loading

కుజ దోషం-Kuja Dosham

  • Home
  • Blog
  • కుజ దోషం-Kuja Dosham

కుజ దోషం-Kuja Dosham

కుజ దోషం

జన్మకుండలిలోని గ్రహాల స్థితులను బట్టి ఎన్నో దోషాలను గుర్తించే పద్ధతి జ్యోతిష్య శాస్త్రంలో తెలియజేయబడింది. ఈ దోషాల వలన జాతకుని జీవితంలో ఎన్నో సవాళ్లు, అడ్డంకులు, కష్టాలు, బాధలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి దోషాల్లో ఒకటైన కుజ దోషము గురించి ఇక్కడ తెలియజేయబోతున్నాను. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలో లగ్నం నుండి 1,2,4,7,8 లేదా 12 వ స్థానంలో కుజుడు ఉన్నట్లైతే, ఆ జాతకులకు కుజ దోషం ఉంటుంది అని చెప్పవచ్చు. కుజ దోషం అనేది జాతకుల యొక్క వైవాహిక జీవితం పై అధిక ప్రభావం చూపుతుంది. కుజ దోషం ఉన్న జాతకులకు కొందరికి వివాహం ఆలస్యం అవ్వడం, వివాహం అయిన వారి వైవాహిక జీవితంలో తీవ్ర అసంతృప్తి, ఇబ్బందులు, గొడవలు, చికాకులు కలుగుతూ జీవితం ఒక సవాలుగా మారుతుంది. కుజ దోషం ఉన్న వారు, తమ జీవిత భాగస్వామి యొక్క తీవ్ర ప్రవర్తనను తట్టుకోలేక విడిపోవడం కొందరికి కూడా జరుగుతుంది.

Kuja dosham
Kuja dosham

కుజ దోషం ఉన్నవారి లక్షణాలు:

  • కుజుడు అగ్ని తత్వం గల రాశి. కుజ దోషం ఉన్న జాతకులు కూడా ఆవేశపూరితంగా ఉంటారు. ఇది వీరికి ఎంతో ప్రతికూలతను తెచ్చిపెడుతుంది.
  • కుజదోషం ఉన్న వ్యక్తులకు తొందరపాటు తనం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వలన స్వల్ప కారణాలకు కూడా కోపం తెచ్చుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇందు కరణంగానే వైవాహిక జీవితంలో కూడా సర్దుబాటు ధోరణిని కలిగి ఉండరు. ఫలితంగా, జీవిత భాగస్వామితో విభేధాలు ఎదురవుతాయి.
  • కుజ దోషం ఉన్న వారి ఆవేశాన్ని, కోపాన్ని, తొందర పాటుని తట్టుకోలేని జీవిత భాగస్వామి, జాతకులతో విదాకౌల వరకు వెళ్ళే అవకాశాలు కలుగుతాయి.
  • పోటీ తత్వము వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పోటీ తత్వమి అయినంత వరకు సజావుగానే సాగుతుంది. కానీ కుజుని యొక్క ప్రతికూల శక్తి వలన కుజ దోషం ఉన్న జాతకులకు పోటీ తత్వం అనేది తీవ్రంగా మారి, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలు అనేవి ప్రతికూలంగా మారతాయి.
  • కుజ దోషం ఉన్న జాతకులకు అసహనం, శీఘ్ర కోపం ఎక్కువగా ఉంటాయి. కుజ దోష ప్రభావం ఉన్న జాతకులు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది ఎంతో కష్టం అవుతుంది. ముఖ్యంగా ఒత్తిడిని కలిగించే సంధర్భాలలో వీరి కోపాన్ని వీరు అదుపు చేసుకోలేరు.

జన్మకుండలిలో కుజుడు ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని, ఒక్కో విధమైన దోషాన్ని కలుగజేస్తాడు. అవి ఏ విధంగా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను.

