మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు:
ముందుగా మాంగల్య దోషము ఎందుకు ఏర్పడుతుందో, మాంగల్య దోషం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము.
- ఒక స్త్రీ జాతకములో అష్టమ భావమును అంటే 8వ స్థానమును మాంగల్య స్థానము అని పిలుస్తారు. ఈ అష్టమ భావములో చెడు గ్రహములు ఉంటే వారికి మాంగల్య దోషము ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రము ప్రకారం గురువు స్త్రీలకు మాంగల్య భాగ్యమును ప్రసాదిస్తాడు. అందువలన ఒక స్త్రీ జాతకములో 8వ స్థానము, 8వ స్థానాధిపతి మరియు గురువు అశుభ స్థానములో ఉన్నట్లైతే ఆ స్త్రీకి మాంగల్య దోషము ఏర్పడుతుంది. మాంగల్య దోషము ఉన్న స్త్రీ యొక్క భర్త, భార్యతో తగాదాలు పది ఇల్లు వదలి పారిపోవటం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు మాంగల్య దోషం ఉన్న స్త్రీలు భర్తతో విడిపోవటం గాని, లేదా భర్త అకస్మాత్తుగా చనిపోవటం గాని జరుగుతుంది.
- ఒక స్త్రీ జాతకములోని 8వ స్థానములో కుజుడు ఉన్నట్లైతే మాంగల్య దోషం ఏర్పడుతుంది. దీనినే కుజ దోషం అని, అంగారక దోషం అని, చెవ్వై దోషము అని పిలుస్తారు. మాంగల్య దోషం కేవలం గురువు, కుజుడు అను ఈ రెండు గ్రహముల వలనే గాక శని వలన కూడా ఏర్పడుతుంది. ఒక స్త్రీ జాతకములో 8వ స్థానములో శని ఉన్నట్లైతే మాంగల్య దోషం ఏర్పడుతుంది. జాతకములో 7వ స్థానానికి అధిపతి అయిన పాపగ్రహము (కుజుడు లేదా రవి లేదా శని లేదా రాహు లేదా కేతు) జాతక చక్రములోని 8వ స్థానములో అనగా మాంగల్య స్థానములో ఉన్నట్లైతే ఆ స్త్రీకి వైధవ్యము లభిస్తుంది. వైధవ్యము ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అని చెప్పలేము కానీ దంపతుల మధ్య విబేధాలు వచ్చి విడిపోవటం జరుగుతుంది.
- స్త్రీ జాతకములో అష్టమ భావములో అంటే 8వ స్థానములో రాహువు లేదా కేతువు ఉన్నట్లైతే , మాంగల్య దోషము ఉన్నట్టుగా గుర్తించాలి. దీనినే నాగ దోషం అని కూడా పిలుస్తారు. నాగదోషము ఉన్న స్త్రీలకు వివాహ సంబంధములు కుదరటములో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ ఏదైనా సంబంధము కుదిరినా కూడా సరైన వరుడు లభించటం దాదాపు అసాధ్యము అవుతుంది. అందువలన రాహువు లేదా కేథ్వు కారణంగా ఏర్పడే మాంగల్య దోషము స్త్రీలకు దాంపత్య జీవనమును దూరము చేస్తుంది. అంతేకాకుండా అత్తామామలతో విరోధాలు రావటం, భర్తకు తరచుగా రోగాలు రావటం జరుగుతుంది.
సంపూర్ణ జన్మ కుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
పరిహారములు:
ఈ మాంగల్య దోష నివారణ జరుగుటకు పరిహారములు జరిపించుకోవాలి. క్రింద ఇవ్వబడిన హోమములలో ఏదైనా ఒక ప్రాయశ్చిత్త హోమము జరిపించుకోవాలి. ఈ హోమములు జరిపించుకోవడం వలన పూర్వజన్మలో చేసిన పాపముల ప్రాయశ్చిత్తము కలిగి , మాంగల్య దోషము నివారణ కలుగుతుంది. ఆ హోమములు ఏమిటంటే
- అష్టమంగళ బలి
- వైవాహిక పీడా దోష నివారణా హోమము
- సువాసిని హోమము
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
||సర్వే జనా సుఖినోభవంతు||
||శుభం||
-C.V.S.చక్రపాణి, జ్యోతిష్య భూషణ, 9846466430
Related Articles:
- షష్ట్య గ్రహ కూటమిలో జరిగిన సూర్యగ్రహణమే ఈ విపత్తుకు కారణమా?
- నష్టజాతక ప్రశ్న-The Lost Horoscope
- జాతక పరిశీలన- Horoscope Reading
- ఏ యంత్రమును ఎందుకు పూజించాలి?
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Mathibhramana Yogam- మతిభ్రమణ యోగం
- Chinnamastha Homam- చిన్నమస్తికా హోమం
- Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