loading

Month: July 2024

వైవాహిక దోషం

వైవాహిక దోషం

మనిషి  జీవితంలో వైవాహిక జీవితం అనేది ముఖ్యమైన ప్రభావం చూపిస్తుంది. వైవాహిక జీవితంలో ముఖ్య పాత్రను వహించే అంశాలే వైవాహిక యోగాలు. ఆ యోగాలకు అవయోగాలు కలిగి వైవాహిక జీవితం భ్రష్టుపట్టడమే వైవాహిక దోషం. వైవాహిక దోషం వల్ల వివాహాలు జరుగకపోవడం, ఆలస్యం కావడం, వివాహానంతరం దంపతుల మధ్య గొడవలు, మనస్పర్థలు కలుగుతాయి. దీనికి కళత్ర దోషం కూడా తోడైనట్లైతే వివాహనంతరం వారి భార్య అనారోగ్యపాలవడం, ఆత్మహత్యకు పూనుకోవడం లేదా పరాయి పురుషులతో నీచ సంగత్యాలు సాగించడం, శీలదోషం ఏర్పడటం, వివాహమాడిన వ్యక్తితో జీవించలేకపోవడం, అశాంతి, అనుమానాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. సాధరణంగా వైవాహిక దోషం వ్యక్తులు జన్మించినపుడే తనతో అంటుకొని వస్తుంది. వివాహ వయస్సు రాగానే దాని శక్తిని, ప్రభావాన్ని చూపిస్తుంది.                              

                                         వైవాహిక దోషాలు 2 రకాలు ఉంటాయి. 1. ప్రారబ్ద జన్మతః వైవాహిక దోషం, 2. స్వయంకృత కర్మానుయోగ వైవాహిక దోషం. ఈ దోషం ఏర్పడటానికి ఒక రకంగా వైవాహిక దోషం కారణభూతమవుతుంది మరియు అసలు వివాహం కలుగక పోవడానికి కూడా దోహదపడుతుంది. మొదటి వైవాహిక దోషమైన ప్రారబ్ద జన్మతః వైవాహిక దోషం ఏర్పడటానికి పూర్వజన్మ కర్మ దోషం వల్లనూ, రెండవది అయిన స్వయంకృత కర్మానుయోగ వైవాహిక దోషం మొదటి దాని వల్ల ఏర్పడిన అవయోగాన్ని బలోపేతం చేయడానికి సంపూర్ణ వైవాహిక దోషాలను అనుభవించేలా ప్రభావితం చేస్తుంది. దీనికి మీకు ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. ఉదా:- ఒక వ్యక్తికి వాహన గండం ఉంది అనుకుందాము.ఆ వ్యక్తికి ఆ వాహన గండం వల్ల అంగ వైకల్యం ఏర్పడాలంటే, ఆ వ్యక్తి వాహనాన్ని ఒక ప్రతికూల దశలలో నడపడం. ఆ వ్యక్తికి గండం కారణంగా వాహన ప్రమాదం జరగాలంటే ఆ అంశానికి మరొక కీడు చేసే అంశం జతగూడాలి. అంటే, ఆ వ్యక్తి ప్రతికూలదశలలో వాహనం నడపడం అతని ప్రతికూల స్థితి, ఆ వ్యక్తి ప్రతికూల స్థితిలో వాహనం నడపడమే కాకుండా వ్యతిరేక దశలో వన్ వేలో వెళ్ళడం వల్ల, ఎదురుగా వస్తున్న వాహనం వల్ల వాహన ప్రమాదం జరగడం మరియు అంగ వైకల్యం ఏర్పడటం అన్నమాట. ఇదే విధంగా వైవాహిక దోషం ఏర్పడినపుడు వ్యక్తులు ముఖ తేజస్సును కోల్పోవడం, ఎవ్వరికీ నచ్చకపోవడం, వచ్చిన సంబంధాలు ఇతరుల వల్ల చెడగొట్టబడటం, అనేకమైన ఆటంకాలు రావడం, పీటల దాకా వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోవడం జరుగుతాయి. ఇది ఒకరకమైతే, దాని తీవ్రత అంత వరకే సాగుతుంది. దీనికి తోడుగా స్వయంకృత కర్మాను యోగ వైవాహిక దోషం కూడా జతగూడితే, వివాహం జరిగి, పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టుగా, వైవాహిక జీవితంలో తప్పించుకోలేని విధంగా దుష్పరిణామాలు, ప్రతికూల సంఘటనలు ఎదురవుతాయి.

               ఈ విధంగా 2 రకాల వైవాహిక దోషాలు దంపతుల జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తాయి. వివాహం జరిపించిన పెద్దలకు, వివాహం చేసుకున్నా దంపతులకు నిప్పుల మీద నడకలాగా భరించలేని విధంగా ఉంటుంది. రెండవ రకం అయిన స్వయంకృత కర్మాను యోగ వైవాహిక దోషం అనేది ప్రాథమిక వైవాహిక దోషం కారణంగా కొన్ని గ్రహ స్థితులను అన్వయించి ఏర్పడుతుంది. అది వివాహ దశలో ప్రారంభమవుతుంది. వివాహ లగ్నం సరైనది కాకపోవడమో లేదా దోష పూరితంగా ఉన్న జాతకాలు గల వ్యక్తులకు వివాహం జరిపించడమో, ఈ విధంగా అనేకమైన తప్పిదాల కారణం చేత స్వయంకృత కర్మానుయోగ వైవాహిక దోషం ఏర్పడుతుంది.

               వైవాహిక దోషం ఏర్పడటానికి గల గ్రహస్థితులు కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.

  • వైవాహిక జీవితం ఫలవంతం అవడానికి గురు శుక్రులు ప్రధాన కారకులు అవుతారు. అష్టమ స్థానంలో గురువు గాని లేదా శుక్రుడు గాని ఉన్నట్లైతే లేదా గురు శుక్ర గ్రహాలు కలసి అష్టమంలో ఉన్నా జాతకులకు వైవాహిక దోషం ఏర్పడుతుంది.
  • స్త్రీ జాతకంలో అష్టమంలో గురువు రాహువుతో గాని లేదా కేతువుతో గాని సంగమించి, అష్టమాధిపతి శుక్రుడు అయ్యి, నీచ ప్రతికూల స్థానంలో ఉండినా జాతకులఆకు వైవాహిక దోషం ఏర్పడినట్టు గుర్తించాలి.
  • సప్తమ స్థానంలో అనగా వైవాహిక స్థానంలో శని, కుజుల సంగమం సంపూర్ణ వైవాహిక దోషానికి దారి తీస్తుంది.
  • సప్తమ స్థానంలో గురు గ్రహం గాని లేదా శుక్ర గ్రహం గాని నీచపడితే జాతకులకు వైవాహిక దోషం ఏర్పడినట్టు గుర్తించాలి.
  • వైవాహిక స్థానంలో త్రికూట గ్రహ సంగమం జరగడం వల్ల కూడా వైవాహిక దోషం ప్రాప్తిస్తుంది.

ఇక్కడ కేవలం కొన్ని గ్రహస్థితులు మాత్రమే వివరించాను. ఇంకా అనేక రకములైన గ్రహస్థితుల వల్ల కూడా వైవాహిక దోషం ప్రాప్తిస్తుంది.

                     బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles: 

 

 

సందేహాలు-సమాధానాలు (పార్టు-2)

సందేహాలు-సమాధానాలు (పార్టు-2)

అందరికీ నమస్కారం!

జూన్ 5, 2024 నుండి జూన్ 20, 2024 వరకు నిర్వహించిన సందేహ నివృత్తి కార్యక్రమము గురించి మీ అందరికీ విదితమే. మాకు అందిన సందేహాలలో దాదాపు 50 శాతం వరకు వారి సందేహాలను స్పష్టంగా మాకు వ్యక్తపరచలేదు. సందేహాలు పూర్తిగా, స్పష్టంగా వివరించిన వారి జన్మకుండలిని పరిశీలించి, సందేహ నివృత్తి చేయడం జరిగింది. వాటిని ఇక్కడ వివరిస్తున్నాము. ఈ కార్యక్రమం వచ్చే 2 నెలలలో మరొకసారి పునరావృతం చేస్తాము. ఆ సమయంలో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి అనేది గుర్తుంచుకోవాలి. ప్రశ్న అనేది స్పష్టంగా అర్థమైతేనే కదా, దానికి తగ్గ సమాధానాలు కూడా ఇవ్వగలము!

స్పష్టంగా లేని ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో మీకు ఉదాహరణల ద్వారా వివరిస్తాము.

  • My future? (భవిష్యత్తు అంటే దేని గురించి అడుగుతున్నారో చెప్పాలి.)
  • Job? (మీ ఉద్దేశం, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనా? లేక ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుందా అనా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి.)
  • Marriage? (మీ ఉద్దేశం, వివాహం జరుగుతుందా అనా? లేక వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనా? లేక వైవాహిక దోషాలు ఉన్నాయా అనా?. ఇలా కాకుండా, స్పష్టంగా వివరించండి.)

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విధంగా మాకు ఎన్నో అస్పష్టమైన ప్రశ్నలు అందాయి. అలాంటివాటిని మేము పరిగణలోకి తీసుకోలేదు.

1. Krishna Kumar

పుట్టిన తేదీ: 04-03-1971

పుట్టిన సమయం: 06:35 PM

పుట్టిన స్థలం: ఏలూరు

(i) నా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

సమాధానం: సప్తమ స్థానం (వైవాహిక స్థానం) వీరికి అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి రవి కుంభంలో సప్తమములో బుధుడితో కలసి ఉండటం వలన వివేకం గల భార్యను పొందటం జరుగుతుంది. కానీ వివాహానంతరం ఈ జాతకుడు కొన్ని అనారోగ్య సమస్యలను, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్య తరపున కొంత ఆస్తి లాభం కలుగును. వీరి భార్య కొన్ని విషయాలలో ప్రతికూలంగా ప్రవర్తించటం జరుగుతుంది. అయిననూ భార్య వలన ఆస్తి సంక్రమించును.

(ii) నా ఆయుర్దాయం గురించి చెప్పండి.

సమాధానం: అష్టమ స్థానాధిపతి అయిన గురువు అనుకూలుడై వీరికి శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. పూర్ణాయుర్దాయం వచ్చును. వీరి తండ్రి, తాత వలె సంవత్సరాలు జీవించగలరు. వీరి తండ్రికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్తపడాలి. మహామృత్యుంజయ లేదా ధన్వంతరీ హోమమును జరిపించుకోవాలి లేదా యంత్రమును ధరించవలెను లేదా గృహంలో ఉంచి పూజించాలి.

(iii) నాకు వ్యాపారం ఎలా ఉంటుంది?

సమాధానం: దశమ స్థానంలో వృషభ రాశిలో చంద్రుడు వ్యాపార రీత్యా అనుకూలతను భాగస్వాములతో మరియు వీరి పై యజమానితో సంబంధ భాందవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపార రీత్యా జల సంబంధ, క్షీర సంబంధ, వస్త్ర దుకాణాలు, ఆహార పధార్థ హోటళ్లు లాభమును కలుగజేస్తాయి.

2. Sravan Kumar

పుట్టిన తేదీ: 22-07-1998

పుట్టిన సమయం: 10:50 AM

పుట్టిన స్థలం: హైదరాబాదు

(i) నాకు కాలసర్ప దోషం ఉన్నదా? ఉంటే ఏ కాలసర్పదోషం ఉన్నదో వివరించండి. 

సమాధానం: 6వ స్థానంలో కేతువు మరియు 12వ స్థానములో రాహువు మధ్య 7 గ్రహాలు ఇమిడి ఉండటం వలన జాతకులకు “శేషనాగ కాలసర్ప దోషం” ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాలసర్ప దోషం వలన గుప్త శత్రువులు అధికంగా ఉతరు. శారీరక సుఖం, ఆరోగ్యం సరిగా ఉండదు. గొడవలు, కోర్టు కేసులు, వివాదాలు లాంటి వాటితో ఓటమి పాలవుతారు. పరిచయం లేనివారితోవిరోధం రావచ్చు.

కాలసర్పదోషం యొక్క పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

(ii) నాకు విదేశీయానం ఉందా స్వామి?

సమాధానం: పితృస్థానాధిపతి శుక్రుడు 10లో అనగా దశమంలో చంద్ర+కుజ సంగమంలో చంద్ర మంగళ యోగాన్ని కలుగజేయటం వలన దూరదేశ మరియు విదేశీయాన నివాసం, సంపాదన అమోఘంగా ఉంటుంది. విదేశీయానం అప్రయత్నంగా ఫలిస్తుంది.

(iii) నాకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కారణం తెలుపండి స్వామి. 

సమాధానం: లగ్నాధిపతి బుధుడు రాహువుతో దగ్ధయోగంలో పడినందున వీరికి వచ్చే ఆలోచనలు మరియు చేసే పనుల వల్ల వీరికి విపరీతమైన  మానసిక వ్యాధులు (హిస్టీరియా) లేదా అజ్ఞాత వాసానికి వెళ్ళడం లేదా బుద్ధి మాలిన్యం, బుద్ధి హీనత కారణములగును. 12వ స్థానంలో రాహువు బుధ మరియు రాహు దశ అంతర్దశలలో ఈ విధమైనటువంటి   అవయోగాలు సంభవించును. సాధరణంగా వీరికి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు.

3. Sri Vidya

పుట్టిన తేదీ: 14-07-1983

పుట్టిన సమయం: 04:21 PM

పుట్టిన స్థలం: నెల్లూరు

(i) నాకు గురు చండాల యోగం ఉందా?

సమాధానం: ధనాధిపతి గురువు కేతువుతో సంబంధం కలిగి గురుచండాల యోగం కల్గును. జీవితంలో అభివృద్ధిలోకి రాలేకపోవడం జరుగుతుంది. తీవ్రమైన వైవాహిక దోషం వల్ల భర్తతో గొడవలు, మాట పట్టింపులు విడాకులు దాకా వెళ్ళడం జరుగుతుంది. మాతృరిష్టం కలుగును.

గురు చండాల యోగం యొక్క పూర్తి వివరణ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

(ii) నాకు కాలసర్పదోషం ఉంది అని ఒక సిద్ధాంతి చెప్పారు. నాకు నిజంగా కాలసర్పదోషం ఉందా?

సమాధానం: లగ్నములో కేతువు మరియు 7వ స్థానములో రాహువు ఉంటూ, మిగిలిన 7 గ్రహాలు ఈ రాహు కేతు గ్రహాల మధ్య ఇమిడి ఉండటం వలన జాతకురాలికి ‘తక్షక కాలసర్ప దోషం’ ఉన్నట్టు తెలుస్తుంది.

(iii) నాకు సంతాన దోషం ఉందా?

సమాధానం: పంచమాధిపతి గురువు లగ్నంలో కేతువుతో ఉన్నందున సంతాన విచారం, సంతాన నష్టం కలుగును. ఈ జాతకులకు సంతాన దోషం ఉన్నది. 

4. T. Sai Kumar 

పుట్టిన తేదీ: 27-07-1999

పుట్టిన సమయం: 04:25 PM

పుట్టిన స్థలం: శ్రీ కాళహస్తి

(i) నాకు సర్పదోషం ఉందా?

సమాధానం: శని 5వ భావములో ఉండుట వలన అధికారముతో కూడిన ఉద్యోగి అవుతారు. సంతానముతో వ్యతిరేకతలు ఏర్పడతాయి.ఈ శని మేష రాశిలో కుజ స్థానములో ఉండుట వలన ఈ జాతకులకు ఈ భావంలో “సర్పశాపం” ఉన్నట్టుగా తెలుస్తోంది. 

సర్పశాపం గురించి పూర్తి వివరణ కొరకు ఈ లింకును క్లిక్ చేయండి. 

(ii) నాకు పితృదోషం ఉందా?

సమాధానం: శుక్రుడు 9వ భావములో ఉండుట వలన వీరికి వీరి తండ్రితో వ్యతిరేకతలు ఏర్పడతాయి. ఈ శుక్రుడు వీరికి “పితృశాపం” కలుగజేస్తున్నాడు.

పితృశాపం గురించి పూర్తి వివరాల కొరకు ఈ లింకును క్లిక్ చేయండి. 

(iii) నాకు ఏ ఉద్యోగం బాగుంటుంది?

సమాధానం: రవి, బుధుడు, రాహువు వీరందరూ కలసి అష్టమ భావములో ఉన్నారు. అంటే వీరికి చదువు బాగుంటుంది. కానీ చదువులో ఆటంకములు వస్తాయి (విద్యా ఆటంకములు). వీరు చదివిన చదువు వీరికి ఉపయోగపడదు. వీరు చదువుకున్న చదువుకు సంబంధము లేని ఉద్యోగం లేదా వృత్తి చేస్తారు. 

5. Rajeshwar Kumar

పుట్టిన తేదీ: 09-11-1994

పుట్టిన సమయం: 03:40 PM

పుట్టిన స్థలం: కరీంనగర్

(i) కోర్టు వివాదములకు గల కారణం ఏమిటి?

సమాధానం: ద్వాదశములో ఉన్న శని స్వస్థానములో బలంగా ఉండటం వలన దగ్ధయోగ దోషమును కలుగచేస్తాడు. అగ్ని ప్రమాదాలు, కోర్టు వివాదాలు, అజ్ఞాతవాసములోకి వెళ్ళటం జరిగే అవకాశం మెండుగా ఉంది. మొత్తం మీదా యోచించగా ఈ జాతకుల జీవితములో దారిద్ర్యము, ఐశ్వర్యము ఈ రెండూ కూడా అధిక సాంద్రతలో అనుభవించటం జరుగుతుంది. సాధరణంగా జన్మకుండలిలో 4 లేదా 5 గ్రహాలు ఒకే స్థానములో ఉండటం వలన వీరి జీవితం ఊహించని విధంగా జ్యోతిష్య పరిశీలనకు కూడా అర్థంకాని లోతైన రీతిగా మార్పులు, దుష్పరిణామాలు సంభవిస్తాయి.

(ii) పెట్టుబడులు నాకు కలసి వస్తాయా?

సమాధానం: షష్ట్యాధిపతి రవి అష్టమములో ఉండుట వలన శారీరక, మానసిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలలో, పెట్టుబడులలో మోసపోయే అవకాశం ఉండటం వలన చాలా జాగ్రత్తగా ఉండాలి.

(iii) నాకు గురు చండాల యోగం ఉన్నదా?

సమాధానం:  లగ్న అధిపతి జాతకుల మనస్సుకు, శరీరముకు తనూభావ కారకుడై అష్టమములో ఉండటం వలన లజ్ఞాధిపతి అయిన గురువు అష్టమాధిపత్యాన్ని పొందటం, గురుగ్రహ ప్రతికూలతను పొందటం జరిగింది. అంతేకాకుండా అష్టమాధిపత్యం గురువుకు రావటం దోషంగా చెప్పబడుతుంది. దీనికి తోడుగా నాలుగు గ్రహములతో కలసి ఒకేరాశిలో ఉండటం వలన ఆ గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలను పొంది, జాతకునికి నష్టం చేకూరచడం జరుగుతుంది మరియు ఈ గురువు రాహువుతో కలసి “గురు చండాల యోగముగా” చెప్పబడుతుంది.

గురు చండాల యోగం యొక్క పూర్తి వివరణ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

6. Ramana Murthy

పుట్టిన తేదీ: 01-01-1965

పుట్టిన సమయం: 11:30 AM

పుట్టిన స్థలం: తుని

(i) నాకు పితృశాపం ఉందా?

సమాధానం: భాగ్య స్థానం, పితృ స్థానం అని చెప్పబడే నవమ స్థానములో చతుర్థ గ్రహ కూటమి బుధ, శుక్ర, చంద్ర, కేతువులు తరసించడం వలన, బుధ శుక్ర చంద్ర గ్రహములు తమ యొక్క ప్రత్యేక అనుకూల శక్తులను జాతకుని పై చూపేందుకు , యోగాలను ఇచ్చేందుకు మిక్కిలి ఉత్సాహమును వేగమును ప్రదర్శించే సంధర్భములో కేతువు అడ్డుకోవడం జరుగుతుంది (పూర్వజన్మలో ఏర్పడ్డ పితృవంశపు పితృశాపం మరియు పితృవంశపు నాగశాపం). వృశ్చిక రాశిలో గల విషతుల్య స్థానములో కేతువు తటస్థించడాన్ని నవనాగ సర్పశాపం ఏర్పడుతుంది. వీరి తండ్రితో వీరికి చిన్నతనములో పూర్తి వ్యతిరేకత ఉంటుంది. పితృస్థానములో చంద్రుడు నీచ పడటం వలన తండ్రి మరణానంతరం తండ్రి గురించి తీవ్రంగా బాధపడతారు. వీరికి తండ్రిని పోలిన లక్షణాలు రావటం జరుగుతుంది. వీరి తాత లేదా ముత్తాత చిన్నవయస్సులోనే కాలం చేసి ఉంటారు. పూర్వీకుల ఆస్తిని పొందలేకపోవటం లేదా వాటి వలన లాభం పొందలేకపోవటం గాని జరుగుతుంది (పితృశాపం).

పితృశాపం గురించి పూర్తి వివరాల కొరకు ఈ లింకును క్లిక్ చేయండి. 

(ii) నా అనారోగ్యాలకు గల కారణమయ్యే గ్రహాలు ఏమిటి?

సమాధానం: ద్వాదశ భావంలో గల శని కుంభరాశిలో దగ్ధ యోగ కారకుడు అవ్వడం వలన శారీరక అనారోగ్యములు మరియు మారకమునకు కారణమయ్యే వ్యాధులు కలుగును. అందున శని తన స్వక్షేత్రంలో ఉండటం వలన అనారోగ్యాలను జాతకుడు అనుభవించడానికి శని కారణభూతం అవ్వడమే కాకుండా, స్వక్షేత్ర గతుడు అయినందున “కారకోఃభావ నాశాయ” అన్న విధంగా శని ఆ భావాన్ని బలోపేతం చేసి, తదుపరి ప్రతికూల దశలలో వ్యతిరేక ఫలితాలను కలుగజేయును.

(iii) పూర్వీకుల ఆస్తి తగాదాల్లో ఉన్నది. అది నాకు సంక్రమిస్తుందా?

సమాధానం: మీకు పితృశాపం ఉన్నందున పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిని మీరు దాదాపు పొందలేరు అనే చెప్పాలి.

7. Surya Narayana Raju

పుట్టిన తేదీ: 11-09-1971

పుట్టిన సమయం: 11:30 PM

పుట్టిన స్థలం: విశాఖపట్టణం

(i) నా మానసిక సమస్యలకు కారణమయ్యే గ్రాహాల గురించి తెలుపగలరు. 

సమాధానం: లగ్నములో శని ఉండుట వలన కళ్ళకు, శరీరానికి నలత చేస్తుంది. ఈ లగ్నములో శని వలన అందరితో కలసి మెలసి ఉండలేక పోవటం జరుగుతుంది. చట్ట సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. అతి జాగ్రత్తగా ఉండటం, సూక్ష్మ బుద్ధి లేకపోవటం, మతి మరపు రావటం, స్థిర చరాస్తుల యందు ఆసక్తి కలగటం జరుగుతుంది. ఈ శని, చంద్రుడు సంగమం పూర్తి వ్యతిరేక గ్రహ యోగం కావటం వలన ప్రధానంగా శరీరానికి, మనస్సుకు సంబంధించిన దోషాలు, సమస్యల వలన ఈ జాతకుడు మానసికంగానూ, శారీరికంగానూ దెబ్బ తినటం జరుగుతుంది.

(ii) నా పిల్లలు నా మాటను లెక్క చేయుట లేదు. కారణం?

సమాధానం: పంచమ స్థానములో అనగా సంతాన స్థానములో ఉన్న ఇంద్ర, యముడు పరస్పర వ్యతిరేకులు అవటం వలన సంతాన (కొరకు లేదా వలన) విచారం, సంతాన శతృత్వం ఏర్పడుతుంది.

(iii) నా భార్యతో నాకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏ దోషం వలన ఇలా జరుగుతుందో చెప్పండి. 

సమాధానం: సప్తమ వైవాహిక అధిపతి అయిన కుజుడు శని స్థానములో రాహువుతో కలసి ఉండటం వలన పూర్వజన్మలోని వైవాహిక శతృత్వం వలన భార్యతో శతృత్వం ఏర్పడగలదు. విడాకులకు దారితీయును. కుజమహాదశలో రాహు అంతర్దశలో లేదా రాహుమహదశలో కుజ విదశలో వైవాహిక సంబంధమైన సమస్యలు, తగాదాలు ఏర్పడతాయి. ఈ జాతకుడికి వైవాహిక జీవితానికి తన యొక్క పూర్వజన్మ మరియు పితృపితామహుల దోషాలకు కుజ రాహు పీడ వీరిపై తీవ్ర ప్రభావమును చూపిస్తుంది. పితృశాపం ఏర్పడటం వలన తండ్రి లేదా తాత , ముత్తాతలలో ఒకరి వ్యతిరేకత ఈ జాతకుడికి పితృ దోషం ద్వారా వైవాహిక దోషం ఏర్పడినది. ఈ కుజ రాహువుల వలన వాహన ప్రమాదములు, శస్త్ర చికిత్సలు, చట్ట పరమైన వివాదాలు, స్త్రీల నుండి వ్యతిరేకత సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది.

8. Sreenivasa Rao Bendi

పుట్టిన తేదీ: 17-09-1975

పుట్టిన సమయం: 04:05 PM

పుట్టిన స్థలం: విజయనగరం

(i) నాకు అదృష్ట యోగం ఉందా?

సమాధానం: ఏకాదశ స్థానంలో అనగా పూర్వజన్మ స్థానములో రాహువు సర్పశాపమును ప్రాప్తింప జేయుట వల్ల పూర్వ జన్మ అదృష్ట౦ కలసి రాకపోవుట, చేతికి అందినది అనుభవించలేకపోవటం జరుగుతుంది.

(ii) మా పూర్వీకుల ఆస్తులు తగాదాల్లో ఉన్నాయి. ఆ ఆస్తులు నాకు సంక్రమిస్తాయా?

సమాధానం: అష్టమాధిపతి రవి కన్యారాశిలో ఉన్నందున ఈ జాతకుల తండ్రి మంచి వివేకవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. కానీ ఈ జాతకులకు పితృదోషం ప్రాప్తించడం వల్ల పిత్రార్జితము అమ్ముకోవడం లేదా నష్టపోవడం, మరికొంత ఆస్తిని పొందలేకపోవటం జరుగును.

(iii) నాకు ఎదురయ్యే ఆడవారు అందరూ నాకు శత్రువులుగా మారుతున్నారు. ఏదో ఒక విధంగా నా తప్పు లేకపోయినా ఆడవారితో నాకు సమస్యలు వస్తున్నాయి. 

సమాధానం: అష్టమ శుక్రుని వల్ల జాతకులకు స్త్రీ శాపం ఏర్పడింది. దీని వల్ల ఆడవారి వల్ల, మాదక ద్రవ్యాలు, మత్తు పధార్థాల వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి.

9. P. Siva Ram

పుట్టిన తేదీ: 11-10-1980

పుట్టిన సమయం: 04:05 PM

పుట్టిన స్థలం: విజయవాడ

(i) నా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

సమాధానం: సప్తమ స్థానంలో అనగా, భార్యా స్థానంలో శుక్రుడు ప్రతికూలుడుగా ఉండటం, ఆ స్థానాధిపతి అయిన రవి కన్యారాశిలో నీచపడటం వలన, అష్టమాధిపత్యం కలిగిన గురువుతో మరియు శనితో కలసి ఉన్నందున, ఈ జాతకులకు సంపూర్ణమైన వైవాహిక దోషం కలిగి, జాతకుని యొక్క భార్యతో చట్ట సంబంధమైన గొడవలు, భార్య తరపున తల్లిదండ్రుల వలన గాని లేదా భార్య తరుపున వ్యక్తుల వలన గొడవలు రావడం జరుగుతుంది. కొన్ని సంధర్భాలలో ఈ జాతకులకు వైవాహిక బంధం విడాకుల వరకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

(ii) నాకు ప్రాణ గండాలు ఉన్నాయని ఒక జ్యోతిష్యులు చెప్పారు. నిజంగానే నాకు ప్రాణ గండాలు ఉన్నాయా? తగిన పరిహారాలు, హోమాలు చెప్పండి. 

సమాధానం: అష్టమ స్థానాధిపతి అయిన బుధుడు పితృస్థానంలో అనుకూలుడుగా ఉండటం వలన జాతకునికి ఆయుర్దాయ విషయంలో సంపూర్ణ ఆయుర్దాయము లభిస్తుంది. అయితే అష్టమ స్థానంలో రవి, గురు, శని ఉండటం వలన, వీరిలో శని కాస్త ఆరోగ్యాన్ని ప్రసాదించినప్పటికి, రవి గురు గ్రహాలు మాత్రం ప్రాణ గండాలను సంప్రాప్తించడం జరుగుతుంది. దీని వలన దినదినగండం, నూరేళ్ళు ఆయుషు అన్నట్టు శరీరానికి సమస్యలు వస్తాయి. రవి, గురు, శని గ్రహాలకు పరిహారాలు జరిపించడం ద్వారా ప్రాణ గండములు కలుగడం తప్పుతుంది.

(iii) మా పూర్వీకులకు ఒకప్పుడు ఉన్న వైభవం నాకు మళ్ళీ కలుగుతుందా?

సమాధానం:పితృస్థానంలో అనగా నవమ భావంలో చంద్రుడు, బుధుడు ఉన్నందున, జాతకుని యొక్క తండ్రి లేదా తాత లేదా ముత్తాతలు విశేషమైన కీర్తిని, ప్రతిష్టాని, మంచిని, సంఘంలో గౌరవాన్ని పొంది ఉండటం కారణంగా, వీరి పూర్వీకులు చేసుకున్న పుణ్యకార్యముల వలన ఈ జాతకులకు ఈ జన్మలో వృత్తి పరంగానూ, ఎన్నో విధాలుగా సహకరించడం సంభవిస్తుంది. 

10. Vijayendra Varma 

పుట్టిన తేదీ: 11-07-1990

పుట్టిన సమయం: 09: 10 PM

పుట్టిన స్థలం: నెల్లూరు

(i) నాకు సంతానం కలుగుతుందా?

సమాధానం: పంచమ స్థానంలో అనగా సంతాన స్థానంలో గురు గ్రహం యొక్క ప్రతికూలత స్థితి మరియు సంతాన స్థానాధిపతి బుధుడు కేతువుతో కూడినందున, 6వ స్థానమున శత్రు క్షేత్ర గతుడు అయినందున సంతాన విచార దోషం ఏర్పడినది. సాధారణంగా ఈ జాతకులకి ఇరువురు పుత్ర సంతానం కలుగును. కాని గురువుకు శత్రు క్షేత్రమైన బుధ స్థానంలో గురువు ఉన్నందున ప్రతికూలత కారణంగా సంతానం కలుగుటకు అవరోధములు కలుగును. వీరి భార్య యొక్క జాతకమును పరిశీలించిన మేలు జరుగును. 

(ii) కోర్టు వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి. 

సమాధానం: ద్వాదశ రాహువు వలన శత్రువులు చేసే కుట్రలలో లేదా ప్రయోగాలలో ఈ జాతకులు ఇరుక్కొని, తద్వారా కోర్టు కేసులు ఎదుర్కోవచ్చు. మతి స్థిమితం కోల్పోయే అవకాశం కలదు. గుప్త శత్రువులు (మీకు తెలియని శత్రువులు) అధికంగా ఉంటారు. పరిచయం లేని వ్యక్తులతో విరోధం ఏర్పడుతుంది.

(iii) నాకు నాగశాపం ఉందా?

సమాధానం: మేష కుజుడు జాతకునికి సర్పశాపం ఏర్పరుచును. కొంతమంది స్త్రీల వలలో చిక్కుకొని మోసపోయి, నానా ఆగచాట్లు పడటం జరుగుతుంది. (12లో రాహువు, మేష కుజుడు సర్పశాపం). 

11. Suresh

పుట్టిన తేదీ: 18-10-1983

పుట్టిన సమయం: 02:30 PM

పుట్టిన స్థలం: అత్తిలి

(i) కోర్టు కేసులు, పోలీసు కేసులు, విడాకులు

సమాధానం:సప్తమ స్థానంలో అనగా వైవాహిక స్థానంలో కుజుడు, శుక్రులు శతృస్థానగతులు అయినందున వైవాహిక దోషం ఏర్పడినది. అందుకారణంగా మరియు కళత్ర స్థానాధిపతి రవి తులా రాశిలో నీచపడినందున, వైవాహిక దోషం విడాకుల దాకా తీసుకెళ్తుంది. 

(ii) జీవితంలో స్థిరత్వం లేదు

సమాధానం: జాతకునికి దశమ స్థానంలో గురు మరియు కేతు సంగమం కలిగినందున ఉద్యోగ స్థిరత్వం ఉండదు. గురు చండాల యోగం కలిగినది. 

గురు చండాల యోగం యొక్క పూర్తి వివరణ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

(iii) ఆర్థిక ఇబ్బందులు

సమాధానం: సర్ప దోషము ఏర్పడినది. అందుకు పరిహారములు జరిపిన పిదప స్థిరత్వము ఏర్పడును. 

 

(మిగిలిన వారి పరిశీలనలు పార్ట్-3లో మరో మూడు రోజుల్లో వెబ్ సైట్లో ప్రచురిస్తాము)

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

సంపూర్ణ జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Email: chakrapani.vishnumaya@gmail.com

 

 

 

 

 

 

సందేహాలు-సమాధానాలు (పార్టు-1)

అందరికీ నమస్కారం!

జూన్ 5, 2024 నుండి జూన్ 20, 2024 వరకు నిర్వహించిన సందేహ నివృత్తి కార్యక్రమము గురించి మీ అందరికీ విదితమే. మాకు అందిన సందేహాలలో దాదాపు 50 శాతం వరకు వారి సందేహాలను స్పష్టంగా మాకు వ్యక్తపరచలేదు. సందేహాలు పూర్తిగా, స్పష్టంగా వివరించిన వారి జన్మకుండలిని పరిశీలించి, సందేహ నివృత్తి చేయడం జరిగింది. వాటిని ఇక్కడ వివరిస్తున్నాము. ఈ కార్యక్రమం వచ్చే 2 నెలలలో మరొకసారి పునరావృతం చేస్తాము. ఆ సమయంలో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి అనేది గుర్తుంచుకోవాలి. ప్రశ్న అనేది స్పష్టంగా అర్థమైతేనే కదా, దానికి తగ్గ సమాధానాలు కూడా ఇవ్వగలము!

స్పష్టంగా లేని ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో మీకు ఉదాహరణల ద్వారా వివరిస్తాము.

  • My future? (భవిష్యత్తు అంటే దేని గురించి అడుగుతున్నారో చెప్పాలి.)
  • Job? (మీ ఉద్దేశం, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనా? లేక ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుందా అనా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి.)
  • Marriage? (మీ ఉద్దేశం, వివాహం జరుగుతుందా అనా? లేక వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనా? లేక వైవాహిక దోషాలు ఉన్నాయా అనా?. ఇలా కాకుండా, స్పష్టంగా వివరించండి.)

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విధంగా మాకు ఎన్నో అస్పష్టమైన ప్రశ్నలు అందాయి. అలాంటివాటిని మేము పరిగణలోకి తీసుకోలేదు.

1. Dornala Bhargav

పుట్టిన తేదీ: 22-07-1982

పుట్టిన సమయం: 10:30 PM

పుట్టిన స్థలం: ప్రకాశం

  • (i) నా ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది?
  • సమాధానం: లాభాధిపతి శనితో కుజుడు కూడి ఉన్నందున, ఈ కుజుడు ప్రతికూలుడు అయినందున వీరి వైవాహిక విషయాదుల వలన ఈ జాతకుల యొక్క ఆర్థిక స్థితి క్షయమగును. శని + కుజుల మధ్య ఉన్న సంఘర్షణ ప్రభావం వీరి ఆర్థిక స్థితి పై పడుతుంది.
  • (ii) నాకు రాజయోగం ఉందా?
  • సమాధానం: రాజయోగాన్ని ప్రసాదించే గురువు అష్టమంలో ప్రతికూలుడిగా ఉన్నందున, వీరికి రాజయోగ భంగము కలుగును.
  • (iii) పితృదోషం ఉన్నదా?
  • సమాధానం: పితృస్థానాధిపతి అయిన కుజుడు శనితో కలసి ప్రతికూలుడు అయినందున, ఈ జాతకులకు పితృదోషం ఉన్నది. ఇందుకారణముగా, పితృవైరం, పితృసౌఖ్యం లేకపోవడం జరుగును.
  • 2. Lakshmi Phalguna

పుట్టిన తేదీ: 31-07-1986

పుట్టిన సమయం: 06:19 AM

పుట్టిన స్థలం: కడప

  • (i) నాకు రెండవ వివాహం జరిగే అవకాశం ఉందా?

సమాధానం:  వైవాహిక స్థానాధిపతి అయిన శని విషతుల్యయోగమును కలిగించుట వలన ఈ జాతకులకు ద్వితీయ వివాహం జరుగుట కష్టమగును.

  • (ii) నేను ద్వితీయ వివాహం చేసుకుంటే అతనికి ఏమైనా హాని కలుగుతుందా?

సమాధానం: సప్తమాధిపతి అయిన శని వృశ్చిక రాశిలో విషతుల్య యోగమును కలిగించుట కారణంగా, ద్వితీయ వివాహం వీరికి జరిగినా కూడా నిలబడదు. వీరికి కలిగే సంతానం వలన అతను అజ్ఞాతవాసంలోకి వెళతారు.

(iii) నాకు సంతాన భాగ్యం ఉన్నదా?

సమాధానం: పంచమ స్థానంలో శని దోషమును కల్పించుట మరియు సంతాన స్థానాధిపతి కుజుడు 6వ స్థానంలో         అనగా వ్యాధి, శతృ స్థానంలో ఉన్నందున, ఈ జాతకులకు సంతాన సాఫల్యత పొందలేకపోవుట, ఒకవేళ కలిగినా     వ్యాధి గ్రస్తం అగుదురు.

  • 3. Nithin Kolimi

పుట్టిన తేదీ: 14-03-1993

పుట్టిన సమయం: 01:30 AM

పుట్టిన స్థలం: నిజామాబాద్

(i) వంశ పారంపర్య ఆస్తి నాకు ఎప్పుడు వస్తుంది?కోర్టు ద్వారా వస్తుందా లేక చర్చ ద్వారా వస్తుందా?

 సమాధానం: నవమాధిపతి అయిన రవి ప్రతికూలుడై, బుధునితో అస్తంగత్వం చెందినందున ఆస్తి గురించి దాయాదులతో, అన్నదమ్ములతో వైరములు, కుట్రలు జరుగును. చర్చల ద్వారా రాదు. ఆస్తి అయితే వచ్చును. కానీ ఊహించినంత రాదు. నూటికి-30 విధంగా వచ్చును. రవి, శని దశాంతర్దశలలో ప్రాప్తించును.

(ii) జీవితంలో స్థిరత్వం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

సమాధానం: 32వ ఏట నుండి మీకు స్థిరత్వము కలుగును. జాతకంలో దగ్ధయోగ దోషం అనగా 12వ స్థానంలో గ్రహణ యోగం ఏర్పడినది. కావున జాగ్రత్త మరియు పరిహారములు అవసరం.

(iii) అమ్మవారి ఆలయం నిర్మించాలని ఉన్నది, అది సాధ్యమవుతుందా?

సమాధానం: 50 ఏళ్ళు గడచిన తరువాతే సాధ్యమవుతుంది.

  • 4. Thrilok

పుట్టిన తేదీ: 20-06-1991

పుట్టిన సమయం: 09:30 PM

పుట్టిన స్థలం: పుట్టపర్తి

(i) నాకు ఏ వృత్తిలో అనుకూలంగా ఉంటుంది?

సమాధానం: పంచమాధిపతి మరియు దశమాధిపతి వీరికి శుక్రుడు. పంచమాధిపతి శుక్రుడు అనుకూలుడు అవడం వలన, శుక్రునికి సంబంధించిన క్రీడా వస్తు సామగ్రి, కాస్మోటిక్స్, వస్త్రములు, ఫ్లవర్ డెకరేషన్లు, వివాహ పరిచయ వేదికలు, వివాహ అలంకార సంబంధిత వ్యాపారాలు ఈ జాతకులకు అనుకూలించును.

(ii) నాకు అదృష్ట యోగం ఉన్నదా?

సమాధానం: 2వ, 9వ, 11వ అధిపతులు వీరికి అదృష్టమును అనగా గత జన్మలో చేసిన పుణ్యముల వలన ఈ జన్మలో అదృష్టమును ఆయా గ్రహములు- శని, బుధుడు, కుజుడు కల్పించును. ఈ జాతకుల యొక్క అదృష్టమునకు శని కారకుడు అగును. శనికి సంబంధించిన వృత్తుల వలన అదృష్టమునకు శని దోహదపడును. బుధుడు ఉపకరించు సంధర్భములో రవి నిదానము చేయును. కేతువు భంగపరచును.

(iii) నాకు పితృ దోషం ఉన్నదా?

సమాధానం: ఈ జాతకులకు పితృ దోషము కేతువు కారణముగా కలిగినది. అయిననూ ఈ దోషము వలన వీరికి అంతగా చెడు కలుగదు.

5. ఇందుర్తి జగదీష్

జన్మ తేదీ: 09-12-1986

జన్మ సమయం: 10:07 PM

జన్మ స్థలం: వరంగల్

(i) నాకు వివాహ యోగం ఉన్నదా?

సమాధానం: సప్తమాధిపతి శని వృశ్చికమునందు కుటుంబ స్థానంలో విషతుల్య యోగమును కల్పించుట వలన విషకన్య వివాహ యోగం కలుగును. కుటుంబీకుల, బంధువుల సంబంధంతో వివాహం జరుగవచ్చు.

(ii) నాకు భయం ఎక్కువగా ఉంటుంది, అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణాలు ఏమిటి?

సమాధానం: లగ్నాధిపతి రవి చతుర్థ గ్రహ కూటస్థుడు అయినందున ప్రతీ విషయమునందు అనుమానము, భయం ఎక్కువగా ఉంటాయి. గ్రహ దశల మార్పుల ఫలితము అవి కనుమరుగు కాగలవు.

  • (iii) నా ఉద్యోగ పరిస్థితి ఏమిటి?

సమాధానం: దశమాధిపతి మరియు పంచమాధిపతి అయిన ఆదాయ ఉద్యోగ కారకుడు అగును. శుక్రుడు, గురువు కారకులు. గురువు ప్రతికూలుడు కావడం వలన బాధ్యతలు గల ఉద్యోగమునందు ప్రతికూలత ఉండును. అనగా అధికారిగా వీరు ఉద్యోగము చేసినచో,  ప్రతికూలత, శతృవర్గము ఉండును. వీరికన్నా క్రింది స్థాయి వారితో ప్రతిబంధకాలు ఏర్పడును. శుక్రుడు మధ్యమ బలీయుడుగా ఫలించుట వలన అనేకానేక ఉద్యోగములు మారుతూ ఉంటారు. శుక్ర దశ, అంతర్దశలలో ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఈ దశలో ఉద్యోగములో అభివృద్ధి కలుగును.

6. Bangale Harika

పుట్టిన తేదీ: 22-01-2000

పుట్టిన సమయం: 02:45 AM

పుట్టిన స్థలం: బనగానపల్లి

(i) 7 సంవత్సరాల నుండి నాకు విద్యా ఆటంకం ఉంది. NEET UG పరీక్షను 7 సార్లు వ్రాసాను. MBBS ఫ్రీ సీటు రాలేదు. ఇంటర్ తోనే నా చదువు ఆగిపోయింది. నేను ఏ గ్రూపు తీసుకుంటే బాగుంటుంది?

(ii)అసలు నా జాతకంలో ఉద్యోగం చేసే యోగం ఉందా? ఒకవేళ ఉంటే ఏ ఉద్యోగం నాకు బాగా కలసి వస్తుంది?

సమాధానం: విద్యాధిపతి శని ప్రతికూలుడు అయినందున సంపూర్ణమైన వైద్య విద్య ప్రాప్తించదు. విద్యా స్థానంలో కుజుడు స్థితి చెంది ఉండటం వలన వైద్య విద్యకు కావల్సిన ప్రాథమికము పూర్తి చేయగలిగారు (Bipc, ఇంటర్). శని ప్రతికూలుడు కావడంవలన ఎం‌బి‌బి‌ఎస్ చదవలేకపోయారు. మీరు విద్యను ఏది చేయాలో అని ఎంచుకోలేరు. మీరు ఏది చదవాలి అనేది విద్యా కారకుడు గతంలో నిర్ణయించబడింది. అందుకారణంగా అదియే జరుగును. ఇది అంతయూ కూడా మీ ప్రారబ్ధము. మీ గత జన్మ పాప, పుణ్యము ఫలితములే మీకు ప్రాప్తించును. క్లినికల్ లేబొరటరీలు, శవాగారములు, వైద్యశాలల యందు ఉద్యోగము కలుగును. కానీ మీకు అది చేయుట కష్టమగును. కానీ యోగించును. పారా మెడికల్ కోర్సులు మరియు ఆధ్యాత్మిక వస్తు విక్రయములు, వాహనముల సారధ్యము మరియు ట్రావెల్స్ మీకు కలసి వచ్చును. శారీరక శ్రమ ఉన్ననూ, ధనము చేకూరును.

7. Pasupuleti Sainadh

పుట్టిన తేదీ: 15-06-1992

పుట్టిన సమయం: 09:07 AM

పుట్టిన స్థలం: గుంటూరు

(i) నా గత జన్మ రహస్యం నేను తెలుసుకోవచ్చా?

సమాధానం: గత జన్మమందు మిధున లగ్నములో జన్మించినందున  మీరు వివాహ పరిచయ వేదికలు నిర్వహించుట చేసినారు మరియు దేవాలయమందు వ్యాపారాదులు నిర్వహించుచుంటిరి.

(ii) నాకు సంతాన దోషం ఉన్నదా?

సమాధానం: పంచమ స్థానంలో వృశ్చికరాశిలో చంద్రుడు ప్రతికూలుడుగా ఉండుట కారణంగా సంతాన ప్రతికూలత, సంతాన దోషం ప్రాప్తించినది.

(iii) నేను ఏ దేవత మంత్ర సాధనాలు చేయవచ్చా? ఉచ్ఛిష్ట గణపతి సాధన నేను చేయవచ్చా?…స్వామి.

సమాధానం: భైరవి సాధన చేయాలి. ప్రాచీన కాలము నాటి విగ్రహారాధనను చేయుట వలన మంత్ర సిద్ధి కలుగవచ్చును.  ఉచ్ఛిష్ట గణపతి సాధన చేయుటకు ఆటంకములు ఎక్కువగా కలుగును. ఇది సంపూర్ణ తాంత్రికముగా ఉండును.

8. Poreddy Harikishan Reddy

పుట్టిన తేదీ: 10-05-1989

పుట్టిన సమయం: 01:55 PM

పుట్టిన స్థలం: కరీంనగర్

(i) నాకు స్వగృహ యోగం ఉన్నదా?

సమాధానం: చతుర్థాధిపతి కుజుడు చంద్రునితో సంగమించినందున చంద్ర మంగళ యోగం కలుగును. స్వగృహ ప్రాప్తి కలుగును. అంతే కాకుండా, ఈ యోగము వలన విదేశీ యోగము, విదేశీ గృహ నివాసము కలుగును.

(ii) నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

సమాధానం: ప్రభుత్వ ఉద్యోగము మరియు ఇతర ప్రైవేటు కాంట్రాక్టులు మరియు విశేషమైన ఆదాయములు ప్రాపించును. . దశమాధిపతి శుక్రుడు స్వస్థానంలో ఉన్నందున, గురువుతో సంగమించుట వలన కుజ చంద్రుల యోగము అనుకూలించును.

(iii) పితృ దోషం ఉన్నదా?

సమాధానం: నవమ భావంలో మేషరాశిలో రవి ఉచ్చములో ఉన్నందున మీకు పితృదోషము లేదు. పితృయోగ్యము కలుగును. పిత్రార్జితము బాగా యోగించును.

9. Lalitha Prathyusha

పుట్టిన తేదీ: 18-07-1992

పుట్టిన సమయం: 06:45 PM

పుట్టిన స్థలం: మార్కాపురం

(i) నాకు సంతానం కలుగుతుందా?

సమాధానం: సంతానాధిపతి శుక్రుని అనుకూలత వలన మరియు సంతాన స్థానంలో కుజుని అనుకూల ప్రభావము చేత స్త్రీ సంతానము కలుగును.

(ii) నా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?

సమాధానం: అష్టమాధిపతి మరియు సప్తమాధిపతి వైవాహిక జీవితమును నిర్దేశించును. సప్తమాధిపతి అయిన చంద్రుడు కుంభరాశిలో మిశ్రమ ఫలితాలు ఇచ్చును. అష్టమాధిపతి రవి కర్కాటకములో ఉండినందున వీరి ఆధిపత్య పోరు సాగును.

(iii) నా భర్త మారేందుకు పరిహారములు తెలియజేయగలరు.

సమాధానం: సూర్యగ్రహ హోమము మరియు గురు గ్రహ శాంతి జరిపించిన మేలు జరుగును.

10.Sunil

పుట్టిన తేదీ: 27-10-1986

పుట్టిన సమయం: 11:55 AM

పుట్టిన స్థలం: తిరుపతి

(i) ప్రశ్న (ఈమెయిల్): నాకు ఆర్థిక సమయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి లేదు. స్వగృహ ప్రయత్నం చేస్తున్నాను. నాకు పరిహారాలు తెలియజేయమని కోరుకుంటున్నాను.

సమాధానం:

  • గురు గ్రహము మాందితో కలసి ఉన్నందున తులారాశిలో రవి నీచపడినందున ప్రభుత్వ ఆదాయ సంబంధ విషయాదులలో ప్రతికూలత కలుగును. తాంత్రిక కుబేర తంత్ర హోమం జరిపించుకోవాలి.
  • మీనరాశిలో గృహ స్థానంలో రాహువు తత్ స్థానాధిపతి గురువు మధ్య బలీయుడు అయినందున స్వగృహము ఆలస్యము అవుతుంది. అయిననూ స్వగృహము పూర్తి అగును.
  • 11. Ghali Venkata Hari Kishan

పుట్టిన తేదీ: 28-10-1980

పుట్టిన సమయం: 11:30 AM

పుట్టిన స్థలం: కావలి

(i) ప్రశ్న (ఈమెయిల్):  వివాహం,  ఉద్యోగం

సమాధానం:  సప్తమాధిపతి బుధుడు నీచపడిన రవితో సంగమించినందున, అస్తగాత్వం చెందినందున ఆలస్య వివాహము మరియు వివాహ భంగము కలుగును. ద్వితీయ వివాహము కలుగును.

దశమాధిపతి బుధుడు నీచ సాంగత్య రవి గ్రహ అస్తంగత్వ దోష కారణాదుల వలన మరియు ప్రతికూల గురు స్థితి , గురు శనుల సంగమ గ్రహ యుద్ధము కారణము చేత జాతకునికి గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు చేతికి అందినట్లు వచ్చును. కానీ అవి సిద్ధించవు. ప్రభుత్వ ఉద్యోగము ప్రాప్తించదు.

12. Ranjith Kumar

పుట్టిన తేదీ: 14-03-1974

పుట్టిన సమయం: 09:32 AM

పుట్టిన స్థలం: వరంగల్

(i) పిల్లల జీవితం ఎలా ఉంటుంది?

సమాధానం: పంచమాధిపతి రవి ఏకాదశంలో ఉన్నందున మధ్యమ బలీయుడు అయినందున వీరి సంతాన ఆర్థిక స్థితి గతులు మధ్యస్థముగా ఉంటాయి. ఏకాదశాధిపతి శని కేతువుతో కూడి ఉన్నందున వారి మధ్య ఐక్యత లోపం ఉంటుంది. వీరి సంతానం ఒకరి వలన ఒకరు కానరాని సమస్యలను గురి చేసుకుందురు. వారి వ్యక్తిగత జాతక పరిశీలనతో వారి సంపూర్ణమైన భవిష్యత్తు తెలియును. సంతానంలో ఒకరు సమస్యలకు గురి అగుదురు, విద్యా హీనత ఏర్పడును.

(ii) నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?

సమాధానం: ద్వితీయాధిపతి కుజుడు మధ్యమ బలీయుడు అయినందున లాభాధిపతి శని, ప్రతికూలుడు అయినందున 9వ స్థానమందు రాహు స్థితి, ఈ జాతకుల యొక్క ఆర్థిక విషయాలు అన్నీ కూడా ఆగమ్యగోచరంగా ఉంటుంది.

(iii) నాకు ఏ వ్యాపారం బాగుంటుంది?

సమాధానం: మీకు వ్యాపారము అచ్చుబాటు రాదు.

13. Naresh Kumar

పుట్టిన తేదీ: 18-08-1982

పుట్టిన సమయం: 12:02 PM

పుట్టిన స్థలం: సిద్ధిపేట్

(i) నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?

సమాధానం: లాభాధిపతి కుజుడు లగ్నమందు, దశమాధిపతి దశమ స్థానంలో శుక్ర గ్రహ సంగమంతో కూడినందున శుక్ర, చంద్ర మహాదశలలో ఆర్థిక లాభములు కలుగును.

(ii) ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

సమాధానం: చంద్ర, శుక్ర అంతర్దశలలో ఉద్యోగ ప్రాప్తి కలుగును, యోగించును.

(iii) స్వగృహ యోగం ఉందా?

సమాధానం: గృహ స్థానాధిపతి అయిన శని కన్యారాశిలో ద్వాదశమందు ఉన్నందున చెరుపు చేయును. స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. కానీ ఆ స్వగృహమునందు ఎక్కువ కాలము ఉండరు. ఆ గృహము ఛిద్రమగును లేదా వాస్తు దోషము గల గృహము ప్రాప్తించును. అమ్మివేయుదురు.

