loading

విషతుల్య యోగం-Telugu Horoscope Reading

  • Home
  • Blog
  • విషతుల్య యోగం-Telugu Horoscope Reading

విషతుల్య యోగం-Telugu Horoscope Reading

విషతుల్య యోగం

జన్మకుండలిలో శని, చంద్రుడు కలసి ఉన్నపుడు గాని లేదా శని కొన్ని ప్రత్యేక రాశులలో, లగ్నాలలో ఉన్నపుడు దానిని విషయోగం లేదా విషతుల్య యోగం అంటారు. గత జన్మలో చేసిన పంచమహాపాతకాల కారణంగా ఈ జన్మలో శని కారణంగా శనిగ్రహ విషతుల్య యోగములు ప్రాప్తిస్తాయి. కొంతమంది శిశువులు జన్మించిన నాటి నుండి, వారికి పెరిగే వయస్సుకు తగ్గట్టుగా అవయవ అభివృద్ధి లేకపోవడం, మరుగుజ్జుతనం, వయస్సు పెరుగుతున్న దశలో అంగవైకల్యం ఏర్పడటం, నడకరాకపోవడం, మాటలు రాకపోవడం, బుద్ధి మాంద్యము, మూర్ఛ వ్యాధులు ప్రాప్తించడం, మనోవైకల్యం ఏర్పడటం, జ్ఞాపకశక్తి నశించడం, ఎక్కువగా విషాహార సేవనం జరగడం, శ్వాస సంబంధిత లేదా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, బుద్ధి పరిపక్వత లేకపోవుట వంటి దుష్పరిణామాలు ప్రాప్తిస్తాయి. జాతకంలో శని లేదా చంద్రుడు లేదా శని, చంద్రులు కలసి ఉండే స్థానాలను బట్టి విషతుల్య యోగం నిర్ణయించబడుతుంది. ఆ స్థానాన్ని అనుసరించి విషతుల్య యోగం ప్రభావాన్ని చూపిస్తుంది.

వృశ్చిక రాశిలో శని చూపించు ప్రభావం: 

               వృశ్చిక రాశిలో శని అత్యంత ప్రభావాన్ని, దుష్పరిణామాన్ని చూపిస్తుంది. వ్యక్తులకు జన్మకుండలిలో శని వృశ్చిక రాశిలో ఉండినా, అది ద్వాదశ స్థానాలలో ఏ స్థానమయ్యి ఉంటుందో, దాన్ని బట్టి జాతకునికి ఫలితములు నిర్ణయించబడతాయి. ఉదాహరణకి, జన్మ లగ్నం వృశ్చికమయి, అందులో శని ఉన్నట్లైతే, ఆ జాతకునికి అంగవైకల్యం ఏర్పడుతుంది. ఈ ఫలితం అనేది ఆ రాశి యొక్క రాశ్యాధిపతి (కుజుడు) విదశ జరుగు సమయంలో జరుగును. ఇలా అనేకమైన గ్రహస్తితి దశ కలయికల వలన ఈ విషతుల్య యోగం దుష్ప్రభావాలను చూపిస్తుంది. జాతక పరిశీలనలో ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో తెలియును.  జన్మకుండలిలో శని, పుష్యమి/అనురాధ/ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నట్లైతే వారికి విషయోగం ప్రాప్తిస్తుంది.  

Telugu astrology

ఉదాహరణ ద్వారా విషతుల్య యోగం వివరణ: 

               విషతుల్య యోగం 12 రాశులలో అనగా ఒక వ్యక్తి జన్మకుండలిలో శని చంద్రుడు కలసి గాని లేదా శని మాత్రమే ఉండిన స్థానం జన్మలగ్నం నుండి ఏ భావానికి చెందునో, ఏ భావములలో (12 రాశులలో లేదా లగ్నాలలో) విషతుల్య యోగం ఏర్పడినదో ఆ భావానికి లేదా రాశి ఉన్న స్థానాన్ని అనుసరించి విషతుల్యయోగ ఫలితం ప్రాప్తించును. ఉదా:- మేష లగ్నానికి అష్టమ స్థానంలో విషతుల్య యోగం ఏర్పడినందున, అష్టమ స్థానం స్త్రీలకు మాంగల్య స్థానం మరియు ఆయుః స్థానం అగును. శని మహా దశ, అంతర్దశలలో, శని గోచర రీత్యా వృశ్చికంలోకి వచ్చినపుడు జాతకులకు విషతుల్య యోగ ఫలితములు ఎదురగును.  ఆ కాలంలో విషతుల్య యోగం అనుభములోకి వచ్చును. ఆయుః కారకుడు శుభుడు అయితే ప్రాణహాని కలుగదు. ఆయుః కారకుని దశ కూడా ఈ విషతుల్య యోగ దశలో వస్తే, మారకము తప్పదు. వివాహితులైన స్త్రీలకు ఈ గ్రహస్థితి వచ్చినపుడు, భర్తకు హాని కలుగు వార్తలు వినాల్సి వస్తుంది. ఇవి అన్నియు కూడా గ్రహస్థితులు, గ్రహ దశలు, గోచార గ్రహ సంచారం అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వృశ్చిక లగ్నమందు జన్మించిన లగ్నమందు శని ఉన్నట్లైతే ఆ స్థితిలో శని దశాంతర్దశ జరుగుతున్నట్లైతే ఆ వ్యక్తికి లేదా శిశువుకి ప్రాణహాని లేదా అవయవ లోపములు జన్మసమయంలో కలుగును. జన్మించిన ఒక సంవత్సరం తరువాత వచ్చిన పిదప జాతకునికి మాటలు రాకపోవడం, అగ్ని ప్రమాదాలకు గురి అయ్యి చర్మము కాలిపోవడం జరుగును. సాధారణంగా ఈ విషతుల్యయోగం కలిగిన వారు సంపూర్ణ ఆయుర్దాయం పొందలేరు.

జాతక పరిశీలనలో నా అనుభవం: 

నేను చూసిన జాతక పరిశీలనలో ఆ వ్యక్తులలో విషతుల్యయోగం ఉన్నవారు, చిన్న వయస్సులోనే ప్రమాదాలకు గురి అవ్వడం జరిగింది. చిన్న వయస్సు లేదా మధ్య వయస్సులో మరణించిన వారి యొక్క జాతక పరిశీలనలో విషతుల్య యోగం సంపూర్ణంగా కనబడటం జరిగింది. నేను చేసిన పరిశీలనలో, పరిశోధనలో వంద మందిలో 5 శాతం మాత్రమే విషతుల్య యోగము గల జాతకములు చూడటం జరిగింది. జ్యోతిష్య విషయ జ్ఞానం ఉన్నవారికి ఈ విషతుల్య యోగం గురించి అవగతమవుతుంది. ఈ నా పరిశోధనలు (విషతుల్య యోగం మీద) జ్యోతిష్య విద్యార్థులకు ఉపయోగపడాలని, అవగతమవ్వాలని కోరుకుంటున్నాను. మనం నేర్చిన విద్య పరులకు ఉపయోగపడితే, మనం నేర్చిన విద్యకు అర్థము మరియు మన జన్మకు పరమార్థము. ఆత్మానంద వివేకము కలుగుతాయి. విషతుల్య యోగం కలిగిన వారికి అనారోగ్య సమస్యలు, వ్యాధులు, మనో వైకల్యం, అంగ వైకల్యం అధికంగా ఉంటాయి.

జ్యోతిష్య పరిశీలన(Horoscope Reading in Telugu): 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.

Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Related Articles: 

 

 

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X