తిలా హోమం
కుటుంబంలో అసహజ మరణం పొందిన వారి కొరకు ఈ తిలా హోమాన్ని జరిపిస్తారు. సాధరణంగా ఏడాదికి ఒకసారి చేసే తిథి అనగా పితృతర్పణ లాగా కాకుండా, ఈ తిలా హోమాన్ని కేవలం జీవితంలో ఒకే ఒక్కసారి జరిపించాలి. అసహజ మరణం పొందిన ఆత్మకు శాశ్వతమైన తృప్తి కలిగించడమే మోక్షము. ఆ మోక్షమును పొందుటకు అవరోధములను తొలగించే ప్రక్రియే తిలా హోమం.
తల్లి తరపున లేదా తండ్రి తరపున కుటుంబంలో మరణం సంభవిస్తే పిండ ప్రధానం చేస్తారు. అప్పుడే పుట్టిన చంటి పిల్లలు మరణిస్తే పూడ్చి పెడతారు. మరికొన్ని సంధార్భాలలో, అనగా, చిన్నపిల్లలు, పెల్లిగాని అమ్మాయి లేదా అబ్బాయి ఊహించని విధంగా మరణించినా లేదా అసహజ మరణం పొందినా, అనగా, నీటిలో మునిగి చనిపోవడం, అగ్ని ప్రమాదాల వలన మరణించడం, విష కీటకాదుల వలన మరణం సంభవించడం, ఆత్మాహుతి చేసుకోవడం, రాళ్ళు తగలడం వలన చనిపోవడం, గొంతు నులమడం వలన మరణించడం, ఆయుధాలు, దాడుల వలన మరణించడం, ప్రసవ సమయంలో మరణించడం, ఋతుక్రమ సమయంలో మరణించడం, ఈ విధంగా మరణించిన వారు అటు స్వర్గానికి వెళ్లలేక, ఇటు నరకానికి వెళ్లలేక మధ్యలో తీవ్ర క్షోభను అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా నరకం అనుభవించే ఆ ఆత్మలు, తమను ఆ చెర నుండి ఎప్పుడు విముక్తి కలిగిస్తారా అని తమ కుటుంబ సభ్యుల పై ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వీరి క్షోభ వలన, మన జీవితాలలో తీవ్రమైన ఆటంకాలు, కష్టాలు ఎదురవుతాయి. భరించలేని ఆ క్షోభ నుండి తమను విడిపించమని మనకు ఆ ఆత్మలు ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆత్మ క్షోభ నుండి విముక్తి కలిగించేందుకు ఈ తిలా హోమాన్ని నిర్వహిస్తారు.
కుటుంబంలో అసహజ మరణం పొందిన పూర్వీకులు క్షోభించడం వలన ఉద్యోగాలు దొరక్కపోవడం, వివాహం ఆలస్యం కావడం, పిల్లలు మాట వినకపోవడం, సంతానానికి అనారోగ్య సమస్యలు ఏర్పడటం, కుటుంబ సభ్యుల మధ్య మరియు దంపతుల మధ్య అనైక్యత పెరగడం, సంపాదనకు మించిన ఖర్చులు రావడం, చట్ట పరమైన సమస్యలు ఎదుర్కోవడం మరియు తరచూ ప్రమాదాలు జరగడం వంటివి జరుగుతాయి.
ఈ హోమం జరిపించుటకు రామేశ్వరం వంటి శక్తివంతమైన మరియు పవిత్రమైన ప్రదేశం మరొకటి లేదు. సహజ మరణం పొందిన పూర్వీకులకు తాము చనిపోయిన తిథి నాడు ఇళ్ల వద్ద పిండ ప్రధానం చేయవచ్చు. కానీ అసహజ మరణం పొందిన పూర్వీకుల కొరకు మాత్రం ఈ తిలా హోమాన్ని నిర్వహించాలి. తామ్రపార్ణి నది వద్ద ఈ హోమాన్ని జరిపించాలి. చనిపోయిన వారి ఆస్తికలను ఈ నదిలో కలిపివేయడం వలన వారి ఆత్మకు శాంతి కలిగి, ముక్తి లభిస్తుంది అని మహాభారతంలో చెప్పబడింది.
కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ ఈ దోషం తప్పక ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా ఈ హోమములో పాల్గొనలాని శాస్త్రం చెబుతోంది. అమావాస్య నాడు గాని లేదా పితృ అమావాస్య నాడు లేదా పూర్వీకులు చనిపోయిన తిథిలో ఏడాదికి ఒకసారి జరిపించే పిండ ప్రధాన ప్రక్రియలా కాకుండా ఈ తిలా హోమాన్ని కేవలం జీవితంలో ఒక్కసారే జరిపిస్తారు. కావున కుటుంబంలోని వారందరూ కూడా ఈ తిలా హోమంలో పాల్గొనాలి.
గాలిలో ఆత్మ క్షోబిస్తూ సంచరించడం వలన భూమి పై ఉన్న తమ వారసుల పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాంటి ఆత్మలకు విముక్తి కలిగించేందుకు ఈ తిలా హోమమే సరైన పరిపూర్ణ పరిహారం అని శాస్త్రం చెబుతోంది. ఈ హోమం ఆచరించడం వలన ఆత్మకు మార్గం లభించి, మళ్ళీ జన్మించడం గాని లేదా శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మముల చెంతకు పంపడం గాని జరుగుతుంది.
జాతక పరిశీలన
- జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు.
- జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Ph: 9846466430 Whatsapp: wa.me/919846466430
Related Articles:
- జాతకులను జైలుపాలు చేసి అగుచాట్లకు గురి చేసే బంధన యోగం
- కళత్ర దోషం అంటే ఏమిటి? వాటి ప్రభావాలు ఏమిటి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు ఏమిటి?
- గుండె జబ్బులకు గల జ్యోతిష్య కారణాలు
- జన్మకుండలి పరిశీలన
- ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious