యంత్రానుష్టానం
మానవులు ఆధ్యాత్మికతను వారి పూర్వీకుల నుండి ఆచరిస్తున్న పూజా విధానాల ద్వారా వారు అనుసరిస్తున్నారు. ఈ ప్రపంచంలో సృష్టి, సృష్టి నిర్మాణం, కాలంలో మార్పులు, యుగాలు, వాటిని పాలించిన రాజులు, రాజులు మరియు మనుష్యుల రూపంలో పరిపాలించిన దైవాలు, ఆ దైవాలను అనుష్టించిన ఋషులు వారి ద్వారా సంక్రమించిన ఆధ్యాత్మికతను ఇప్పటి వారు ఆచరిస్తున్నారు. మనిషి తాను చేసిన గత జన్మల పాప పుణ్యాలను అనుభవించడానికే మరల మరల జన్మలను ఎత్తడం, వాటి తాలూకు కర్మలను అనుభవించడం, ఇదే జరుగుతున్నది. కర్మఫలాన్ని అనుభవించి కర్మల ఫలితాన్ని నిర్మూలించడానికి హైందవంలో అనేక మార్గాలు, విధానాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది దైవానుష్టానం లేదా దైవారాధన. దేవాలయాన్ని నిర్మించి, దేవతా మూర్తులను వేంచేపు చేసి, విగ్రహ మూర్తుల క్రింద యంత్రములను ప్రతిష్టింపజేసి, ఆ యంత్రములకు ప్రాణ ప్రతిష్ట చేసి, వాటి ద్వారా దైవ ఆవాహన ఆ విగ్రహ మూర్తులలోకి చేస్తారు. ఈ విధంగా పంచలోహ, వెండి, బంగారు రేకులలో యంత్రములను చేసి ఆ యంత్రములకు మంత్ర సిద్ధిని పెంపొందింపజేసి, ఆ ప్రదేశాన్ని మంత్ర దిగ్భందనం చేస్తారు. విగ్రహములకు ఆ శక్తి వాటి క్రింద ఉన్న యంత్రముల ద్వారా సంక్రమిస్తుంది. అభీష్ట కార్య సిద్ధి కోసం అనేక రకములైన గ్రహ దోషాలను తొలగించడం కోసం, యంత్ర పూజలను చేయడం జరుగుతుంది. దైవాల శక్తులు మనకు అనుగ్రహం కావాలంటే ఒక రూపాన్ని మనం కొలుస్తాము. ఆ రూపం శిలారూపమో లేదా లోహపు శిల్పాలు లేదా కాగితము పై ఆ రూపాలను (ఫోటోలను) పూజించడం జరుగుతుంది. శిలా రూపంలో గృహాలలో ఒక అడుగుకు మించి ఉన్న విగ్రహాలను మన గృహంలో లేకుండా చూస్తాము. అందుకారణంగా వాటికి ప్రత్యామ్నాయంగా ఫోటోలను పూజించడం సాధరణంగా జరుగుతుంది. అయితే, ఈ ఫోటోలను పూజించడం వలన ఫలితం శూన్యం. లోహానికి ఉన్న గుణములు, ప్రత్యేకతలు ఫోటోలకు ఉండవు. శిల్పాలకు ప్రత్యామ్నాయంగా యంత్రములను (పంచలోహపు యంత్రములను) పూజించడం ద్వారా మేలు, కార్యసిద్ధి జరుగుతుంది. పూజా మందిరములో లోహపు యంత్రములను లేదా విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలి. చాలా మందికి తెలియని విషయం ఏమంటే, ఫోటో ఫ్రేములను (దైవాలను) పూజించడం నిరర్థదాయకమని, దైవాల ప్రతిమా రూపంలో యంత్రాలను పూజించడం ద్వారా కార్యసిద్ధి, దైవనుగ్రహం ప్రాప్తిస్తాయి. ఈ యంత్రములను పంచలోహముతో చేయించి, గురువు యొక్క ఆధ్వర్యంలో దైవ పీఠములందు పూజించినవి అయ్యి ఉండవలెను. వాటిని పవిత్రం చేయించి గురువు ద్వారా పొందవలెను. ఈ విధంగా వ్రతాలు, నోములు, యంత్ర రూపంలో ఉన్న మంత్ర, యంత్రాలను పూజించండి. వాటి శక్తి మీకు అర్థమవుతుంది. మరల మరల జ్ఞప్తిక తెస్తున్నాను. దైవాలను కాగితపు ఫోటోలలో పూజించడం వ్యర్థం. మనం ఉచ్చరించే మంత్రాలను ఈ యంత్రాలు స్వీకరించి శబ్ధ తరంగము ద్వారా మనం ఆరాధించే దైవాలకు సమర్పిస్తాయి, చేరవేయబడతాయి. ఇది ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి పధార్థానికి ఒక నిర్ధిష్ట శక్తి ఉంటుంది. దాన్ని ఏ విధంగా దేనికి ఉపయోగించాలన్న ధర్మాలు, పరిమితులు, ఆంక్షలను ఆగమశాస్త్రాలలో చెప్పబడ్డాయి. దానిని ఆధారంగా యంత్రములు శిల్పి రూపొందించి, గురువర్యుల పీఠమునకు అందిస్తాడు. గురువులు వాటిని దైవాహనము మరియు ప్రాణ ప్రతిష్ట చేసి వాటికి శక్తులను ఇమిడింపజేయుదురు. వాటిని జాతకులు పొంది , గృహమునందు ఉంచిన అమోఘమైన దేవతారాధన ఫలితములు పొందగలుగుతారు. అంతటి మహత్తరమైన శక్తి బీజాక్షర యంత్రములకు ఉంటుంది. శాస్త్ర ప్రకారం ఒక నిర్ధిష్ట ప్రమాణములతో యంత్రములను పూజించడం మంచిది.