loading

వరుణ గ్రహం – ప్రాణాపాయ పరిస్థితులు

  • Home
  • Blog
  • వరుణ గ్రహం – ప్రాణాపాయ పరిస్థితులు

వరుణ గ్రహం – ప్రాణాపాయ పరిస్థితులు

ప్రాణాపాయములు కలిగించే వరుణ గ్రహ స్థితి ఫలితములు:

జ్యోతిష్య శాస్త్రం అంతయూ కూడా నవగ్రహముల మీద ఆధారపడి ఫలితములు ఇవ్వడం జరుగుతుంది. ఈ నవగ్రహాల ఆధారంగా ప్రపంచ, రాజకీయ, ఆర్థిక, ధర్మాధర్మ విచక్షణ, ప్రకృతి భీభత్సములు ఎప్పుడు జరుగునో తెలుసుకోవడం అనాది నుండి జరుగుతుంది. వ్యక్తులపై దుష్ప్రభావాలను, మారకమును ఇచ్చుటలో యమగ్రహం, ఇంద్ర గ్రహం, వరుణ గ్రహం నూరు శాతం ప్రతిఫలింపజేస్తాయి. విదేశీయానం, విదేశీ జీవనం, విదేశాలలో ప్రయాణాదులలో మరణం, అపహరణకు గురి కావడం, శిక్షలకు గురి కావడం, విదేశాలలో బానిస జీవనం వంటి అంశాలు యమ, వరుణ, ఇంద్ర గ్రహాలు ప్రాప్తింపజేస్తాయి. రాజ యోగాలను ప్రసాదింపజేసే శని, గురు, శుక్ర, కుజ గ్రహాలు వాటి బాధ్యతలను వరుణ, ఇంద్ర, యమ గ్రహాలకు అప్పగించడం జరుగుతుంది. ఈ గ్రహాలు మానవులకు దుష్పరిణామాలు కలిగించే స్థితిని గ్రహ వెధా దోషాలు అని పిలుస్తారు. యమ, వరుణ, ఇంద్ర గ్రహాలు దుష్పరిణామాలను కలిగించే గ్రహ స్థితులు తెలుసుకోండి.

జన్మలగ్నమందు అనగా వ్యక్తుల జన్మకుండలిలో జన్మలగ్నములో వరుణుడు ఉండినట్లైతే, కరెంటు షాకు వల్ల, బాంబు పేలుళ్ళ వల్ల, పిడుగుపాటు వలన ఆ వ్యక్తులకు ప్రాణ గండములు గడుచుట జరుగును.

  • 6వ స్థానములో వరుణుడు ఉండినట్లైతే కరెంటు షాకుకు గురి కావడం, అగ్నిప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. ఈ గ్రహ స్థితి ఉన్న జాతకుల యొక్క భార్య లేదా భర్త ఆత్మ హత్యకు పాల్పడటం, హత్యకు గురి కాబడటం జరుగుతుంది. వ్యాపార భాగస్వాముల వలన వీరికి మరణ గండములు సంభవించును. సామాజిక, సాంకేతిక మాధ్యమాల్లో ఈ విషయాలను ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము. క్యాన్సర్, కుష్టు వ్యాధులు సంభవించు అవకాశములు ఉండును.
  • జన్మ లగ్నము నుండి 7వ స్థానములో వరుణ గ్రహం ఉన్నట్లైతే, వివాహం జరిగిన కొద్ది కాలానికే జీవిత భాగస్వామికి ప్రాణ గండములు సంభవించే అవకాశములు వచ్చును. వరుణ గ్రహముతో పాటు యమ గ్రహము కూడా కలసి ఉన్నట్లైతే, ఒకరినొకరు లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు పాశవికంగా హత్యకు గురి కావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ విధమైన సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాము. ఈ విధమైన ప్రాణాపాయ గండాలు, దుష్పరిణామాల నుండి తప్పించుకోవడానికి అధర్వణ తంత్రంలో కొన్ని పరిహారాదులు, హోమాలు జరిపించిన రక్షింపబడతారు.
  • జన్మలగ్నము నుండి 5వ స్థానంలో వరుణుడు ఉన్నట్లైతే సంతానము కలుగడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ జన్మకుండలిలో సంతాన కారక గ్రహం బలంగా ఉన్నట్లైతే, సంతానము కలిగి, ఆ సంతానము అంగవైకల్యముతో పుట్టడం జరుగుతుంది. సంతానానికి మాటలు రాకపోవడం, గుండెలో రంధ్రములు ఏర్పడటం, మూర్చలు, అంగవైకల్యం, మతిస్థిమితం లేకపోవడం, నపుంసకత్వం ప్రాప్తించడం, మానసిక దౌర్బల్యం, ఉన్మాదం కలిగి ఉండటం, భార్యకు గర్భస్రావాలు జరగడం లాంటివి జరుగుతాయి. పంచమ స్థానంలో వరుణుడి స్థితి వలన సంతానముకు జలగండము కలుగడం జరుగుతుంది. నది మీద ప్రయాణింస్తుండగా లేదా నీటిలో మునిగి చనిపోవడం మనం చాలా సార్లు గమనించే ఉంటాము.

 

విదేశీయాన జీవనం, విదేశాలలో బలవన్మరణం పొందడం, అపహరణకు గురి కావడం, వీటికి గల గ్రహ స్థితులు:

  • జన్మకుండలిలో 9వ స్థానంలో వరుణ గ్రహ స్థితి మరియు శని, కుజ గ్రహముల పాపదృష్టి ఉన్నట్లైతే, ఈ విధమైనటువంటి గ్రహస్థితులు కలిగి ఉన్న వ్యక్తులు విద్య నిమిత్తమో, ఉద్యోగ నిమిత్తమో విదేశాలకు పోయి, అచ్చట దుర్మరణం పాలగును లేదా వారు తీరి తమ స్వదేశానికి తిరిగి రాకపోవడమో జరుగుతుంది. ఇలాంటి గ్రహస్థితులు కలిగి ఉన్న వ్యక్తులకు ఇవి తప్పక ప్రాప్తిస్తాయి. ముందుగా గ్రహించి శాంతి పరిహారాదులు జరిపించిన ఎడల మేలు జరుగును. పూర్ణాయుర్దాయమును పొందగలుగుతారు.
  • వరుణుడు 4,6,8,9,11,12 స్థానాలలో చెడు చేయును. ఒకవేళ 12వ స్థానములో వరుణుడు స్థితి చెంది ఉన్నట్లైతే, ఇతర పాప గ్రహాల దృష్టి కూడా చేరినట్లైతే, కారాగార ప్రాప్తి, జైలులో మగ్గిపోవడం జరుగును.

గమనిక: ఈ ఫలితములు ఆ స్థానం యొక్క రాశిని బట్టి మారును. కేవలం నిష్ణాతులైన జ్యోతిష్యులు మాత్రమే క్షుణ్ణంగా పరిశీలించి వీటి ఫలితాలను జాతకులకు వివరించగలరు.

 

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Nagashakthi Telugu Book#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu#effects #precautions #yoga #specialyogas #astrology #astrologyhoroscope #zodiac #moonsign #moons #rashiphal #rashi #horocopereading #deatiledlifereading #birthchart #birthhoroscope #kalsarpayoga #yogasinhoroscope #effectsandcauses

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.