Bagalamukhi Yantra sadhana
బగలాముఖి యంత్ర సాధన- ఫలితములు:
బగలాముఖి అమ్మవారు ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన దేవత. ఈ బగలాముఖి మాత అన్నీ రకముల చెడు దుష్ట శక్తులు, భయములు అన్నింటి నుండి దూరం చేస్తుంది. బగలాముఖి మాత యంత్రము ఎంతో శక్తివంతమైనది, శుభకరమైనది. పురాణాల ప్రకారం తక్షణ ఫలితములు ఇచ్చే సాధనలలో ఈ బగలాముఖి యంత్ర సాధన ఎంతో శుభకరమైనది. దుష్ట శక్తులు, వాటి ప్రభావాల వలన కలిగే అడ్డంకులు, చేతబడి క్రియలు నుండి ఎంతో తొందరగా ఈ బగలాముఖి యంత్ర సాధన వలన బయట పడతారు.
ఈ యంత్ర సాధన వలన సాధకుడు కోరికలు అన్నీ కూడా నెరవేరేందుకు, దుష్ట శక్తుల నుండి రక్షణ పొందేందుకు తోడ్పడుతుంది. జీవితములో ఎదుర్కొనే అన్నీ రకముల సమస్యలకు ఈ యంత్ర సాధన సాధకుడికి ఎంతో శుభ ఉపయోగమును ఇస్తుంది అని చెప్పవచ్చు.
బగలాముఖి యంత్ర పూజా విధానం :
ఈ యంత్రమును ప్రతిష్టించే ముందు సాధకుడు బగలాముఖి మహా యంత్రమును పంచామృతములతో అభిషేఖము చేయాలి. ఆ తరువాత గురువు గారు ఇచ్చిన పూజా విధానమును అనుసరించి ఈ యంత్రమును పూజా మందిరములో ప్రతిష్టించాలి. యంత్రమును ప్రతిష్టించిన తరువాత మంచి శీఘ్ర ఫలితముల కోసం పూలు, కొబ్బరికాయ,పసుపు కుంకుమలతో పూజించాలి. ఈ యంత్ర ప్రత్యేక బగలాముఖి బీజ మంత్రములతో పూజించాలి. బీజ మంత్రమును ఉచ్చరించడం వలన ఆ మంత్రము నుండి యంత్రముకు శక్తి చేకూరుతుంది. ఆ తరువాత ఆ యంత్రము నుండి ఆ యంత్రము ఉండే చుట్టుప్రక్కల వాతావరణముకు ఆ పాజిటివ్ ఎనర్జీ తరలించబడుతుంది. ఈ బగలాముఖి యంత్రమును రాత్రి సమయములో ప్రతిష్ట చేస్తే ఆ యంత్రము ఎంతో శక్తివంతముగా, శీఘ్ర ఫలితములు ఇచ్చేదిగా మారుతుంది. మహా శివరాత్రి, హోలీ, దీపావళి, దసరా వంటి పర్వదినములలో కూడా ఈ యంత్ర ప్రతిష్ట గావించవచ్చు. ఈ విశ్వములో ఏ ప్రాణి కూడా బగలాముఖి మాతను ఓడించలేదు. జీవితములో జరిగే ప్రతి సంఘటనకు తన భక్తులకు బగలాముఖి అమ్మవారు విజయమును చేకూరుస్తుంది.
యంత్ర ప్రతిష్ట చేసే విధానము:
యంత్రమును ప్రతిష్ట చేసే ముందు యంత్రమును గంగాజలముతో శుభ్రము చేసి, పంచామృతాలతో అభిషేకము చేయాలి. యంత్ర సాధన చేసే సాధకుడు స్వచ్చమైన మనస్సుతో, పూర్తి భక్తి శర్ద్ధ, నమ్మకముతో శ్రీ భగలాముఖి మాతను ప్రార్థించాలి. భగలాముఖి మాత యొక్క రక్షాకవచము బంగారు లేదా వెండిలో చేయించుకొని ధరించవచ్చు. యంత్ర సాధన చేసే సమయములో సాధకులు పసుపు పచ్చటి వస్త్రాలు ధరించాలి.
భగలాముఖి మహా యంత్రమును ప్రతి రోజు ధూపము, దీపముతో ప్రార్థించాలి. పసుపు పచ్చ వస్త్రములు ధరించి, సాధకులు కూర్చున్న పీటము పై కూడా పసుపు రంగు వస్త్రము ఉంచి కూర్చోవాలి. సాధకులు భగలాముఖి మాత యొక్క మంత్ర జపము చేయాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. పసుపు రంగు చీర, వస్త్రము ఏదైనా శక్తి ఆలయములో భగలాముఖి దేవికి సమర్పిస్తున్నట్టు సంకల్పించి దానము చేయాలి. ఇలా చేయటం వలన జీవితములో అనుభవిస్తున్న కష్టాలకు, ఒడిదుడుకుల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈ యంత్ర సాధన చేయటం వలన శత్రువులపై విజయము సాధించవచ్చు, శతృనాశనం చేయవచ్చు, దుష్ట శక్తులు, చేతబడిలాంటి ప్రయోగముల నుండి రక్షణ పొందవచ్చు. ఈ భగలాముఖి యంత్ర సాధన చేసే వారికి కోర్టు వ్యవహారములలో కూడా విజయము లభిస్తుంది. కానీ ఈ యంత్ర సాధన చేసేటపుడు చేయాల్సిన నియమములు ఖచ్చితంగా పాటించి భక్తి శ్రద్దతో పూజిస్తే ఆ భగలాముఖి మాత సాధకుని కోరికను కచ్చితంగా తీరుస్తుంది. ఈ యంత్రమును పూజా మందిరములో ప్రతిష్టించి మన కళ్ళకు ఎదురుగా యంత్రము ఉండేతట్టు చూసుకోవాలి. మంత్ర జపము ఆరంభించే ముందు చుట్టూ ప్రక్కల ఎలాంటి శబ్దములు లేకుండా చూసుకొని, శ్రద్ధతో ఆ యంత్రము యొక్క మధ్య భాగము పై దృష్టి కేంద్రీకరించి ఓంకారము జపించాలి. మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ధ్యానించాలి. ఆ తరువాత భగలాముఖి మంత్ర జపము చేయాలి. ఇలా చేయటం వలన మొదటి రోజు నుండే సాధకునిలో, సాధకుని జీవితములో మార్పు కనిపిస్తుంది. ఈ యంత్ర పూజను మంగళవారము రోజున మొదలు పెట్టాలి. చతుర్దశినాడు వచ్చే మంగళవారము నాడు, సూర్యుడు మకర రాశిలో ఉన్న ముహూర్తము ఎంతో గొప్ప ఫలితములు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ పురాణాల ప్రకారం సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చే మంగళవారం చతుర్దశి నాడు శ్రీ భగలాముఖి మాత ముల్లోకాలలో ఉన్న రాక్షసులను సంహరిస్తుంది అని చెప్పబడింది.
మంత్రము:
“ఓం హ్లీం భగలాముఖి సర్వదుష్టానం వచం ముఖాన్ పాదం స్తంభయ ఝివ్యం కిలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా||”
శాస్త్రాల ప్రకారం భగలాముఖి దేవత దశమహావిద్యలలో ఎనిమిదవది. అపూర్వమైన శక్తి గల ఈ భగలాముఖి మాతను పూజించిన వారికి, యంత్ర సాధన చేసిన వారికి వివాదాలలో, శత్రువులపై విజయం సాధిస్తారు. అన్నీ రకముల సమస్యలను తీర్చగల దయా మూర్తి. అంతేకాకుండా శాస్త్రాల ప్రకారం ఈ భగలాముఖి మాత తన యంత్రములో ఆధీష్టించి భక్తుల కోరికలు తీర్చటానికి మక్కువ చూపుతుందని చెప్పబడింది.
||మంగళంమహత్||
||ఇష్ట కార్య ఫలసిద్ధిరస్తు||
బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు ఆచరిస్తున్నారు. జన్మకుండలి ద్వారా గతజన్మ పాప కర్మలు తెలిస్తే ఈ జన్మలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిహారాలు చేసుకోవచ్చు. అలా తెలుసుకోకుండా సంబంధం లేని పూజలు జపములు, దానములు చేస్తే ప్రయోజనం ఉండదు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, స్త్రీల వలన ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles:
- ఆయుష్ హోమం-Ayush Homam
- Astrology in Srimath Ramayana-శ్రీమత్ రామాయణములో జ్యోతిష్య శాస్త్ర ఆచరణ
- ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు Astrology reasons for Second marriage
- కాన్సర్ వ్యాధికి గల జ్యోతిష్య కారణాలు Astrology reasons for Cancer disease
- విడాకులు-జ్యోతిష్య కారణాలు Astrology reasons for Divorce
- పితృదోషం- ప్రభావములు Pitru dosham
- మాంగల్య దోషం వివరములు- వాటి నివారణా మార్గములు Mangalya Dosham
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu