అంగారక యోగం
జన్మకుండలిలో రాహువు, కుజుడు కలసి ఒకే భావంలో ఉండినట్లైతే అంగారక దోషం ఏర్పడుతుంది. ఈ కుజ రాహువు కలసి సంగమించిన స్థానం పాప లేదా శత్రు స్థానం అయితే, ఈ దోషం యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జాతకులు ఎంతో ఆవేశం, కోపం కలిగి ఉంటారు. కుజుడు నిప్పు, రాహువు తైలం. ఈ ఇద్దరు కలసి ఒకే భావంలో సంగమిస్తే నిప్పుకి ఆఝ్యం పోసినట్టే అవుతుంది. కుజుడు జాతకునికి అధిక ఆవేశాన్ని ఇస్తే, కుజుడు ఇచ్చే లక్షణాన్ని రాహువు మరింత ఉధృతం చేసి, జాతకుడిని క్రూరుడిగా మారుస్తాడు. కుజుడు జాతకునికి దేనినైనా సాధించే గుణాన్ని ఇస్తాడు, రాహువు జాతకునికి ఊహల్లో బ్రతికేలా చేస్తాడు. దీని వల్ల జాతకుడు నిర్ణయాలను తీసుకోవడం కష్టతరంగా మారుతుంది.
మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ దోషం ఏర్పడిన స్త్రీ జాతకులు చాలా నిజాయితీగా ఉంటారు, కానీ వారికి ఉన్న ముక్కుసూటితనం వల్ల అందరికీ కఠినాత్ములుగా అనిపిస్తారు. అదే, ఈ దోషం పురుష జాతకులకు ఏర్పడితే, వారు చాలా ఆవేశపరులుగా, అన్నింటా అనుమానాలు కలిగి ఉంటారు, వీరి భార్యని కేవలం ఇంటికే పరిమితం అయ్యేలా ఉండటానికే ఇష్టపడతారు. వీరి ప్రవర్తన అహంకారం, ప్రమాదకరంగా ఉంటుంది.
- ఈ అంగారక యోగం ఉన్న జాతకులకంటే చిన్నవారైన సోదరసోదరీమనులు, స్నేహితులతో వీరికి బంధం ఆగమ్యగోచరంగా ఉంటుంది. అయితే జాతకుల పట్ల పూర్తి అసూయతో అయినా ఉంటారు లేదంటే జాతకులను అసలు లెక్క చేయకుండా అయినా ఉంటారు.
- ఈ దోషం ఉన్న జాతకులకు మగవారితోనే స్నేహబంధాలు ఎక్కువగా ఉంటాయి.
- ఈ యోగ జాతకులకు ధైర్యం, దూకుడు అధికంగా ఉంటుంది. ఈ కారణంగా జాతకులకు వయస్సు పెరిగే కొద్ది రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి.
- ఈ దోషం జాతకులకు వివాహం తరువాత, తమ జీవిత భాగస్వామి యొక్క వృత్తి/వ్యాపార జీవనం అయోమయంలో పడుతుంది.
- ఈ దోష జాతకులు తమ అత్తామామలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి నానాపాట్లు పడాల్సి ఉంటుంది.
- అంగారక యోగ జాతకులు జన్మించిన తరువాత తమ తల్లి యొక్క ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.
- మేనత్తలతో, పొరుగు వారితో, తోటి ఉద్యోగులతో ఈ జాతకులకు సత్సంబంధాలు ఉండవు.
- ఈ అంగారక దోషం ఉన్న జాతకులు ఏదైనా సంస్థ మీద గాని, స్థలం మీద గాని ఇష్టం పెంచుకుంటే, దానిని వీరు ఎంతో సులువుగా అదుపులోకి తెచ్చుకోగలుగుతారు.
- ఈ దోషం ఉన్న జాతకులకు గొప్ప ప్రణాలికలు వేసే సామర్థ్యం బాగుంటుంది. కానీ వీరికి ముక్కుసూటితనం, ఆవేశం లాంటి లక్షణాలు ఉండటం వల్ల వీరు వేసిన ప్రణాళిక ఎంత గొప్పది అయినప్పటికి, వాటి ప్రకారం పనులు పూర్తిచేయాలంటే ఈ జాతకులకు దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.
- ఈ అంగారక యోగం అనుకూల రాశిలో ఏర్పడినట్లైతే, అలాంటి జాతకులు పోలీసు శాఖ, మిలిటరీ శాఖలో వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అంగారక దోషం ఉన్న వారికి ఉండే సహజ లక్షణాలను ఇక్కడ మీకు తెలియజేశాను. ఈ అంగారక దోషం ఏ భావంలో ఏర్పడితే ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది మీకు క్షుణ్ణంగా ఇక్కడ వివరించబోతున్నాను.
