జన్మకుండలిలో గురువు అనుకూలంగా ఉంటే, ప్రతికూలంగా ఉంటే ఫలితాలు
జన్మకుండలిలో గురువు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జన్మకుండలిలో గురువు జాతకుని యొక్క కుటుంబం, ఆర్థిక స్థితి, ఆధ్యాత్మిక విలువలు, సాంప్రదాయాలు, బంగారం, పేరుప్రతిష్టలు, మేధస్సు, జ్ఞానం, రక్తంలో చెక్కర స్థాయిలు, శరీరంలో ఉన్న కొవ్వు, గురువులు, ఆధ్యాత్మిక గురువులు వంటి అంశములు అన్నీ కూడా గురువు ఆధీనంలో ఉంటాయి. గురువు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచరించుటకు ఒక సంవత్సర కాలం పడుతుంది. ప్రతీ సంవత్సరం దాదాపు 4 నెలల పాటు వక్రగతిలో సంచరిస్తాడు.

జన్మకుండలిలో గురువు అనుకూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు:
- జన్మకుండలిలో గురువు అనుకూలంగా ఉన్న జాతకులకు, ఉన్నత చదువులు, క్రమశిక్షణ మరియు ప్రణాళిక బద్ధమైన జీవనశైలి, చేసే పని లేదా వృత్తి పై అమిత జ్ఞానం, ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది.
- గురువు అనుకూలంగా ఉన్న జాతకులు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం ఇష్టపడరు. కేవలం అవతలి వారికి అవ్సరమయ్యే సలహాలు ఇస్తారు గాని నిర్ణయాలు వారే తీసుకోవాలని వారికే వదిలేస్తారు.
- గురువు అనుకూలంగా ఉన్న జాతకులకు బాధ్యత, పదవీ, ఉన్నత స్థాయి గల వృత్తి లేదా ఉద్యోగం ఉంటుంది. వివాదాస్పద అంశాల నుండి పక్కకి తప్పుకుంటారు.
- గురువు అనుకూలంగా జాతకులు తమకు ఎంతో ప్రియమైన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు సమస్యల్లో ఉంటే, వీరు మాత్రం రూల్స్ ప్రకారం జరగాలి అన్నట్టుగా, వారికి సహాయం చేయరు.
- గురువు అనుకూలంగా ఉండే జాతకులు, తాము ఆలోచించే కోణమును ఎవరైనా వ్యతిరేకిస్తే, వారిని జీవితాంతం శత్రువులుగా పరిగణిస్తారు.
- గురువు అనుకూలంగా ఉన్న జాతకులకు సైన్సు మీద, అదే విధంగా తమ వృత్తి మీద అమిత జ్ఞానం కలిగి ఉంటారు.
- గురువు అనుకూలంగా ఉన్న జాతకులకు డబ్బు సంపాదించడం అనేది ఎప్పటికీ సమస్యగా ఉండదు. దాదాపుగా గురువు అనుకూలంగా ఉన్న వారందరూ కూడా సౌకర్యవంతమైన జీవితాన్నే జీవిస్తారు.
- గురువు అనుకూలంగా ఉన్న జాతకులకు ఆధ్యాత్మిక భావన, దేశ భక్తి, అధికంగా ఉంటుంది.
- ఈ జాతకులకు వీరి కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తారు. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి వీరు ఆలోచించే కోణమును వ్యతిరేకిస్తారు. వీరి సంతానం వీరి మాట వినకపోవడం లేదా వీరి అంచనాలకు తగ్గట్టు జీవించకపోవడం జరుగుతుంది. ఈ సంధర్భాలను బంధువులు ఆసరాగా తీసుకొని వీరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు.
- వయస్సు పెరిగే కొద్ది ఊబకాయం, కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధులు రావచ్చును.
- గురువు అనుకూలంగా ఉన్న జాతకులు మంచి రచయితలగానూ, చరిత్రకారులుగా, వక్తలుగా, ప్రవక్తలుగా పేరొందుతారు. కానీ వీరి ప్రవర్తనలో చాకచక్యం లోపించడం వలన శతృవుల సంఖ్య అధికంగా ఉంటుంది.
జన్మకుండలిలో గురువు ప్రతికూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు ఏమిటి?
- జన్మకుండలిలో గురువు ప్రతికూలంగా ఉన్న జాతకులలో కొందరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు. అయినా గాని, వారి ఆలోచనలు మాత్రం చాలా చిన్న స్థాయిలో ఉంటాయి అని చెప్పాలి. ఉదా: గురువు ప్రతికూలంగా ఉన్న ఒక జాతకుడు ఒక దేశానికి ప్రధానమంత్రి అనుకుందాం, అతనికి తన క్రింద పని చేసే ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ విధంగా అన్నమాట.
