కాలసర్ప దోష నివృత్తి హోమం
జన్మకుండలిలో రాహువు మరియు కేతువు గ్రహాల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నప్పుడు ఆ జాతకునికి కాలసర్ప యోగం ఉన్నట్టు గుర్తించాలి. ఈ కాలసర్పయోగం ఉన్న జాతకులు తమ జీవితంలో మంచి పేరు పొందటానికి, తాము ఎంచుకున్న వృత్తులలో విజయం సాధించడానికి ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు ఎదుర్కొంటారు. ఎంత శ్రమ ఓర్చినా కూడా కష్టానికి తగ్గ ఏ విధమైన ఫలితం వీరికి దక్కదు.
అయితే కాలసర్ప దోషం ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా ఒకే రకమైన ప్రభావాన్ని అయితే పొందరు. గ్రహాల స్థానాలను బట్టి, గ్రహ స్థానాల బలాలను బట్టి, ఇంకా ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రభావాలు ఉంటాయి. అందువలన కాలసర్ప దోషం ఉంది అనగానే అందరూ బెంబేలెత్తి పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నిష్ణాతుడు అయిన జ్యోతిష్య పండితుని వద్ద జన్మకుండలి పరిశీలన చేయించుకొని ఆలస్యం చేయకుండా దానికి తగ్గ పరిహారం చేసుకోగలిగితే కాలసర్ప దోషం యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయి. కాలసర్ప యోగం ఉన్న ఎంతో మంది తమకు అడ్డంకులు, ఒడిదుడుకులు ఉన్నప్పటికి, ఉన్నత స్థానాల్లో ఉంటూ, సంపన్నులుగా, నాయకులుగా, మంచి పేరు ప్రతిష్టలు పొందినవారు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే ఈ కాలసర్ప యోగ ప్రభావాన్ని తట్టుకోలేనంతగా ఉంది అని తోచినపుడు, జ్యోతిష్య పండితుని సలహా మేరకు వెంటనే తగిన ప్రాయశ్చిత్త పరిహారాలను చేయించుకోవాలి. తద్వారా కాలసర్పయోగ దుష్ప్రభావములు తగ్గి జాతకుల యొక్క జీవితం సులభతరంగా, సౌకర్యవంతంగా మారుతుంది.
12 రకాల కాలసర్ప యోగాలు ఏమిటో, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోవచ్చును.
కాలసర్పయోగం వలన ఏ విధమైన సమస్యలు కలుగుతాయి?
కాలసర్పదోషం ఉన్న జాతకునికి ఊహించని ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. దీని వలన శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండలేరు. మానసిక అశాంతి, ధైర్యం కోల్పోవడం, మతిమరుపు, అనవసరమైన శ్రమ, ఒత్తిడి, భాద్యతా రాహిత్యం, మానసిక రుగ్మతలు, నిలకడలేని ఆలోచన శక్తి లాంటి సమస్యలు ఎదురయ్యి జాతకుడిని నిస్తేజుడిని చేస్తుంది. వ్యక్తిగత సంబంధాలలో నిలకడలేని భావోద్వేగాలు ఎదురవుతాయి. పరీక్షల్లో వరుసగా ఫెయిల్ అవ్వడం, మంచి విద్య లేదా స్కూల్లో, కాలేజీలో, విశ్వవిద్యాలయములో కొత్త విద్యను అభ్యసించలేకపోవడం, దీని వలన ఉన్నత చదువులు చదవాలన్న ఉత్సాహం వీరిలో మాయమవుతుంది. వృత్తి, విద్యలలో విజయం ఫలించకపోవడం, తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండటం, ఉన్నత పదవి కోసం చేసే ప్రయత్నంలో తీవ్ర అడ్డంకులు, జాప్యం తలెత్తుతాయి.
ప్రేమలో విఫలం అవ్వడం, నమ్మిన స్నేహితుల చేతిలో, జీవిత భాగస్వామి చేతిలో,వ్యాపార భాగస్వామి చేతిలో మోసపోవడం జరుగుతుంది. ఈ కాలసర్ప యోగం జాతకుల యొక్క ప్రియుడు లేదా ప్రియురాలితో గాని, జీవిత భాగస్వామితో గాని ఉన్న సంబంధం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వివాహం ఆలస్యం అవ్వడం, వైవాహిక జీవితం అసంతృప్తికరంగా ఉండటం, శృంగార జీవితం అసంతృప్తికరంగా ఉండటం, సంతాన లేమి (గర్భం దాల్చేందుకు సమస్యగా మారడం), తరచూ అబార్షన్లు కావడం, పుత్ర యోగంలో లోపం ఉండటం, దంపతుల మధ్య ఐక్యత లేకపోవడం, విడాకులకు దారి తీయడం లాంటివి కాలసర్పయోగం యొక్క తీవ్ర ప్రభావాలు.
ఆర్థిక విషయాల గురించి చర్చిస్తే, ఆర్థిక శ్రేయస్సు లోపించడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, పేదవాడిగా మారే విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోవడం, వ్యాపారం నడపడంలో తీవ్రమైన అడ్డంకులు రావడం, ఆస్తులను పొందడంలో సమస్యలు, వారసత్వపు సంపదను దక్కించుకోవడంలో తీవ్రమైన సమస్యలు రావడం జరుగుతుంది.
ఈ విధంగా కాలసర్పదోషం ఉన్న జాతకులు తమ జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు కూడా ఆరోగ్యం, విద్య, వృత్తి, వివాహం, ఆర్థికంగా, సామాజికంగా సమయానికి తగట్టు ఒడిదుడుకులు ఎదుర్కుంటూనే ఉంటారు. వామతంత్రము ఆధారంగా కాలసర్ప దోషం ఉన్న జాతకులు ఆ మహాశివుని అనుగ్రహం కొరకు, నాగ దేవత యొక్క అనుగ్రహము కొరకు హోమ,పూజా క్రతువులు ఆచరించాలి.
కాలసర్పదోషము కలుగచేసే బాధలు, చిరాకులను తొలగించుకోవడానికి, పైన తెలిపిన తీవ్ర ప్రభావాలను తగ్గించి, శుభ ఫలితాలను పొందేందుకు, పూర్వీకుల ఆశీర్వాదం పొందేందుకు, సంతానంలేని దంపతులు సత్సంతానం పొందడానికి ఈ కాలసర్పదోష నివృత్తి హోమమును తప్పక జరిపించుకోవాలి అని వామతంత్రం చెబుతోంది.
సంపూర్ణ జాతక పరిశీలన
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు Ph: 9846466430
జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- జాతకులను జైలుపాలు చేసి అగుచాట్లకు గురి చేసే బంధన యోగం
- కళత్ర దోషం అంటే ఏమిటి? వాటి ప్రభావాలు ఏమిటి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు ఏమిటి?
- గుండె జబ్బులకు గల జ్యోతిష్య కారణాలు
- జన్మకుండలి పరిశీలన
- ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
- ఏ హోమములు ఎందుకు జరిపించాలి?
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu