సందేహాలు-సమాధానాలు (పార్టు-2)
అందరికీ నమస్కారం!
జూన్ 5, 2024 నుండి జూన్ 20, 2024 వరకు నిర్వహించిన సందేహ నివృత్తి కార్యక్రమము గురించి మీ అందరికీ విదితమే. మాకు అందిన సందేహాలలో దాదాపు 50 శాతం వరకు వారి సందేహాలను స్పష్టంగా మాకు వ్యక్తపరచలేదు. సందేహాలు పూర్తిగా, స్పష్టంగా వివరించిన వారి జన్మకుండలిని పరిశీలించి, సందేహ నివృత్తి చేయడం జరిగింది. వాటిని ఇక్కడ వివరిస్తున్నాము. ఈ కార్యక్రమం వచ్చే 2 నెలలలో మరొకసారి పునరావృతం చేస్తాము. ఆ సమయంలో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి అనేది గుర్తుంచుకోవాలి. ప్రశ్న అనేది స్పష్టంగా అర్థమైతేనే కదా, దానికి తగ్గ సమాధానాలు కూడా ఇవ్వగలము!
స్పష్టంగా లేని ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో మీకు ఉదాహరణల ద్వారా వివరిస్తాము.
- My future? (భవిష్యత్తు అంటే దేని గురించి అడుగుతున్నారో చెప్పాలి.)
- Job? (మీ ఉద్దేశం, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనా? లేక ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుందా అనా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి.)
- Marriage? (మీ ఉద్దేశం, వివాహం జరుగుతుందా అనా? లేక వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనా? లేక వైవాహిక దోషాలు ఉన్నాయా అనా?. ఇలా కాకుండా, స్పష్టంగా వివరించండి.)
ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ విధంగా మాకు ఎన్నో అస్పష్టమైన ప్రశ్నలు అందాయి. అలాంటివాటిని మేము పరిగణలోకి తీసుకోలేదు.
1. Krishna Kumar
పుట్టిన తేదీ: 04-03-1971
పుట్టిన సమయం: 06:35 PM
పుట్టిన స్థలం: ఏలూరు
(i) నా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?
సమాధానం: సప్తమ స్థానం (వైవాహిక స్థానం) వీరికి అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి రవి కుంభంలో సప్తమములో బుధుడితో కలసి ఉండటం వలన వివేకం గల భార్యను పొందటం జరుగుతుంది. కానీ వివాహానంతరం ఈ జాతకుడు కొన్ని అనారోగ్య సమస్యలను, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్య తరపున కొంత ఆస్తి లాభం కలుగును. వీరి భార్య కొన్ని విషయాలలో ప్రతికూలంగా ప్రవర్తించటం జరుగుతుంది. అయిననూ భార్య వలన ఆస్తి సంక్రమించును.
(ii) నా ఆయుర్దాయం గురించి చెప్పండి.
సమాధానం: అష్టమ స్థానాధిపతి అయిన గురువు అనుకూలుడై వీరికి శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. పూర్ణాయుర్దాయం వచ్చును. వీరి తండ్రి, తాత వలె సంవత్సరాలు జీవించగలరు. వీరి తండ్రికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్తపడాలి. మహామృత్యుంజయ లేదా ధన్వంతరీ హోమమును జరిపించుకోవాలి లేదా యంత్రమును ధరించవలెను లేదా గృహంలో ఉంచి పూజించాలి.
(iii) నాకు వ్యాపారం ఎలా ఉంటుంది?
సమాధానం: దశమ స్థానంలో వృషభ రాశిలో చంద్రుడు వ్యాపార రీత్యా అనుకూలతను భాగస్వాములతో మరియు వీరి పై యజమానితో సంబంధ భాందవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపార రీత్యా జల సంబంధ, క్షీర సంబంధ, వస్త్ర దుకాణాలు, ఆహార పధార్థ హోటళ్లు లాభమును కలుగజేస్తాయి.
2. Sravan Kumar
పుట్టిన తేదీ: 22-07-1998
పుట్టిన సమయం: 10:50 AM
పుట్టిన స్థలం: హైదరాబాదు
(i) నాకు కాలసర్ప దోషం ఉన్నదా? ఉంటే ఏ కాలసర్పదోషం ఉన్నదో వివరించండి.
సమాధానం: 6వ స్థానంలో కేతువు మరియు 12వ స్థానములో రాహువు మధ్య 7 గ్రహాలు ఇమిడి ఉండటం వలన జాతకులకు “శేషనాగ కాలసర్ప దోషం” ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాలసర్ప దోషం వలన గుప్త శత్రువులు అధికంగా ఉతరు. శారీరక సుఖం, ఆరోగ్యం సరిగా ఉండదు. గొడవలు, కోర్టు కేసులు, వివాదాలు లాంటి వాటితో ఓటమి పాలవుతారు. పరిచయం లేనివారితోవిరోధం రావచ్చు.
కాలసర్పదోషం యొక్క పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(ii) నాకు విదేశీయానం ఉందా స్వామి?
సమాధానం: పితృస్థానాధిపతి శుక్రుడు 10లో అనగా దశమంలో చంద్ర+కుజ సంగమంలో చంద్ర మంగళ యోగాన్ని కలుగజేయటం వలన దూరదేశ మరియు విదేశీయాన నివాసం, సంపాదన అమోఘంగా ఉంటుంది. విదేశీయానం అప్రయత్నంగా ఫలిస్తుంది.
(iii) నాకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కారణం తెలుపండి స్వామి.
సమాధానం: లగ్నాధిపతి బుధుడు రాహువుతో దగ్ధయోగంలో పడినందున వీరికి వచ్చే ఆలోచనలు మరియు చేసే పనుల వల్ల వీరికి విపరీతమైన మానసిక వ్యాధులు (హిస్టీరియా) లేదా అజ్ఞాత వాసానికి వెళ్ళడం లేదా బుద్ధి మాలిన్యం, బుద్ధి హీనత కారణములగును. 12వ స్థానంలో రాహువు బుధ మరియు రాహు దశ అంతర్దశలలో ఈ విధమైనటువంటి అవయోగాలు సంభవించును. సాధరణంగా వీరికి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు.
3. Sri Vidya
పుట్టిన తేదీ: 14-07-1983
పుట్టిన సమయం: 04:21 PM
పుట్టిన స్థలం: నెల్లూరు
(i) నాకు గురు చండాల యోగం ఉందా?
సమాధానం: ధనాధిపతి గురువు కేతువుతో సంబంధం కలిగి గురుచండాల యోగం కల్గును. జీవితంలో అభివృద్ధిలోకి రాలేకపోవడం జరుగుతుంది. తీవ్రమైన వైవాహిక దోషం వల్ల భర్తతో గొడవలు, మాట పట్టింపులు విడాకులు దాకా వెళ్ళడం జరుగుతుంది. మాతృరిష్టం కలుగును.
గురు చండాల యోగం యొక్క పూర్తి వివరణ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
(ii) నాకు కాలసర్పదోషం ఉంది అని ఒక సిద్ధాంతి చెప్పారు. నాకు నిజంగా కాలసర్పదోషం ఉందా?
సమాధానం: లగ్నములో కేతువు మరియు 7వ స్థానములో రాహువు ఉంటూ, మిగిలిన 7 గ్రహాలు ఈ రాహు కేతు గ్రహాల మధ్య ఇమిడి ఉండటం వలన జాతకురాలికి ‘తక్షక కాలసర్ప దోషం’ ఉన్నట్టు తెలుస్తుంది.
(iii) నాకు సంతాన దోషం ఉందా?
సమాధానం: పంచమాధిపతి గురువు లగ్నంలో కేతువుతో ఉన్నందున సంతాన విచారం, సంతాన నష్టం కలుగును. ఈ జాతకులకు సంతాన దోషం ఉన్నది.
4. T. Sai Kumar
పుట్టిన తేదీ: 27-07-1999
పుట్టిన సమయం: 04:25 PM
పుట్టిన స్థలం: శ్రీ కాళహస్తి
(i) నాకు సర్పదోషం ఉందా?
సమాధానం: శని 5వ భావములో ఉండుట వలన అధికారముతో కూడిన ఉద్యోగి అవుతారు. సంతానముతో వ్యతిరేకతలు ఏర్పడతాయి.ఈ శని మేష రాశిలో కుజ స్థానములో ఉండుట వలన ఈ జాతకులకు ఈ భావంలో “సర్పశాపం” ఉన్నట్టుగా తెలుస్తోంది.
సర్పశాపం గురించి పూర్తి వివరణ కొరకు ఈ లింకును క్లిక్ చేయండి.
(ii) నాకు పితృదోషం ఉందా?
సమాధానం: శుక్రుడు 9వ భావములో ఉండుట వలన వీరికి వీరి తండ్రితో వ్యతిరేకతలు ఏర్పడతాయి. ఈ శుక్రుడు వీరికి “పితృశాపం” కలుగజేస్తున్నాడు.
పితృశాపం గురించి పూర్తి వివరాల కొరకు ఈ లింకును క్లిక్ చేయండి.
(iii) నాకు ఏ ఉద్యోగం బాగుంటుంది?
సమాధానం: రవి, బుధుడు, రాహువు వీరందరూ కలసి అష్టమ భావములో ఉన్నారు. అంటే వీరికి చదువు బాగుంటుంది. కానీ చదువులో ఆటంకములు వస్తాయి (విద్యా ఆటంకములు). వీరు చదివిన చదువు వీరికి ఉపయోగపడదు. వీరు చదువుకున్న చదువుకు సంబంధము లేని ఉద్యోగం లేదా వృత్తి చేస్తారు.
5. Rajeshwar Kumar
పుట్టిన తేదీ: 09-11-1994
పుట్టిన సమయం: 03:40 PM
పుట్టిన స్థలం: కరీంనగర్
(i) కోర్టు వివాదములకు గల కారణం ఏమిటి?
సమాధానం: ద్వాదశములో ఉన్న శని స్వస్థానములో బలంగా ఉండటం వలన దగ్ధయోగ దోషమును కలుగచేస్తాడు. అగ్ని ప్రమాదాలు, కోర్టు వివాదాలు, అజ్ఞాతవాసములోకి వెళ్ళటం జరిగే అవకాశం మెండుగా ఉంది. మొత్తం మీదా యోచించగా ఈ జాతకుల జీవితములో దారిద్ర్యము, ఐశ్వర్యము ఈ రెండూ కూడా అధిక సాంద్రతలో అనుభవించటం జరుగుతుంది. సాధరణంగా జన్మకుండలిలో 4 లేదా 5 గ్రహాలు ఒకే స్థానములో ఉండటం వలన వీరి జీవితం ఊహించని విధంగా జ్యోతిష్య పరిశీలనకు కూడా అర్థంకాని లోతైన రీతిగా మార్పులు, దుష్పరిణామాలు సంభవిస్తాయి.
(ii) పెట్టుబడులు నాకు కలసి వస్తాయా?
సమాధానం: షష్ట్యాధిపతి రవి అష్టమములో ఉండుట వలన శారీరక, మానసిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలలో, పెట్టుబడులలో మోసపోయే అవకాశం ఉండటం వలన చాలా జాగ్రత్తగా ఉండాలి.
(iii) నాకు గురు చండాల యోగం ఉన్నదా?
సమాధానం: లగ్న అధిపతి జాతకుల మనస్సుకు, శరీరముకు తనూభావ కారకుడై అష్టమములో ఉండటం వలన లజ్ఞాధిపతి అయిన గురువు అష్టమాధిపత్యాన్ని పొందటం, గురుగ్రహ ప్రతికూలతను పొందటం జరిగింది. అంతేకాకుండా అష్టమాధిపత్యం గురువుకు రావటం దోషంగా చెప్పబడుతుంది. దీనికి తోడుగా నాలుగు గ్రహములతో కలసి ఒకేరాశిలో ఉండటం వలన ఆ గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలను పొంది, జాతకునికి నష్టం చేకూరచడం జరుగుతుంది మరియు ఈ గురువు రాహువుతో కలసి “గురు చండాల యోగముగా” చెప్పబడుతుంది.
గురు చండాల యోగం యొక్క పూర్తి వివరణ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
6. Ramana Murthy
పుట్టిన తేదీ: 01-01-1965
పుట్టిన సమయం: 11:30 AM
పుట్టిన స్థలం: తుని
(i) నాకు పితృశాపం ఉందా?
సమాధానం: భాగ్య స్థానం, పితృ స్థానం అని చెప్పబడే నవమ స్థానములో చతుర్థ గ్రహ కూటమి బుధ, శుక్ర, చంద్ర, కేతువులు తరసించడం వలన, బుధ శుక్ర చంద్ర గ్రహములు తమ యొక్క ప్రత్యేక అనుకూల శక్తులను జాతకుని పై చూపేందుకు , యోగాలను ఇచ్చేందుకు మిక్కిలి ఉత్సాహమును వేగమును ప్రదర్శించే సంధర్భములో కేతువు అడ్డుకోవడం జరుగుతుంది (పూర్వజన్మలో ఏర్పడ్డ పితృవంశపు పితృశాపం మరియు పితృవంశపు నాగశాపం). వృశ్చిక రాశిలో గల విషతుల్య స్థానములో కేతువు తటస్థించడాన్ని నవనాగ సర్పశాపం ఏర్పడుతుంది. వీరి తండ్రితో వీరికి చిన్నతనములో పూర్తి వ్యతిరేకత ఉంటుంది. పితృస్థానములో చంద్రుడు నీచ పడటం వలన తండ్రి మరణానంతరం తండ్రి గురించి తీవ్రంగా బాధపడతారు. వీరికి తండ్రిని పోలిన లక్షణాలు రావటం జరుగుతుంది. వీరి తాత లేదా ముత్తాత చిన్నవయస్సులోనే కాలం చేసి ఉంటారు. పూర్వీకుల ఆస్తిని పొందలేకపోవటం లేదా వాటి వలన లాభం పొందలేకపోవటం గాని జరుగుతుంది (పితృశాపం).
పితృశాపం గురించి పూర్తి వివరాల కొరకు ఈ లింకును క్లిక్ చేయండి.
(ii) నా అనారోగ్యాలకు గల కారణమయ్యే గ్రహాలు ఏమిటి?
సమాధానం: ద్వాదశ భావంలో గల శని కుంభరాశిలో దగ్ధ యోగ కారకుడు అవ్వడం వలన శారీరక అనారోగ్యములు మరియు మారకమునకు కారణమయ్యే వ్యాధులు కలుగును. అందున శని తన స్వక్షేత్రంలో ఉండటం వలన అనారోగ్యాలను జాతకుడు అనుభవించడానికి శని కారణభూతం అవ్వడమే కాకుండా, స్వక్షేత్ర గతుడు అయినందున “కారకోఃభావ నాశాయ” అన్న విధంగా శని ఆ భావాన్ని బలోపేతం చేసి, తదుపరి ప్రతికూల దశలలో వ్యతిరేక ఫలితాలను కలుగజేయును.
(iii) పూర్వీకుల ఆస్తి తగాదాల్లో ఉన్నది. అది నాకు సంక్రమిస్తుందా?
సమాధానం: మీకు పితృశాపం ఉన్నందున పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిని మీరు దాదాపు పొందలేరు అనే చెప్పాలి.
7. Surya Narayana Raju
పుట్టిన తేదీ: 11-09-1971
పుట్టిన సమయం: 11:30 PM
పుట్టిన స్థలం: విశాఖపట్టణం
(i) నా మానసిక సమస్యలకు కారణమయ్యే గ్రాహాల గురించి తెలుపగలరు.
సమాధానం: లగ్నములో శని ఉండుట వలన కళ్ళకు, శరీరానికి నలత చేస్తుంది. ఈ లగ్నములో శని వలన అందరితో కలసి మెలసి ఉండలేక పోవటం జరుగుతుంది. చట్ట సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. అతి జాగ్రత్తగా ఉండటం, సూక్ష్మ బుద్ధి లేకపోవటం, మతి మరపు రావటం, స్థిర చరాస్తుల యందు ఆసక్తి కలగటం జరుగుతుంది. ఈ శని, చంద్రుడు సంగమం పూర్తి వ్యతిరేక గ్రహ యోగం కావటం వలన ప్రధానంగా శరీరానికి, మనస్సుకు సంబంధించిన దోషాలు, సమస్యల వలన ఈ జాతకుడు మానసికంగానూ, శారీరికంగానూ దెబ్బ తినటం జరుగుతుంది.
(ii) నా పిల్లలు నా మాటను లెక్క చేయుట లేదు. కారణం?
సమాధానం: పంచమ స్థానములో అనగా సంతాన స్థానములో ఉన్న ఇంద్ర, యముడు పరస్పర వ్యతిరేకులు అవటం వలన సంతాన (కొరకు లేదా వలన) విచారం, సంతాన శతృత్వం ఏర్పడుతుంది.
(iii) నా భార్యతో నాకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏ దోషం వలన ఇలా జరుగుతుందో చెప్పండి.
సమాధానం: సప్తమ వైవాహిక అధిపతి అయిన కుజుడు శని స్థానములో రాహువుతో కలసి ఉండటం వలన పూర్వజన్మలోని వైవాహిక శతృత్వం వలన భార్యతో శతృత్వం ఏర్పడగలదు. విడాకులకు దారితీయును. కుజమహాదశలో రాహు అంతర్దశలో లేదా రాహుమహదశలో కుజ విదశలో వైవాహిక సంబంధమైన సమస్యలు, తగాదాలు ఏర్పడతాయి. ఈ జాతకుడికి వైవాహిక జీవితానికి తన యొక్క పూర్వజన్మ మరియు పితృపితామహుల దోషాలకు కుజ రాహు పీడ వీరిపై తీవ్ర ప్రభావమును చూపిస్తుంది. పితృశాపం ఏర్పడటం వలన తండ్రి లేదా తాత , ముత్తాతలలో ఒకరి వ్యతిరేకత ఈ జాతకుడికి పితృ దోషం ద్వారా వైవాహిక దోషం ఏర్పడినది. ఈ కుజ రాహువుల వలన వాహన ప్రమాదములు, శస్త్ర చికిత్సలు, చట్ట పరమైన వివాదాలు, స్త్రీల నుండి వ్యతిరేకత సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది.
8. Sreenivasa Rao Bendi
పుట్టిన తేదీ: 17-09-1975
పుట్టిన సమయం: 04:05 PM
పుట్టిన స్థలం: విజయనగరం
(i) నాకు అదృష్ట యోగం ఉందా?
సమాధానం: ఏకాదశ స్థానంలో అనగా పూర్వజన్మ స్థానములో రాహువు సర్పశాపమును ప్రాప్తింప జేయుట వల్ల పూర్వ జన్మ అదృష్ట౦ కలసి రాకపోవుట, చేతికి అందినది అనుభవించలేకపోవటం జరుగుతుంది.
(ii) మా పూర్వీకుల ఆస్తులు తగాదాల్లో ఉన్నాయి. ఆ ఆస్తులు నాకు సంక్రమిస్తాయా?
సమాధానం: అష్టమాధిపతి రవి కన్యారాశిలో ఉన్నందున ఈ జాతకుల తండ్రి మంచి వివేకవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. కానీ ఈ జాతకులకు పితృదోషం ప్రాప్తించడం వల్ల పిత్రార్జితము అమ్ముకోవడం లేదా నష్టపోవడం, మరికొంత ఆస్తిని పొందలేకపోవటం జరుగును.
(iii) నాకు ఎదురయ్యే ఆడవారు అందరూ నాకు శత్రువులుగా మారుతున్నారు. ఏదో ఒక విధంగా నా తప్పు లేకపోయినా ఆడవారితో నాకు సమస్యలు వస్తున్నాయి.
సమాధానం: అష్టమ శుక్రుని వల్ల జాతకులకు స్త్రీ శాపం ఏర్పడింది. దీని వల్ల ఆడవారి వల్ల, మాదక ద్రవ్యాలు, మత్తు పధార్థాల వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి.
9. P. Siva Ram
పుట్టిన తేదీ: 11-10-1980
పుట్టిన సమయం: 04:05 PM
పుట్టిన స్థలం: విజయవాడ
(i) నా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?
సమాధానం: సప్తమ స్థానంలో అనగా, భార్యా స్థానంలో శుక్రుడు ప్రతికూలుడుగా ఉండటం, ఆ స్థానాధిపతి అయిన రవి కన్యారాశిలో నీచపడటం వలన, అష్టమాధిపత్యం కలిగిన గురువుతో మరియు శనితో కలసి ఉన్నందున, ఈ జాతకులకు సంపూర్ణమైన వైవాహిక దోషం కలిగి, జాతకుని యొక్క భార్యతో చట్ట సంబంధమైన గొడవలు, భార్య తరపున తల్లిదండ్రుల వలన గాని లేదా భార్య తరుపున వ్యక్తుల వలన గొడవలు రావడం జరుగుతుంది. కొన్ని సంధర్భాలలో ఈ జాతకులకు వైవాహిక బంధం విడాకుల వరకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
(ii) నాకు ప్రాణ గండాలు ఉన్నాయని ఒక జ్యోతిష్యులు చెప్పారు. నిజంగానే నాకు ప్రాణ గండాలు ఉన్నాయా? తగిన పరిహారాలు, హోమాలు చెప్పండి.
సమాధానం: అష్టమ స్థానాధిపతి అయిన బుధుడు పితృస్థానంలో అనుకూలుడుగా ఉండటం వలన జాతకునికి ఆయుర్దాయ విషయంలో సంపూర్ణ ఆయుర్దాయము లభిస్తుంది. అయితే అష్టమ స్థానంలో రవి, గురు, శని ఉండటం వలన, వీరిలో శని కాస్త ఆరోగ్యాన్ని ప్రసాదించినప్పటికి, రవి గురు గ్రహాలు మాత్రం ప్రాణ గండాలను సంప్రాప్తించడం జరుగుతుంది. దీని వలన దినదినగండం, నూరేళ్ళు ఆయుషు అన్నట్టు శరీరానికి సమస్యలు వస్తాయి. రవి, గురు, శని గ్రహాలకు పరిహారాలు జరిపించడం ద్వారా ప్రాణ గండములు కలుగడం తప్పుతుంది.
(iii) మా పూర్వీకులకు ఒకప్పుడు ఉన్న వైభవం నాకు మళ్ళీ కలుగుతుందా?
సమాధానం:పితృస్థానంలో అనగా నవమ భావంలో చంద్రుడు, బుధుడు ఉన్నందున, జాతకుని యొక్క తండ్రి లేదా తాత లేదా ముత్తాతలు విశేషమైన కీర్తిని, ప్రతిష్టాని, మంచిని, సంఘంలో గౌరవాన్ని పొంది ఉండటం కారణంగా, వీరి పూర్వీకులు చేసుకున్న పుణ్యకార్యముల వలన ఈ జాతకులకు ఈ జన్మలో వృత్తి పరంగానూ, ఎన్నో విధాలుగా సహకరించడం సంభవిస్తుంది.
10. Vijayendra Varma
పుట్టిన తేదీ: 11-07-1990
పుట్టిన సమయం: 09: 10 PM
పుట్టిన స్థలం: నెల్లూరు
(i) నాకు సంతానం కలుగుతుందా?
సమాధానం: పంచమ స్థానంలో అనగా సంతాన స్థానంలో గురు గ్రహం యొక్క ప్రతికూలత స్థితి మరియు సంతాన స్థానాధిపతి బుధుడు కేతువుతో కూడినందున, 6వ స్థానమున శత్రు క్షేత్ర గతుడు అయినందున సంతాన విచార దోషం ఏర్పడినది. సాధారణంగా ఈ జాతకులకి ఇరువురు పుత్ర సంతానం కలుగును. కాని గురువుకు శత్రు క్షేత్రమైన బుధ స్థానంలో గురువు ఉన్నందున ప్రతికూలత కారణంగా సంతానం కలుగుటకు అవరోధములు కలుగును. వీరి భార్య యొక్క జాతకమును పరిశీలించిన మేలు జరుగును.
(ii) కోర్టు వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి.
సమాధానం: ద్వాదశ రాహువు వలన శత్రువులు చేసే కుట్రలలో లేదా ప్రయోగాలలో ఈ జాతకులు ఇరుక్కొని, తద్వారా కోర్టు కేసులు ఎదుర్కోవచ్చు. మతి స్థిమితం కోల్పోయే అవకాశం కలదు. గుప్త శత్రువులు (మీకు తెలియని శత్రువులు) అధికంగా ఉంటారు. పరిచయం లేని వ్యక్తులతో విరోధం ఏర్పడుతుంది.
(iii) నాకు నాగశాపం ఉందా?
సమాధానం: మేష కుజుడు జాతకునికి సర్పశాపం ఏర్పరుచును. కొంతమంది స్త్రీల వలలో చిక్కుకొని మోసపోయి, నానా ఆగచాట్లు పడటం జరుగుతుంది. (12లో రాహువు, మేష కుజుడు సర్పశాపం).
11. Suresh
పుట్టిన తేదీ: 18-10-1983
పుట్టిన సమయం: 02:30 PM
పుట్టిన స్థలం: అత్తిలి
(i) కోర్టు కేసులు, పోలీసు కేసులు, విడాకులు
సమాధానం:సప్తమ స్థానంలో అనగా వైవాహిక స్థానంలో కుజుడు, శుక్రులు శతృస్థానగతులు అయినందున వైవాహిక దోషం ఏర్పడినది. అందుకారణంగా మరియు కళత్ర స్థానాధిపతి రవి తులా రాశిలో నీచపడినందున, వైవాహిక దోషం విడాకుల దాకా తీసుకెళ్తుంది.
(ii) జీవితంలో స్థిరత్వం లేదు
సమాధానం: జాతకునికి దశమ స్థానంలో గురు మరియు కేతు సంగమం కలిగినందున ఉద్యోగ స్థిరత్వం ఉండదు. గురు చండాల యోగం కలిగినది.
గురు చండాల యోగం యొక్క పూర్తి వివరణ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
(iii) ఆర్థిక ఇబ్బందులు
సమాధానం: సర్ప దోషము ఏర్పడినది. అందుకు పరిహారములు జరిపిన పిదప స్థిరత్వము ఏర్పడును.
(మిగిలిన వారి పరిశీలనలు పార్ట్-3లో మరో మూడు రోజుల్లో వెబ్ సైట్లో ప్రచురిస్తాము)
Related Articles:
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
- జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Bhairavi homam -భైరవి హోమం
- Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు
- కళత్ర దోషం అంటే ఏమిటి? కళత్ర దోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి?
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
సంపూర్ణ జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Email: chakrapani.vishnumaya@gmail.com