- గురువు ప్రతికూలంగా ఉన్న జాతకులు, తమ దగ్గర లక్షల కొద్ది సొమ్ము మూలుగుతున్నా కూడా, ఒక రూపాయి కోసం అయినా సరే సులభంగా అబద్ధం చెప్పేస్తారు. తమ పేరు మారుమోగుతుంది అనుకుంటే మాత్రమే దానములు చేస్తారు.
- గురువు ప్రతికూలంగా ఉన్న జాతకులు ఎంతో చాకచక్యంగా ఇతరుల నుండి సమాచారమును సేకరించగలరు.
- గురువు ప్రతికూలంగా ఉన్న జాతకులు ఒక పని కోసం ఒక మనిషిని ఏర్పాటు చేసి, ఆ మనిషి సరిగ్గా చేస్తున్నాడా లేదా అని అతనిని గమనించడానికి ఇంకొక మనిషిని ఏర్పాటు చేసే వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
- గురువు ప్రతికూలంగా ఉన్న జాతకులకు ఎవరైనా తమ రహస్యాలు చెప్పుకుంటే, వాటిని వీరు బయటకు చెప్పడం గాని లేదా వాటి ద్వారా సొమ్ము చేసుకోవడం గాని చేస్తారు.
- గురువు ప్రతికూలంగా ఉన్న జాతకులకు ముఖ్య లక్ష్యం డబ్బు మాత్రమే. దాని కోసం వారికి ఎన్ని విధాలుగా, ఎన్ని మార్గాల నుండి అయినా సంపాదించడానికి ప్రయత్నిస్తారు.
- గురువు ప్రతికూలంగా ఉన్న పురుష జాతకులలో కొందరు తమ భార్యని, ఆడపిల్లలని కాకుండా కొడుకుల మీద ప్రేమ చూపించి, పక్షపాతం చూపుతారు. ఈ బుద్ధి ఈ జాతకులకు వృద్ధాప్యంలో తిరిగి కొడుతుంది.
- గురువు ప్రతికూలంగా ఉన్న జాతకులు తమ కుటుంబం గురించి అందరూ గొప్పగా అనుకోవాలని, తమ పిల్లల గురించి, తమ ఆస్తుల గురించి లేని పోనీ అబద్ధాలు, హెచ్చులు చెబుతారు.
- గురువు ప్రతికూలంగా ఉన్న జాతకుల వద్ద నుండి అప్పులు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే తిరిగి చెల్లించేదాకా తీవ్రమైన హింస పెడతారు.
- దేవుడిని, మతమును, ఆధ్యాత్మిక కార్యక్రమాల పేర్లను అడ్డం పెట్టుకొని వీరిలో కొందరు డబ్బుని సేకరించి, వాటిని దుర్వినియోగం చేస్తారు.
- ఈ జాతకులు తరచూ స్నేహితులను, శత్రువులను మారుస్తూ ఇంటారు. చాలా వరకు ఈ మార్పు కేవలం వారి వ్యక్తిగత కారణాల వలన గాని, వ్యక్తిగత ప్రయోజనాల కొరకు గాని అయ్యి ఉంటుంది.
- వీరి ముఖం పై కనిపించే భావన, మనసులో ఉన్న భావనా వేరుగా ఉంటాయి.
ముఖ్య గమనిక:
జన్మకుండలిలో గురువు అనుకూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. అదే విధంగా, గురువు ప్రతికూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. వ్యక్తిగత జన్మకుండలిలో (Personal horoscope) గురువు స్థితి చెంది ఉన్న భావం, రాశి, లగ్నమును బట్టి ఫలితములు మారతాయి. దీనిని కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించి ఫలితములను వివరించగలరు.
జన్మకుండలిలో గురువు ప్రతికూలంగా ఉన్నాడా లేదా అనుకూలంగా ఉన్నాడా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి?
ఈ విషయాన్ని కేవలం జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించగలరు. ఈ ఫలితాలు అన్నీ అందరికీ వర్తించవు. జాతకుని యొక్క లగ్న భావమును, గురు గ్రహ స్థితిని అనగా రాశిని, సంగమించిన గ్రహాలను ఆధారం చేసుకొని మాత్రమే ఫలితాలను నిర్ణయించాలి.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. https://brahmatantra.com/complete-horoscope-reading-telugu/
Related Articles:
- జన్మకుండలిలో శని అనుకూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు, ప్రతికూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు జాతకుడు పొందుతాడు?
- జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు, ప్రతికూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు జాతకుడు పొందుతాడు?
- శని చంద్ర గ్రహాల కలయిక వలన ఏర్పడే విష యోగ ఫలితాలు ఏమిటి?
- శని చూపించు విషతుల్య యోగం యొక్క ప్రభావములు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
