భగవత్ బంధువులు అందరికీ నమస్కారము, బ్రహ్మ తంత్ర పీఠం యొక్క 25వ వార్షిక మహోత్సవముల సంధర్భముగా యావత్ భక్తులకు ఉచిత కాలసర్పదోష నివారణ హోమమును అక్టోబర్ 4, 2024 నుండి అక్టోబర్ 12, 2024 వరకు దిగ్విజయంగా జరిపించబడింది. యావత్ భక్తులకు ఆ నాగరాజు అనుగ్రహం కలగాలని, ప్రతీ భక్తుని గృహములో నాగరాజా యంత్ర రూపములో సాక్షాత్ నాగరాజా స్వామి కొలువై ఉండాలని, 9 రోజుల పాటు, శ్రీ C.V.S. చక్రపాణి గారితో సహా 21 మంది యాజ్ఞీకులు కలసి చేసిన మహాయజ్ఞం ఇది. ఈ యజ్ఞములో ఉంచిన నాగరాజా స్వామి యంత్రమును, ఆశీర్వాద అక్షితలను, నాగాయక్షి అమ్మన్ అర్చన కుంకుమను, గంధమును, యజ్ఞ భస్మమును, నాగరాజ స్వామి చిత్ర పఠమును భక్తులకు పంపడం జరిగింది.
పార్సిల్ ట్రాకింగ్ వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రసాద వినియోగ విధానము:
- యజ్ఞ భస్మములో కొబ్బరి నూనెను కలిపి తిలకధారణ చేయాలి.
- కుంకుమను, గంధమును తిలకధారణ చేయాలి.
- ఇంట్లో ఉన్న పెద్దవారితో ఆశీర్వాద అక్షితలను శిరస్సుపై వేయించుకొని, ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవారు ఎవరూ ఇంట్లో లేని యెడల స్వయంగా శిరస్సు పై అక్షితలను వేసుకోవాలి.
యంత్ర ప్రతిష్టా విధానము:
మంగళవారము నాడు లేదా శుక్రవారము నాడు గాని ఉదయం మీరు పూజ చేసుకునే సమయంలో ఈ యంత్రమును ప్రతిష్టించవచ్చు. తూర్పుకు అభిముఖంగా ఆసనం పై కూర్చుని, మీ ముందు గంధం పూసిన పళ్ళెంలో యంత్రాన్ని ఉంచాలి.మొదట గణపతి పూజ చేయాలి. తదుపరి తమలపాకుతో నీళ్ళు తీసుకొని శిరస్సు పై చల్లుకొని క్రింది మంత్రాన్ని మూడు సార్లు జపించాలి.
‘అపవిత్రః పవిత్రో వ సర్వ వస్తాంగతోపివ: య స్మరేత్ పుండరీ కాక్ష సబాహ్య సంతరః శుచిః’
తరువాత క్రింద ఇవ్వబడిన మంత్రాలు పఠించాలి.
- ఓం శ్రీ గురుభ్యో నమః|
- ఓం శ్రీ గణేశాయ నమః|
- ఓం శ్రీ కుల దేవతభ్యో నమః|
- ఓం శ్రీ ఇష్ట దేవతభ్యో నమః|
- ( ఆచమనం)
- ఓం శ్రీ కేశవాయ నమః|
- ఓం శ్రీ నారాయణాయ నమః |
- ఓం శ్రీ మాధవాయ నమః|
నీరు చేతిలోకి తీసుకొని క్రింద వదిలేయండి.
- ఓం గోవిందాయ నమః|
- ఓం ఆపో జ్యోతి (కుడి కన్నుని చేతితో తాకండి)
- రసో అంత్రీతాం (ఎడమ కన్నుని చేతితో తాకండి)
- బ్రహ్మ భూ భువః స్వరోం (నుదుటిని చేతితో తాకండి)
- దేవయే నమః ఆవాహనం సమర్పయామి(యంత్రము పై పూలు వేయండి)
- దేవయే నమః ఆసనం సమర్పయామి (యంత్రము పై పూలు వేయండి )
- దేవయే పంచామృత స్నానం సమర్పయామి (యంత్రము పై తమిలపాకులతో నీరు జల్లాలి )
- దేవయే వస్త్రం సమర్పయామి (ఒక ఎర్రటి బ్లౌసు పీసు పెట్టండి)
- దేవయే యజ్ఞోపవీతం సమర్పయామి (యంత్రము పై పూలు వేయండి)
- దేవయే గంధం సమర్పయామి (గంధపు బొట్టు యంత్రానికి పెట్టండి)
- దేవయే అక్షతాన్ సమర్పయామి (యంత్రము పై అక్షితలు వేయండి)
- దేవయే పుష్యం సమర్పయామి (యంత్రము పై పూలు వేయండి)
- దేవయే ధూపం సమర్పయామి (బత్తీలు వెలిగించండి)
- దేవయే నైవేద్యం సమర్పయామి (పళ్ళు లేక కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టండి)
- దేవయే తాంబూలం సమర్పయామి (తమలపాకు,వక్కలు,దక్షిణ తాంబూలం పెట్టండి)
- దేవయే కర్పూర నీరాజనం సమర్పయామి (హారతి ఇవ్వాలి)
- దేవయే ప్రదక్షిణం సమర్పయామి
- (కింద మంత్రాన్ని మూడు సార్లు చదివి ప్రదక్షిణ చేయండి.)
- “యాని కానీచ పాపాని జన్మాంతర కృతానిచ తాని సర్వాణి నశ్యన్తు ప్రదక్షిణం పదే పదే”
- పూలు సమర్పించి చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. యంత్రాన్ని ఒక పసుపు వస్త్రముపై ఉత్తర దిశకు అభిముఖంగా యంత్రాన్ని పెట్టండి. ప్రతి రోజు కింద ఇవ్వబడిన మంత్రాన్ని 9 లేదా 54 లేదా 108 సార్లు (లేదా శక్తానుసారం) జపించి అక్షితలు వేయాలి.
- మంత్రం : “ఓం హ్రీం సర్ప సర్ప సర్ప దివ్యసర్ప గగనసర్ప గంధర్వసర్ప కనకసర్ప కారుణ్యసర్ప మంత్రసర్ప మహాసర్ప దోష నివారణం కురు, వేధ నివారణం కురు, క్షేమం శీఘ్రం కురుకురు ఓం నవనాగ దేవతేభ్యో నమః”
- కాలసర్పదోషము, సర్పశాపానికి మధ్య గల తేడా తెలుసుకునే జ్యోతిష్య పరిశీలనా విధానము?
- ఏ గ్రహాల కలయిక వలన కుజ దోషము ప్రాప్తిస్తుంది?
- పునర్వివాహాలు జరుగుటకు, ఆలస్య వివాహం జరుగుటకు, సంతానం ఆలస్యంగా కలుగటానికి కారణమయ్యే గ్రహ స్థితుల పరిశీలనలు? లభించే మలయాళ జ్యోతిష్య పరిశీలనలు.
మున్నగు ప్రధాన అంశాలు, జ్యోతిష్య సంబంధిత విశేషాలు, దోషాలు, యోగాలు, అవయోగాలు, శాపాలు, గ్రహ స్థితుల ఆధారంగా కలిగే ఫలితాలు, జన్మ కుండలి విశేషాలు, హోమాలు, తాంత్రిక పరిహారములు, ప్రాయశ్చిత్తములు వివరాలు, జాతక రీత్యా మీకున్న సందేహాలు, తాంత్రిక పరిహారాలు, అసలైన కుజ దోష నిర్ధారణ, కాలసర్ప దోషములు, పైశాచిక పీడలు వంటి ఎన్నో అంశాలకు సమాధానం మా ఈ www.brahmatantra.com వెబ్ సైట్లో మీకు దొరుకుతుంది.
NAGASHAKTHI Telugu Book
సంపూర్ణ జాతక పరిశీలన- Complete Personal Horoscope Reading
ద్వికళత్ర యోగం/పునర్వివాహం
చట్ట సంబంధ వివాదాలు-కోర్టుకేసులు-జన్మకుండలి
పూర్వ జన్మ కర్మ ఫలితాలు-వాటి అవయోగాల ఫలితాలు