loading

Problems with boss, higher officials-Astrology reasons

  • Home
  • Blog
  • Problems with boss, higher officials-Astrology reasons

Problems with boss, higher officials-Astrology reasons

ఉద్యోగములో అధికారులతో ఇబ్బందులు ఎందుకు వస్తాయి?- అందుకు గల జ్యోతిష్య కారణాలు ఏమిటి?

Problems with boss, higher officials

మానవుడికి తన మనుగడ కొరకు భగవంతుడు ఎన్నో విద్యలను, శాస్త్రాలను వరంగా ప్రసాదించాడు. జ్యోతిష్య శాస్త్రము అనేది వేదాలకు కన్ను వంటిది. ఈ జ్యోతిష్య శాస్త్రము ఎంతో మహిమాన్వితమైనది. కాకపోతే ఈ జ్యోతిష్య శాస్త్రములో అరకొర జ్ఞానం కలిగిన వారు జ్యోతిష్య సలహాలు చెబితే అవి దాదాపు విఫలం అవుతాయని చెప్పక తప్పదు. జ్యోతిష్య శాస్త్రము ద్వారా జ్యోతిష్య సలహాలు ఇవ్వటానికి కేవలం జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం మాత్రమే ఉంటే చాలదు, ఈ శాస్త్ర జ్ఞానముతో పాటు అనుష్టాన బలం, వాక్ సిద్ధి కలిగి ఉండాలి. అప్పుడే ఆ జ్యోతిష్యుడిని “దైవజ్ఞ” అని పిలుస్తారు.

Problems with boss-Astrology reasons

మన జీవితములో జరిగే ప్రతి చిన్న విషయాలు కూడా మన జన్మకుండలిని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవచ్చు. ఉద్యోగం చేసే అందరికీ కూడా పై అధికారులు లేదా తమ Boss ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. ఆ పై అధికారితో ఉన్న బంధం, సాంగత్యంతోనే, ఉద్యోగం చేసే జాతకుని ప్రశాంతత, తన అభివృద్ధి ముడిపడి ఉంటుంది. కొందరికి పై అధికారులతో స్నేహం కలిగి తొందరగా అభివృద్ధిలోకి వస్తారు. ఇంకొందరికి ఎంత విద్య ఉన్నప్పటికి, తమ పై అధికారులతో సరైన సంబంధములు లేకపోవటం వలన వారి స్థాయిలో ఎదుగుదల, అభివృద్ధి అనేది ఉండదు. అందుకు కారణాలు ఏమిటో, జన్మకుండలిలో ఎలాంటి గ్రహస్థితుల వల్ల ఈ సమస్యలు ఎదురవుతాయో మీకు ఇప్పుడు వివరిస్తాను. పై అధికారులకు మరియు జాతకునికి ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసుకోవడానికి జాతకుని జన్మకుండలిలో నవమాధిపతి, దశమాధిపతి, నవమ భావం, దశమ భావం పరిశీలించాలి.

  • జన్మకుండలిలో నవమాధిపతి నీచ స్థానములో ఉన్నా (లేదా) పాప గ్రహాలతో కలసి ఒకే రాశిలో ఉన్నా లేదా నవమ భావములో పాప గ్రహములు ఉన్నా, జాతకునికి తమ పై అధికారితో, Bossతో ఎప్పుడూ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. జాతకునికి మరియు అధికారికి మధ్య సరైన సమబంధాలు ఉండవు.
  • జన్మకుండలిలో రవి గ్రహం యొక్క స్థితిని బట్టి కూడా అధికారులతో ఉన్న సంబంధం తెలుస్తుంది. రవి నీచ స్థానములో ఉన్నా, రవి రాహువుతో కలసి ఒకేరాశిలో ఉన్నా; రవి మరియు శని కలసి ఒకే రాశిలో ఉన్నా; రవి మరియు శనికి పరస్పరం దృష్టి ఉన్నా జాతకులు తమ పై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడిని, సమస్యలను ఎదుర్కొంటారు.
  • నవమాధిపతి మిత్ర గ్రహాలతో కలసి బలంగా ఉంటే, జాతకుడి అభివృద్ధికి తమ పై అధికారే కారణం అవుతారు. జాతకుని వెన్నంటే ఉంటూ ప్రోత్సహించి మంచి అభివృద్ధిని కలుగుచేస్తారు.
  • నవమాధిపతి మిత్ర స్థానములో నవమములో ఉన్న జాతకులు తమ అధికారులతో స్నేహ పూర్వక బంధం పెంచుకుంటారు. జాతకుల పై అధికారి ఒక స్నేహితుడిగా ఉంటూ జాతకునికి ధైర్యం చెబుతారు. ప్రతి పనిలో ప్రోత్సాహమును జాతకునికి ఇస్తారు.
  • నవమాధిపతి కేంద్రంలో అంటే 1,4,7,10 లోని ఏదో ఒక భావములో మిత్ర స్థానములో ఉండినట్లైతే జాతకునికి పై అధికారి నుండి సరైన సమయంలో సరైన సహాయం అందుతుంది. అంతేకాకుండా జాతకునికి ఎంతో అనుకూలంగా ఉంటూ, సరైన సమయములో రక్షణ, సహాయం అందించే విధంగా ఉంటారు.
  • శత్రు, పాప గ్రహముల మహాదశ మరియు అంతర్దశలలో జాతకునికి మరియు అధికారికి మధ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలములో ముఖ్యంగా పై అధికారులతో అపార్థాలు, మానసిక ఆందోళనలు తలెత్తుతాయి.

ఈ విధంగా కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి తమ పై అధికారులు అనుకూలంగానూ, కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి తమ పై అధికారులు వ్యతిరేకంగానూ, ఉద్రేకంగానూ ఉంటారు.

ఉద్యోగస్తులు ఎవరైతే తమ పై అధికారుల వలన ఇబ్బందుల పాలవుతున్నారో వారికి జ్యోతిష్య శాస్త్ర రీత్యా కొన్ని పరిహారములు ఇక్కడ తెలుపుతున్నాను. గమనించండి.

పరిహారములు:

  • ‘ఆదిత్య హృదయం’ ప్రతి రోజు సూర్యోదయమున పఠించండి.
  • ‘బతుక భైరవ యంత్ర మంత్ర తంత్ర సాధన’
  • ‘మహేంద్ర బలి’ కార్యక్రమం (ఇంద్రాదిత్య హోమం)

ఉద్యోగములో ఉన్న పదవిని పొందడానికి, రాజకీయ పదవిని పొందడానికి, VRS పొందడానికి వచ్చే ఆటంకాలను ఛేదించి శీఘ్రంగా VRS మరియు సంపూర్ణమైన పెన్షన్ పొందడానికి మహేంద్రాదిత్య హోమాదులు శ్రీ C.V.S. చక్రపాణి గారి ఆధ్వర్యంలో వావిళ్యాపురం (పాలక్కాడ్- కేరళ)లోని తంత్ర పీఠములో జరిపించబడును.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

Related Articles: 

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430 

చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి అభిచార కర్మలకు, శత్రువుల చెడు ప్రయోగాల నిర్మూలనకు తాంత్రిక హోమములు కేరళలోని మా బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకోవచ్చు.

వివరాలకు సంప్రదించండి. Ph 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

 

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.