతిష్యుల చేత మీ జన్మకుండలి పరిశీలన చేయించుకోవాలి.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. పరిశీలన కొరకు ఈ లింకుని క్లిక్ చేయండి.
