Astrology reasons for extra martial affair
జన్మకుండలి ద్వారా వివాహేతర సంబంధములు (అన్య స్త్రీ/ పురుష):
జ్యోతిష్య సలహాలు, పరిహారాల కొరకు నా వద్దకు వచ్చేవారిలో 60 శాతం కేవలం ఈ వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు కొరకు వచ్చినవారే. “గురువు గారు! నా జాతకములో వివాహేతర సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగిన వారు కూడా ఉన్నారు. అయితే మనకు ఈ జన్మలో కలిగే ప్రతి సంఘటన, మనకు కలిగే దురాలోచన, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన జన్మకుండలి లోని గ్రహస్థితుల వలనే జరుగుతాయి. పూర్వజన్మలో మనము ఏదైతే చేసి ఉంటామో, వాటి ఫలితాలు అది మంచి అయినా, చెడు అయినా భూమి పై ఉన్న ప్రతి జీవి అనుభవించాల్సిందే. అయితే ఇప్పుడు వివాహేతర సంబంధములు కలిగే గ్రహస్థితులు ఏమిటో తెలుసుకుందాము.
మన జీవితములో వివాహం అనేది అతి ముఖ్యమైన సందర్భం. ఎందుకంటే మన జీవితాంతం వరకు మనం ఎన్నుకునే జీవిత భాగస్వామితోనే గడపాల్సి ఉంటుంది. కష్టాలలో, సుఖాలలో ఇద్దరు సమానంగా పాలు పంచుకోవలసి ఉంటుంది. కానీ వారి అభిప్రాయాలకు తగ్గ జీవిత భాగస్వామి దొరకకపోతే వైవాహిక జీవితం సాఫీగా సాగదు. ప్రతి ఒక్కరికీ మనస్సును అర్థం చేసుకునే జీవితభాగస్వామి రావాలని కోరుకుంటారు. అది జరగని పక్షంలో కొందరు వేరే దారి చూసుకుంటారు. అది వివాహేతర సంబంధం అవుతుంది. హిందూ చట్ట ప్రకారంగా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒకసారి వివాహం జరిగిన తరువాత విడాకులు తీసుకోకుండా ఏర్పడే సంబంధాలను నేరము క్రింద పరిగణిస్తారు. మరి అయితే నేరం అని తెలిసినప్పటికి ఎందుకు ఈ వివాహేతర సంబంధములు ఏర్పడుతున్నాయి? ఈ మధ్య కాలములో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కూడా కొందరు రహస్యంగా ఈ సంబంధాలను కొనసాగిస్తారు. ఇంకొందరు సహజంగా జీవిస్తారు. అయితే ఈ వివాహేతర సంబంధముల వలన సామాజిక, కుటుంబీక సమస్యలు కలిగించే గ్రహస్థితులు ఏమిటి? కేవలం కుటుంబీక సమస్యలు కలిగించే గ్రహ స్థితి ఏమిటి? అన్న విషయము ఇప్పుడు మీకు తెలియజేస్తాను.
వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివాహేతర సంబంధ సమస్యకు ముఖ్య కారణం కుజుడు గాని లేదా రాహువు గాని లేదా కేతువు గాని 4వ భావములో లేదా 6వ భావములో లేదా 12వ భావములో ఉన్నప్పుడూ ఈ వివాహేతర సంబంధములు కలుగుతాయి.
- సప్తమ భావము నుండి 5వ భావముపై గాని (లేదా) పంచమ భావము నుండి సప్తమ భావముపై గాని పాప గ్రహముల దృష్టి పడినా; లేదా సప్తమ భావము నుండి 5వ భావములో గురు, శుక్ర గ్రహముల సంగమము జరిగినా జాతకుడు వివాహేతర సంబంధము యొక్క పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
- సప్తమాధిపతి గాని లేదా ద్వితీయాధిపతి గాని శుక్ర దృష్టికి గురి అయినా లేదా శుక్రుడు ఈ స్థానాలలో ఉన్నా లేదా దశమాధిపతి సప్తమములో శుక్రునితో కలసి ఉన్నా జాతకుడు తీవ్ర కామ వాంఛ కారణంగా వివాహేతర సంబంధము ఏర్పరచుకొని తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాడు.
- సప్తమాధిపతి రాహువుతో గాని లేదా కేతువుతో గాని కలసి ఉంటీ ఆ జాతకులు వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. కానీ ఈ జాతకులు బాగా మోసపోయి వలలో పడిపోతారు. (Trap)
- జన్మకుండలిలో మనః కారకుడు అయిన “చంద్రుడు”; ప్రేమకు కారణమైన “శుక్రుడు”; ధైర్య సాహసాలకు కారణమైన రాహువు, కుజుడు (చంద్ర,శుక్ర,కుజ,రాహు) ఈ నాలుగు గ్రహములు 3వ భావం, 5వ భావం, 7వ భావం,11వ భావం 12వ భావములకు మరియు వాటి అధిపతులకు సంబంధం ఏర్పడితే జాతకుడి జీవితభాగస్వామి (భార్య/భర్త) జాతకులను మోసం చేస్తారు. అంతేకాకుండా వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటారు.
- జన్మకుండలిలో సప్తమ భావము బలహీనముగా ఉన్న లేదా సప్తమాధిపతి నీచ స్థానములో ఉంటూ మరియు 11వ భావములో గురువు లేదా శుక్రుడు ఉండినట్లైతే, జాతకుని జీవితభాగస్వామికి వివాహేతర సంబంధం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు.
- జన్మకుండలిలో నీచ స్థాన క్షీణ చంద్రుడు మరియు రవి కలసి 4వ భావములో ఉంటే జాతకుడికి రహస్యములు ఎక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు. అంతే కాకుండా జాతకుడు వయసులో వీరి కంటే పెద్దవారితో గాని లేదా ముసలివారితో గాని అక్రమ సంబంధము ఏర్పరచుకుంటారు.
- శుక్రుడు ప్రేమ మరియు శ్రుంగరానికి కారకుడు అవుతాడు. ఈ శుక్రుడు రాహువుతో గాని లేదా కుజునితో గాని కలసి ఒకేరాశిలో ఉంటే జాతకుడికి కామ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఐతే ఈ శుక్ర రాహు లేదా శుక్ర కుజులు కలసి వృశ్చికరాశి, మేషరాశి, తులారాశి, మిధునరాశిలో గాని ఉన్నట్లైతే జాతకునికి వివాహేతర సంబంధములు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి.
- చంద్రుడు మరియు బుధుడు కలసి మిధునరాశిలో ఉంటూ, ఆ మిధునరాశిపై శని దృష్టి పడితే జాతకుడు వివాహేతర సంబంధం ఏర్పడి, సమస్యలు ఎదుర్కొంటాడు.
(గ్రహ స్థితులు ఇంకా ఉన్నాయి. తరువాతి రోజులలో క్లుప్త వివరణ ఇస్తాను)
ఈ విధంగా కొన్ని విధముల గ్రహ స్థితుల వలన కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా గాని లేదా అనుకోకుండా గాని ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడి సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని గ్రహ స్థితుల వలన జాతకులు మోసపోయి, వివాహేతర సంబంధం ఏర్పరచుకొని విచిత్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. సహజంగా వారి బుద్ధి అలాంటిది కాకపోయినా,ఆ సమయములో గ్రహ ప్రభావము వలన వారి మనస్సు వారి ఆధీనములో లేకుండా చేస్తాయి. ఈ వివాహేతర సంబంధములు ఎన్నో అగుచ్చాట్లు తెచ్చిపెడతాయి.
అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి ? అన్న విషయానికి వస్తే, వ్యక్తిగత జన్మకుండలి పరిశీలించి ఏ గ్రహము వలన జాతకుడికి ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయో, ఆ గ్రహమునకు సంబంధించిన పరిహారములు జరిపిస్తే సమస్యకు పరిష్కారం అవుతుంది.
మరి పరిహారాలు జరిపిస్తే సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయా ? అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనము పూర్వజన్మలో చేసిన పాపములకు,పుణ్యములకు కర్మఫలం, కర్మ భారం అనుభవిస్తున్నాము. ఈ జన్మలో మనకు ఏమి జరగాలి అన్నది బ్రహ్మదేవుడు మన నుదిటి వ్రాతను వ్రాసిపెట్టాడు. బ్రహ్మ దేవుడు వ్రాసిన నుదిటి వ్రాతను తిరిగి రాయగలిగే శక్తి ఎవరికి సాధ్యం కాదు. అయితే దోషములు ఉన్నవాటికి పరిహారములు జరిపించుకుంటే “పాము కాటువేయాల్సిన చోట, చీమ కాటు వేస్తుంది” అన్నట్టుగా పెను తుఫాను రావాల్సిన చోట, చినుకులు పడతాయి అన్నమాట.
ఉదాహరణకి మనకు ఏదైనా జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరకు వెళతాము. Operation చేయాలి అని వైద్యుడు చెబుతాడు. ఆపరేషన్ వలన కలిగే నొప్పిని భరించి, మందులు వాడితే జబ్బు నయం అవుతుంది. ఆపరేషన్ కొరకు భయపడి వెనుకడుగు వేస్తే మున్ముందు ఆ జబ్బు కలిగించే నొప్పిని నరకయాతనతో అనుభవించాల్సి ఉంటుంది. ధైర్యము చేసి ముందుకు వెళితే కేవలం ఆపరేషన్ వలన కలిగే నొప్పి మాత్రమే భరించాల్సి ఉంటుంది. తరువాత ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకవచ్చు.
ఇదే విధంగా మన జాతకములో ఉన్న దోషములకు పరిహారములు చేసుకుంటే సంపూర్ణంగా సమస్యలు పోవు. ఆ పెద్ద సమస్యలు దైవనుగ్రహం వలన చిన్న సమస్యగా మారతాయి. అర్థం చేసుకుంటారని మనవి.
||సర్వేజనా సుఖినోభవంతు||
ఇవి కూడా చదవండి:
- గురు చండాల యోగం ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలను జాతకుడు ఎదుర్కొంటాడు?
- కాలసర్ప దోషం ఉన్నవారు నివృత్తి హోమం ఎలా జరిపించుకోవాలి?
- దుష్ట శక్తుల నుండి కాపాడుకునేందుకు, శత్రు నాశనం జరిగేందుకు జాతకుడిని అనుగ్రహించే ప్రత్యాంగిరా హోమం యొక్క వివరాలు.
- జాతకంలో దోషాల వలన దంపతుల మధ్య విభేధాలు కలిగి విడాకుల వరకు తీసుకెల్లే గ్రహస్థితులు ఏవి?
- దంపతులలో ఒకరు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని, బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులకు జాతకంలో ఏ విధమైన గ్రహస్థితులు కారణం అవుతాయి?
- బంధన యోగం అంటే ఏమిటి? నాగ బంధన యోగం అంటే ఏమిటి?
- సర్పశాపం
- మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు
- విడాకులు-జ్యోతిష్య కారణాలు
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి.
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com