ప్రేమ మరియు పెళ్లి బంధాలకు పొంతన కుదరని, ఇమడని రాశులు :
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మకుండలిలో చంద్రుడు ఉన్న రాశిని జన్మరాశిగా పరిగణిస్తారు. ఈ జన్మ రాశులు అనేవి మన మనస్సును గురించి తెలియజేస్తుంది. 12 రాశులలో, కొన్ని రాశుల వారు ఇంకో కొన్ని రాశుల వారితో కలసినపుడు పొంతన కుదరక, వారిద్దరి మధ్య ఇమడక బాధలు అనుభవించి, చివరకు విడిపోతారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. 12 రాశులను 4 మూలకములైన భూమి, గాలి, నిప్పు, నీరు క్రింద 4 బృందాలుగా విభజించారు. అంటే ఒక్కొక్క మూలకముకు 3 రాశులు ఉంటాయి.
భూమి (భూ తత్వం) : మకరరాశి; కన్యారాశి; వృషభ రాశి
గాలి (వాయు తత్వం) : మిధునరాశి; తులారాశి; కుంభరాశి
నిప్పు (అగ్ని తత్వం) : మేషరాశి; సింహరాశి; ధనస్సురాశి
నీరు (జల తత్వం) : కర్కాటకరాశి; వృశ్చికరాశి; మీనరాశి
1.మీనరాశి-మిధునరాశి: మీనరాశి వారు భ్రాంతిలో జీవిస్తారు కానీ తొందరగా వివాహం లేదా ప్రేమ వ్యవహారం ద్వారా జీవితములో స్థిరపడాలని ఆత్రుత చెందుతారు. కానీ మిధున రాశి వారు సాధించేందుకు ఇంకా ఎంతో ఉందని , ఈ బంధాలను పెద్దగా పట్టించుకోరు. మీనరాశి వారు అతి సున్నితంగా ఉంటారు, అదే మిధునరాశి వారు కేవలం వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి, ఈ రెండు రాశులు అనగా మీనరాశి, మిధునరాశి వారికి బంధం ఏర్పడితే, అది ఎంతో కాలం నిలువదు. అతిస్వల్ప కాలములోనే ఈ ఇద్దరు విడిపోవటం జరుగుతుంది.
2.మేషరాశి-వృశ్చిక రాశి: ఈ మేష, వృశ్చికములకు అధిపతి కుజుడు. ఈ రెండు రాశుల వారికి కుజ లక్షణాలు ఉంటాయి. ఈ రెండు రాశుల వారు స్వతంత్రంగా జీవించేందుకు ఇష్టపడతారు. వ్యాపారం విషయానికి వస్తే మేష, వృశ్చిక వారి మధ్య వ్యాపార భాగస్వామ్యం ఎంతో మెరుగ్గా, చురుగ్గా సాగుతుంది. కానీ ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే మాత్రం, వీరి బంధం సర్వనాశనం అవుతుంది. మేషరాశి వారు ఆధిపత్యం వహించాలని చూస్తారు, అదే వృశ్చిక రాశివారు మేషరాశి వారు చేసే ఆధిపత్యం తట్టుకోలేరు. ఈ రెండు రాశుల వారికి ఎంతో అసూయ ఉంటుంది. కావున మేషరాశి, వృశ్చిక రాశి వారి మధ్య బంధము ఎక్కువ కాలం నిలువదు.
3.వృషభరాశి-కుంభరాశి: ప్రథమంగా కుంభరాశి వారు వృషభరాశి వారిపై ఎంతో వ్యామోహం పెంచుకుంటారు. కానీ వీరి బంధం ఎంతోకాలం నిలువదు. కుంభరాశివారు అందరికీ భిన్నంగా ఉండటానికి ఇష్టపడతారు, ఎక్కువకాలం ఒకే రకమైన జీవితం వీరికి ఇష్టం ఉండదు. అదే వృషభరాశి వారు ఒక చోట స్థిరపడిపోవుటకు ఇష్టపడతారు, జీవితములో తరచూ మార్పులు రావటం ఈ వృషభరాశి వారు తట్టుకోలేరు. ఈ కారణం వలన వీరి బంధం ఈరోజో, రేపో అన్నట్టుగా బేధాలు వచ్చి విడిపోతారు. వృషభరాశి వారు కుంభరాశివారితో సులభంగా ఇమడలేక, వారితో ఉన్న బంధాలను తెంచుకుంటారు.
4.మిధునరాశి-కర్కాటకరాశి: కర్కాటకరాశి వారు మిధునరాశి వారితో ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారు. కానీ మిధునరాశివారు మాత్రం వారి జీవితానికి ఎంతో ముఖ్యం అనుకుంటే తప్ప కర్కాటకరాశి వారిని లెక్క చేయరు. కర్కాటకరాశి వారి సున్నితత్వాన్ని ఈ మిధునరాశి వారు అసలు భరించలేరు. కావున వీరిద్దరు ఎంతో త్వరగా విడిపోతారు. కర్కాటకరాశి వారు ఈ మిధునరాశివారితో Commit కాకుండా ఉండటం ఎంతో మంచిది.
5.సింహరాశి-మీనరాశి: మీనరాశివారు నీటికి సంబంధించినవారు; సింహరాశివారు నిప్పుకు సంబంధించినవారు. మీనరాశివారు భ్రాంతిలో జీవిస్తారు, ఆ ఊహాలోకములో ఈ మీనరాశి వారు ఆనందంగా ఉంటారు. కానీ సింహరాశి వారు అలా కాదు, వారు ఏదైతే అనుకుంటారో దాని గురించి కలలు కనకుండా వెంటనే ఆచరణలో పెడతారు. మీనరాశివారు అతీసున్నితంగా ఉంటూ, తరచూ వీరి మనస్తత్వం కూడా మారుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఈ మీనరాశి వారి మనస్సుకు ఉన్న అనిశ్చిత అసలు నచ్చదు. సింహరాశివారు మీనరాశివారిపై ఆధిపత్యం వహించుటకు, గొడవలు చేయుటకు ఎక్కువ ప్రయత్నిస్తారు. ఇవి మీనరాశి వారికి తట్టుకోవడం సాధ్యం కాదు. కావున వీరి బంధం కూడా ఎంతో కాలం నిలువదు.
6.తులారాశి-మకరరాశి: తులారాశివారు ఎంతో సమతుల్యంగా ఉంటూ, ప్రతి పని పరిపూర్ణం అవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ మకరరాశి వారు ఇది ఎంత మాత్రం లెక్క చేయరు. వీరి మధ్య ఏదైనా సమస్య వస్తే తులారాశి వారు సమరస్యంగా విషయాలను చర్చించేందుకు , పరిష్కరించేందుకు సిద్ధపడతారు. కానీ మకరరాశి వారు పాత విషయాలను గూర్చి చర్చలకు ఇష్టపడరు. కావున ఈ తులా మరియు మకర రాశి వారి పెళ్లి లేదా బంధం ఎంతో కాలం నిలువదు. మకరరాశి వారిని తట్టుకోలేక తులారాశివారు విడిపోయి సరైన వ్యక్తిని చూసుకుంటారు.
7.కన్యారాశి-సింహరాశి: కన్యారాశి భూమికి సంబంధించినది, సింహరాశి నిప్పుకు సంబంధించినది. కావున ఈ రెండు రాశుల మధ్య విరోధం విపరీతంగా ఉంటుంది. సింహరాశి వారు కన్యారాశివారిపై నిత్యం నిఘా పెడతారు, కానీ కన్యారాశి వారు ఏకాంతమును ఇష్టపడతారు. సింహరాశి వారికి సమాజములో గొప్పగా స్థాయిలో కనపడుటకు ఎంతో శ్రమిస్తారు. కన్యారాశివారు దీనికి ఇష్టపడరు. సింహరాశి వారి ప్రవర్తన కన్యారాశి వారికి నచ్చదు. కావున వీరి బంధము ఎక్కువ కాలం నిలువదు.
- కుంభరాశి-వృశ్చికరాశి: కుంభరాశి మరియు వృశ్చికరాశి వారికి దాదాపుగా ఒకే రకమైన అలవాట్లు, లక్ష్యాలు, ఇష్టాలు ఉంటాయి. కాకపోతే కుంభరాశి వారు వీరి మధ్య ఉన్న బంధానికి పూర్తి ప్రాముఖ్యత ఇవ్వరు. ఈ లక్షణం వృశ్చికరాశి వారికి ఇష్టం ఉండదు. కుంభరాశివారు వైవాహిక లేదా ప్రేమ బంధముకు పూర్తి బాధ్యత వహించరు. వృశ్చికరాశి అతి అసూయతో ఉంటారు. వృశ్చికరాశి వారు ప్లాన్ ప్రకారం చేయాలనుకుంటారు. కానీ కుంభరాశివారు సమయమునకు అనుగుణంగా కార్యములు చేస్తారు. కారణంగా ఈ రెండు రాశుల వారికి ప్రేమ బంధం ఉంటే ఆ బంధం ఎంతో కాలం ఉండదు
[table id=1 /]
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
www.brahmatantra.com
Email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles:
- Astrology reasons for extra martial affair-వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?
- బంధన యోగం అంటే ఏమిటి? నాగ బంధన యోగం అంటే ఏమిటి?
- యంత్ర ప్రపంచం
- బ్రహ్మ తంత్ర వేద జ్యోతిష్య నిలయం
- జాతకములో పాపగ్రహముల వలన కలిగే ప్రభావములు:-
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu