loading

ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?

  • Home
  • Blog
  • ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?

ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?

Astrology reasons for Suicide attempts

ఆత్మహత్యా ధోరణికి కారణములు ఏమిటి?

ఇప్పటి కలియుగములో గ్రహములు, వాటి స్థానములు పెరిగే కొలది మన జీవనవిధానాలు మారుతున్నాయి. జీవన విధానాలు మారటం వలన అందరి మనస్సులకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందువలననే చిన్నా,పెద్ద అన్న తేడా లేకుండా చిన్న చిన్న కారణాలకు,పిచ్చి పిచ్చి కారణాలకు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.                                                                                                                 

                   మన వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మన మనస్సుపై ఆధిపత్యం వహిస్తాడు. బుధుడు మన బుద్ధికి కారకుడు అవుతాడు. బుధుడు ఎప్పుడైతే ఇతర గ్రహాలతో పీడింపబడతాడో, అపుడు మన చేత తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు. కొన్ని సంధార్భాలలో ఆత్మహత్యలకి కూడా పాల్పడతారు. జాతకుడి యొక్క ఆయుర్దాయము శని ఆధీనములో ఉంటుంది. శని 8వ స్థానములో ఉంటే, ఆ జాతకుడికి దీర్ఘాయుర్దాయము ఉంటుంది. ఎవరి జాతకములో అయితే శని బలహీనంగా ఉంటాడో, ఆ జాతకులు చిన్న వయస్సులోనే గతించడం లేదా నిరంతర అనారోగ్యములు కలుగటం జరుగుతుంది.

  • నవగ్రహములలో సూర్యుడు మాత్రమే ఆత్మహత్యకు ప్రేరేపణ ఇవ్వని గ్రహముగా చెప్పవచ్చు. రవి వలన ఆత్మగౌరవం, అహంకారం, నాయకత్వం జాతకుడికి కలుగుతాయి. చంద్ర స్థితి సరిగ్గా లేకపోయినా సరే, రవి ఎవరి జాతకములో అయితే శుభంగా ఉంటాడో ఆ జాతకుడు ఎప్పటికీ నిరాశ చెందడు, క్రుంగిపోడు.
  • రవి ఎవరి జాతకములో అయితే బలహీనంగా ఉంటాడో, ఆ జాతకులు తమకు ఎదురయ్యే పరిస్థితులతో ఎదురు తిరిగి పోరాడేశక్తి, ధైర్యం లేక, వారికి ఉన్నంత వాటితో తృప్తి చెందుటకు ప్రయత్నిస్తారు. ఈ సమయములో బుధుడు ఆధిపత్యం వహించి ఆ జాతకుడికి ఆత్మహత్య ధోరణి కలిగేలా చేస్తాడు. అతని జాతకములో గల శని యొక్క స్థానమును బట్టి ఆ వ్యక్తి ఆత్మహత్య వలన మరణం పొందుతాడో లేదా అనేది నిర్ణయించబడుతుంది.

astrology reasons for suicide attempts

ఆత్మహత్యా ధోరణి కలిగించే బుధుడు ఏ గ్రహాలతో కలిస్తే ఏ ప్రభావాలు వస్తాయో ఇక్కడ వివరిస్తున్నాను:

  • బుధుడు-రాహువు: ఎవరి జన్మకుండలిలో అయితే బుధ రాహువులు కలసి ఉంటే , ఆ జాతకుడు విషం త్రాగటం , పురుగుల మందు త్రాగటం, విషపూరిత రసాయనాలు శరీరములోకి బలవంతముగా పంపించుకోవటం, ఎత్తైన భావనముల మీద నుండి క్రిందకు దూకివేయటం, ఆత్మాహుతి దాడికి (Suicide Bombing) పాల్పడటం లాంటివి ప్రయత్నిస్తారు.
  • బుధుడు-చంద్రుడు: ఎవరి జన్మకుండలిలో అయితే బుధ చంద్రులు కలసి ఉంటారో, ఆ జాతకులు బావులలో దూకడం, నదులలో, సముద్రములలో మునిగి చనిపోవడానికి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారు.
  • బుధుడు-కేతువు: ఎవరి జన్మకుండలిలో అయితే బుధ కేతువులు కలసి ఉంటారో, ఆ జాతకులు పుణ్యక్షేత్రములలో ఆత్మహత్య చేసుకోవటం (పుణ్యక్షేతములో మరణిస్తే మోక్షం లభిస్తుందని వీరి కోరిక, ఆశ), సైనైడ్ లాంటి కెమికల్స్ మింగటం, ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగటం, పాదరసం త్రాగటం లాంటివి ఈ బుధ కేతువులు కలసి ఉన్న జాతకులు ప్రయత్నిస్తారు. ఈ కలయిక ఉన్న జాతకులు Schizophrenia అను మానసిక వ్యాధికి గురి అవుతారు.
  • బుధుడు-శని: ఎవరి జన్మకుండలిలో అయితే బుధ శని కలసి ఉంటారో, ఆ జాతకులు రైలు పట్టాలపై పడుకోవటం, అతివేగముగా వాహనాలను నడిపి ప్రమాదలను సృష్టించడం, రోడ్లపై ఆత్మహత్యకు పాల్పడటం, తనంతట తాను కత్తితో పొడుచుకోవటం, ఉరివేసుకోవటం లాంటివి చేసేందుకు ఈ జాతకులు ప్రయత్నిస్తారు.
  • బుధుడు-కుజుడు: ఎవరి జన్మకుండలిలో అయితే బుధుడు కుజుడు కలసి ఉంటారో, ఆ జాతకులు తమ మనికట్టును కోసుకోవటం, గొంతును కోసుకోవటం, శరీరముకు నిప్పు పెట్టుకోవటం, తుపాకితో కాల్చుకోవటం, కరెంటు షాకులు పెట్టుకోవటం లాంటివి ఈ జాతకులు ప్రయత్నిస్తారు.
  • బుధుడు-శుక్రుడు: ఎవరి జన్మకుండలిలో అయితే బుధ శుక్రులు కలసి ఉంటారో, ఆ జాతకులు నొప్పిలేకుండా ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. నిద్రపోయే ముందు డ్రగ్స్ లేదా విషం తీసుకోవటం, వాహన ప్రమాదం సృష్టించుకోవడం లాంటివి ఈ జాతకులు ప్రయత్నిస్తారు.
  • బుధుడు-గురువు: ఎవరి జన్మకుండలిలో అయితే బుధ, గురువులు కలసి ఉంటారో, ఆ జాతకులు యోగా పద్ధతులలో ఆత్మర్పణం చేసుకునే ప్రయత్నములు చేస్తారు. ప్రాణాయామం ద్వారా పూర్తిగా ఊపిరి ఆపివేయటం, జీవ సమాధిలోకి వెళ్ళటం లాంటివి ఈ జాతకులు ప్రయత్నిస్తారు.
  • బుధుడు ఏ గ్రహము వలన పీడింపకపోయినా, రవి చంద్రులు బలహీనంగా ఉంటే అపుడు బుధుడు ఆ జాతకుడిని క్రుంగదీసి, ఆత్మహత్య ధోరణి ఏర్పడేలా బుధుడు కారకుడు అవుతాడు. కానీ ఆత్మహత్య ప్రయత్నముకు మాత్రము ఆ జాతకుడికి ధైర్యం ఉండదు.
  • శని నీచంలో ఉండి, మరియు 2, 7, 8, 12 భావ గ్రహాల చెడు దశలలో జాతకుడు ఆత్మహత్యా ప్రయత్నము చేస్తాడు.
  • జన్మకుండలిలో రాహువు శక్తివంతముగా, యోగకారకుడిగా ఉంటే, అతని ఆత్మహత్యా ప్రయత్నం విఫలం అవుతుంది.
  • ఎవరైతే ఇలాంటి గ్రహస్థితులతో జన్మకుండలి ఉన్నదో, వారికి సరైన Counseling ఇస్తూ, మృత్యుంజయ హోమం, రుద్ర హోమము జరిపించాలి. విష్ణుసహస్ర నామ స్తోత్రం పఠించడం లేదా శ్రవణం చేయటం వలన శని మరియు బుధుడు వలన కలిగే పైశాచిక ప్రభావాలు పటాపంచలు అవుతాయి.

పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. కానీ దారుణమైన చావులుగా చెప్పబడే వాహన ప్రమాదాలు, ఆత్మహత్యలు సర్పగ్రహ పూరితమైన రాహు, కేతు, శని గ్రహాల వలన జరుగుతాయి. మానసికంగా శక్తిని కోల్పోయిన వారు మాత్రమే ఆత్మహత్య ప్రయత్నానికి పూనుకుంటారు. దీనికి వయసుతో ప్రమాణం లేదు. వారి వారి గ్రహ స్థితుల అవయోగాల వలన జరుగుతాయి. జాతకచక్రములో ఇలాంటి గ్రహస్థితులను ముందుగా తెలుసుకోవడం చాలా మంచిది. సమస్య ఏదైనా గాని పరిష్కారం ప్రధానం. కారణాలు ఏవైనా గాని పరిహారం ఒక్కటే, అదే తంత్ర కర్మ విచ్చేధ. పూర్వజన్మ పాప ఫలం కారణంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను కల్పిస్తాయి పైశాచిక గ్రహాలు. ఈ గ్రహాల పైశాచికతను జన్మకుండలి ద్వారా తెలుసుకుని జాగ్రత్తపడటం మంచిది. ఈ ఆత్మహత్య బలవన్మరణాలు ఎవరి జీవితములో ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఒకవేళ జాతక పరిశీలనలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నపుడు జాగ్రత్తపడగలరని, వాటికి సంబంధించి గ్రహ సంబంధులు యోగాలు, అవయోగాలు ఆత్మహత్యలకు బలవన్మరణాలకు కారక గ్రహ సంబంధాలను వివరించడం జరిగింది.

సూచన : మానవులు గ్రహస్థితుల వలన గాని, పూర్వజన్మలో చేసిన పాపఫలమ్ వలన గాని, స్వయంకృత అపరాధాల వలన గాని, తట్టుకోలేని అనేక సమస్యల వలన గాని ఆత్మహత్యలకు పూనుకుంటారు లేదా బలవన్మరణం చెందడం, వాహన ప్రమాదములో మరణించటం వంటి దుర్ఘటనలు జరుగుతాయి. ఈ ఘట్టాల నుండి  బయట పడగలిగితే జీవితములో ఊహించలేనంత అభివృద్ధిలోకి వస్తారు. ఐశ్వర్యవంతులు కావటం ఖాయం. ఇలాంటి గ్రహస్థితులను ముందుగా తెలుసుకొని నివారణ తెలుసుకొని ఈ సంఘటనల నుండి బయటపడి జీవితములో అన్నీ విధాలుగా ఆనందమయం కాగలరు. ఈ పైశాచిక గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలను తంత్ర మార్గంలోని హోమాల ద్వారా తాంత్రిక గ్రహదోష విచ్ఛేదనల ద్వారా పరిహారములు జరిపించవలెను. ఈ పరిహారాలు కేరళలో మాత్రమే జరుగుతాయి.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి

 Ph: 9846466430

చేతబడి, బాణామతి, చిల్లంగి లాంటి అభిచార కర్మలకు, శత్రువుల చెడు ప్రయోగాల నిర్మూలనకు తాంత్రిక హోమములు కేరళలోని మా బ్రహ్మ తంత్ర పీఠము నందు జరిపించుకోవచ్చు.

వివరాలకు సంప్రదించండి. Ph 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

జన్మకుండలి పరిశీలన-Horoscope Reading

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

 

 

 

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X