ఈ జాతకమున చేయవలసిన ముఖ్య దోష పరిశీలన:
- తనూభవ దోషం (లగ్న శని)
- రాహు గ్రహ ధగ్ధ యోగ దోషం (12 రాహువు)
- కేతు గ్రహ రవి సంగమ ఆయుఃక్షీణ దోషం (రవి+కేతు)
జాతకుని పేరు : నరేంద్ర
జాతకుడు పుట్టిన తేదీ: 20-06-1991
జాతకుడు పుట్టిన సమయం: 09:30 PM
జాతకుడు పుట్టిన స్థలం: అనంతపురం
జాతక విశ్లేషణ:
- లగ్నాధిపతి శని లగ్నంలో ఉండటం వల్ల జాతకునికి శని మిశ్రమ ఫలితమును ఇవ్వడం వల్ల ధృఢమైన మనస్తత్వం కలిగి ఉండి చామన ఛాయ కలిగి చర్మ సంబంధిత సమస్యలతో అనారోగ్య భావం జాతకునికి సమస్యలు ఎదురవుతాయి.
- ధనస్థాన, నేత్ర స్థానాధిపతి శని స్వస్థానంలో ఉండినందున ‘కారకొభావనాశాయ’ అన్నట్టుగా, ఆ స్థానంలో కారక గ్రహములు శని ధనాధి విషయాలలో మిశ్రమ ఫలితాలు ఇవ్వడం వల్ల అత్యంత కష్టతరమైన జీవన విధానం ద్వారా ధనం ఆర్జించడం జరుగును.
- తృతీయాధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చంలో ఉండటం వల్ల అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళలో కొందరు అభివృద్ధిలోకి వస్తారు. కాని వారి వలన మానసికమైన దిగుళ్లను, బాధ్యతలను భరించాల్సి వస్తుంది.
- జాతకుని అక్కాచెల్లెళ్ల విషయాలలో భార్య అజమాయిషీ వలన జాతకుడు భార్యతో వైరమును కలిగి ఉండును. తోబుట్టువులలో ఎవరో ఒకరు అనారోగ్య సమస్యను, అపమృత్యు దోషమును కలిగి ఉండి చిన్న వయస్సులోనే గండములను ఎదుర్కోవడం జరుగుతుంది.
- గృహ స్థాన, విద్యా, స్థాన, వాహన స్థానాధిపతి కుజుడు కర్కాటకమందు నీచ స్థితిని పొందడం వల్ల మాతృ సౌఖ్యం, విద్యా యోగం, గృహసౌఖ్యం, నశించును.
- కుజ దోషం ప్రాప్తించడం వల్ల వివాహం ఆలస్యం అగును. ఇష్టపడి వివాహం చేసుకొనుట జరుగును. కుటుంబం నందు అన్యోన్యత, ఐకమత్యం, మాతృ సౌఖ్యం నశించును (భార్య కారణముగా).
- పంచమాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో స్వస్థానంలో ఉండినందున సంతానం వీరి మాట వినరు. సంతానం వీరికి దూరమగును. స్త్రీ సంతానం కలుగును. భార్య కారణముగా కొంత సహాయ సహకారములు అందినప్పటికి, భార్య గోప్యమైన మనస్సు, ధనాపేక్ష గల బుద్ధి, దురాశ, ఆధిపత్య ధోరణి, కుటిలత్వం కలిగి ఉండి జాతకుడిని విసిగించును.
- వీరి జీవితములో ద్వితీయ వివాహం జరుగును లేదా పర స్త్రీ సాంగత్యం ఏర్పడును.
- అష్టమాధిపతి ఆయుః కారకుడైన రవి మిధునంలో బుధునితో కలసి ఉండటం వల్ల, జాతకునికి గండములు కలుగును.
- పితృ స్థానములో చంద్రుని వలన పితృ భాగ్యమును స్వల్పముగా ఆభరణముల రూపంలో, స్వల్ప గృహ, భూ స్థిరాస్థి రూపంలో పొంది, తరువాతి కాలంలో కోల్పోవును.
- దశమాధిపతి శుక్రుడు కర్కాటకంలో స్థితి పొందుట వలన అనిశ్చితమైన వృత్తి, వ్యాపారాదులు ఉండును.
- ద్వాదశంలో రాహువు ప్రతికూలత వలన దగ్ధ యోగము కలిగి తంత్ర ప్రయోగములకు గురి కావడం, కిడ్నీ సమస్యలకు, నరముల సమస్యలకు, గండములకు గురి కావడం జరుగుతుంది.
- గత జన్మలో ఈ జాతకులు వేద పండితులను అకారణంగా అవమానించి బాధకు గురి చేసినందుకు, ఈ జన్మలో ఈ జాతకుల చుట్టూ పక్కల వారి నుండి, భార్య నుండి తీవ్రమైన వ్యతిరేకతను, అపార్థాలను ఎదుర్కొంటారు. దీని కారణంగా జాతకులు మానసిక దిగులుకు లోనవుతారు. భార్య నుండి విడిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
- గత జన్మలో ఈ జాతకులు డబ్బు పై ఆపేక్షతో తీర్పులను తప్పుగా ఇస్తూ ప్రజలను మోసం చేసేవారు. కారణంగా ఈ జన్మలోఈ జాతకులకు దైవనుగ్రహం అంత సులువుగా లభించదు. మానసికమైన దిగుళ్ళకు లోనవుతారు.
ఈ జాతకునికి కలిగిన తనుభావ దోష విశ్లేషణ:
- ఈ జాతకుల జన్మకుండలిలో 1వ స్థానం అనగా లగ్నంలో మకరరాశిలో శని స్వస్థాన కారకుడై ఉండటం వల్ల శని ఆ స్థానంలో ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆ రాశిలో, ఆ లగ్నంలో బలంగా ఉంటాడు. అయితే ఏ గ్రహం అయినా తన సొంతరాశిలో ఉండటం వల్ల ఆ జాతకునికి ఆ గ్రహం యొక్క లక్షణాలను ఇవ్వడం జరుగుతుంది. అందుకారణంగా శని యొక్క లక్షణాలు జాతకునిపై వ్యతిరేకంగా ఉండటం కారణంగా పాపభూయిష్టమైన ఆలోచనలు స్పురింపజేయుట, అనారోగ్యపు లక్షణాలు కలిగి ఉండుట, చర్మ సంబంధిత రోగాలు, వచ్చే మంచి అవకాశాలను వాదులుకునే మూర్ఖపు పట్టుదల, జీవితంలో రాబోయే విలాసవంతమైన, ఐశ్వర్యపూరితమైన జీవితాన్ని వదులుకునేలా చేయటం, ఉదర సంబంధ, ముఖ సంబంధ, శిరో సంబంధ, హృదయ సంబంధ, ఛాయా సంబంధిత, నేత్ర సంబంధిత అనారోగ్యాన్ని అవయోగాలను ఈ జన్మ శని ప్రాప్తింపజేస్తాడు. ఈ జాతకునికి నేత్ర సంబంధ సమస్య (ఇతని కళ్ళ నుండి ఎప్పుడూ నీరు గారుతూ, ఎర్రటి జీరలు కళ్ళలో కనిపిస్తూ, ఎదుటి వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీరి నేత్రములపై ప్రభావాన్ని చూపుతాడు). తన స్వస్థానంలో ఉండటం వల్ల ‘కారకోః భావనాశాయ’ అన్నట్టుగా, ఆ భావం శని చెడగొట్టడం జరుగుతుంది. ఈ లగ్నంలో ఉన్న స్వస్థాన శని ఉండటం వల్ల జాతకులకు మూర్ఖపు ఆలోచనలు, అసూయత్వాన్ని కలిగి ఉండటం వల్ల శని ఈ జాతకునికి మానసిక అశాంతి కలుగజేయు విధంగా ఈ విధమైన చర్యలకు పూనుకోవడం వల్ల తీవ్రమైన ఆలోచనలు శని చేయించడం వల్ల వీరికి శిరో సంబంధ, నేత్ర సంబంధ వ్యాధులు, పార్శ్వపు నొప్పి కలుగజేస్తాడు. ఈ జాతకులకు శని అంతర్దశ జరిగే చివరి కాలంలో ఊహించని విధంగా అనారోగ్యాలు, సమస్యల వల్ల గాని, వృత్తి ఉద్యోగాల కోసం గాని పిచ్చి పట్టిన వారి లాగా కాళ్ళు అరిగేలా ఇల్లు విడిచి తిరగడం, మతి స్థిమితం కోల్పోవడం, భయాందోళనలకు గురి కావడం, బిపి, ఎలర్జీలు, విష జంతు కీటకాదులు వల్ల ప్రాణగండానికి గురి కావడం, ఊపిరితిత్తుల సమస్యలు రావడం, కుటుంబ వ్యక్తులకు దూరం కావడం, వైరాగ్యం, విరక్తి కలగడం,పీడ కలలు రావడం, కాళ్ళకు గాయాలు కలగడం, వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల లాభాలు కలుగకపోవడం, నమ్మక ద్రోహములకు గురి కావడం, జరుగుతుంది. జన్మకుండలిలో జన్మలగ్నమందు గోచార శని ప్రవేశించినపుడు ఈ పైన పేర్కొన్న సంఘటనలు దాదాపుగా సంప్రాప్తమవుతాయి.
ద్వాదశంలో రాహువు ధగ్ధయోగ దోషం :
- 12వ స్థానంలో రాహువు ప్రవేశించినపుడు అనగా జన్మ సమయమందు ద్వాదశంలో (12లో) రాహువు ఉండగా జన్మించిన జాతకులకు ఏర్పడేదే ధగ్ధయోగ దోషం. జాతకచక్రంలో 12వ స్థానంలో రాహువు ఉండినందున ఈ జాతకులకు కలిగే ధగ్ధయోగ దోష ఫలితములు. పరదేశ నివాసం, పరదేశమందు దూరప్రాంతాలకు పోయి అక్కడ ధననష్టాన్ని, మానహానిని, ప్రాణహానిని పొందటం జరుగుతుంది. శిక్షలకు గురికావడం జరుగుతుంది. 6 మరియు 9వ భావాలకు అధిపతి ఆగుట వలన 6వ స్థానం ఋణములను, 9వ స్థానం తండ్రిని, తండ్రి తరపున బంధువులను సూచించడం వల్ల, శత్రువుల వలన, ఋణముల వలన, రోగముల బారీనపడుట వల్ల హాని జరుగుతుంది. ఋణములు అధికంగా చేయటం, అది తీర్చలేక సమస్యలకు గురి కావడం, శతృవర్గం వారు చేసే తంత్ర ప్రయోగాలకు గురికావడం, దీర్ఘకాలిక అనారోగ్యములు సంభవించి ప్రాణహాని జరగడం పోలీసుకేసులకు గురి కావడం, కోర్టు సమస్యలు తీరకపోవడం, అపహరణకు (కిడ్నాప్) గురి కావడం లేదా అజ్ఞాతంగా జీవించడం జరుగును.
వైవాహిక దోషం (భగుత్ దోషం):
- సప్తమంలో (7వ గ్రహం) కుజ గ్రహం, నీచపడినందున సుగుణములు లేని భార్య వల్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు, గొడవలు, విభేదాలు, విడాకులు సంభవించును. వీరి జీవితములో మరియొకరు ప్రవేశించుట వల్ల వీరి దాంపత్య జీవితము చెడును. ఈ వైవాహిక దోషము వల్ల వీరి జీవిత భాగస్వామి వల్ల మానహాని, ధనహాని, ప్రాణహాని సంభవించును.
రాహువు, శని వల్ల ఈ అవయోగ దోషములను, రాహువు, శని వృశ్చిక, మేషములందు ఉండినపుడు సర్పశాపం అని, సర్పశాపం వల్ల ఏర్పడ్డ సర్పదోష వైవాహిక దోషమును, సర్పశాప ధగ్ధ యోగా దోషమని సంభోధిస్తారు.
ఈ దోష నిర్మూలణకు ప్రాయశ్చిత్త పరిహారములు కేరళ తంత్ర విధానములో జరిపించడం జరిగినది. దోషములు నిర్మూలించబడింది. దీనికి జరిపిన పరిహారములు.
పరిహారములు:
- తిలకాష్ట బలి (హోమం)
- అష్టమంగళ బలి (హోమం)
- తాంత్రిక రాహు పీడా నివారణా బలి (హోమం)
- గంధర్వ ప్రీతి బలి
Related Articles:
జన్మకుండలిలో గ్రహాయోగాలు, అవయోగాల పరిశీలన
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.
Ph: 9846466430
Email:
chakrapani.vishnumaya@gmail.com
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu