వైవాహిక దోషం
మనిషి జీవితంలో వైవాహిక జీవితం అనేది ముఖ్యమైన ప్రభావం చూపిస్తుంది. వైవాహిక జీవితంలో ముఖ్య పాత్రను వహించే అంశాలే వైవాహిక యోగాలు. ఆ యోగాలకు అవయోగాలు కలిగి వైవాహిక జీవితం భ్రష్టుపట్టడమే వైవాహిక దోషం. వైవాహిక దోషం వల్ల వివాహాలు జరుగకపోవడం, ఆలస్యం కావడం, వివాహానంతరం దంపతుల మధ్య గొడవలు, మనస్పర్థలు కలుగుతాయి. దీనికి కళత్ర దోషం కూడా తోడైనట్లైతే వివాహనంతరం వారి భార్య అనారోగ్యపాలవడం, ఆత్మహత్యకు పూనుకోవడం లేదా పరాయి పురుషులతో నీచ సంగత్యాలు సాగించడం, శీలదోషం ఏర్పడటం, వివాహమాడిన వ్యక్తితో జీవించలేకపోవడం, అశాంతి, అనుమానాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. సాధరణంగా వైవాహిక దోషం వ్యక్తులు జన్మించినపుడే తనతో అంటుకొని వస్తుంది. వివాహ వయస్సు రాగానే దాని శక్తిని, ప్రభావాన్ని చూపిస్తుంది.
వైవాహిక దోషాలు 2 రకాలు ఉంటాయి. 1. ప్రారబ్ద జన్మతః వైవాహిక దోషం, 2. స్వయంకృత కర్మానుయోగ వైవాహిక దోషం. ఈ దోషం ఏర్పడటానికి ఒక రకంగా వైవాహిక దోషం కారణభూతమవుతుంది మరియు అసలు వివాహం కలుగక పోవడానికి కూడా దోహదపడుతుంది. మొదటి వైవాహిక దోషమైన ప్రారబ్ద జన్మతః వైవాహిక దోషం ఏర్పడటానికి పూర్వజన్మ కర్మ దోషం వల్లనూ, రెండవది అయిన స్వయంకృత కర్మానుయోగ వైవాహిక దోషం మొదటి దాని వల్ల ఏర్పడిన అవయోగాన్ని బలోపేతం చేయడానికి సంపూర్ణ వైవాహిక దోషాలను అనుభవించేలా ప్రభావితం చేస్తుంది. దీనికి మీకు ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను. ఉదా:- ఒక వ్యక్తికి వాహన గండం ఉంది అనుకుందాము.ఆ వ్యక్తికి ఆ వాహన గండం వల్ల అంగ వైకల్యం ఏర్పడాలంటే, ఆ వ్యక్తి వాహనాన్ని ఒక ప్రతికూల దశలలో నడపడం. ఆ వ్యక్తికి గండం కారణంగా వాహన ప్రమాదం జరగాలంటే ఆ అంశానికి మరొక కీడు చేసే అంశం జతగూడాలి. అంటే, ఆ వ్యక్తి ప్రతికూలదశలలో వాహనం నడపడం అతని ప్రతికూల స్థితి, ఆ వ్యక్తి ప్రతికూల స్థితిలో వాహనం నడపడమే కాకుండా వ్యతిరేక దశలో వన్ వేలో వెళ్ళడం వల్ల, ఎదురుగా వస్తున్న వాహనం వల్ల వాహన ప్రమాదం జరగడం మరియు అంగ వైకల్యం ఏర్పడటం అన్నమాట. ఇదే విధంగా వైవాహిక దోషం ఏర్పడినపుడు వ్యక్తులు ముఖ తేజస్సును కోల్పోవడం, ఎవ్వరికీ నచ్చకపోవడం, వచ్చిన సంబంధాలు ఇతరుల వల్ల చెడగొట్టబడటం, అనేకమైన ఆటంకాలు రావడం, పీటల దాకా వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోవడం జరుగుతాయి. ఇది ఒకరకమైతే, దాని తీవ్రత అంత వరకే సాగుతుంది. దీనికి తోడుగా స్వయంకృత కర్మాను యోగ వైవాహిక దోషం కూడా జతగూడితే, వివాహం జరిగి, పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టుగా, వైవాహిక జీవితంలో తప్పించుకోలేని విధంగా దుష్పరిణామాలు, ప్రతికూల సంఘటనలు ఎదురవుతాయి.
ఈ విధంగా 2 రకాల వైవాహిక దోషాలు దంపతుల జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తాయి. వివాహం జరిపించిన పెద్దలకు, వివాహం చేసుకున్నా దంపతులకు నిప్పుల మీద నడకలాగా భరించలేని విధంగా ఉంటుంది. రెండవ రకం అయిన స్వయంకృత కర్మాను యోగ వైవాహిక దోషం అనేది ప్రాథమిక వైవాహిక దోషం కారణంగా కొన్ని గ్రహ స్థితులను అన్వయించి ఏర్పడుతుంది. అది వివాహ దశలో ప్రారంభమవుతుంది. వివాహ లగ్నం సరైనది కాకపోవడమో లేదా దోష పూరితంగా ఉన్న జాతకాలు గల వ్యక్తులకు వివాహం జరిపించడమో, ఈ విధంగా అనేకమైన తప్పిదాల కారణం చేత స్వయంకృత కర్మానుయోగ వైవాహిక దోషం ఏర్పడుతుంది.
వైవాహిక దోషం ఏర్పడటానికి గల గ్రహస్థితులు కొన్ని ఇక్కడ ఇస్తున్నాను.
- వైవాహిక జీవితం ఫలవంతం అవడానికి గురు శుక్రులు ప్రధాన కారకులు అవుతారు. అష్టమ స్థానంలో గురువు గాని లేదా శుక్రుడు గాని ఉన్నట్లైతే లేదా గురు శుక్ర గ్రహాలు కలసి అష్టమంలో ఉన్నా జాతకులకు వైవాహిక దోషం ఏర్పడుతుంది.
- స్త్రీ జాతకంలో అష్టమంలో గురువు రాహువుతో గాని లేదా కేతువుతో గాని సంగమించి, అష్టమాధిపతి శుక్రుడు అయ్యి, నీచ ప్రతికూల స్థానంలో ఉండినా జాతకులఆకు వైవాహిక దోషం ఏర్పడినట్టు గుర్తించాలి.
- సప్తమ స్థానంలో అనగా వైవాహిక స్థానంలో శని, కుజుల సంగమం సంపూర్ణ వైవాహిక దోషానికి దారి తీస్తుంది.
- సప్తమ స్థానంలో గురు గ్రహం గాని లేదా శుక్ర గ్రహం గాని నీచపడితే జాతకులకు వైవాహిక దోషం ఏర్పడినట్టు గుర్తించాలి.
- వైవాహిక స్థానంలో త్రికూట గ్రహ సంగమం జరగడం వల్ల కూడా వైవాహిక దోషం ప్రాప్తిస్తుంది.
ఇక్కడ కేవలం కొన్ని గ్రహస్థితులు మాత్రమే వివరించాను. ఇంకా అనేక రకములైన గ్రహస్థితుల వల్ల కూడా వైవాహిక దోషం ప్రాప్తిస్తుంది.
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles:
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Bhairavi Homam -భైరవి హోమం
- Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- యంత్ర ప్రపంచం