loading

మహాపద్మ కాలసర్ప దోషం

  • Home
  • Blog
  • మహాపద్మ కాలసర్ప దోషం

మహాపద్మ కాలసర్ప దోషం

మహాపద్మ కాలసర్ప దోషం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ,  ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే  జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో ఆరవది అయిన మహాపద్మ కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.

  • దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ

జన్మకుండలిలో ఆరవ భావంలో (శతృ, వ్యాధి, ఋణ స్థానం) రాహువు మరియు పన్నెండవ భావంలో (వ్యయ, విదేశీయానం, ఆధ్యాత్మిక భావం) కేతువు ఉండి, ఈ రెండు గ్రహాల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నట్లైతే, వారికి మహాపద్మ కాలసర్ప దోషం ఉన్నట్టు గుర్తించాలి. మహాపద్మ కాలసర్పదోషం వలన జాతకుల యొక్క శత్రువర్గం, ఆరోగ్యం, రుణములు, వ్యయములు, విదేశీయాన ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ మహాపద్మ కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.

మహాపద్మ కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:

  • ఈ కాలసర్ప దోషం వలన జాతకులు తమ వైవాహిక జీవితంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు.
  • ఈ దోష జాతకులకు అప్పులు ఎక్కువగా ఉంటాయి.
  • వీరి జీవితంలో ఒడిదుడుకులు అనేవి రోజూవారి జీవితంలో ఒక భాగంగా అవుతాయి.
  • కుటుంబ సభ్యుల మధ్య అపర్థాలు, అనర్థాలు తలెత్తుతాయి.
  • వీరి జీవితంలో తరచూ ఎదురయ్యే వైఫల్యాల వలన వీరిపై వీరికి ఆత్మ విశ్వాసం తగ్గి, వీరి సామర్థ్యాల పై వీరికి నమ్మకం పోతుంది. నిరాశ పెరుగుతుంది.
  • సొంతవారి చేతిలో మోసపోవడం జరుగుతుంది. స్నేహితులుగా, బంధువులుగా భావించిన వారే ఈ దోష జాతకులకు శత్రువులుగా మారతారు.
  • ఈ దోష ప్రభావం వలన జాతకులు తమ కుటుంబ సభ్యులకు మరియు జీవిత భాగస్వామికి దూరంగా విదేశాలలో ఉండాల్సి వస్తుంది.
  • స్నేహితుల వద్ద అప్పులు చేయడం వలన గాని, తాత్కాలిక సుఖాలు, జూదం వంటి వాటికి డబ్బులు ఖర్చుచేసి అప్పులపాలు అవుతారు. తరచుగా ఆస్తుల నష్టం జరుగుతుంది.
  • శత్రువర్గం వీరికి ఒక సంధర్భంలో అధికంగా పెరగడం వలన నిద్రలేమి ఎదురవుతుంది.
  • శత్రువులపై వీరికి విజయం కలిగినప్పటికి, వీరు ఆత్మీయులు అనుకున్న వారి చేతిలోనే మోసపోవాల్సి వస్తుంది.
  • ఈ దోష జాతకులకు వృద్ధాప్యం కాస్త కష్టంగానే గడుస్తుంది.
  • ఈ దోష ప్రభావానికి వ్యక్తిగత జాతకంలో వేరొక అశుభ యోగాలు కూడా తోడైనపుడు దివాలా తీయాల్సిన పరిస్తితి కూడా ఏర్పడుతుంది.
  • మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి.
  • వ్యక్తిగత జాతకంలో ఈ కాలసర్పదోషంతో పాటుగా మరిన్ని అశుభ యోగాలు కూడా ఉన్నపుడు, ఈ దోష జాతకులు దారిద్ర్యం, దాస్య జీవితం ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • కేతువు వలన అధిక ఖర్చులు, తప్పని ఖర్చులు ఉంటాయి. స్వయంకృత అపరాధల వలన వీరు మోసపోతారు.
  • ఈ కాలసర్పదోషం ఉన్నవారికి వెన్నుముక ప్రారంభములో నెప్పులను, తలనొప్పులను, చర్మ వ్యాధులను కలిగి ఉంటారు.
  • వీరిపై తంత్ర ప్రయోగములు సులభముగా జరగగలవు.
  • ద్వాదశ కేతువు వలన జాతకులకు నిద్రలేమి, శృంగార జీవితంలో సంతృప్తి లేకపోవడం జరుగుతుంది.
  • కొన్ని అశుభ యోగాలు కూడా తోడైనపుడు, ఈ దోష జాతకులు విదేశాలలో నివసిస్తూ వీరికి మరియు వీరి కుటుంబానికి మనశ్శాంతి లేకుండా జీవనం సాగిస్తారు.
mahapadma kalasarpa dosham

ముఖ్య గమనిక:

               మహాపద్మ కాలసర్ప దోషం వలన ఆరోగ్య పరంగా, అప్పుల పరంగా, శత్రువుల విషయంలో, ఖర్చుల పరంగా, విదేశీ యాన పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికి, ఈ దోషం వలన కొన్ని అనుకూల విషయాలు కూడా ఉన్నాయి. ఈ దోష జాతకులకు శతృవులు ఎక్కువగా ఉన్నప్పటికి, శత్రువుల మీద జయం వీరేదే అవుతుంది. విదేశీ నివాసం ఏర్పడే అవకాశం ఉంటుంది (వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఈ యోగం మారుతుంది). ఒక సంధర్భంలో ఈ దోష జాతకులు తమ జీవితంలో అన్ని వైపుల నుండి అనుకోని లాభాలు వచ్చి పడతాయి. జన్మకుండలిలో శుభ యోగాలు కూడా తోడైనట్లైతే, జాతకులకు 54 సంవత్సరాల తరువాత శుభ ఫలితాలు కనబరుస్తాయి. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.

 

మహాపద్మ కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఈ దోష జాతకులకు చట్ట పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున, చట్టపరమైన విషయాలలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • చేబదులుగా గాని లేదా అప్పుగా గాని డబ్బును ఇతరుల నుండి తీసుకోవడం చాలా తగ్గించాలి. ఎంతో అవసరం అయితే తప్ప, ఈ దోష జాతకులు అప్పు జోలికి పోరాదు. ఎందుకనగా ఈ దోష జాతకులు అప్పుగా తీసుకున్న తరువాత, ఆ అప్పును తీర్చేందుకు ఈ జాతకులు తీవ్రంగా కృషి చేయాల్సి వస్తుంది.
  • క్రమం తప్పకుండా ఈ దోష జాతకులు తమ ఆరోగ్యం కొరకు ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలి. ఈ దోష జాతకులకు కీళ్ల నొప్పులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కావున వీరికి యోగా, వ్యాయామం, ప్రాణాయామం తప్పనిసరి.
  • ఈ దోష జాతకులు ఇతరులను పూర్తిగా నమ్మరాదు. ఎవరైతే ఈ జాతకులకు సన్నిహితంగా ఉన్నారని వీరు భావిస్తారో, వారే వీరికి శత్రువులు అని ఈ జాతకులు గుర్తుంచుకోవాలి. ఈ మోసం జరగకుండా ఉండాలి అంటే, జాతకులు తమని తాము తప్ప వేరే ఎవరిని నమ్మకూడదు.
  • ఈ దోష జాతకులు తాము పని చోట, తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగడం అలవాటు చేసుకోవాలి. తోటి ఉద్యోగులను స్నేహితులుగా భావించి, వారితో తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మాత్రం చేయకూడదు.

పరిహారాలు:

  • 40 రోజుల పాటు హనుమాన చాలీసా పఠనం ఎన్నో ఇబ్బందులను దూరం చేస్తుంది.
  • సుందరకాండ పారాయణం.
  • మహాపద్మ కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకుఇక్కడ క్లిక్ చేయండి.
  • నిష్ణాతులైన జ్యోతిష్యులను సంప్రదించి జాతకంలో ఇంకేవైనా దోషములు, అవయోగములు ఉన్నాయేమో పరిశీలించుకొని, వ్యక్తిగత పరిహారాలు జరిపించుకోవాలి.

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Nagashakthi Telugu Book#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.