loading

శంఖచూడ కాలసర్ప దోషం

  • Home
  • Blog
  • శంఖచూడ కాలసర్ప దోషం

శంఖచూడ కాలసర్ప దోషం

శంఖచూడ కాలసర్ప దోషం

శంఖచూడ కాలసర్పదోషం:

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ,  ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే  జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో తొమ్మిదవది  అయిన శంఖచూడ కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.

  • దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ

జన్మకుండలిలో నవమ భావములో (పితృ స్థానం, అదృష్ట భావం, ఆధ్యాత్మికత తెలిపే భావం) రాహువు మరియు తృతీయ భావములో (సోదర/సోదరీ భావం, ధైర్య సాహసాలు తెలియజేసే భావం, ప్రయాణాలు గూర్చి తెలిపే భావం)  కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శంఖ చూడ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి.

 

శంఖచూడ కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:

  • శంఖచూడ కాలసర్ప దోషం ఉన్న వారికి పితృదోషము కూడా తోడవడం వలన జాతకులకు రెండు దోషముల యొక్క ప్రభావమును ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • స్థిరమైన ఉద్యోగం లేదా వృత్తి లేక గాని, ఇతర వ్యాపకాల వలన గాని ఈ జాతకులకు తీవ్రమైన ధన నష్టం వాటిల్లుతుంది. తరచూ ఉద్యోగములు లేదా వృత్తులు మారుస్తూ ఉండాల్సి వస్తుంది.
  • జాతకులకు గొప్ప అధికారము ఉన్నప్పటికి, కొన్ని అనుకోని సంఘటనల కారణంగా అకస్మాత్తుగా వీరికి ఆ అధికారము చేజారిపోతుంది.
  • స్థిరాస్తుల పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా వీరికి సమస్యలు వాటిల్లును.
  • తండ్రితో గాని లేదా తండ్రి తరపున బంధువులతో గాని వైరములు కలుగును. పిత్రార్జితమును అనుభవించలేరు.
  • చట్ట పరమైన సమస్యలు జాతకునికి ఎదురవుతాయి.
  • గుప్త శత్రువులు వీరిని వివిధ రకాలుగా సమస్యలలోకి నేట్టేందుకు ప్రయత్నిస్తారు.
  • వ్యాపార విషయంలో నష్టపోవాల్సి వస్తుంది.
  • సోదరీ/సోదరులతో ఈ జాతకులకు సత్సంబంధాలు ఉండవు. తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి.
  • ఉద్యోగము చేసే చోట తోటి ఉద్యోగులతో వీరికి గొడవలు వస్తాయి. కావున కొన్ని అపనిందలు కూడా మోయాల్సి వస్తుంది.
  • వైవాహిక జీవితం గందరగోళంగా ఉంటుంది. వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లవచ్చు. దంపతులు విడిపోయేందుకు సహకరించే ఇతర గ్రహ స్థితులు కూడా జన్మకుండలిలో ఉన్నట్లైతే, పురుష జాతకులకు ఈ విషయంలో తీవ్ర ధన నష్టం జరుగుతుంది. స్త్రీ జాతకులకు సైతం ధన నష్టం వాటిల్లును.
  • మతానికి వ్యతిరేకమైన కార్యకలాపములు జరుపుటకు సిద్ధపడతారు.
  • హై బిపి, నిరంతర ఆలోచనలు ఉంటాయి.
  • ఈ దోషం ఉన్న వారికి జీవితములో పైకి ఎదగడం ఎంత సులభంగా జరుగుతుందో, క్రిందకి పడిపోవడం కూడా అంతే సులభంగా జరుగుతుంది. జీవితములో వీరికి ఏది సులభంగా దొరకదు.
  • ఎవరిని నమ్మాలో తెలియక అన్నీ చోటల ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు.

Shankhachuda Kalasarpa dosham

ముఖ్య గమనిక:

               శంఖచూడ కాలసర్పదోషం వలన జాతకులకు తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికి, ఈ దోషం వలన కలిగే కొన్ని అనుకూల విషయాలు కూడా ఉన్నాయి. ఈ దోష జాతకులు తమ పూర్వీకులకు పిండ ప్రధానం సక్రమంగా చేసినట్లైతే, పూర్వీకుల ఆత్మలకు విముక్తి లభించి, ఈ జాతకులకు పితృదోష ప్రభావం ఎక్కువగా చూపించదు. శంఖచూడ కాలసర్పదోష జాతకులు తత్వవేత్తలుగా, ఆధ్యాత్మిక గురువులుగా బాగా రాణించగలరు. వీరి ఆధ్యాత్మిక జ్ఞానం, వీరికి ఉన్న తత్వ జ్ఞానం డబ్బు సంపాదన కొరకై ఉపయోగించుకుంటారు. ఆధ్యాత్మిక రంగంలో వీరికి ఉన్న జ్ఞానం వలన ఆర్థిక పరంగా అనుకోని లాభాలు వచ్చిపడతాయి. వ్యక్తిగత జన్మకుండలిలో శుభ యోగాలు కూడా తోడైనట్లైతే, జాతకులకు 36 సంవత్సరాల తరువాత శుభ ఫలితాలు కనబరుస్తాయి. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.

 

శంఖచూడ కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఈ జాతకులు తరచూ ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవడం వలన అదృష్టాన్ని, మనశ్శాంతిని పొందగలరు.
  • తండ్రితో విబేధాలు పెట్టుకోకుండా, సత్సబంధాలు పెంచుకోవడం వలన వీరి జీవితంలో అభివృద్ధి కలుగుతుంది.
  • జన్మ స్థలం నుండి దూరంగా ఈ జాతకులు తమ వృత్తి, ఉద్యోగాలు చేయడం వలన ఆర్థికపరమైన స్థిరత్వం పొందగలరు.
  • జీవిత భాగస్వామితో, తోబుట్టువులతో వాదనలు, విబేధాలకు దిగరాదు. వీరితో సత్సబంధాలు కొనసాగించడం వలన భవిష్యత్తులో వీరు మీకు ఎంతగానో సహాయం చేస్తారు.
  • ఈ జాతకులకు ముక్కోపం ఎక్కువగా ఉంటుంది. కావున ఇతరులతో సంభాషించేటపుడు వీరు వీరి కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. ముఖ్యంగా వీరు పనిచేసే చోట తమ సహోద్యోగులతో శాంతంగా, ఆలోచించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి.   

    పరిహారాలు:

  • శంఖచూడ కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పితృ పక్షములలో పిండ ప్రధానము, దనములు చేయవలెను.
  • శివ పంచాక్షరీ స్తోత్రమును ప్రతిరోజూ పఠించాలి లేదా ‘ఓం నమః శివాయ’ మంత్రమును ప్రతిరోజూ 108 సార్లు జపించాలి.
  • నిష్ణాతులైన జ్యోతిష్యులను సంప్రదించి జాతకంలో ఇంకేవైనా దోషములు, అవయోగములు ఉన్నాయేమో పరిశీలించుకొని, వ్యక్తిగత పరిహారాలు జరిపించుకోవాలి. 

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Nagashakthi Telugu Book#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses

Leave a Reply