లగ్నం: 

కుజుడు లగ్నంలో ఉన్న జాతకులకు కుజ దోషం ఉంటుంది. వీరికి తమ జీవిత భాగస్వామితో తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. కుజుడు లగ్నంలో ఉన్నవారు, తమ జీవిత భాగస్వామిని హింసించడం, శారీరకంగా బాధించడం జరుగుతుంది.

రెండవ స్థానం:

కుజుడు రెండవ స్థానంలో ఉన్న జాతకులకు కుజ దోషం ఉంటుంది. ఈ జాతకులకు కుజ దోషం వలన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం పై ప్రభావం చూపుతుంది. కుటుంబంలో వీరు ప్రదర్శించే మాట తీరు వలన తీవ్రమైన గొడవలు జరుగు అవకాశములు ఉంటాయి.

నాలుగవ స్థానం:

జన్మకుండలిలో 4వ స్థానంలో కుజుడు ఉన్న జాతకులకు కుజ దోషం ఏర్పడుతుంది. 4వ స్థానంలో ఉన్న కుజ స్థితి వలన, జాతకులు తాము చేసే వృత్తి లేదా ఉద్యోగం తరచూ మారుతూ ఉంటారు. వృత్తిపరమైన స్థిరత్వం ఉండదు. కుటుంబంతో వీరికి ఉన్న  మానసిక బాంధవ్యంలో అస్థిరత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రగానే ఉంటుంది.

సప్తమ స్థానం:

సప్తమ స్థానం వివాహాన్ని సూచిస్తుంది. వైవాహిక స్థానంలో కుజుడు ఉన్న జాతకులకు సంపూర్ణ కుజ దోషం ఉంటుంది. వైవాహిక జీవితంలో తగాదాలు, చికాకులు నిరంతరంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో శృంగార జీవితం వీరికి సంతృప్తి కలిగించక, వివాహేతర సంబంధాలు ఏర్పరచుకుంటారు. వీరికి ఉన్న తీవ్రమైన ఆవేశం, తొందర పాటు నిర్ణయాల వలన వీరి జీవిత భాగస్వామితో తీవ్రమైన విభేధాలు ఏర్పరచుకుంటారు.

అష్టమ స్థానం:

జన్మకుండలిలో కుజుడు అష్టమ స్థానంలో ఉన్న జాతకులకు కుజ దోషం ఏర్పడుతుంది. అష్టమంలో కుజుడు ఉన్న జాతకులు సోమరితనం, లెక్కలేని తనం, దురుసు స్వభావం కలిగి ఉంటారు. వీరికి వీరి కుటుంబంతో సత్సంబంధాలు ఉండవు. ఈ అష్టమ కుజ స్థితి వలన జాతకుల యొక్క వైవాహిక జీవితంలో తరచూ పెను మార్పులు సంభవిస్తూ ఉంటాయి.

ద్వాదశ స్థానం:

జన్మకుండలిలో కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్న జాతకులకు కుజ దోషం ఉంటుంది. ద్వాదశ స్థానం అనగా వ్యయ స్థానం. ఈ కుజ స్థితి వలన అనేకమైన నష్టాలు, అనవసర ఖర్చులు అనుకోకుండా ఏర్పడతాయి. వీరిని ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. వీరికి ఆర్థిక పరమైన కష్టాలు, ఒంటరితనాన్ని పోరాడే సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి. మానసికమైన సమస్యలు, ఆందోళనలు అధికంగా ఉంటాయి. వీరి చుట్టూ శత్రువులు పొంచి ఉంటారు.

ముఖ్య గమనిక: కుజుడు 1,2,7,8, లేదా 12 స్థానాల్లో ఉన్నపుడు మాత్రమే కుజ దోషం ఏర్పడదు. కుజుడు కొన్ని గ్రహాలతో, కొన్ని రాశులలో, కొన్ని గ్రహ దృష్టులతో కలసినపుడు కూడా కుజ దోషం ఏర్పడుతుంది. మరి మీకు అసలైన కుజ దోష నిర్ధారణ జరిగింది అనుకుంటున్నారా?

