కర్కోటక కాలసర్ప దోషం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ, ఇంకా ఎన్నో విధాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్పయోగాలు 12 రకాలుగా విభజించబడ్డాయి. రాహువు మరియు కేతువు స్థానాన్ని బట్టి ఈ కాలసర్పయోగాలు మారతాయి అందులో ఎనిమిదవది అయిన కర్కోటక కాలసర్ప యోగం గురించి క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాము. ఈ యోగాలు కేవలం చెడు ఫలితాలు మాత్రమే కాదు, కొన్ని మంచి ఫలితాలను కూడా జాతకులకు అందజేస్తాయి. నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో ఈ 12 రకాల కాలసర్ప దోషాల వలన కలిగే ఫలితాలు అన్నిటిని మీకు ఒక్కొక్కటిగా క్లుప్తంగా వివరిస్తాను.
- దైవజ్ఞ రత్న C.V.S. చక్రపాణి, Ph.D (Medical astrology), జ్యోతిష్య భూషణ
జన్మకుండలిలో అష్టమ భావములో (ఆయుర్దాయం, ఊహించని లాభాలు, పూర్వీకుల ఆస్తులు, గత జన్మ కర్మ) రాహువు మరియు ద్వీతీయ భావములో (ధన, నేత్ర, వాక్కు) కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఆ రాహు కేతు మధ్య ఉన్నట్లైతే వారికి కర్కోటక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి.
కర్కోటక కాలసర్పదోషం వలన జాతకులు ఎదుర్కొనే సమస్యలు:
- ఈ దోషం ఉన్నవారు పూర్వీకుల ఆస్తులు అన్నీ కోల్పోతారు.
- శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు.
- విషపూరితమైన సర్పాల వలన గాని లేదా కీటకాల వలన గాని ప్రమాదములు పొందవచ్చు.
- కుటుంబములో అనేక సమస్యలు కలుగవచ్చు. జాతకులకు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక నష్టము జరుగుతుంది.
- యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశములు ఉన్నాయి.
- కుటుంబ సభ్యులలో ఒకరికి ధీర్ఘ కాలిక వ్యాధులు కలుగవచ్చును. తల్లిదండ్రుల నుండి ఈ దోష జాతకులు సంపూర్ణ ప్రేమను పొందలేరు.
- చిన్నపాటి విషయాలకు కూడా ఈ దోష జాతకులు అబద్ధాలు ఎక్కువగా చెబుతారు.
- చెడు స్నేహాల వలన విద్యా ఆటంకములు కలుగుతాయి.
- వైవాహిక జీవితంలో సమస్యలు కలుగవచ్చు. మానసికంగా, శారీరకంగా దంపతుల మధ్య సక్యత లేకపోవుట వలన, వైవాహిక జీవితంలో అపార్థాలు, అనుమానాలు, వివాహేతర సంబంధాలు వంటి సమస్యలు చవి చూడాల్సి రావచ్చును. జన్మకుండలిలో మరిన్ని ప్రతికూల గ్రహాలు కూడా ఉన్నట్లైతే, జాతకుల యొక్క వివాహాలు విఫలం అవుతాయి.
- ఈ దోషము గల జాతకుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండదు. స్కాములు వంటి వాటికి గురయ్యి మోసపోయే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో ఈ జాతకులు అధికంగా మోసపోతారు.
- ఈ దోషం ఉన్న జాతకులకు కొందరికి నత్తి ఉండటం, మాటలు సరిగ్గా రాకపోవడం జరుగును (కొన్ని సంధర్భాలలో మాత్రమే).
- కుటుంబ సభ్యులతో వీరు బంధాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
- ఈ దోషం కలిగి ఉన్న జాతకుల యొక్క మాట తీరు దురుసుగా ఉంటుంది. దీని వలన జాతకులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇతరులకు అనవసరమైన సలహాలు ఇవ్వడం కూడా వీరికి హాని తలపెడుతుంది.
ముఖ్య గమనిక:
కర్కోటక కాలసర్ప దోషం వలన ఆయుర్దాయం పరంగా, వ్యాధుల పరంగా, ఆడవారికి మాంగల్య బలం పరంగా, పూర్వీకుల ఆస్తుల విషయాల పరంగా, గత జన్మల పరంగా, ఆర్థిక విషయాల పరంగా, వాక్కు పరంగా, ఈ దోషం ఏర్పడిన రాశుల ఆధారంగా ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికి, కొన్ని అనుకూల విషయాలను కూడా మీకు వివరించబోతున్నాను. ఈ దోషం ఉన్న జాతకులకు ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా పొందగలిగే శక్తి ఉంటుంది. వివాహం తరువాత వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరి ముక్కుసూటితనం, దురుసుతనం వలన సమస్యలు కలిగినప్పటికి, కొన్ని విషయాలలో అదే వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యక్తిగత జన్మకుండలిలో శుభ యోగాలు కూడా తోడైనట్లైతే, జాతకులకు 39 సంవత్సరాల తరువాత శుభ ఫలితాలు కనబరుస్తాయి. పుట్టిన తేదీ, సమయం, స్థలం ఆధారంగా వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వివరాలకు సంప్రదించండి Ph: 9846466430.
కర్కోటక కాలసర్ప దోష జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- కర్కోటక కాలసర్పదోష జాతకులు తాము మాట్లాడే ముందు, కాస్త ఆలోచించి, వినయంగా, గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలి. దూకుడుతనం, దురుసుతనం, ముక్కుసూటితనం వలన ఏదో ఒక రోజు తీవ్ర ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉన్నది.
- స్టాక్ మార్కెట్లు, జూదము, బెట్టింగులు వంటి వాటిలో డబ్బు పెట్టరాదు. ఈ రంగాలలో ఇతరులకు వచ్చిన లాభాలను చూసి ఈ జాతకులు వీటిలో పెట్టుబడులు పెట్టరాదు.
- ఈ కర్కోటక కాలసర్పదోషం ఉన్న జాతకులు తమ పేరు మీద ఏ విధమైన వాహనాన్ని కూడా కొనుగోలు చేయరాదు. వాహనములు నడిపేటపుడు ఎంతో జాగ్రత్త వహించాలి.
- ఈ దోష జాతకులు తమకు ఉన్న దూకుడుతనం, దురుసుతనం వంటి లక్షణాల వలన ప్రతికూల చర్యలు చేసే అవకాశాలు ఉంటాయి. ఆ విధమైన కార్యాలను చేయకుండా జాగ్రత్తపడాలి.
- ఈ జాతకులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. కావున ఖర్చు చేసే ముందు ఆలోచించి ఖర్చు చేయాలి.
పరిహారాలు:
- ప్రతిరోజూ ఈ జాతకులు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. జాతకులు తమకు వీలు కుదిరినపుడు మహామృంత్యుంజయ హోమమును జరిపించుకోవాలి.
- తక్షక కాలసర్ప దోషం నుండి సంపూర్ణ విముక్తి పొంది, సంపూర్ణ దోష నివారణ జరుగుటకు కాలసర్ప దోష నివృత్తి హోమమును వ్యక్తిగతంగా జరిపించుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త హోమమును జరిపించుకోవడం వలన కాలసర్ప దోషము వలన కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. వీరు చేపట్టే కార్యక్రమాలలో అడ్డంకులు తొలగిపోయి, జీవితంలో అభివృద్ధిని చూడగలరు. ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును మలయాళ సర్ప శాస్త్ర విధానంలో నాగ వంశీకుల చేత బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకొనుటకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- నిష్ణాతులైన జ్యోతిష్యులను సంప్రదించి జాతకంలో ఇంకేవైనా దోషములు, అవయోగములు ఉన్నాయేమో పరిశీలించుకొని, వ్యక్తిగత పరిహారాలు జరిపించుకోవాలి.
Related Articles:
- ఎన్నో సమస్యలు కలిగించే 12 రకాల కాలసర్పయోగాల వివరణ
- గ్రహణ యోగం వలన ఏ విధమైన సమస్యలు కలుగుతాయి? ఎలా గుర్తించాలి?
- ఏ భావంలో అంగారక యోగం ఏర్పడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
- తీవ్రమైన సమస్యలకు గురి చేసే పితృ శాపం వివరాలు.
- దంపతుల మధ్య విభేదాలకు కారణమయ్యే వైవాహిక దోషం
- జాతకంలోని అవయోగం వలన జైలు పాలు చేసే బంధన యోగం
- జీవితంలో అభివృద్ధికి ఆటంకం కలిగించే గురు చండాల యోగం
- మాంగల్య దోషం
Ph: 9846466430
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.