loading

మహాలయ పక్షం 2026 | సర్వపితృ అమావాస్య | నారాయణ బలి & పితృ తర్పణం

  • Home
  • Blog
  • మహాలయ పక్షం 2026 | సర్వపితృ అమావాస్య | నారాయణ బలి & పితృ తర్పణం

మహాలయ పక్షం 2026 | సర్వపితృ అమావాస్య | నారాయణ బలి & పితృ తర్పణం

మహాలయ పక్షం – సర్వపితృ అమావాస్య

పితృదేవతల ఆరాధనకు అత్యంత విశేషమైన కాలం: 

భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్షాన్ని (పౌర్ణమి తరువాత వచ్చే 15 రోజులను) మహాలయ పక్షం లేదా పితృ పక్షం అని అంటారు.భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మాహాలయ అమావాస్య అని, సర్వ పితృ అమావాస్య అని పిలుస్తారు.

         ఈ 15 రోజులలో పితృదేవతల ఆరాధన వలన, వారిని స్మరించుకోవడం వలన, వారికి శార్థ కర్మలను నిర్వహించడం వలన, బలవన్మరణం లేదా ఆకస్మిక మరణం పొందిన వారికి నారాయణ బలి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం వలన, పూర్వీకులు తమ సంతానం లేదా వారసులు ఇచ్చే తర్పణాలు, శ్రాద్ధ కర్మలను స్వీకరిస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. పితృదేవతలకు శాస్త్రోక్తంగా పూజలు, తర్పణాలు నిర్వహించేందుకు మహాలయ పక్ష సమయం ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది.

తిలా హోమము, నారాయణ బలి పూజాది కార్యక్రమములను ఎవరు జరిపించుకోవాలి?

క్రింది పరిస్థితులు ఉన్నవారు తిలా హోమము, నారాయణ బలి, సపిండి శార్థమును ఆచరించమని గరుడ పురాణములో చెప్పబడింది:

  • బలవన్మరణం పొందిన వారికి
  • హఠాన్మరణం పొందిన వారికి
  • ఆత్మహత్య చేసుకున్న వారికి
  • విషకీటకాదుల వలన మరణించిన వారికి
  • పిడుగు పాటు వలన మరణించిన వారికి
  • నీటిలో మునిగి మరణించిన వారికి
  • వివాహం అవ్వకముందే మరణించిన స్త్రీ, పురుషులకు
  • పురిటిలో మరణించిన వారికి
  • చేతబడికి గురి అయ్యి అనారోగ్యం పాలయ్యి మరణించిన వారికి
  • వాహన దుర్ఘటనల వలన మరణించిన వారికి
  • జాతక భావంలో పితృ దోషం ఉన్నవారు
  • స్త్రీ శాపములు ఉన్నవారు
  • భ్రూణ హత్య దోషములు (అబార్షన్) చేసిన వారందరూ కూడా ఈ కార్యక్రమాలను జరిపించుకోవాలి. 

మహాలయ పక్షం – సర్వపితృ అమావాస్య

సపిండికరణములు, ఆబ్దికము నిర్వహించని వారికి కలిగే ప్రభావాలు:

అనేక కారణముల వలన గతించిన వారికి సపిండికరణములు, ప్రతీ సంవత్సరం వచ్చే ఆబ్దికమును నిర్వహించని వారికి, గతించిన వారు ఆత్మలుగా సంచరిస్తూ, మోక్షమును పొందలేక, మరల జన్మను ఎత్తలేక ఘోషిస్తూ ఉంటారు.పితృ ఘోష వలన వారి వారసులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.తమ వారసులు తమకి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారని గతించిన వారి యొక్క ఆత్మలు ఈ మాహాలయ పక్షములో ఆకలి దప్పికలతో ఎదురుచూస్తూ ఉంటారు.వారి యొక్క తృష్ణను తీర్చి, వారికి శ్రీ మహావిష్ణువు ద్వారా మోక్షమును అనుగ్రహించాలని కోరుకుంటూ ఉండాలి.

పితృ దోషం వలన ఏర్పడే సమస్యలు: 

పూర్వీకుల యొక్క ఆత్మఘోష, రోదన వలన వారి సంతానానికి, వారి వారసులకు ఏర్పడే అవరోధాలు ఏర్పడతాయి. అసహజ మరణం పొందిన వారు లేదా శ్రార్థ కర్మలను నిర్వహించని వారి కుటుంబానికి పితృ దోషం ఏర్పడుతుంది. కొందరికి జాతక భావంలోనే పితృదోషము ఉంటుంది. దీని వలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. 

  • పితృదోషము ఉన్నవారి ఇంటిలో ఎప్పుడూ అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద తగాదాలు వస్తూ ఉంటాయి.
  • పితృదోషముతో బాధపడేవారికి వివాహ విషయములో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత ప్రయత్నించినా, సరైన వయస్సుకు వివాహం జరుగదు.
  • పితృదోషం నుండి బాధపడేవారు అప్పుల్లో కూరుకుపోతారు. ఎంత ఘనంగా ప్రయత్నించినా ఆ అప్పులు తీర్చలేరు.
  • పితృదోషము ఉన్నవారి కుటుంబములో ఒకరికి తరచూ ఒక పాము కలలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబమునకు చెందిన పితృదేవతలలో ఒకరు కలలో కనబడి ఆహారం లేదా బట్టలు కొరకు అడుగుతూ ఉంటారు.
  • ఈ దోషము ఉన్నవారికి మంచి ఉద్యోగము లభించింది అని సంతోషించే లోపే, ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోవడం, పై అధికారులతో ఇబ్బందులు ఏర్పడటం జరుగుతుంది. 
  • పితృదోషం వలన కుటుంబ సభ్యులలో ఒకరికి దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడటం, వాటి కోసం ఎంతో ఖర్చు పెట్టాల్సి రావడం జరుగుతుంది. 
  • పితృ దోషంతో పాటుగా, జాతక భావంలో సంతాన దోషం కూడా ఉన్నట్లైతే, ఆ జాతకులకు సంతాన నష్టం కూడా జరుగుతుంది. 
  • పితృ దోషం వలన, పితృదేవతల అనుగ్రహం లేనందున, జాతకుల యొక్క సంతానం, ముఖ్యంగా పుత్ర సంతానం దుర్వ్యసనల పాలయ్యి దుర్మరణం చెందడం కొన్ని సంధర్భాలలో జరుగుతుంది. 
  • పితృ దోషం కారణంగా కుటుంబంలో స్త్రీలు పక్కదోవ పట్టడం లేదా కుటుంబం నుండి విడిపోవడం జరుగుతుంది. 

పితృదోషం కారణగా ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి. పితృ దోషం గురించి సంపూర్ణంగా తెలుసుకునేందుకు ఈ లింకుని క్లిక్ చేసి తెలుసుకోగలరు.

పితృదేవతల అనుగ్రహం పొందడానికి నారాయణ బలి పరిహారం:

పితృదేవతల అనుగ్రహం పొందడానికి మన విద్యుక్త ధర్మాన్ని ఆచరించడానికి నారాయణ బలి పరిహారం ఆచరించాలి. మన పూర్వీకుల మీద మనకున్న బాధ్యతను నిర్వహించాలి. పూర్వీకులు ఏ తిథినాడు గతించారో తెలియని వారు, తమ పితరులు గతించిన తరువాత ఆబ్దికములను శ్రద్ధగా నిర్వహించని వారు, జాతక భావంలో పితృ దోషం ఉన్నవారికి ఈ మహాలయ పక్షంలో జరిపించే ఈ ప్రాయశ్చిత్త పరిహారములు ఆచరించుకోవడం వలన, అటు పితృ దేవతలకు మోక్షం లభించుట, అలాగే ఇటు తమ వారసులు వంశాభివృద్ధికి ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మహాలయ పక్షములో ఈ పరిహారములు చేయడం ద్వారా గతించిన వారికి మోక్షము లభించి, తమ వారసులకు ఆశీర్వచనములు ప్రాప్తిస్తాయి.

మహాలయ పక్షంలో నిర్వహించబడే కార్యక్రమాలు: 

  • పితృ తర్పణ
  • నారాయణ బలి
  • తిలా హవనం
  • సాయుజ్య హవనం
  • బ్రాహ్మణ సంతుష్ట బలి
  • యమరాజ దీపం

హోమాది కార్యక్రమములు మాహాలయ పక్షములో శ్రీ మలయాళ భగవతి నాగరాజ స్వామి నాగయక్షి పీఠము నందు, కేరళ నంబూద్రీలచేత నిర్వహించబడుతుంది.

📅 కార్యక్రమ తేదీలు

సెప్టెంబర్ 27, 2026 నుండి అక్టోబర్ 10, 2026 వరకు

📍 కార్యక్రమ స్థలం

శ్రీ మలయాళ భగవతి నాగరాజ స్వామి నాగయక్షి పీఠము, అరణ్యమలై

నిర్వహించబడే కార్యక్రమాలు: 

🪔 పితృ తర్పణ

🕉️ త్రిపిండి శ్రాద్ధం

🙏 బ్రాహ్మణ సంతుష్ట బలి

🔥 సాయుజ్య హవనం

🔥 తిలా హవనం

🕉️ నారాయణ బలి

🪔 యమరాజ దీపం

నమోదు చేసుకోవడానికి చివరి తేదీ

ఈ కార్యక్రములలో పాల్గొన దలచిన వారు సెప్టెంబర్ 25 వ తారీఖులోపు నమోదు చేసుకోగలరు.

📌 ముఖ్యమైన తేదీలు

📅మహాలయ పక్షము- సెప్టెంబర్ 27 – అక్టోబర్ 10, 2026
💰 రుత్విక్ సంభావన: ₹25,000/-
📝 నమోదు చివరి తేదీ: సెప్టెంబర్ 25, 2026

Related articles: 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 9846466430

Leave a Reply