loading

కులికా కాలసర్ప దోషం

  • Home
  • Blog
  • కులికా కాలసర్ప దోషం

కులికా కాలసర్ప దోషం

కులికా కాలసర్ప దోషం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ,  ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే  జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో రెండవది అయిన కులికా కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.

–దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ

జన్మకుండలిలో రెండవ భావంలో (ధన స్థానం) రాహువు మరియు అష్టమ స్థానంలో (ఆయుః స్థానం, మాంగల్య స్థానం (ఆడవారికి), గత జన్మ కర్మ, వారసత్వపు ఆస్తులు, అనుకోని లాభాలు తెలియజేసే స్థానం) కేతువు ఉంటూ, ఈ రాహు కేతు గ్రహాల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నపుడు ఆ జాతకులకు కులికా కాలసర్ప దోషం ఉంటుంది. కులికా కాలసర్ప దోషం ముఖ్యంగా జాతకుని యొక్క ధన స్థానం, ఆయుర్దాయ స్థానం, మాంగల్య స్థానం, వృత్తి స్థానం, ఆరోగ్యం, వారసత్వపు ఆస్తుల పై ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ కులికా కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430

కులిక కాలసర్ప దోషం వలన కలిగే ప్రభావములు:

  • ఈ కులికా కాలసర్ప దోషం ఉన్న జాతకులకు ధన నష్టం ఎక్కువగా ఉంటుంది.
  • ఈ దోషం ఉన్న జాతకులు భవిష్యత్తు కోసం ధనమును నిల్వచేసుకోవాలని ప్రయత్నించినా కూడా, ఏదో ఒక విధంగా ఆ ధనము ఖర్చు అయిపోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితితి నిలదోక్కుకోవటం కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది.
  • కుటుంబ సభ్యుల మధ్య మరియు సమాజములో పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. వీరి కుటుంబములో తగాదాలు ఎదురవుతాయి. కుటుంబ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది.
  • నరాల బలహీనత, మూర్చలు లాంటి సమస్యలు వస్తాయి. ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు.
  • ఈ కులికా కాలసర్పదోషం అనుభవిస్తున్న వారు వారి మాటలను ఎంతో అదుపులో ఉంచుకోవాలి. వీరి మాటలు ఇతరులను సులభంగా బాధిస్తాయి కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. వీరి మాటల వలన జాతకులు ఏదో ఒక రోజు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు.
  • ఈ కాలసర్పదోషం ఉన్నవారికి కంటికి సంబంధించిన సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా కుడి కన్నుకు సమస్య ఏర్పడుతుంది.
  • ఈ కులికా కాలసర్ప దోషం వలన జీవితంలో వరుసగా అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • వారసత్వపు ఆస్తులను పొందుటకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • ఈ కాలసర్ప దోషం ఉన్న జాతకుల నిజాయితీ, ముక్కుసూటితనం వంటి లక్షణాలు ఇతరులకు వీరు కఠిన మనస్కులుగా, అహంకారం గలవారిగా కనిపిస్తారు.
  • స్పెక్యులేషన్ వల్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగాలు అస్థిరంగా ఉంటాయి. వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా అభివృద్ధి చాలా కష్టంగా మారుతుంది. తరచూ తమ వృత్తులను మార్చుకుంటూ ఉంటారు.
  • ఈ కులికా కాలసర్ప దోష ప్రభావం వలన జాతకులు తమకు అవసరం లేని విషయాల కోసం, సంబంధం లేని వ్యక్తుల కోసం అనవసరంగా జోక్యం చేసుకొని సమస్యల పాలవుతూ ఉంటారు.
  • మానసిక ఒత్తిడి, ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందడం, ముక్కోపం, దురుసు ప్రవర్తన లాంటి లక్షణాలు ఈ కాలసర్ప దోషం జాతకులకు కలిగిస్తాయి.
  • ఈ దోషం గల జాతకులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం నా అనుభవంలో చాలా మందినే చూశాను. కావున ఆరోగ్య రీత్యా ఈ దోష జాతకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాయామం, సమతుల్యమైన ఆహారం, మంచి నిద్ర ఈ దోష జాతకులు తప్పక పాటించాలి. ఈ కాలసర్పదోషం ఉన్న వారికి ఆలోచనలు లోతుగా ఉంటాయి. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడటం వలన ఈ దోష జాతకులకు మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి.
  • వృత్తి రీత్యా ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. తాము అనుకున్న కలలను నెరవేర్చుకునే సంధర్భంలో తీవ్రమైన ఆటంకాలు వీరిని ఇబ్బంది పెడతాయి.
  • ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు. తమకు చదివే సామర్థ్యం, వివేకం అన్నీ ఉన్నప్పటికి, తమ విద్యను పూర్తి చేసేందుకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • ఈ దోష జాతకుల యొక్క వృత్తి పరమైన అభివృద్ధి చాలా మందగొడిగా సాగుతుంది.
  • పూర్వీకుల ఆస్తుల విషయాలలో తగాదాలు వస్తాయి. పూర్వీకుల యొక్క జ్ఞానాన్ని కూడా వీరు వారసత్వంగా పొందుతారు. కాని ఆ జ్ఞానాన్ని వీరు వినియోగించుకోలేరు.
  • నేత్ర సమస్యలు ముఖ్యంగా కుడి కంటికి సమస్యలు, వీరి మాటల వలన సమస్యలు ఏర్పడును. జంతువులు, కీటకాల వలన గాయాలు ఏర్పడును. శస్త్ర చికిత్సలు జరుగు అవకాశములు ఉండును.

ముఖ్య గమనిక:

ఈ కులికా కాలసర్పదోషం ఉన్న జాతకులకు రెండవ స్థానంలో ఉన్న రాహువు ఇబ్బందులకు గురి చేసినా, అష్టమ కేతువు పూర్తిగా చెడు ఫలితాలు ఇస్తాడని చెప్పలేము. అష్టమ కేతువు ఈ దోష జాతకులకు మంచి ఫలితాలను కూడా ఇస్తాడు అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. జన్మకుండలిలో ఇతర శుభ యోగాలు కూడా ఉన్నట్లైతే, ఈ కులికా కాలసర్ప దోష జాతకులకు 33 సంవత్సరాల తరువాత జీవితంలో వరుస అభివృద్ధి సాధ్యం అవుతుంది.

               ఒకవేళ జన్మకుండలిలో కులికా కాలసర్ప దోషం కలిగి ఉండి, కేతువు శుభ స్థానంలో ఉండి ఉంటే, ఆ జాతకులకు అన్ని వైపుల నుండి అనుకోకుండా ఊహించని లాభాలు కలసి వస్తాయి. అత్తా మామల నుండి ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఈ కులికా కాలసర్ప దోష ప్రభావం ఏ తీవ్రతతో ఉంటుంది అనేది, ఈ దోషం ఏర్పడిన రాశులను ఆధారం చేసుకొని వ్యక్తిగత జన్మకుండలి ద్వారా నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే తెలియజేస్తారు.పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430

కులికా కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • స్నేహితులతో, పొరిగింటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ దోష జాతకులపై ఎవరు ఏ విధమైన కుట్రలు చేస్తున్నారో జాతకులకు అస్సలు తెలియదు. వీరి పై అసూయను కలిగి ఉంటారు. కావున స్నేహితులతో, పొరుగు వారితో, తోటి ఉద్యోగులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  • స్పెక్యులేషన్ రంగాలలో పెట్టుబడులు పెట్టరాదు. స్పెక్యులేషన్ రంగాలలో వీరు ఊహించినంత లాభాలు రావు. కావున ఈ పథకాలలో పెట్టుబడులు ఈ దోష జాతకులు పెట్టరాదు.
  • మాట్లాడే ముందు ఆలోచించుకొని సంభాషించడం మంచిది. కొన్ని సంధర్భాలలో ఈ దోష జాతకులు ఇతరులతో మాట్లాడేటపుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ దోష జాతకులకు ఉన్న ఈ అలవాటు ఏదో ఒక రోజు సమస్యలలోకి నెట్టేస్తుంది. ఆ సమస్య నుండి బయటకి రావడం జాతకులకు కష్టతరం కావచ్చు.
  • ఆరోగ్య సమస్యలను నివారించుకునేందుకు ఆరోగ్యవంతమైన ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం, ధ్యానం ఈ దోష జాతకులకు చాలా అవసరం.
  • జంతువులు, కీటకాల నుండి జాగ్రత్త వహించాలి.

పరిహారాలు:

  • మహా మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించాలి.
  • మంగళవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
  • నిష్ణాతులైన జ్యోతిష్యుల సలహా మేరకు, రాహు, కేతు మహా యంత్రములను ప్రతిష్టించుకొని, పూజించాలి.
  • అనంత కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.