వైవాహిక జీవితం పై కుజ దోష ప్రభావం ఏ విధంగా ఉంటుంది?

  • జన్మకుండలిలో కుజుడు సప్తమ స్థానం పై ప్రతికూల ప్రభావం చూపినపుడు, దంపతుల మధ్య తీవ్రమైన గొడవలు, వివాదాలు, వాదనలు చోటుచేసుకుంటాయి. కుజుడికి దూకుడు స్వభావం ఉంటుంది, ఆ లక్షనాలే జాతకుడికి ఆవహించి దాంపత్య జీవితాన్ని భారంగా చేసుకుంటాడు. దీని వలన దంపతులు కలసి ఉండటం అనేది అసాధ్యం అవుతుంది.
  • జన్మకుండలిలో కుజుడి యొక్క ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉన్నపుడు, వైవాహిక జీవితంలో కేవలం మాట భేదాలు మాత్రమే కాకుండా శరీరకంగా, మానసికంగా, మాటల ద్వారా ఇలా ఎన్నో రకాలుగా ఘర్షణలకు దారి తీస్తుంది. ఆవేశం, దురుసు స్వభావం వంటి తీవ్ర స్వభావాల వలన దాంపత్య జీవితంలో ప్రేమ మరియు ప్రశాంతత అనేది లోపిస్తుంది. దంపతులు కలసి ఉండటం కష్టతరం అవుతుంది.
  • జన్మకుండలిలో కుజుని ప్రతికూల శక్తి జాతకుల పై ఉన్నపుడు, జాతకుడు గాని లేదా జాతకుని జీవిత భాగస్వామి గాని లేదా దంపతులు ఇద్దరి వల్ల కూడా దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. తొందర పాటు నిర్ణయాలు, దురుసు ప్రవర్తన, ఆలోచనలేని తక్షణ చర్యల వలన దాంపత్య జీవితం అల్లకల్లోలం అవుతుంది. వీటి వలన దాంపత్య జీవితంలో సామరస్యత లోపించి, దాంపత్య బంధంలో స్థిరత్వాన్ని భంగం చేస్తుంది.
  • కుజుని తీవ్ర ప్రభావం వలన దంపతుల మధ్య పరిష్కరించలేని విభేధాలు, సమస్యలు తలెత్తి, వారు విడిపోయెందుకు దారి తీస్తుంది. ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడక, కలసి ఉండలేక, విడిపోయి తీరాలి అనే భావనా దంపతులలో కలుగుతుంది.
  • కుజుని తీవ్ర ప్రభావం ఉన్నపుడు, కేవలం వైవాహిక జీవితంలో సమస్యలు రావడమే కాదు, వివాహం జరిగేందుకు కూడా సమస్యలు తలెత్తుతాయి. కుదిరిన సంబంధాలు పదే పదే చివరి నిమిషంలో భగ్నం కావడం జరుగుతుంది. కొన్ని దారుణమైన సంధర్భాలలో, తాళి కట్టే సమయంలో కూడా ఏదో ఒక అవాంతరం ఏర్పడి పెళ్ళి ఆగిపోవడం కూడా జరుగుతుంది.

జన్మకుండలిలో కుజ దోషమును ఏ విధంగా గుర్తించాలి?

వ్యక్తుల జన్మకుండలిలో కుజుడు 1,4,7,8,12 స్థానాలలో ఉన్నట్లైతే, కుజ దోషంగా చెప్పబడుతుంది. కానీ, ఇది కొందరి వ్యక్తుల (పూర్వపు జ్యోతిష్య సిద్ధాంతులు, ఉదా: కళ్యాణ వర్మ, పాణి) అభిప్రాయము మాత్రమే. అయితే, ఈ స్థానాలలో కుజుడు ఉన్నపుడు మాత్రమే కుజ దోషం ఏర్పడుతుంది అని ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రములో ఏ విభాగములో చెప్పబడలేదు. ఎందుకనగా గ్రహాలు కొన్ని విషమ స్థానాలైన 6, 8, 12 స్థానాలలో సాధరణంగా అశుభ ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటారు. అయితే, స్థానాన్ని మాత్రమే నిర్ణయించి అశుభ ఫలితాలను ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే గ్రహాలు నైసర్గిక పాపులుగానూ, తాత్కాలిక మిత్రులు, శత్రువులుగా, ఇతర గ్రహ సంగమం వలన వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తారు. కనుక జన్మకుండలి పరిశీలనలో కుజుని యొక్క ఇతర గ్రహాల సంగమ స్థితిని పరిశీలించి మాత్రమే కుజ దోషమును నిర్ణయించవలెను. కుజ దోషము వైవాహిక జీవితము మీద చూపెడి దుష్ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రంలో 9 రకాలుగా వర్గీకరించడం జరిగింది.  అయితే, ఇక్కడ ప్రస్తావన అంశము, వైవాహిక జీవితానికి సంబంధించినది కాబట్టి, వైవాహిక జీవితం వల్ల ఏర్పడే సుఖ దుఃఖాలు, శృంగార జీవితము (దాంపత్య జీవితము), దాంపత్య జీవనము వలన ఏర్పడే సంతానాంశములు మొదలగు ఈ అంశాలు ప్రాప్తించడానికి, వాటికి అవయోగాలు కలుగడానికి, అనుకూల, ప్రతికూల ఫలితాలు, సంఘటనలు ఏర్పడటానికి వివిధ స్థానాలలో గల కుజ గ్రహంతో ఇతర గ్రహాల సంగమం వలన జరుగును. ఈ అంశాలలో ప్రతికూలమైన ఫలితాలు ప్రాప్తించడానికి గల కారణభూతమైన కుజ గ్రహంతో ఇతర గ్రహముల సంగమ వివరణలు:

సప్తమ స్థానము (వైవాహిక స్థానము) – అష్టమ స్థానము (మాంగల్య స్థానము, ఆయుః స్థానము)

కుజ+శని:

కుజ శనులు కలసి ఏ రాశిలో ఉన్ననూ, దాంపత్య ఘర్షణ యోగం కలుగుతుంది. ఈ యోగం ఉన్నవారికి దాంపత్య జీవితంలో నిరంతరం ఘర్షణలు ఉండును. దీనిని శని కుజ సాంగత్య దాంపత్య పీడా దోషం అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగింది.

కుజ+ శుక్రుడు:

7వ స్థానంలో కుజుడు శుక్రుడితో కలసి ఉంటే, వీరికి వివాహానంతరం అక్రమ సంబంధాలు ఏర్పడతాయి.

కుజ+రాహువు:

సప్తమ స్థానంలో కుజుడు, రాహువు కలసి ఉంటే, జాతకులకు సత్కళత్రము లభించదు. వివాహము భగ్నము అవుతుంది. వివాహ సమయంలో వారి యొక్క పూర్వపు స్నేహితుల ప్రణయ వ్యవహారములు బయటకు పొక్కి వివాహము ఆగిపోవును. ఈ విధంగా అనేక పర్యాయాలు జరిగి, ఆలస్య వివాహానికి దారి తీయును. జరిగిన ఆలస్య వివాహము కుజ రాహు సంగమ శీల దోషమును కలిగించి, నీచ స్థాయి వివాహమునకు కారణమగును. ధనస్సులో కుజ రాహువుల సంగమం కుజ దోషమును కలిగిస్తుంది. కుంభమునందు కుజ రాహువులు, కుజ శుక్రులు వైవాహిక కుజ దోషాన్ని కలుగజేస్తుంది.

 

ముఖ్య గమనిక: వ్యక్తిగత జన్మకుండలి పరిశీలనలో కుజుడు ఇతర గ్రహముల సంగమ స్థితిని పరిశీలించి కుజ దోషమును నిర్ధారణ చేసుకొనవలెను.

Related Articles: 

Ph: 9846466430

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu

Leave a Reply

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X