loading

విషధార్ కాలసర్ప దోషం

  • Home
  • Blog
  • విషధార్ కాలసర్ప దోషం

విషధార్ కాలసర్ప దోషం

విషధార్ కాలసర్ప దోషం

 

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ,  ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే  జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో పదకొండవ అయిన విషధార్ కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్పదోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.

  • దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ

               జన్మకుండలిలో ఏకాదశ భావములో (లాభ స్థానం, పూర్వ జన్మ) రాహువు మరియు పంచమ భావములో (సంతాన స్థానం, వృత్తి, ప్రేమ వ్యవహార స్థానం, విద్య) కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారు విషధార్ కాలసర్ప దోషము ఉన్నట్టుగా గుర్తించాలి. విషధార్ కాలసర్పదోషం వలన జాతకుల యొక్క సంతానం పై, వృత్తి పై, ప్రేమ వ్యవహార, వ్యాపార లాభాల విషయాలలో జాతకుల పై ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ విషధార్ కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430

విషధార్ కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:

  • ఈ దోష జాతకులకు జ్ఞాపకశక్తి లోపిస్తుంది.
  • తండ్రి తరపున బంధువులతో ఈ జాతకులకు సమస్యలు, వివాదాలు ఏర్పడతాయి.
  • సంతాన పరమైన సమస్యలు ఎదురవుతాయి. సంతాన చింత ఏర్పడుతుంది. సంతాన వ్యతిరేకత ఏర్పడుతుంది.
  • కడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వీరికి కలుగుతాయి.
  • విద్యలో రాణించలేరు. పై చదువులు కొనసాగించేందుకు వీరికి కూడా తెలియని కారణాలు అడ్డంకులుగా ఏర్పడతాయి.
  • ఆర్థిక విషయాలలో, ఆస్తుల విషయాలలో బంధువులతో గొడవలు సంభవిస్తాయి.
  • వృత్తిపరమైన జీవితంలో అస్థిరత్వం ఏర్పడుతుంది.
  • కుటుంబ సభ్యులతో ఈ జాతకులకు సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు.
  • ఈ దోషం వలన తరచూ అనారోగ్య సమస్యలు రావడం, అవి ఎందుకు వచ్చాయో అంతుపట్టకపోవడం, రోగ నిర్ధారణ కాకపోవడం జరుగును.
  •  సోదరులతో విబేధాలు కలుగవచ్చు. చపల మనస్తత్వం కలిగి ఉంటారు.
  • కారాగార శిక్ష అనుభవించే సూచనలు రావచ్చు (జన్మకుండలిలో బంధన యోగాన్ని ప్రోద్బలం చేసే గ్రహ స్థితులు ఉన్న వారికి మాత్రమే జరుగుతుంది).
  • నిద్రలేమి, కంటి సమస్యలు, హృదయ సమస్యలు రావచ్చు. 
  • కొంత డబ్బు కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కోసారి చేయకూడని పనులు కూడా చేయవలసి ఉంటుంది.
  • జ్ఞాపక శక్తి మందగిస్తుంది.
  • అవకాశాలు చేతిదాకా వచ్చినప్పటికి, వీరు అనుకున్నది సాధించడానికి జాప్యం ఏర్పడుతుంది.
  • మానసిక పరమైన ఒత్తిడి, ఆందోళన నిరంతరం మనస్సులో ఉంటుంది.
  • ప్రేమ వ్యవహారాలలో విచిత్రమైన మలుపులు, జటిల సమస్యలు ఏర్పడతాయి.
  • సొంతంగా నిర్వహించే వ్యాపారాలలో మరియు భాగస్వామ్య వ్యాపారాలలో కూడా ఈ జాతకులకు సమస్యలు ఎదురవుతాయి.

ముఖ్య గమనిక:

విషధార్ కాలసర్పదోషం వలన జాతకులకు తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికి, ఈ దోషం వలన కలిగే కొన్ని అనుకూల విషయాలు కూడా ఉన్నాయి. ఈ దోషం గల జాతకులు పెట్టుబడుల విషయంలో కాస్త వివేకం ప్రదర్శిస్తే, షేర్ మార్కెట్లో లాభాలు పొందగలరు. జాతకులు కాస్త శ్రమిస్తే వీరిలో ఆధ్యాత్మికత మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణాల వలన లాభాలు చేకూరుతాయి. చట్ట పరమైన కేసులు, వివాదాలు ఉన్నప్పటికి, చిట్ట చివరకి విజయం వీరిదే అవుతుంది. వ్యక్తిగత జన్మకుండలిలో శుభ యోగాలు కూడా తోడైనట్లైతే, జాతకులకు 42 సంవత్సరాల తరువాత శుభ ఫలితాలు కనబరుస్తాయి. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.

 

విషధార్ కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • విషధార్ కాలసర్ప దోష ఉన్న జాతకులు తమ సంతానం యొక్క ఆరోగ్యం పై దృష్టి సారించాలి. సంతానం యొక్క ఆరోగ్యం పై ఒక కన్ను వేసి ఉంచాలి.
  • షేర్ మార్కెట్ల ద్వారా వీరికి లాభాలు వచ్చినప్పటికి, ఇది శాశ్వతం అయితే కాదు. కావున షేర్ మార్కెట్ల లాభాలను చూసుకొని అత్యుత్సాహానికి పోకూడదు.
  • ఏకాగ్రత, శ్రద్ద, మానసిక దృష్టి వీరు మెరుగుపరచుకోవాలి.
  • ఈ జాతకులు తమ సన్నిహితులు, స్నేహితులు, బంధువుల పై దురుసు ప్రవర్తనను చూపించడం మానుకోవాలి. అందరితో ప్రేమగా, సన్నిహితంగా మెలగడం అలవాటు చేసుకోవాలి.

పరిహారాలు:

  • విషధార్ కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్చేయండి.
  • ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
  • మహామృంత్యుంజయ మంత్రాన్ని జపించాలి.
  • మహాశివునికి రుద్రాభిషేకం చేయించాలి.

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Nagashakthi Telugu Book#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses

Leave a Reply