జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటే కలిగే ఫలితాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడు జాతకుని యొక్క ధైర్యాన్ని, తోబుట్టువులను, స్థిరాస్థి అయిన భూమి, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారమును, గనులు, యుద్ధాలు, చట్ట పరమైన సమస్యలు, పోలీసు, మిలిటరీ, రక్తము, వెన్నుముక, క్రీడలు, బాడీ బిల్డింగ్ వంటివి అన్నిటిని జన్మకుండలిలో కుజుడు సూచిస్తాడు. కుజుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచరించుటకు 45 రోజుల సమయం పడుతుంది. జన్మకుండలిలో కుజుడు వక్రగతిలో ఉండినట్లైతే, జాతకుడు ఏ విధమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకునేందుకు ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉన్నాడా లేక ప్రతికూలంగా ఉన్నాడా అన్న అంశం ఇక్కడ తెలుసుకుందాము. జన్మకుండలిలో కుజ దోషం, అంగారక యోగం ఉన్నదా లేదా? ఉంటే, ఏ విధమైన ఫలితములను జాతకుడు ఎదుర్కొంటాడు అన్న అంశములను నేను ఇదివరకే వివరించి ఉన్నాను. వాటికి సంబంధించిన లింకులను ఇక్కడే పొందుపరిచాను.

జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలను జాతకుడు పొందుతాడు?
- జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉండినట్లైతే, ఆ జాతకుడు తన బంధువులను, స్నేహితులను, ఆత్మీతులను అందరినీ కూడా తన స్వార్థం కొరకు వాడుకుంటారు. తిరిగి వారికి సహాయం కావాలన్నపుడు వీరు నిర్లక్ష్యం చేస్తారు.
- కుజుడు అనుకూలంగా ఉన్న జాతకులకు క్రీడలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సాహసోపేతమైన క్రీడలపైన ఆసక్తి చూపుతారు.
- జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉంటే జాతకుడు ఒక క్రీడాకారుడిగా లేదా కోచ్ గా లేదా ఇష్టమైన క్రీడల మీద బెట్టింగ్ వల్ల గాని సంపాదించుకొనుటకు అవకాశం ఉన్నది.
- కుజుడు అనుకూలంగా ఉంటే, ఆ జాతకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలసి వస్తుంది. జాతకునికి కుజ మహాదశ లేదా అంతర్దశలలో లాటరీ లాంటి అద్భుతం వీరి జీవితంలో జరుగుతుంది.
- కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికి, వీరికి ఉన్న దుడుకుతనం వలన, తరచూ కిందపడటం, గొడవలు పడటం, పోలీసు కేసులు అవ్వడం, ఆసుపత్రులకు వెళ్ళడం ఇవన్నీ వీరికి సాధారణ విషయంగా తోస్తుంది.
- జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉంటే, ఆ జాతకులకు కుజ మాహాదశ లేదా అంతర్దశలలో రాజకీయ పదవి దక్కవచ్చు, నకిలీ షెల్ కంపెనీల ద్వారా అక్రమ సంపాదన కలుగవచ్చు, బ్యాంకులు, ఫైనాన్స్ కంపనీలు వంటివి అకస్మాత్తుగా మూసేసి ఎంతో మందిని మోసం కూడా చేయవచ్చు.
- కుజుడు అనుకూలంగా ఉన్న జాతకులు నల్ల డబ్బును చాలా సులభంగా వ్యవహరిస్తారు.
- కుజుడు అనుకూలంగా ఉన్న జాతకులను ఎవరైనా గేలి చేసినా, వెక్కిరించినా, వీరికి ఉన్న శక్తిని అంతా కూడబట్టుకొని కక్ష సాధించుటకు బలంగా పూనుకుంటారు.
- చట్టపరమైన విషయాలలో ఈ జాతకులు మధ్యవర్తులుగా బాగా రాణిస్తారు. దీని వలన రెండు పార్టీల నుండి లక్షలు సంపాదించుకుంటారు.
- వీరిలో కొంత మంది బ్లడ్ బ్యాంకులు నడపడం, రక్త దానం చేయడం చేస్తారు.
జన్మకుండలిలో కుజుడు ప్రతికూలంగా ఉంటే జాతకుడు ఎదుర్కొనే ఫలితాలు:
- జన్మకుండలిలో కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులకు జీవిత భాగస్వామికి తెలియకుండా వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుంటారు.
- కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు తమ చిన్నతనంలో ఎన్నో సమస్యలకు గురి అవుతారు. స్నేహితులకు దూరమవ్వడం జరుగుతుంది. యవ్వన వయస్సులో కుటుంబానికి కూడా దూరం అవుతారు. కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్ని మొదలుపెడతారు.
- కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు తమ స్నేహితులకు, కుటుంబమునకు ఎంతో సహాయం చేస్తారు. ఈ జాతకులకు సహాయం కావాల్సినపుడు ఆ సహాయం పొందిన వారందరూ కూడా కృతజ్ఞతతో వీరికి తిరిగి సహాయం చేస్తారు.
- జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు వీరి ఇంటి సమస్యలను చూసుకుంటారు. దాని వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు.
- కొన్ని సంధర్భాలలో వీరిని ఇతరులు కేవలం డబ్బు కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు.
- వ్యవసాయ రంగములలో బాగా రాణిస్తారు. లాయర్లుగా కూడా రాణిస్తారు.
- కుజుడు ప్రతికూలంగా ఉంటే, ఆ జాతకుల చుట్టూ పెద్ద కుటుంబమే ఉన్నా కూడా, వీరిలో ఒంటరితనం అలానే ఉంటుంది.
- కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు అవతలి వ్యక్తుల యొక్క సత్తాను తక్కువ అంచనా వేసి, పూర్తిగా నమ్మి, తమ భాద్యతలను అన్నీ అప్పజెప్పి, చివరికి మోసపోతారు.
- కుజుడు ప్రతికూలంగా ఉన్న జాతకులు సాధరణంగా స్త్రీల యొక్క ఆలోచన విధానమును ద్వేషించే వారు చాలా వరకు ఉంటారు. కానీ బయటకు తెలియజెప్పరు. స్త్రీల పై ఒక విధమైన చులకన భావం వీరిలో ఉంటుంది.
- ఫోన్లలో లేదా మెసేజుల ద్వారా తీవ్రంగా గొడవపడతారు. కానీ ముఖా ముఖి వచ్చేసరికి, అక్కడ నుండి జారుకుంటారు.
- అసభ్యకర క్లబ్బులు, బీచులు వంటి వాటిలో చాలావరకు కుజుడు ప్రతికూలంగా ఉన్నవారే ఉంటారు.
ముఖ్య గమనిక:
జన్మకుండలిలో కుజుడు అనుకూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. అదే విధంగా, కుజుడు ప్రతికూలంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ ఫలితాలు అన్నీ వర్తించవు. వ్యక్తిగత జన్మకుండలిలో (Personal horoscope) కుజుడు స్థితి చెంది ఉన్న భావం, రాశి, లగ్నమును బట్టి ఫలితములు మారతాయి. దీనిని కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించి ఫలితములను వివరించగలరు.
మీ జన్మకుండలిలో కుజుడు ప్రతికూలంగా ఉన్నాడా లేదా అనుకూలంగా ఉన్నాడా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి?
ఈ విషయాన్ని కేవలం జ్యోతిష్యులు మాత్రమే పరిశీలించగలరు. ఈ ఫలితాలు అన్నీ అందరికీ వర్తించవు. జాతకుని యొక్క లగ్న భావమును, కుజ గ్రహ స్థితిని అనగా రాశిని, సంగమించిన గ్రహాలను ఆధారం చేసుకొని మాత్రమే ఫలితాలను నిర్ణయించాలి.
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది లేదా 9951779444 Brahma Tantra Astro Services నెంబరుకు Phonepe/Gpay/Paytm ద్వారా 2000/- జమ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలను మాకు whatsapp చేయగలరు. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. https://brahmatantra.com/complete-horoscope-reading-telugu/
Related Articles:
- జన్మకుండలిలో శని అనుకూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు, ప్రతికూలంగా ఉంటే ఏ విధమైన ఫలితాలు జాతకుడు పొందుతాడు?
- శని చంద్ర గ్రహాల కలయిక వలన ఏర్పడే విష యోగ ఫలితాలు ఏమిటి?
- శని చూపించు విషతుల్య యోగం యొక్క ప్రభావములు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