లగ్నభావంలో అంగారక యోగం:
అంగారక యోగం మొదటి భావంలో ఏర్పడితే, ఆ జాతకులకు ముక్కు మీద కోపం, ఎవ్వరి మాట లెక్కచేయని జగమొండి లాంటి లక్షణాలు ఉంటాయి. పరిస్తితి ఏమిటి అన్న ఆలోచన, వివేకం లేకుండా, అర్థం చేసుకోకుండా, ఆవేశంగా ముందుకు దూకే స్వభావం ఉంటుంది. అవతలి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, తగాదాలు పెట్టుకుంటారు. కొన్ని సార్లు తమ వివేకం ఏ మాత్రం పనిచేయక, కేవలం ఆవేశంతో పనులు చేసి, చాలా ఇబ్బందుల పాలవుతారు.
ద్వితీయ భావంలో అంగారక యోగం:
జన్మకుండలిలో ద్వితీయ భావంలో అంగారక యోగం ఏర్పడిన జాతకులు చాలా దురుసుగా మాట్లాడే గుణాన్ని, కపటమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. ఏది మాట్లాడినా చాలా బిగ్గరగా మాట్లాడటం, అబద్ధాలు ఎక్కువగా చెప్పడం చేస్తారు. తమ చుట్టూ ఉన్నవారితో, తమ కుటుంబ సభ్యులతో కారణం లేకుండానే పోట్లాడుతూ ఉంటారు. ఈ జాతకులకు డబ్బు సంపాదించాలి అనే ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది, దాని కోసం చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారు.
తృతీయ భావంలో అంగారక యోగం:
అంగారక యోగం తృతీయ భావంలో ఏర్పడటం కాస్త అనుకూలం అనే చేపచ్చు. ఈ గ్రహస్తితి ఉన్న జాతకులు సర్జన్ గా గాని, వక్తగా, ఇతరులను తీవ్ర ప్రభావితం చేసే రచయితగా గాని అయ్యే అవకాశం ఉంటుంది. ఈ జాతకుల మాటలో ముక్కుసూటితనం, మోసం ఉంటుంది. ఈ సంగమం శుభ, మిత్ర రాశిలో జరిగితే జాతకుల యొక్క ప్రతిభకు ప్రశంసలు, సన్మానాలు, రివార్డులు లభిస్తాయి. ఈ సంగమం తృతీయంలో శతృరాశిలో జరిగితే, జాతకులకు ప్రతికూల విషయాల మీద ఇష్టం పెరుగుతుంది.
చతుర్థ భావంలో అంగారక యోగం:
మాతృ స్థానం అయిన చతుర్థ భావంలో అంగారక యోగం ఏర్పడితే, జాతకులకు తమ తల్లితో కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడి ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడతాయి. ఈ సంగమం చతుర్థ భావంలో జరిగిన జాతకులకు తమ తల్లితోనే కాకుండా, తమ కుటుంబ సభ్యులతో, తమ బంధువులతో ఉన్న భాంధవ్యం కూడా చెరిగిపోతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో జాతకులు తీవ్రంగా వాదిస్తూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతతని నెలకొల్పాలని ఈ జాతకులు తీవ్రంగా శ్రమిస్తారు. సంతానం వల్ల కూడా ఈ జాతకులకు తీవ్ర సమస్యలు వస్తాయి. నిర్మాణ రంగంలో లేదా రియల్ ఎస్టేట్ వంటి వృతి వ్యాపారాల మీద మక్కువ చూపిస్తారు.
పంచమ భావంలో అంగారక యోగం:
అంగారక యోగం పంచమ భావంలో ఏర్పడటం వల్ల జాతకులు కళల్లో, క్రీడల్లో, సాహసాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు. వీటి వల్ల జాతకుల్లో తెలియని శక్తి ఏర్పడుతుంది. బెట్టింగులు, షేర్ మార్కెట్లు వంటి వాటిని తీరిక వేళల్లో చేస్తూ ఉంటారు. పేరు, ప్రతిష్ట, హోదా కోసం ఈ జాతకులు ప్రాకులాడుతూ ఉంటారు. ప్రేమ విషయాల్లో చాలా సార్లు భేధాలు రావచ్చు.
మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి.
షష్ట్య భావంలో అంగారక యోగం:
షష్ట్య భావంలో అంగారక యోగం జరగడం వల్ల జాతకులకు వ్యాధులు, వృత్తి/ఉద్యోగం చేసే చోట విభేధాలు తలెత్తడం, పై అధికారులతో గొడవలు రావడం జరుగుతుంది. ప్రయాణం అనేది వీరు చేసే వృత్తిలో భాగం కావచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా ఈ జాతకులు గొడవలు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. కోర్టు కేసుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ భావంలో ఈ సంగమం జరగడం వలన జాతకునికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. పోటీల్లో విజయం సాధిస్తాడు. ఎలాంటి శతృవులనైనా ఓడించే సామర్థ్యం వీరికి ఉంటుంది.
సప్తమ భావంలో అంగారక యోగం:
వైవాహిక స్థానమైన సప్తమ స్థానంలో అంగారక యోగం ఏర్పడటం వలన భార్యా భర్తలు విడిపోవడం గాని, లేదంటే విడాకులు అవ్వడం గాని జరుగుతుంది. భూమి వంటి స్థిరాస్తుల నుండి ఈ జాతకులు లాభాలు ఘడిస్తారు. వివాహేతర సంబంధాలు ఉంటాయి.
అష్టమ భావంలో అంగారక యోగం:
ఈ అంగారక యోగం అష్టమ భావంలో ఏర్పడితే, జాతకులకు తమ అత్తామామలతో తీవ్రమైన గొడవలు జరుగుతాయి. దీని వల్ల మానసికమైన వ్యధ అనుభవించాల్సి ఉంటుంది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్నో రకాల శస్త్ర చికిత్సలు జరుగుతాయి. కొంతకాలానికి ఈ జాతకులకు ఆధ్యాత్మిక ధోరణి ఏర్పడుతుంది.
నవమ భావంలో అంగారక యోగం:
నవమ భావంలో అంగారక యోగం ఏర్పడినపుడు జాతకులు తమ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కల్పిస్తుంది. ఈ నవమ భావంలో ఈ సంగమం జరగడం వల్ల గురువులతో, మేధావులతో, ఉపాధ్యాయులతో వీరికి వాగ్వాదాలు తలపడచ్చు. నవమ భావంలో జరిగిన ఈ సంగమం శుభ రాశి అయితే, జాతకుడిని భక్తి పారవశ్యంలో మునిగేలా చేస్తుంది, అదే చెడు రాశిలో జరిగితే ఈ సంగమం జాతకుడిని పూర్తి నాస్తికుడిగా మారుస్తుంది.
దశమ భావంలో అంగారక యోగం:
దశమ భావంలో అంగారక యోగం ఏర్పడితే, ఆ జాతకులకు తమ పై అధికారులతో, తమ కన్నా వయస్సులో పెద్దవారితో భేదాభిప్రాయాలు ఏర్పడి గొడవలు జరుగుతాయి. చేసే వృత్తి లేదా వ్యాపారం కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పనిచేసే చోట చాలా ఇబ్బంది వాతావరణం ఉంటుంది. మెడిసిన్, ఫార్మసీ, నిర్మాణ రంగ వ్యాపారం వంటివి వీరికి అబ్బుతాయి. చమురు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ ఏజెన్సీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. జాతకులకు దూకుడు లక్షణం ఉన్న కారణంగా, వీరి పై అధికారులతో వీరి బంధం ప్రశ్నంతకంగా మారుతుంది.
ఏకాదశ భావంలో అంగారక యోగం:
ఏకాదశ భావంలో అంగారక యోగం ఏర్పడితే, అలాంటి జాతకులు తమ స్నేహితులతో, తమకన్నా పెద్దవారైన తోబుట్టువులతో గొడవలు వస్తాయి. ఈ జాతకులు అందరిలో సులభంగా కలసిపోగలరు. కానీ వీరికి దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కకపోతే డీలా పడిపోతారు. వడ్డీ వ్యాపారం, మీడియా, సినిమా రంగం, షేర్ మార్కెట్లు వీరికి వృత్తిగా అబ్బుతాయి.
ద్వాదశ భావంలో అంగారక యోగం:
అంగారక యోగం ద్వాదశ భావంలో ఏర్పడిన జాతకులకు విదేశీయానం కలుగుతుంది. విలాసవంతమైన వస్తువుల మీద అధిక ఖర్చు చేస్తారు. అనుకోని విధంగా అధిక నష్టాలు వస్తాయి. ఈ జాతకులకు ఎవరి మీద అయినా పీకల లోతు కోపం ఉంటే, వారి మీద ఒక్కసారిగా విరుచుకుపడతారు. ఈ జాతకులకు కోపావేశాలు వస్తే మాత్రం, ఎలాంటి పనులకు తలపడతారో ఊహించడం కష్టం. గతంలో జరిగిన విషయాలను మనసులో ఉంచుకొని అవతలి వారితో గొడవ పడతారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారాలు, పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లాంటి వృత్తి, వ్యాపారాలు అబ్బుతాయి.
మీ జన్మకుండలి పరిశీలన కొరకై ఇక్కడ క్లిక్ చేయండి.
Related Articles:
- వైవాహిక జీవితం-గంధర్వ గ్రహాలు
- పూర్వ జన్మ కర్మ ఫలితాలు-వాటి అవయోగాల ఫలితాలు
- కళత్ర దోషం అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
- NAGASHAKTHI Telugu Book
- జాతక పరిశీలన- Horoscope Reading
- ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- సర్పశాపం
- కాలసర్పయోగ నివృత్తి హోమం
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు తెలుసుకొనుటకు సంప్రదించండి.
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com