ప్రత్యంగిరా హోమం (Pratyangira Homam)
మహా శివుని మూడవ కన్ను నుండి శ్రీ మహా ప్రత్యంగరీ దేవి ఉద్భవించింది. మహా శివుడు, మహా విష్ణువు, మహా శక్తి ఈ ముగ్గురి యొక్క శక్తుల కలయికే మహా ప్రత్యంగరీ దేవిగా పురాణాలు చెబుతున్నాయి. ప్రత్యాంగిరా దేవిని నరసింహిక అని కూడా పిలుస్తారు. ఋగ్వేదములో ప్రత్యాంగిరా దేవి సూక్తమును ఖీల ఖాండములో గమనించవచ్చు. మేరు తంత్రము వంటి పురాణాల్లో కూడా ప్రత్యాంగిరా దేవి ప్రస్తావన ఉన్నది. సింహము ముఖము కలిగి ఉండి, స్త్రీ శరీరము కలిగి ఉంటుంది కాబట్టి ప్రత్యాంగిరా దేవిని నరసింహిక అని కూడా సంభోదిస్తారు. చేతబడి గురించి, మంత్ర విద్యలు, అభిచార కర్మల గురించి అథర్వణ వేదం వివరిస్తుంది. అథర్వణ వేదముకు మరొక పేరు అంగీరస వేదం. అంగీరస వేదం అనేది అభిచార కర్మలు, మంత్ర విద్యల గురించి వివరణ కలిగి ఉంటుంది. ప్రత్యంగీరస వేదములో ఆ అభిచార కర్మలను తిరిగి దాడి చేసే వివరణ తెలియజేస్తుంది. ప్రత్యంగీరస వేదములో ప్రత్యాంగిరా దేవి గురించి వివరించబడింది. దుష్ట శక్తులను ఉపయోగించి శత్రువులు చేసే దాడులను ప్రత్యాంగిరా దేవి అడ్డగించి తన భక్తులను ఆదుకుంటుంది. ప్రత్యంగిరా అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకి హాని తలపెడతారో, వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చింది అని తెలుస్తోంది. అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నాయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ప్రత్యాంగిరా దేవి హోమాన్ని ఆచరించాలి.
చేతబడి, దుష్టశక్తులు,ప్రేతాత్మలు, గుప్త శత్రువులు, ప్రతికూల శక్తులు వంటి నిర్మూలన కొరకు ప్రత్యాంగిరా, శూలిని, సిద్ధకుబ్జిక, రక్తకాళి, అఘోరా, వటుక, భైరవ, శరభేశ్వర, నారసింహ, సుదర్శన హోమములు వంటి భీకరమైన హోమములు అనుకూల ఫలితాలను అందిస్తాయి. ప్రత్యాగిరా దేవిని తీవ్ర మూర్తిగా వివరించబడింది. సాధారణ మనుషులు ప్రత్యాగిరా దేవి యొక్క పూజను ఆచరించకూడదు. నిష్ణాతులు అయిన తాంత్రికుల పర్యవేక్షణలో మాత్రమే ప్రత్యాంగిరా దేవి పూజా, హోమములు జరిపించబడతాయి.
ప్రత్యాంగిరా హోమము వలన అనుకూల ప్రకంపనలు ఏర్పడి, శత్రువులు, చెడు దృష్టి, చేతబడి వంటి దుష్ట శక్తులు తొలగిపోతాయి. ఇది తీవ్ర ఉగ్ర హోమము కావడం వలన ప్రతికూల శక్తుల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఈ ప్రత్యాంగిరా దేవి హోమమును జరిపించుకోవాలి. ప్రత్యాంగిరా దేవి హోమం, జపాల ద్వారా దేవిని సంతుష్టపరచిన, ఆ దేవి తన భక్తులకు రక్షణ కల్పిస్తూ, శుభాన్ని అనుగ్రహిస్తుంది. మంచి ఆలోచనలు కలిగి, ఆనందదాయకమైన అడ్డంకులు లేని జీవితాన్ని ఆ దేవి తన భక్తులకు ప్రసాదిస్తుంది. క్షుద్ర శక్తులు, శారీరక దీర్ఘ వ్యాధులు, మానసిక రుగ్మతలను ఈ హోమం దూరం చేస్తుంది. ఈ హోమాన్ని ఆచరించడం వలన శతృవులను జయించగలము. దీని వలన పూర్వ వైభవము భక్తులకు తిరిగి దక్కుతుంది. మానసికంగా ఎల్లపుడూ దిగులుగా, అణగారిన మానసిక స్థితి ఉన్నవారు ఈ హోమమును ఆచరించిన తరువాత మానసికమైన ప్రశాంతతను పొందగలరు. ఈ హోమము యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యాంగిరా హోమమును ఎండు మిరపకాయలు, మిరియాలతో చేస్తారు.
ప్రత్యాంగిరా దేవి హోమము జరిపించేటపుడు ఒక నిమ్మపండుని ఆ దేవి పాదాల చెంత ఉంచుతారు. హోమం జరిపించిన తరువాత ఆ నిమ్మపండులో దేవి యొక్క అనుకూల శక్తి, దేవి యొక్క అనుగ్రహం నిండి ఉంటుంది. దీనిని హోమము జరిపించుకునే భక్తునికి ప్రసాదముగా తాంత్రికులు అందజేస్తారు. ఈ ప్రసాదము భక్తునికి రక్షణగా ఉంటూ, సంపద శ్రేయస్సులను ఆకర్షించునదిగా చెప్పబడుతుంది. శుక్రవారాలు, మంగళవారాలలో వచ్చే పంచమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథులలో, రాత్రి వేళల్లో ప్రత్యాంగిరా దేవి హోమమును ఆచరిస్తే దేవి సంతుష్టపడుతుంది.
ప్రత్యాంగిరా హోమ ప్రక్రియ:
- గణపతి పూజ
- పుణ్యాహావచనం
- మహా సంకల్పం
- కలశ పూజ
- నవగ్రహ పూజ
- ప్రత్యాంగిరా హోమం (1008 జపాలు)
- పూర్ణాహుతి
- ఆశీర్వచనం
- ప్రసాద వినియోగం
శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ప్రత్యాంగిరా దేవి హోమాన్ని ఆచరించడం వలన వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరా దేవి ఉగ్రస్వరూపిణి. ఆమెని పూజించేటప్పుడు మద్యపానం చేయడం, మాంసాహారం తినడంలాంటి పనులు చేయకూడదు. జ్యోతిష్య పండితులను సంప్రదించి, వారి సలహా మేరకు ప్రత్యంగిరాదేవిని పూజించాలి.
జాతకులు తమ వ్యక్తిగత జన్మకుండలిని నిష్ణాతుడైన జ్యోతిష్య పండితుని వద్ద పరిశీలన చేసుకొని, ఆయన సలహా ప్రకారం ఏ విధమైన హోమములు జరిపించుకోవాలో తెలుసుకోవాలి. జన్మకుండలిలో ఉన్న ప్రతికూల గ్రహాలు కలుగచేసే ప్రతికూల శక్తుల ప్రభావాలు తగ్గించి, శుభ గ్రహాల ప్రభావం పెంచడమే హోమముల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ హోమ ప్రక్రియలు పూర్వం నుండి మన పూర్వీకులు సైతం పాటించే పరిహారం. సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవుడు మానవుని సృష్టించిన వెంటనే, మానవుని ఆధ్యాత్మిక అవసరాల కొరకు, జీవనం సాఫీగా సాగుట కొరకు హోమాన్ని కూడా సృష్టించాడు.
Related Articles:
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Bhairavi homam -భైరవి హోమం
- Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- యంత్ర ప్రపంచం
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.
Ph: 9846466430
సంపూర్ణ జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.