loading

company logo
company logo
company logo

About Me

నేను, C.V.S. చక్రపాణి, జ్యోతిష్య ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత 25 సంవత్సరముల నుండి ఎన్నో వేల మంది యొక్క జాతక పరిశీలన చేశాను. జ్యోతిష్యశాస్త్రంలో పట్టభధ్రుడు అయిన నాటి నుండి జాతక చక్ర పరిశీలన చేయటం ప్రారంభించాను. మొదటి 6 నెలల వరకు ఒక్కో జన్మకుండలి పరిశీలనకు నాకు 3 నుండి 4 గంటల సమయం పట్టేది. నా 25వ ఏట నుండి జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రముల పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ వాటిలోని సూక్ష్మమైన మంత్ర, తంత్ర రహస్యములను తెలుసుకున్నాను.

Brahma Tantra Astro Services

+ (91) 9846466430

Our Services

జ్యోతిష్యం, ప్రశ్న శాస్త్రం, వివాహ పొంతన, తాంత్రిక పరిహారాలు, యంత్రాలు, రత్నాల ద్వారా జీవిత సమస్యలకు పరిష్కారాలు.

జ్యోతిష్య పరిశీలన

వ్యక్తి జనన సమయంలో గ్రహ స్థితుల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేయడం. జీవితంలోని వివిధ అంశాలపై సూచనలు ఇస్తారు.

Read More

ప్రశ్నా శాస్త్రం

ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా సమాధానాలు కనుగొనడం.

Read More
service

వివాహ పొంతన

ఇద్దరు వ్యక్తుల జన్మకుండలిలను పోల్చి వారి మధ్య సంబంధం ఎంతవరకు సజావుగా సాగుతుందో తెలుసుకోవడం.

Read More
service

కేరళ తాంత్రిక పరిహారములు

ఇవి వివిధ రకాల సమస్యలకు పరిష్కారం చూపుతాయని నమ్ముతారు.

Read More
service

యంత్రానుష్టానం

వివిధ రకాల యంత్రాలను తయారు చేసి వాటిని పూజించడం ద్వారా కోరికలు నెరవేర్చుకోవడం.

Read More
service

రత్న ధారణ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలను ప్రశాంతం చేయడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి నిర్దిష్ట రత్నాలను ధరించడం.

Read More

దోషాలు-అవయోగాలు

జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన దోషాలు, అవయోగాల సముదాయం.

Our Latest Blogs

May 7, 2025

పాతక కాలసర్ప దోషం

జన్మకుండలిలో రాహువు దశమ భావములో (ఉద్యోగం, పదవీ స్థానం) మరియు కేతువు నాలుగవ భావములో (మాతృ, గృహ, విద్యా, వాహన, కుటుంబ, ఆస్తి, మేనమామ, ఋణ స్థానం) ఉంటూ వీరి మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఉండినట్లైతే వారికి పాతక కాలసర్పదోషం ఉన్నదని గుర్తించాలి. దీనినే ఘాతక కాలసర్ప దోషం అని కూడా అంటారు. ఘాతక కాలసర్పదోషం విద్యా, మాతృ, వాహన, కుటుంబం, మేనమామ, రుణములు, ఉన్నత పదవీ, ఉద్యోగం  విషయాలలో జాతకుల పై ప్రభావం చూపుతుంది. అయితే, జన్మ లగ్నమును బట్టి, జన్మకుండలిలో రాహు కేతు గ్రహాలతో సంగమించిన గ్రహాలను బట్టి, రాహు కేతువులు స్థితి చెందిన రాశులను బట్టి వ్యక్తిగతంగా కొన్ని ఫలితాలు మారవచ్చు. అవి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ పాతక కాల సర్ప దోష జాతకులు అందరూ సహజంగా ఎదుర్కొనే సంఘటనలు ఇక్కడ పూర్తిగా చదివి తెలుసుకోగలరు.

April 28, 2025

శంఖచూడ కాలసర్ప దోషం

శంఖచూడ కాలసర్ప దోషం శంఖచూడ కాలసర్పదోషం: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎన్నో విధాలుగా తమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ, అభివృద్ధి జాప్యమయ్యి, మానసిక ఒత్తిళ్ళు అధికమయ్యి, శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ,  ఇంకా ఎన్నో విధాలుగా […]

February 26, 2025

కర్కోటక కాలసర్ప దోషం

జన్మకుండలిలో అష్టమ భావములో (ఆయుర్దాయం, ఊహించని లాభాలు, పూర్వీకుల ఆస్తులు, గత జన్మ కర్మ) రాహువు మరియు ద్వీతీయ భావములో (ధన, నేత్ర, వాక్కు) కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఆ రాహు కేతు మధ్య ఉన్నట్లైతే వారికి కర్కోటక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి.Click below to read more.