పాతక కాలసర్ప దోషం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో పదవది అయిన పాతక కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.
- దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ
జన్మకుండలిలో రాహువు దశమ భావములో (ఉద్యోగం, పదవీ స్థానం) మరియు కేతువు నాలుగవ భావములో (మాతృ, గృహ, విద్యా, వాహన, కుటుంబ, ఆస్తి, మేనమామ, ఋణ స్థానం) ఉంటూ వీరి మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఉండినట్లైతే వారికి పాతక కాలసర్పదోషం ఉన్నదని గుర్తించాలి. దీనినే ఘాతక కాలసర్ప దోషం అని కూడా అంటారు. ఘాతక కాలసర్పదోషం విద్యా, మాతృ, వాహన, కుటుంబం, మేనమామ, రుణములు, ఉన్నత పదవీ, ఉద్యోగం విషయాలలో జాతకుల పై ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ వాసుకి కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.
పాతక కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:
- కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత నశిస్తుంది. కుటుంబంలో గొడవలు ఒకానొక సంధర్భంలో తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
- ఇంట్లోని సమస్యల వలన ఈ దోషం ఉన్న జాతకులు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది.
- ఆస్తి వివాదాలు ఎదుర్కొంటారు.
- వృత్తి లేదా ఉద్యోగం చేసేచోట మనశ్శాంతి లేకుండుట, వివాదాలు కలుగుట జరుగును.
- వృత్తి పరంగా, వ్యక్తిగత పరంగా అనుకున్న పనుల్లో విజయం సాధించడానికి అడ్డంకులు, మానసిక ఆందోళన, ఒత్తిళ్ళు ఎదురవుతాయి.
- ఈ పాతక కాలసర్ప దోషం ఉన్న జాతకులకు తమ తల్లితోనే సమస్యలు కలుగుతాయి. మాతృ ప్రేమ వీరికి పూర్తిగా లభించదు. మాతృ సౌఖ్యం వీరికి ఉండదు.
- సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే భావములో రాహువు ఉన్నందున, వీరు జీవితాంతం ఆనందంగా ఉండడం కష్టమవుతుంది.
- ఈ దోషం కలిగి ఉన్న జాతకులు ఒకరి పని చేసేందుకు ఇష్టపడరు. ఈ దోషం కలిగి ఉన్న జాతకులలో కొందరు సస్పెండ్ అవ్వడం, ఉద్యోగం పోవడం జరుగుతుంది.
- వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉండదు.
- అర్థం చేసుకోవడంలో, సరైన రీతిలో ఆలోచించడంలో ఈ జాతకులకు సమస్యగా ఉంటుంది.
- జీవితంలో విజయం లభించడం చాలా కష్టతరం అవుతుంది.
- వీరి చిన్నతనం సమస్యపూరితంగా ఉంటుంది. చిన్నతనంలో వీరు అనుభవించిన సంఘటనలు అన్నీ కూడా వీరికి మానసికంగా గాయంగా మిగిలిపోతుంది.
- వీరి ఇంట్లో వీరికి మానసిక విశ్రాంతి లేకపోవుట, ఇంట్లో అసౌకర్యంగా ఉండుట వలన జాతకులకు మనశ్శాంతి లోపిస్తుంది. ఇది వీరి ఆలోచన విధానం పై ప్రభావం పడి, ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో, తమ ప్రవర్తన వలన సన్నిహితులకు దూరం అవుతారు.
- వీరికి అహం ఎక్కువగా ఉంటుంది. దీని వలన వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, వృత్తి పరమైన జీవితం పై కూడా ప్రభావం చూపుతుంది.
ముఖ్య గమనిక:
పాతక కాలసర్పదోషం వలన జాతకులకు తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికి, ఈ దోషం వలన కలిగే కొన్ని అనుకూల విషయాలు కూడా ఉన్నాయి. ఈ జాతకులు తమ మనస్సును ఒకదాని పై ఏకాగ్రతగా ఉంచుకోలేరు. కానీ ఒక్కసారి వీరు ఏకాగ్రత పెడితే, ఏ సమస్యని అయినా సరే ఇట్టే పరిష్కరించే సత్తా వీరిలో ఉంటుంది. ఇతరులకు మంచి సలహా ఇవ్వగలరు, వీరి సలహా పాటించిన వారు తప్పక వృద్ధిలోనికి వస్తారు. విదేశీ వ్యాపార సంబంధాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. కొన్ని ప్రయాణాలు ఈ జాతకులకు లాభాలను తెచ్చి పెడతాయి. జీవితంలో ప్రతి దశలో వచ్చే మార్పులు మొదట కష్టంగా ఉన్నప్పటికి, తర్వాత వీరికి అనుకూలంగా మారుతుంది. ఈ జాతకులు మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉంటారు. వ్యక్తిగత జన్మకుండలిలో శుభ యోగాలు కూడా తోడైనట్లైతే, జాతకులకు 42 సంవత్సరాల తరువాత శుభ ఫలితాలు కనబరుస్తాయి. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.
పాతక కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- ఈ దోషం ఉన్న జాతకులు తాము చేసే ఖర్చుల పై దృష్టి సారించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
- జాతకులు తమ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో జరిగే ఏ చిన్నా లేదా పెద్ద మార్పు అయినా, అన్ని కోణాలలో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.
- ఇతరులకు వీరు సలహా ఇచ్చేముందు ఒక క్షణం ఆలోచించాలి. వీరు ఇచ్చే సలహాలు భవిష్యత్తులో ఇతరులకు మంచి జరుగుతుంది, కానీ వర్తమానంలో మాత్రం ఇతరులు కోరితే తప్ప వీరు సలహాలు ఇవ్వరాదు. అడగనిదే సలహా ఇచ్చిన యెడల, అది తిరిగి అవమానాలను తెచ్చిపెడుతుంది.
పరిహారాలు:
- పాతక కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకుఇక్కడ క్లిక్చేయండి.
- ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
- మహామృంత్యుంజయ మంత్రాన్ని జపించాలి.
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- గ్రహణ యోగం వలన ఏ విధమైన సమస్యలు కలుగుతాయి? ఎలా గుర్తించాలి?
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం
Ph: 9846466430
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.