గృహ నాశ యోగం అంటే ఏమిటి? కారణాలు మరియు పరిహారాలు
మానవ జీవితంలో జరిగే ప్రతీ ఘట్టం కూడా మన తలవ్రాత ప్రకారమే జరుగుతుంది. ఈ ఘట్టాలనే, మన జన్మకుండలి ద్వారా నిష్ణాతులైన జ్యోతిష్యులు ముందుగానే గ్రహించి, మనకు సూచనలు చేస్తారు. మానవులకు అతి ముఖ్యమైన వాటిలో స్థిరమైన నివాసం అనేది ఒకటి. చాలా మందికి స్వగృహం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. స్వగృహం అనేది కొందరికి జీవితాశయంగా కూడా ఉంటుంది. జన్మకుండలిలో స్వగృహ యోగం ఉందా లేక గృహ నాశ యోగం ఉందా అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో వివరంగా ఇవ్వబడింది. స్వగృహం లేదా స్థిరాస్తుల విషయంలో ప్రతికూల సమస్యలు ఎందుకు ఎదుర్కొంటారు అన్న విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను.
గృహ నాశ యోగం అనగా గృహము, భూమి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో నష్టపోయే గ్రహస్థితి ఏర్పడటమే ఈ అవయోగానికి కారణం. జన్మకుండలిలో ఈ గృహ నాశ యోగం ఉన్నవారు స్థిరాస్తులను సంపాదించుకునేనుకు తీవ్రంగా కష్టపడవలసి ఉంటుంది. వంశపారపర్యంగా వస్తున్న ఆస్తులను, సంపదను కోల్పోవడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన చిక్కులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా భూ సంబంధిత మోసాలు కారణంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వలన అనుకోని నష్టాలను చవిచూడాల్సి వచ్చును.
జన్మకుండలిలో చతుర్థ స్థానం అనగా గృహం, భూమి, స్థిరాస్తి, తల్లి వంటి వాటిని సూచిస్తుంది. 12వ స్థానాన్ని దగ్ధ స్థానంగా జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. దీనినే వ్యయ స్థానం అని కూడా అంటారు. జన్మకుండలిలో చతుర్థ స్థానాధిపతికి మరియు ద్వాదశ స్థానాధిపతికి మధ్య వ్యతిరేక సంబంధం ఏర్పడితే, ఆ జాతకుడు గృహం విషయంలో, గృహ మార్పుల విషయంలో, రియల్ ఎస్టేట్ సంబంధిత ఆర్థిక అస్థిరత్వం ఏర్పడును. దీనినే గృహ నాశ యోగంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

గృహనాశ యోగం యొక్క గ్రహ స్థితులు ఏమనగా:
జన్మకుండలిలో చతుర్థాధిపతి ద్వాదశ స్థానంలో అనగా దగ్ధ, వ్యయ స్థానంలో ఉంటూ, శని, కుజ, రాహు లేదా కేతు వంటి నైసర్గిక పాప గ్రహముల దృష్టి ద్వాదశ స్థానం పై పడినపుడు, ఆ జాతకులకు గృహ నాశ యోగం ఉన్నట్టు గుర్తించాలి.
చతుర్థ స్థానం స్థిరాస్తులను సూచిస్తే, ద్వాదశ స్థానం నష్టాలను, ఖర్చులను, విభేదాలను సూచిస్తుంది. ఈ చతుర్ఠాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నపుడు, ఆ జాతకులు స్థిరాస్తులను కోల్పోతారు, స్వగృహం కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇంటి పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అయితే, ఈ చతుర్థస్థానాధిపతి మీద శని, కుజ, రాహు లేదా కేతు యొక్క దృష్టి కూడా జోడైతే, ఇక ఈ గృహ నాశ యోగమునకు తీవ్ర బలము పుంజుకొని, సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి.
గృహ నాశ యోగం వలన కలిగే ప్రభావాలు:
- జాతకునికి వంశపారపర్యంగా వచ్చిన ఆస్తి అయినా లేదా జాతకుడు సొంతంగా కొనుక్కొని ఉన్నా, గృహనాశ యోగం అనేది జాతకుని జన్మకుండలిలో ఉండినట్లైతే, ఆర్థిక ఇబ్బందుల వల్ల గాని, స్థల విబేధాల వలన గాని లేదా అనుకోని సంఘటనల వలన గాని ఆ ఆస్తులను నష్టపోతారు.
- ఈ సంగమంలో రాహు లేదా కేతు గ్రహం కూడా తోడైతే, మోసపూరిత చర్య వలన గాని, దుర్మార్గపు చర్య వలన గాని ఆస్తి నష్టం వాటిల్లుతుంది.
- గృహనాశ యోగం ఉన్న జాతకులు రియల్ ఎస్టేటులో పెట్టుబడులు పెట్టి, తీవ్ర నష్టాలకు గురి అవుతారు.
- ఆస్తిని కొనుగోలు చేసేందుకు అప్పులు చేసి, ఆ అప్పును తిరిగి చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని వలన ఆర్థిక అస్థిరత్వం ఏర్పడుతుంది.
- గృహ నాశ యోగం ఉన్న జాతకులు అద్దె ఇంట్లో ఉన్నప్పటికి, తరచూ ఇల్లు మారుతూ ఉండాల్సి వస్తుంది. స్వంత ఇంటి కల అనేది ఈ దోషం గల జాతకులకు కలగానే మిగిలిపోతుంది.
- ఈ దోష గ్రహ స్థితులకు శని జోక్యం ఉన్నట్లైతే, ఆస్తి కొనుగోలు అనేది ఆలస్యం అవ్వడం జరుగుతుంది. జీవితంలో చాలా ఆలస్యంగా సొంత ఇంటి కల నెరవేరవచ్చు.
- గృహ నాశ యోగం యొక్క గ్రహస్థితికి కుజ, శని, రాహు గ్రహాల దృష్టి కూడా తోడైనపుడు, ఆ జాతకుడు వంశపారపర్యంగా వస్తున్న ఆస్తి విషయంలో తగాదాలు ఎదుర్కొంటారు, ఆస్తి పరమైన కోర్టు కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, భూమి లేదా స్వగృహం గురించి కుటుంబ సభ్యులతో విభేదాలు ఎదుర్కొంటారు.
- గృహ నాశ యోగమునకు ఇతర గ్రహములు అనుకూలించినట్లైతే, జాతకుడు ఉపాధి కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు విదేశాలకు వెళ్ళు అవకాశాలు కలుగును. కానీ అక్కడ స్థిరమైన నివాసం ఏర్పడటం అనేది సవాలుగా మారుతుంది.
గృహ నాశ యోగం వలన ఎదుర్కొనే సవాళ్ళు:
- గృహ నాశ యోగం జాతకంలో తీవ్రంగా ఉన్నపుడు, గృహముల విషయంలో తీవ్ర అస్థిరత్వం ఏర్పడుతుంది, ఒక్కో సంధర్భంలో ఉండటానికి ఇల్లు కూడా కరువవుతుంది.
- వంశపారపర్యంగా వస్తున్న ఆస్తి తగాదాలు ధీర్ఘ కాలం కోర్టు చుట్టూ తిరిగేలా చేస్తుంది.
- రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో అంచనాలు తప్పిపోయి, దాని వలన తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారు.
పరిహారములు:
- గృహ నాశ యోగం అనేది ఏ గ్రహం వలన కలిగినదో, జ్యోతిష పరిశీలన ద్వారా తెలుసుకొని, దానికి తగిన విధంగా పరిహారములు చేసుకోవాలి.
- గృహ నాశ యోగం యొక్క ప్రభావం తగ్గుటకు, తరచూ అద్దె ఇల్లులు మారు స్థితి మారేందుకు, జాతకులు తమ గృహంలో శ్రీ మహా యంత్రమును ప్రతిష్టాపన చేసుకొని, పూజించాలి.
- జన్మకుండలిలో చతుర్థ స్థానాధిపతికి సంబంధించిన పరిహారములు జరిపించుకోవాలి. (ఈ పరిహారాలు వ్యక్తిగత జాతకం ఆధారంగా మారుతూ ఉంటాయి)
- చంద్ర, శని గ్రహముల ధ్యానం చేయాలి.
Ph: 9846466430
Email: chakrapani.vishnumaya@gmail.com
Related Articles:
- సంపూర్ణ జాతక పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు.
- పుట్టిన తేదీ, సమయం, స్థలం వివరాలు తెలియదా? అయినా సరే కేరళ కావడి ప్రశ్న ద్వారా మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు.
- ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఘోరాలకు, కల్లోలాలకు పూర్వజన్మ కర్మలే కారణమా?
- మన మాటల పై జన్మకుండలిలోని బుధ గ్రహం యొక్క ప్రభావం ఉంటుందని మీకు తెలుసా?
- జన్మకుండలిలో శని వక్రగతిలో ఉంటే, ఏ విధమైన ప్రభావాలు కలుగుతాయో మీకు తెలుసా?
- విష తుల్య యోగం
