Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ
మనము నివసించే ఈ భారత భూమి ఎంతో పవిత్రమైన కర్మ భూమి, పుణ్య భూమి. ఎత్తైన హిమాలయములు, వింధ్యా పర్వతములు, నైమిశారణ్యం, దండకారణ్యం లాంటి దట్టమైన అడవులు; గంగా, యమునా,కావేరి,కృష్ణ, గోదావరి, నర్మద లాంటి పవిత్ర నదులతో ఈ పవిత్ర భారతదేశము నిండి ఉంది. ఎన్నో పురాణములు వ్రాసి వాటిలోని విలువలను, జ్ఞానమును లోకమునకు తెలియజేసిన బ్రహ్మర్షులు, మహర్షులు జన్మించిన భూమి. ఈ భరత భూమిపైనే వేదములు కూడా వెలికితీయబడ్డాయి. మొదట శ్రీ వేద వ్యాస మహర్షి వేదములు అన్నింటిని అభ్యసించి , వాటిని తన శిష్యులకు భోదించాడు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానమైన వేదములలో ఆరు అంగములు ఉన్నాయి. ఆ అంగములలో ఒకటి “జ్యోతిష్య శాస్త్రము”. మనకు అష్టాదశ 18 పురాణములు ఉన్నాయి. వేదములను అభ్యసించే శక్తి లేని వారికి, ఈ పురాణములు, ఇతిహాసములు ఒక వరము. నారదమహర్షి ఆధ్వర్యములో వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యం “శ్రీమద్రామాయణము”.
ఈ “శ్రీమద్రామాయణములో” జ్యోతిష్య శాస్త్రము గురించి సంబంధములు , సంఘటనలు ఎన్నో చెప్పబడ్డాయి. రామాయణములో ఏడు కాండలు ఉన్నాయి. ప్రతి కాండములో గ్రహములు, ముహూర్తము, వాస్తు శాస్త్రము, పంచాంగము లాంటి విషయములను శ్రీ మద్రామాయణములో ఆచరణలో ఉంచారు. నేను నా అనుభవము రీత్యా రామాయణములోని కాండములలో ఏ కాండములో , ఏ రకంగా జ్యోతిష్య శాస్త్రమును ఉపయోగించారో మీకు వివరిస్తాను.
1. బాల కాండ :
(a) మొదటి కాండము లేదా మొదటి అధ్యాయము అయిన బాల కాండలో శ్రీ రాముడు మరియు అతని ముగ్గురి సోదరుల జనన కాలము గురించి వాల్మీకి మహర్షి ఈ విధంగా వివరించాడు.
||శ్లో|| తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికె తిథౌ|
నక్షత్రే దితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసూ||
గృహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ|
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక సమస్కృతమ్||
కౌసల్యా జనయద్రామం సవ్య లక్షణ సంయుతం|
పుష్యే జాతస్తు భరతొ మీనలగ్నే ప్రసన్నధిః||
సార్పే జాతౌ తూ సౌమిత్రి కులీరే భ్యూదితే రవౌ|| (1:18:8 to 10; 14)
“ 12 నెలల తరువాత , చైత్ర మాసములో శుక్ల నవమి నాడు కౌసల్యా దేవికి శ్రీ రాముడు జన్మించాడు. కర్కాటక లగ్నములో, చంద్రుడు గురువుతో కలసి, సూర్యుడు, కుజుడు, శుక్రుడు, శని ఉచ్చస్థానములో ఉంటూ , పునర్వసు నక్షత్రములో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామునికి కౌసల్యా దేవి జన్మనిచ్చింది. మీన లగ్నములో, పుష్యమి నక్షత్రములో భరతుడు జన్మించాడు. మరుసటి రోజు కర్కాటక లగ్నములో, ఆశ్లేష నక్షత్రములో కవలలు అయిన లక్ష్మణ, శత్రుజ్ఞులు జన్మించారు”
*ఈ వాల్మీకి రామాయణములో చెప్పిన గ్రహ స్థానముల ప్రకారం శ్రీ రాముల వారి జన్మకుండలి తయారుచేసి, పూర్తి విశ్లేషణ చేసి నాకు తెలిసిన శాస్త్ర రీత్యా త్వరలోనే మీకు అందజేసే ప్రయత్నము చేస్తాను.
(b) ఇదే బాలకాండములో శ్రీ రాముడు మరియు తన సోదరుల వివాహము ఉత్తర ఫల్గుణి నక్షత్రములో జరిగింది. ఈ కార్యమును ఉద్ధేశించి జనకమహారాజు , వశిష్ట మరియు విశ్వామిత్ర మహర్షులతో ఈ విధంగా చెప్పాడు.
||శ్లో|| ఉత్తరే దివసే బ్రాహ్మణ ఫల్గుణీభ్యాం మనీషీనాః |
వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతిః|| (1:72:14)
దీని భావము ఏమిటంటే “నేటికీ రెండు రోజుల తరువాత సంతానపరుడైన భగుడు అనేవాడు అధిష్టాన దేవతగా ఉన్నప్పుడు, ప్రజాపతి కనుక వంశమును పెంచగల నక్షత్రం అయిన ఉత్తర ఫల్గుణి నక్షత్రములో వివాహము జరిపిస్తాను” అని జనకమహారాజు వివరించాడు.
*ఒకే తల్లి, తండ్రికి జన్మించిన పిల్లలకు ఒకే లగ్నములో, ఒక మండపములో వివాహము జరిపించడం నిషిద్ధం. అయితే ఒకే లగ్నములో రెండు శుభకార్యములు చేయవచ్చా? ఒక ఏడాది దాటితే కాని రెండవ శుభకార్యము చేయకూడదు. కానీ తల్లులు వేరు అయితే చేయవచ్చు అన్నారు. కాబట్టి రాముడికి, భరతుడికి ఒకే ముహూర్తములో వివాహము చేయవచ్చు. మరి లక్ష్మణ , శతృఘ్నులకు ఎలా? దీనికి సమాధానం దైవజ్ఞ విలాసములో చెప్పారు. లగ్నమును 30 డిగ్రీలుగా విభజిస్తే 29 డిగ్రీలలో ఒకరికి, 30వ డిగ్రీలలో మరొకరికి వివాహము జరిపించవచ్చు. అందువలన రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞుల వివాహములు సర్వశాస్త్ర సమ్మతమైన ప్రాజాపత్య వివాహములు అని చెబుతారు.
2. అయోధ్య కాండ:
రెండవ కాండ లేదా అధ్యాయము అయిన అయోధ్య కాండలో ఉత్పాత గ్రహముల కలయికలు, స్వప్న శాస్త్రము, వాస్తు శాస్త్రము- ఈ శాస్త్రముల ప్రాముఖ్యత సంబంధిత సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాము.
(a) శ్రీరాముని పట్టాభిషేకము గురించి , దశరథ మహారాజు వశిష్ట మహర్షితో ఈ విధంగా తెలియజేశాడు.
||శ్లో|| చైత్రః శ్రీమానయం మాసః పుణ్యహ్ పుష్పితకాననః|
యౌవరాజ్యాయ రామస్య సర్వమేవోపకల్ప్యతామ్||
స్వ ఏవ పుణ్యా భవిత స్వో భీశెచ్చస్తూ మే సుతః|
రామో రాజీవతమ్రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభుః|| (2:4:2)
దీని భావం ఏమిటంటే “ఇది చైత్ర మాసము. పరమపవిత్రమైన మాసం. అరణ్యములు అన్నింటిలో చెట్లు పుష్పించి , శోభించి ఉంటాయి. పుష్యమి నక్షత్రములో చంద్రుడు కలసి ఉన్న రోజును రాముని పట్టాభిషేకానికి ముహూర్తముగా నిర్ణయించారు.”
సుమంత్రుని పిలిచి రాముడిని తీసుకురమ్మనారు. వశిష్టుల వారిని పిలచి పట్టాభిషేకమునకు కావలసిన ఏర్పాట్లు చేయమని కోరాడు.
(b) శ్రీ రాముడిని దశరథుడు పిలిపించాడు. దశరథుడు శ్రీరామునితో ఇలా అన్నాడు:
||శ్లో|| అపి చాద్యాసుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ |
సనిర్ఘాతాది వొల్కా చ పతతీహా మహాశ్వనా||
అవశ్టబ్ధంచ మే రామ నక్షత్రం దారునెగ్రహైః|
ఆవేదయంతి దైవజ్ఞాః సూర్యాఙరకరాహుభీః||
ప్రాయెనహి నిమిత్తానామిట్టశానాం సముద్భవే|
రాజా హి మృత్యుమాత్నోతి ధోరాంవాపదమృచ్ఛతి|| (2:4:17,18&19)
అద్య చంద్రోభ్యూపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు|
స్వః పుష్యయోగం నియతం వశ్యంతే దైవచింతకాః|| (2:4:21)
“రామా! నాకు పీడ కలలు వస్తున్నాయి. ఉల్కలు విపరీతమైన శబ్దముతో కింద పడుతున్నాయి. తోకచుక్కలు కనబడుతున్నాయి. అన్నింటిని మించి ఈ వేళ నా జన్మ నక్షత్రమును రవి, కుజుడు, రాహువు అను మూడు పాప గ్రహములు ఆవహించి ఉన్నాయి. అందుకని ప్రమాదము ముంచుకొస్తోంది. ఇలాంటి స్వప్నములు, గ్రహ కలయికలు ( జన్మనక్షత్రముకు పాప గ్రహములు ఆవహిస్తే) జరిగితే సహజంగా , మహారాజు మరణము పొందుతారు లేదా భయంకర సంఘటనను ఎదుర్కొంటారు అని మన దైవజ్ఞులు (జ్యోతిష్యులు) తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు చంద్రుడు పునర్వసు నక్షత్రములో ఉన్నాడు. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రములో ఉంటాడు. ఈ నక్షత్రము నీ పట్టాభిషేకముకు ఎంతో శుభప్రదం అని మన దైవజ్ఞులు తెలియజేశారు. కాబట్టి పట్టాభిషేకముకు తయారు అయ్యి, పూజాది కార్యక్రమములు నిర్వహించు” అని దశరథుడు శ్రీరామునితో చెప్పాడు.
*ఇక్కడ పీడకలల గురించి , పాపగ్రహముల కలయిక గురించి , శుభప్రదమైన రోజుల గురించి రామాయణములోని చర్చను గురించి మనము గ్రహించగలిగాము. జ్యోతిష్య పండితులను ఇక్కడ (రామాయణములో) “దైవజ్ఞులు”గా సంభోదించారు. ఎవరైతే గ్రహ కదలికలను నిరంతరంగా గమనిస్తూ, తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి సరైన పరిరము తెలియజేస్తారో వారు ‘జ్యోతిష్య పండితులు’.
(c) ఇదే అయోధ్య కాండలో శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళమని ఆజ్ఞాపించినపుడు , లక్ష్మణుడు కోపోద్రిక్తుడు అవుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడిని ఈ విధంగా శాంతింపజేస్తాడు.
||శ్లో|| సుఖదుఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ|
యచ్చ కించిత్తథ భూతం నను దైవస్య కర్మ తత|| (2:22:22)
“సుఖము, దుఃఖము , కోపము,శాంతి, లాభం, నష్టం, శుభం, అశుభం, తప్పు, ఒప్పు ఇవన్నీ కూడా మన ప్రారబ్దం ప్రకారం జరుగుతాయి. వీటన్నింటిని దైవం శాసిస్తూ ఉంటాడు. ఆ దైవమును తిరస్కరించి మనము ఏమి చేయలేము. ఈ రోజు కైకేయ వెనకాల దైవము ఉండి నన్ను అరణ్యముకు పంపిస్తున్నాడు. అలా కాకపోతే నన్ను ఎప్పుడూ వేరుగా చూడని కైకమ్మ నన్ను అరణ్యవాసము చేయమని ఎందుకు అడుగుతుంది?” అని రాముడు లక్ష్మణుడిని సముదాయించాడు.
(d) అరణ్యముకు చేరిన తరువాత లక్ష్మణుడు వారి ముగ్గురి (రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు) కొరకు ఒక ఆశ్రమము నిర్మిస్తాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఈ విధముగా తెలియజేస్తాడు.
||శ్లో|| కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చీరజీవిభీః|| (2:56:22)
“ఓ లక్ష్మణా! వాస్తు దేవతలను సంతృప్తిపరచిన తరువాత మాత్రమే నూతన గృహములోకి ప్రవేశించాలి. అప్పుడే జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.”
*అరణ్యముకు వెళ్ళిన తరువాత అక్కడ లక్ష్మణుడు చక్కటి పర్ణశాలను నిర్మించాడు. నూతన నిర్మాణ గృహములోకి వెళ్ళేవారు దీర్ఘ కాలము జీవించాలంటే వాస్తు హోమము చేయాలి. వాస్తుహోమము చేయకుండా గృహప్రవేశము చేస్తే యజమాని అల్పాయూష్కులు అవుతారు. ప్రమాదములు సంభవిస్తాయి.
*మనము ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు, భవనములు నిర్మించుకుంటాము. ఆ నిర్మాణములలో సుఖంగా ఉండాలంటే చేయవలసిన హోమ కార్యక్రమములు చేసి తీరాలి.
3. అరణ్య కాండ :
ఈ అరణ్యకాండలో రావణుడు సీతను అపహరించి తీసుకువెళ్లే సంధర్భమును “బుధః ఖే రోహిణిమీవ” అని వాల్మీకి మహర్షి వివరించాడు. ఈ వాక్యముకు ఎంతో అంతర్గత అర్థం ఉంది. అది ఏమిటంటే సీతాదేవిని రావణుడు అపహరించుకుని వెళ్ళేటపుడు బుధుడు, చంద్రుడు అధిపతిగా ఉండే రోహిణి నక్షత్రములో ఉన్నాడు, దీనివలన లంకా ప్రజలకు శుభము కాదు అని వాల్మీకి మహర్షి వివరించాడు.
ఈ అరణ్య కాండలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, సంఘటనలు ఇప్పుడు మనము తెలుసుకుందాము. “జటాయువు” అను పక్షి శ్రీరామునికి “ముహూర్తము” గురించి వివరిస్తుంది. అంతేకాకుండా “కబంధ” అను రాక్షసుడిని శ్రీ రామ లక్ష్మణులు సంహరిస్తే , పాపవిమోచనము కలిగి పాపగ్రహ దశ (చెడు గ్రహ దశ) జరుగుతున్నప్పుడు విజయం కోసం ఏమి చేయాలో శ్రీరాముడికి ఆ కబంధుడు సలహా ఇస్తాడు.
(a)
||శ్లో|| యేనయాతి ముహూర్తెన సీతామాదాయ రావణాః|
విప్రనష్టం ధనం క్షిప్రం తత్ స్వామి ప్రతిపధ్యతే||
విందో నామ ముహూర్తయమ్ సచ కాకుస్థా నాబుధత|
త్వప్రియాం జానకీం హుత్వా రావణో రాక్షసేఖరః|| (3:68:12&13)
పక్షి జటాయువు శ్రీ రామునితో “రామా! రావణుడు సీతాదేవిని ‘విందా’ ముహూర్తములో అపహరించుకుపోయాడు. కాబట్టి నీ సీతాదేవి నీకు దొరుకుతుంది. ‘విందా’ ముహూర్తములో ఇతరుల వద్ద నుండి ఏదైతే దొంగలిస్తారో, ఆ వస్తువు తిరిగి యజమాని వద్దకే చేరుతుంది. నీవు సీతమ్మను పొందుతావు. పరమ సంతోషంగా సీతా రాములు ఇద్దరూ ఉంటారు. మీ ఇద్దరికీ పట్టాభిషేకము అవుతుంది. చాలాకాలము నీవు రాజ్య పాలన చేస్తావు. “
‘కబంధుడు’ అను రాక్షసుడి చేతులు శ్రీ రామ లక్ష్మణులు నరికి వేసి , ఆ తరువాత చితిపై పెట్టి నిప్పుపెడతారు. కబంధునికి శాపవిమోచనము కలిగి , తన అసలైన అందమైన గంధర్వ రూపమును దాల్చాడు. శ్రీరాముడిని సీతాదేవి గురించి చింతించవద్దని సుగ్రీవుని గూర్చి ఈ విధంగా సలహా ఇస్తాడు.
||శ్లో|| రామ షడుక్తయో లోకే యాభిస్సర్వమ్ విర్మశ్యతే|
పశీర్మష్టో దశాంతేన దశాభాగేన సేవ్యతే|| (3:72:8)
కబంధుడు రాముడితో “రామా! నీకు కావలిసినది ఏమిటో తెలుసా? నీకు చాలక్లేశముతో గడపాల్సిన దుష్ట సమయము నీకు నడుస్తోంది. అందుకే నీవు నీ భార్యను పోగొట్టుకున్నావు. నీలాగే భార్యను పోగొట్టుకుని కష్టాన్ని పొందుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే సుగ్రీవుడు.”
“ఎవరైతే చెడుగ్రహ దశ నుండి కష్టాలు పొందుతున్నారో, వారు అదే రకమైన కష్టం, సమయం అనుభవిస్తున్న వారి సహాయము పొందాలి. రాముడి భార్యను రావణుడు అపహరించాడు, సుగ్రీవుని భార్యను వాలి అపహరించాడు. కావున ఇద్దరూ ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాముడు తన చెడు దశా సమయం అంతము కావస్తుంది. అలాగే సుగ్రీవుని చెడు సమయము కూడా. కావున రాముడు, సుగ్రీవుల మైత్రి ఇద్దరికీ ఎంతో శుభ ఫలితాలు ఇస్తాయి”.
4.కిష్కింధ కాండ :
వాలి సుగ్రీవుల యుద్ధమును వాల్మీకి మహర్షి “బుధుడు, కుజుడు మధ్య యుద్ధము”తో పొలుస్తూ “బుధాంగరకాయోరీవా” అని సంభోదించారు.
వానరసేనకు అంగదుడు నాయకత్వము వహిస్తున్నాడు. జాంబవంతుడు, నీల, హనుమంతుడు మిగిలిన వానరము అంతా కలసి సముద్రపు వద్దకు వెళతారు. అక్కడ “సంపాతి” అను పక్షికి అంగదుడు రాముడి కథను గురించి, సంపాతి సోదరుడు అయిన జటాయువు యొక్క మరణము గురించి సంపాతి పక్షికి వివరించాడు. అదంతా విన్న సంపాతి పక్షి సీతమ్మ జాడలను ఈ విధంగా తెలియజేస్తుంది.
||శ్లో|| తస్తయాం వసతీ వైదేహీ దీనా కౌశేయవాసిని|
రవాణాన్తః పూరే రుద్ధా రక్షసిభిస్సురక్షిత||
జనకస్యాత్మజాం రాజ్ఞః తస్యాం ద్రక్ష్యథ మైథిలీమ|| (4:58:22&23)
ఇహస్థో హామ్ ప్రపశ్యామి రావణం జానకీం తథా|
అస్మాకమపీ సౌవర్ణాం దివ్యం చక్షుర్బలం తథా|| (4:58:31)
“నేను, జటాయువు పెట్టుకున్న పోటీలో సూర్యుని వేడిమికి, జటాయువును కాపాడబోయి నా రెక్కలు కాలిపోయి ఈ వింధ్యా పర్వతములపై పడ్డాను. ఇక్కడే ఉంటూ, నాకున్న దివ్యదృష్టితో జానకి మరియు రావణులను చూస్తాను. శోకసంద్రములో మునిగిన సీతాదేవి లంకలో, ఆడరాక్షస భటుల మధ్యలో ఉంది. కావున నీవు లంకలో వెతికితే సీతమ్మ దొరుకుతుంది. మాకు కొన్ని మైళ్ళ దూరము చూసే దివ్య దృష్టి ఉంది. వంద యోజనముల ఉన్న దాన్ని కూడా మేము చూడగలము. “ అని సంపాతి పక్షి అంగదునికి వివరిస్తుంది.
*ఇక్కడ మనము గమనించాల్సిన విషయము ఏమిటంటే పక్షులకు సైతం దివ్య దృష్టి ఉంటుంది. అదే విధంగా దైవజ్ఞులు (జ్యోతిష్యులు) కూడా తమకు తపశ్శక్తి, జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానము ఉన్నందున వారు అధ్భుతమైన జరగబోయే సంఘటనలను చెప్పగలరు.
5. సుందరా కాండ :
(a)ఈ సుందరా కాండలో వాస్తు శాస్త్ర సంబంధిత సంఘటనలను తెలియజేస్తున్నాను. హనుమంతుడు లంకా నగరం యొక్క విన్యాసమును, రావణుని ఘనమైన రాజభవనములను చూస్తాడు. ఆ సంఘటనను వాల్మీకి మహర్షి ఈ విధముగా తెలియజేస్తాడు.
||శ్లో|| గృహాణి నానావాసురాజీతాని|
దేవాసురై శ్చాపి సుపూజితాని|
సర్వైశ్చ దొషై పరివర్జితాని|
కపిర్దదర్శ స్వబలార్జితాని|| (5: 5: 3&4)
హనుమంతుడు “రత్న వైఢూర్యములతో దివ్యంగా వెలిగిపోతున్న ఘనమైన రాజభవనములు చూశాను. గృహములు అన్నీ కూడా వాస్తు శాస్త్రమునకు అనుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ నిర్మాణములో దోషము పట్టటానికి వీలులేకుండా ఉన్నాయి. దేవతలు కూడా అక్కడ ఇళ్లకు వస్తే అక్కడే పూజ చేసుకోవాలి అనిపించెట్టు ఉన్నాయి. వాస్తు శాస్త్ర నిపుణుడు అయిన మయుడు స్వయంగా ఈ భవనాలను నిర్మించినట్టుగా ఉన్నాయి. “ అని వివరించాడు.
*ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే మయుడుని గూర్చి పొలుస్తున్నారంటే, రామాయణ సమయములో వాస్తు శాస్త్రము ఆచరణలో ఉండేదని చెప్పవచ్చు.
(b)హనుమంతుడు లంకలో సీతాదేవిని మొదటి సారి చూడగానే శోకముతో ఈ విధముగా:
||శ్లో|| మాన్యా గురు వినీతస్యలక్ష్మణస్య గురుప్రియా|
యదీ సీతాపీ దుఖార్త కాలొ హి దురతిక్రమః|| (5:16: 3)
“లక్ష్మణ మూర్తి చేత ఆరాధింపబడిన పాదములు కలిగిన సీతమ్మ, లక్ష్మణుని గురువు అయిన రామచంద్రమూర్తి ఇల్లాలు అయిన సీతమ్మ, అయోనిజగా జన్మించిన సీతమ్మ, ఈ రోజు భూమి మీద రాక్షస స్త్రీల మధ్య పది నెలలుగా ఒకే వస్త్రమును కట్టుకొని ఉన్నదంటే “కాలోహి దురతి క్రమః” కాలము ఏదైనా చేస్తుంది. ఈ కాలమునకు అటువంటి శక్తి ఉంది. “ అని హనుమంతుడు బాధపడతాడు.
*”కాలోహి దురతి క్రమః” ఈ వాక్యము దాదాపు 50 సార్లు ఈ వాల్మీకి రామాయణములో కనబడుతుంది. అంటే కాలమునకు అసాధ్యమైనది ఏది లేదు అన్న నిస్సందేహమైన నిజమును మనకు వాల్మీకి మహర్షి తెలియజేస్తాడు.
*”కాల పురుషుని”కి అందరూ తలవంచాలి. ఎవరైతే తమకు వచ్చే మంచి మరియు చెడు సమయములను గూర్చి తమ గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకొని అనుగుణంగా పరిహార క్రియలు జరుపుకుంటాడో, అతను వివేకి అని చెప్పవచ్చు.
(6)యుద్ధ కాండ :
(a)ఈ అధ్యాయములో యుద్ధము కొరకు కిష్కింధ నుండి లంకకు వెళ్ళేందుకు శ్రీరాముడు ముహూర్తము నిర్ణయిస్తాడు.
||శ్లో|| ఆసిమన ముహూర్తే సుగ్రీవ ప్రయాణమభిరోచయ|
యుక్తొ ముహూర్తో విజయః ప్రాప్తో మధ్యం దివాకరః||
ఉత్తరాఫల్గుణి హ్యాద్య క్షస్తు హస్తేన యోక్ష్యతే|
అభిప్రాయం సుగ్రీవ సర్వాణికసమావృతాః|| (6:4:3 & 5)
రాముడు సుగ్రీవునితో ”ఈ సమయములో సూర్యుడు ఆకాశానికి మధ్యలో ఉన్నాడు. మధ్య దినమున మార్తాండ బింబమై ప్రకాశిస్తున్నాడు. ఈ రోజున విశాఖ నక్షత్రము ఉన్నది. ఇక్ష్వాకు వంశీయులు అందరిదీ నక్షత్రం విశాఖ.మూలా నక్షత్రము రాక్షసుల నక్షత్రము. విశాఖ నక్షత్రం నా నక్షత్రముకు ఉద్ధేశించి సాధన తార అవుతుంది. మళ్ళీ రేపు రోజున వచ్చే హస్త నక్షత్రము నిషిద్ధం. అందువలన ప్రయాణము చేయకూడదు. ఇవ్వాళ మిట్ట మధ్యానము వేళ ముహూర్తము చాలా బాగుంది. కనుక ఈ ముహూర్తమును “విజయము” అని పిలుస్తారు. కాబట్టి ఉత్తరక్షణం మనం సైన్యాన్ని తీసుకొని బయలుదేరి వెళదాము” అని చెబుతాడు.
(b) ఇంద్రజిత్తుని మరణము తరువాత తీవ్ర విచార ధోరణిలో ఉన్న రావణుడు, కోపోద్రిక్తుడై సీతాదేవిని చంపేందుకు వెళతాడు. ఆ సమయములో రావణుడి మంత్రి అయిన సుపర్శ్వ, సీతాదేవిని చంపవద్దని, రాముడితో యుద్ధము చేసి విజయము సాధించమని సలహా ఇస్తాడు.
||శ్లో|| అభ్యుత్యానం తమధ్యైవ కృష్ణ పక్ష చతుర్దశీం |
కృత్వా నిర్యాహ్యమావాశ్యం విజయాయ బలౌవృతం || (6:92: 66)
“నీవు కృష్ణ పక్ష చతుర్దశి అయిన ఈరోజు సైన్యమును సిద్ధము చేయి. రేపు అమావాస్య రోజున నీవు రామునితో యుద్ధానికి తలపడి విజయము చేకూర్చుకో” అని సెలవిచ్చాడు.
అమావాస్య రాక్షసులకు మంచి రోజు, మిగిలిన వారందరికి చెడు దినము. కావున రాముడికి రావణుడిని చంపటం ఎంతో కష్టతరము అయ్యింది.
రాముడు యుద్ధం చేసి అలసిపోయాడు. ఆ సమయములో అగస్త్య మహర్షి వచ్చి శ్రీ రాముడికి ఆదిత్య హృదయమును ఉపదేశించి భక్తితో ఈ ఆదిత్య హృదయమును మూడు సార్లు జపించమని సలహా ఇస్తాడు. రాముడు అదే విధంగా ఆదిత్య హృదయమును జపించి, రావణుడిని సంహరిస్తాడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి చెప్పిన మాటను శ్రద్ధగా పాటించాడు. రావణుడు సంహరింపబడ్డాడు. అధర్మమును ధర్మము జయించింది.
పురాణపురుషోత్తముడైన , దివ్య పురుషోత్తముడైన శ్రీ రాముడు “కాల మహిమ” వలన ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇందులో ఎవ్వరికీ ఆక్షేపము లేదు. కాలమునకు అందరూ సమానమే. కాలము ఎంతో శక్తివంతమైనది. కాలముకు మిత్రులు, శత్రువులు ఉండరు. తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. సద్గురువుల యొక్క ఆదేశాలను ఆచరిస్తే ఈ కాలము వలన మనము ఎదుర్కొంటున్న కష్టాలకు కొంతవరకు చెక్ పెట్టవచ్చు. నిత్య దైవ నామస్మరణ వలన దైవానుగ్రహము కలుగుతుంది.
*జ్యోతిష్య శాస్త్రము కూడా వేదముల లాగానే ఎంతో పురాతనమైనది. ఇది ఒక Divine Science. ఈ జ్యోతిష్య శాస్త్రము మనకు చీకటిలో టార్చి లైటుగా ఉపయోగపడుతుంది. ఈ జ్యోతిష్య శాస్త్రమును దుర్వినియోగము చేయకూడదు. ఒక మనిషి యొక్క పూర్వ జన్మ కర్మలను పోగేసుకున్న సమూహం తన జాతక చక్రము తెలియజేస్తుంది. ఈ శాస్త్రము కర్మ సిద్ధాంతముతో ముడిపడి ఉంటుంది. పుణ్యకర్మల ఫలితం మనకు మనశ్శాంతి, ఆనందము కలుగచేస్తాయి. పాపకర్మల ఫలితం మనకు బాధలు, కష్టాలను తెచ్చిపెడతాయి. కావున మనము చేసే ప్రతి పని, మనము మాట్లాడే ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా చేయాలి.
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles:
- Astrology reasons for extra martial affair-వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-
- తంత్ర ప్రపంచం
- సర్పశాపం
- బ్రహ్మ తంత్ర వేద జ్యోతిష్య నిలయం
- What is Kalatra dosha?Effects of Kalatra dosha?
- సూర్యగ్రహణ సమయములో మండకాళి మహా యంత్ర పూజ
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu