loading

పితృదోషం- ప్రభావములు

  • Home
  • Blog
  • పితృదోషం- ప్రభావములు

పితృదోషం- ప్రభావములు

పితృదోషం- ప్రభావములు:

వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జన్మకుండలిలో కొన్ని గ్రహాల సన్నివేశాల వలన పితృదోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. ఆ గ్రహముల సన్నివేశములు ఏమిటో అన్న సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పితృదోషమునకు ముఖ్య కారణం జన్మకుండలిలో రవి గ్రహం మరియు శని గ్రహములకు మధ్య ఉన్న సంబంధముగా చెప్పవచ్చు. రవి , శని గ్రహములు పరివర్తన చెందితే (రవి రాశిలో శని మరియు శని రాశిలో రవి) ఉంటే దానిని పితృదోషముగా గుర్తించాలి. రవి, శని ఒకరిపై మరొకరి దృష్టి పడినప్పుడు లేదా రవి, శని కలసి ఒకే భావములో ఉన్నపుడు జాతకునికి పితృదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఇక్కడ రవి, శని సంబంధం లాగానే జాతకములో గురు, బుధ గ్రహముల వలన కలిగే సంబంధము కూడా పితృదోషమును సూచిస్తుంది. కాకపోతే గురు, బుధ వలన కలిగే పితృదోషం ఎక్కువ ప్రభావం చూపించదు.

         హైందవ పురాణాల ప్రకారం మన పితృదేవతలు (గతించిన తండ్రి, తాత, ముత్తాత……) జీవించి ఉన్నపుడు చేసిన దోషములు , పాపములు (దైవాపచారాలు) శాపంగా మారి తరువాతి తరం వారిని కూడా ప్రభావితం చేస్తాయి. దీనినే పితృదోషముగా చెప్పబడింది. కానీ, నిజానికి ఒక వ్యక్తి తాను గత జన్మలో చేసిన పాప, పుణ్య కార్యముల వలన మాత్రమే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ లోకములో కొన్ని కోట్ల ఆత్మలకు శాంతి కలుగలేదు. ఆ ఆత్మలు అందరూ కూడా ఇప్పుడు నివసిస్తున్న వారికి ఎవరో ఒకరికి పూర్వీకులు అయి ఉంటారు. పూర్వీకులు (తాత, తండ్రి, ముత్తాత…) గతించిన తరువాత అటు మోక్షము పొందక, ఇటు ఇంకొక జన్మనెత్తి పాప ప్రక్షాళన చేసుకోలేక (పునర్జన్మ లేక) ఊర్ద్వలోకములో ఉన్నవారిని “పితృదేవతలు” అంటారు. ఈ పితృదేవతలు మన DNA రూపములో గోత్రమును కొనసాగిస్తూ, కుటుంబములోని మగవారిలోని ‘Y’ Chromosomes రూపములో ఉంటారు.

         ఎప్పుడైతే ఒక వ్యక్తి పితృదోషము వలన బాధపడతాడో, ఆ వ్యక్తి తరువాతి తరమును (కొడుకు, మనుమడు, ….) చూచుటకు కష్ట తరం అవుతుంది. ఆ వ్యక్తికి సంతానం కలుగకపోవటం (లేదా) తన సంతానం తన నుండి విడిపోవటం (లేదా) వంశాభివృద్ధి కలిగే పుత్ర సంతానం కలుగకపోవటం లాంటివి పితృదోషం ఉన్నవారు అనుభవించవలసి ఉంటుంది.

పితృదోషం వలన మానవుడు ఎదుర్కొనే ప్రభావములు :

  • పితృదోషం ఉన్న వ్యక్తి తన గోత్రమును కొనసాగించుటకు పుత్ర సంతానం కలుగకపోవటం.

  • పితృదోషం ఉన్న వ్యక్తికి అసలు సంతానం కలుగకపోవటం.

  • పితృదోషం ఉన్న వ్యక్తికి తరచూ Abortions (గర్భవిచ్ఛితులు) జరగటం.

  • సోదర సోదరీమనుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవటం.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండా విద్యను లేదా ఉద్యోగమును మధ్యలోనే అర్థాంతరంగా ఆపివేయటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం వివాహము చేసుకునేందుకు అంగీకరించకపోవటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తికి వివాహం చేసుకునేందుకు సరైన వారు దొరక్కపోవటం.

  • పితృదోషం ఉన్న వ్యక్తికి శారీరక పరంగా గాని (లేదా) సామాజిక పరంగా గాని పెళ్లి ఆగిపోవటం లేదా సంతానం కలుగకపోవటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానం అతి చిన్న వయస్సులోనే మద్యానికి లేదా Drugsకి అలవాటు పడటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానముకు వివాహము జరుగక మునుపే లేదా వివాహము జరిగి వారసులకు జన్మనివ్వక ముందే గతించడం జరుగుతుంది.

  • శారీరక లేదా మానసిక దౌర్బల్యం కలిగిన సంతానముకు జన్మనివ్వటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క ఇంటిలో తరచూ పాలు పొంగిపోవటం, కొత్త గోడలకు తొందరగా చీలికలు రావటం, నీటి పంపులు లీకేజి రావటం, కుళాయిలోని నీరు కారుతూనే ఉండటం తరచూ జరుగుతాయి.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క వ్యాపారములో అప్పులు, నష్టములు కలుగటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి ఉద్యోగములు మారుతూనే ఉండటం లేదా ఉద్యోగమే లేకపోవటం జరుగుతుంది.

  • పితృదోషం ఉన్న వ్యక్తి యొక్క సంతానము పెద్దవారిని గౌరవించక , అతి దురుసుతనముగా మాటలాడటం జరుగుతుంది.

ఈ విధంగా పితృదోషం ఉన్నవారికి సంఘటనలు జరుగుతాయి.

ఇక జ్యోతిష్య శాస్త్ర ప్రకారముగా ఏ గ్రహాల సన్నివేశములను పితృదోషమును సూచిస్తాయో వివరిస్తున్నాను :

  1. శుక్రుడు, శని, రాహువు లేదా ఈ మూడు గ్రహాలలో ఏ రెండు గ్రహాలు అయినా జన్మకుండలిలో పంచమ భావములో ఉంటే, రవి పాపగ్రహముగా మారి, ఆ పైశాచిక ప్రభావములు జాతకునిపై చూపించబడతాయి.
  2. జన్మకుండలిలో 4వ భావములో కేతువు ఉంటే, ఆ జాతకుడు చంద్ర గ్రహం యొక్క పైశాచిక ప్రభావములు ఎదుర్కొంటాడు.
  3. బుధుడు (లేదా) కేతువు (లేదా) బుధ, కేతు కలసి లగ్నములో గాని, 8వ భావములో గాని ఉంటే, జాతకుడు కుజుడు యొక్క పైశాచిక ప్రభావముల ఫలితములు అనుభవిస్తాడు.
  4. జన్మకుండలిలో చంద్రుడు 3వ భావములో లేదా 6వ భావములో ఉంటే, జాతకుడు బుధుని యొక్క పైశాచిక ప్రభావములు ఎదుర్కొంటాడు.
  5. శుక్రుడు, బుధుడు లేదా రాహువు ఈ 3 గ్రహములలో ఏ రెండు గ్రహాలు గాని, లేదా మూడు  గ్రహాలు 2వ భావములో లేదా 5వ భావములో లేదా 9వ భావములో లేదా 12వ భావములో ఉంటే ఆ జాతకుడు గురువు వలన తీవ్రమైన వ్యతిరేక ఫలితములు అనుభవిస్తాడు.
  6. జాతకములో రవి లేదా చంద్రుడు లేదా రాహువు లేదా ఏ రెండు గ్రహాలు లేదా ఈ మూడు గ్రహములు కలసి 7వ భావములో ఉన్నట్లైతే జాతకుడు శుక్రుడు కలిగించే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తాడు.
  7. రవి, చంద్ర లేదా కుజుడు  లేదా వీటిలో ఏ రెడ్ను గ్రహములు లేదా ఈ మూడు గ్రహములు కలసి 10వ భావములో లేదా 11వ భావములో ఉంటే, ఆ జాతకుడు శని వలన విపరీతమైన చెడు ఫలితములు అనుభవిస్తాడు.
  8. రవి లేదా శుక్రుడు లేదా ఇద్దరు 12వ భావములో ఉంటే, జాతకుడు రాహువు యొక్క వ్యతిరేక ఫలితములను అనుభవిస్తాడు.
  9. చంద్రుడు లేదా కుజుడు 6వ భావములో ఉంటే, జాతకుడు కేతువు వలన చెడు ఫలితాలను అనుభవిస్తాడు.

ఈ విధంగా జన్మకుండలిలో 9వ స్థానానికి ఉన్న ప్రభావాలను బట్టి పితృదోష నిర్దారణ జరుపవచ్చు. ఎందుకంటే గత జన్మలో నుండి మిగిలిన కర్మఫల భారమును తెలియజేసేది ఈ 9వ భావమే. ఈ నవమ భావముకు శని లేదా రవి ప్రభావితం చేయటం వలన సమస్యలు వస్తాయి. ఎవరైతే చేతబడి, చిల్లంగి మొదలగు లాంటి కుతంత్ర శక్తులను (కుతంత్రముకు, తంత్రముకు చాలా తేడా ఉంది. గమనించగలరు) ఆచరించి, కేవలం స్వలాభం కోసం లేదా కక్ష్య సాధింపు కోసం లేదా ఇతరుల నుండి ధనం పొందటం కోసం ఈ కుతంత్ర శక్తులు ఇతరులపై ప్రయోగించే వారు, వారు చేసిన దుష్కృత్యాలు, పాపములు, వారు గతించిన తరువాత వీరి తరువాత తరం వారు (కొడుకు, మనుమడు, …..) కూడా అనుభవించవలసి వస్తుంది. వీరి వారసులు కూడా ఈ పితృదోష పరిణామాలు చవిచూస్తారు. తరువాత అదే గోత్రములో జన్మించి ముందు జన్మలో చేసిన పాపములకు ఫలితములు ఇహ జన్మలో అనుభవిస్తారు.

పితృదోషం ఉన్నవారు పాటించవలసిన నియమాలు:

  1. పని మీద బయటకు వెళ్ళినపుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి.
  2. గతించిన పితృలకు సాంప్రదాయ బద్దముగా షార్థ కర్మలు జరిపించాలి.
  3. గతములో చేసిన పాపకార్యములకు మనస్సులోనే ప్రాయశ్చిత్తము తెలుసుకోవాలి.
  4. శారీరక (లేదా) మానసిక దుర్బలం ఉన్నవారికి అనాధాలకు సంపాదనలో 5-10 శాతం దానము చేయాలి.
  5. కుటుంబముతో మరియు సోదర, సోదరీలతో మంచి అన్యోన్యత పాటించాలి.
  6. దైవానుగ్రహము మరియు పూర్వీకుల ఆశీర్వచనం కొరకు ఒక పేదింటి అమ్మాయి యొక్క వివాహ బాధ్యత తీసుకోవాలి.
  7. రావి చెట్టుకు నీరు పోస్తూ, అమావాస్య పౌర్ణమి రాత్రులలో ఉపవాసము పాటించాలి.

జాతకచక్ర పరిశీలనలో చూడవలసిన అత్యంత ప్రధాన అంశములు దోషములు, శాపములు, వాటిలో ప్రధానమైనది మరియు జాతకులకు అవయోగాలను, అరిష్టాలను కలుగచేసేదే పితృదోషం (పితృశాపం). ఈ శాపం దోషం ఏర్పడటానికి కారణం చనిపోయినవారి కర్మకాండలలో చేసే లోపములు, తప్పులు మరియు గతించిన వారు చేసిన దోషాలు, పాపాలు. అందుచేత కారణం ఏది ఏమైనప్పటికి పితృశాపం ఉన్నవారు “గోకర్ణ బలి, నారాయణ నాగబలి, బ్రాహ్మణ భోజనం” వంటి పరిహారములు ద్వారా ఈ దోషముల నుండి, శాపముల నుండి విముక్తి పొందవచ్చు. ఈ పితృదోషములు, పక్షి దోషములు (పక్షి శాపం) జాతకచక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా కేరళ కర్మ జ్యోతిష్య తాళపాత్ర గ్రంధముల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ పరిహారములు పూర్తి తాంత్రిక విధానములో వామాచారంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది ఒక్క కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని అర్చకులు రుత్విక్కులు మాత్రమే చేయగలరని ప్రతి ఒక్కరూ గమనించాలి.    

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com  

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

Related Articles:

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X