14. Brahmanachary

పుట్టిన తేదీ: 04-04-1965

పుట్టిన సమయం: 02:15 AM

పుట్టిన స్థలం: విజయవాడ

(i) నాకు ఋణ విముక్తి కలుగుతుందా?

సమాధానం: చతుర్తాధిపతి అయిన కుజుడు మరియు 6వ స్థానాధిపతి అయిన బుధుడు ప్రతికూలులుగా ఉండుట వలన వీరికి ఋణములు అధికముగా ఉండును. వీరికి ఋణ విముక్తి లభించుట కాస్త కష్టమే.

(ii) నాకు విదేశీ యోగం ఉందా?

సమాధానం: మీకు విదేశీయానము లేదు.

(iii) నాకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా?

సమాధానం: లాభస్థానంలో శని ఆర్థిక విషయాదులయందు మొదట అప్రయత్న అప్రయత్న కార్యసిద్ధి జరిపించి, ఆర్థిక లాభములను కల్పించి తదుపరి దశలో క్ష్యము చేయును. సంతాన పరంగా వచ్చిన గురు చండాల యోగము దీనికి కారణం అగును.

15. Lanka Balaji

పుట్టిన తేదీ: 19-11-1985

పుట్టిన సమయం: 09:31 AM

పుట్టిన స్థలం: ఏలూరు

(i) నాకు పితృదోషం ఉన్నదా?

సమాధానం: పితృస్థానాధిపతి అయిన రవి వృశ్చికములో శనితో కలసి ఉన్నందున మరియు బుధునితో అస్తంగత్వం చెంది ఉండుట వలన ఈ జాతకులకు సంపూర్ణమైన పితృదోషము ఉన్నది.

(ii) నాకు సంతాన దోషం ఉన్నదా?

సమాధానము: పంచమ స్థానంలో రాహువు ఉన్నందున ఈ జాతకులకు సర్పగ్రస్త సంతాన రాహు దోషం, సంతాన దోషం ఉన్నది.

(iii) నాకు నాగదోషం ఉన్నదా?

సమాధానం: మేషరాశిలో రాహువు నాగదోషమును మరియు సర్పశాపమును, వృశ్చికములో శని విషతుల్య యోగమును ఇచ్చును.

16. Venkata Sai Vineeth

పుట్టిన తేదీ: 01-04-1997

పుట్టిన సమయం: 01:30 PM

పుట్టిన స్థలం: నెల్లూరు

(i) నాకు వివాహం ఎప్పుడు జరుగుతుంది?

సమాధానం: సప్తమాధిపతి శని మీనా రాశిలో చతుర్థ గ్రహ కూటస్తుడు అయినందున మరియు సప్తమము నందు గురువు ఆలస్య వివాహమునకు లేదా అసలు వివాహము కాకపోవుట మరియు వివాహం జరిగినప్పటికి, వైవాహిక దోషం కారణంగా వివాహం విషయంలో సమస్యలు వచ్చును.

(ii) నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

సమాధానం: ప్రభుత్వ ఉద్యోగ సిద్ధించుటకు 60% అవకాశములు కలవు. పితృదోషము కారణంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తికి అవరోధములు కలుగును.

(iii)మేము సొంత ఇల్లు తీసుకుంటామా?

సమాధానం: గృహ స్థానాధిపతి అయిన శుక్రుడు యోగించుట కారణము చేత శుక్ర దశ లేదా అంతర్దశలలో స్వగృహ ప్రాప్తి కలుగును.

17. Deekshith

పుట్టిన తేదీ: 04-06-2003

పుట్టిన సమయం: 02:30 PM

పుట్టిన స్థలం: హైదరాబాదు

(i) వైవాహిక దోషాలు ఉన్నాయా?

సమాధానం: సప్తమాధిపతి గురువు ఉచ్చములో ఉన్నందున ఈ జాతకులకు వైవాహిక దోషము లేదు.

(ii) నాకు ఉద్యోగం కలసివస్తుందా లేక వ్యాపారం కలసి వస్తుందా?

సమాధానం: ఉద్యోగం చేయరు. సంపూర్ణ బాధ్యతలు లేని ఉద్యోగము గాని లేదా లౌక్యముగా చేసేడి వ్యాపారాడుల యందు ఈ జాతకులకు అభివృద్ధి ఉండును.

(iii) నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?

సమాధానం: లాభాధిపతి శుక్రుడు అష్టమంలో ఉండినందున ఈ జాతకులకు 31 ఏట తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడును.

18. Saikumar

పుట్టిన తేదీ: 05-03-1995

పుట్టిన సమయం: 11:05 AM

పుట్టిన స్థలం: హైదరాబాదు

(i) నాకు వ్యాపారం కలసి వస్తుందా?

సమాధానం: వ్యాపారం కలసి వస్తుంది. అయితే ఈ జాతకులకు శని పాపి అయినందున, శని అనుగ్రహం, అనుకూలత కావలెను.

(ii) నేను విడాకులు తీసుకున్నాను. రెండవ వివాహ యోగం ఉందా? వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయా?

సమాధానం: పునర్వివాహం జరుగును. వైవాహిక దోషం కారణంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడును.

(iii) నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?

సమాధానం: ద్వితీయాధిపతి బుధుడు అనుకూలత వీరికి బాగుండును. బుధుని కారణంగా ఆర్థిక లాభములు కలుగును. ఏకాదశాధిపతి అయిన గురువు కారణంగా ఈ జాతకులకు స్త్రీ మూలక ధనప్రాప్తి కలుగును. మరల దశలో ధన క్షయమగును.

19. Sandeep Kumar Goud

పుట్టిన తేదీ: 15-05-1998

పుట్టిన సమయం: 04:38 AM

పుట్టిన స్థలం: సంగారెడ్డి

(i) నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది?

సమాధానం: ఏకాదశ స్థానంలో గురు కేతువుల సంగమం వలన ఈ జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు.

(ii) నాకు వ్యాపారం కలసి వస్తుందా? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? (టైల్స్ వ్యాపారం బాగుంటుందా?)

సమాధానం: లాభ స్థానంలో రవి ప్రతికూలంగా ఉండుట వలన ఈ జాతకులకు ప్రభుత్వ పరమైన చిక్కులు కలుగును (ఆర్థిక విషయాల యందు). వ్యాపారము వీరికి అచ్చుబాటు రాదు. టైల్స్ వ్యాపారము కలసిరాదు.

(iii) వైవాహిక దోషాలు ఉన్నాయా?

సమాధానం: వైవాహిక స్థానాధిపతి శుక్రుడు ద్వాదశంలో దగ్ధ యోగమును కల్పించుట వలన ఈ జాతకులకు వైవాహిక దోషములు ఉన్నవి.

20. Kunda Venkateswara Rao

పుట్టిన తేదీ: 06-06-1961

పుట్టిన సమయం: 02:30 PM

పుట్టిన స్థలం: విజయవాడ

(i) నాకు పితృదోషం ఉన్నదా?

సమాధానం: పితృస్థానములో రవి మరియు 9వ స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమస్థానంలో ఉన్నందున ఈ జాతకులకు పితృమూలక స్త్రీ శాపం ఉన్నది.

(ii) స్వగృహ యోగం ఉన్నదా?

సమాధానం: ఈ జాతకులకు స్వగృహ యోగం ఉన్నది.

(iii) నా జాతకంలో ఉన్న గురువు నీచపడ్డాడు అని ఒక సిద్ధాంతి చెప్పారు. నాకు నీచ భంగ రాజయోగం ఉన్నదా?

సమాధానం: గురువు నీచపడినందున మరియు వక్రించినందున, వక్రించిన శనితో కూడినందున దీనిని గురు శాపం మరియు సంతాన దోషంగా పరిగణించబడుతుంది.

(మిగిలిన వారి పరిశీలనలు పార్ట్-2లో మరో మూడు రోజుల్లో వెబ్ సైట్లో ప్రచురిస్తాము)

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

సంపూర్ణ జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Email: chakrapani.vishnumaya@gmail.com

 

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X