గురుచండాల యోగం
జన్మకుండలిలో గురు గ్రహం కేతు లేదా రాహువు కలసి ఒకే భావంలో ఉండినట్లైతే గురు చండాల యోగం సంభావిస్తుంది. అనగా గురువు ఇచ్చే యోగాలను అన్నిటిని కూడా ఈ రాహు లేదా కేతు గ్రహాలు అడ్డుకుంటాయి. కొన్ని సంధర్భాలలో కేతువు శుభుడిగా ఉంటూ గురు గ్రహంతో కలసి ఒకే భావంలో ఉన్నట్లైతే అది ఒక శుభ యోగంగా చెప్పబడుతుంది. అదే గణేశ యోగం. జన్మకుండలిలో ఎవరికైతే గురు గ్రహం బలంగా ఉంటుందో, వారు సంపన్నులు అవుతారు, ఆధ్యాత్మిక భావనలో ఉంటారు, ఎంతో దయా హృదయం కలిగి ఉంటారు. ఈ గురు గ్రహమే జాతకుడిని పాలకుడిగా చేస్తుంది.
స్త్రీ జన్మకుండలిలో గురువు బలంగా ఉన్నట్లైతే తాను మంచి ఇల్లాలుగా మెదులుతుంది.
పురుషుని జాతకంలో రాహువు అశుభుడుగా ఉండియనట్లైతే ఆ జాతకుడు స్వార్థపరుడిగా, కఠినాత్ముడిగా, కామ వాంఛ అధికంగా ఉంటాయి. అదే రాహువు స్త్రీ జన్మకుండలిలో అశుభుడిగా ఉంటే, ఆ స్త్రీ చాలా ధైర్యవంతురాలిగా, ఉత్సాహవంతురాలిగా ఉంటుంది. ఎన్నో భోగాలతో కూడిన జీవన శైలి ఏర్పడుతుంది. వివాహం అయ్యాక కూడా ఇతరులతో అన్య పురుష సంబంధాలను కలిగి ఉంటారు.
స్త్రీ జన్మకుండలిలో కేతువు అశుభుడిగా ఉంటే, ఆ స్త్రీ ఎంతో శక్తివంతురాలిగా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎంతో స్వార్థపరురాలిగా ఉంటుంది. తమ భర్తల నుండి దూరం కూడా కావచ్చు (ఇతర గ్రహస్థితులను బట్టి పరిపూర్ణంగా నిర్ణయించాలి). అదే ఒక పురుషుని జన్మకుండలిలో కేతువు అశుభుడిగా ఉంటే, వారు ఆధ్యాత్మిక ధోరణి, విరక్తి ధోరణి కలిగి ఉంటారు. పెళ్ళైన ఆడవారి పట్ల, భర్త చనిపోయిన ఆడవారి పట్ల వీరు ఆకర్షితులు అవుతారు.
సాధరణంగా గురువు మరియు రాహువు యొక్క సంగమం మంచిది కాదు. కాకపోతే గురుచండాల యోగం వల్ల కొన్ని మంచి, కొన్ని చెడు విషయాలు జరుగుతాయి. అవి ఎలా అనేది జన్మకుండలిలో గురు గ్రహం యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. ఈ గురు చడాల దోషం యొక్క తీవ్రత ఎంత దారుణంగా ఉంటుంది అనేది, జన్మకుండలిలోని గురు, రాహు యొక్క స్థానాలను బట్టి నిర్ణయించాలి. గురు చండాల యోగం వల్ల ఎలాంటి ప్రభావాలు ఏర్పడతాయో ఇక్కడ వివరిస్తున్నాను.
జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
-
- దేనినైనా గుర్తించుకోవడానికి, ఆలోచనలు క్రమంగా ఉంచుకోవడానికి జాతకునికి కష్టంగా ఉంటుంది.
- స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం జాతకునికి చాలా కష్టంగా ఉంటుంది.
- మతపరమైన విషయంలో జాతకులు ఎప్పుడూ సంధిగ్ధంలోనే ఉంటారు. ఈ యోగానికి శని లేదా కుజ దృష్టి కూడా తోడైతే, జాతకులు మతమార్పిడికి పాల్పడతారు.
- ఆర్థిక పరిస్తితి ఎప్పుడూ ఆగమ్యగోచరంగానే ఉంటుంది.
- కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. తండ్రి, కొడుకుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. పిత్రార్జితం నష్టపోతారు.
- జన్మకుండలిలో గురువు నీచంగా ఉన్నట్లైతే ఆస్తమా, పచ్చ కామెర్లు, హైపర్ టెన్షన్, ట్యూమర్లు, లివర్ సమస్యలు లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- కొన్నిసార్లు జాతకుడు తీసుకునే నిర్ణయాలు అత్యంత ప్రమాదకరంగా కూడా మారతాయి.
- బావ/ బావమరిది జాతకుడిని మోసం చేస్తారు. జాతకుల జీవితంలో తమ బావ/బావ మరిది తీవ్ర సమస్యలు తెస్తారు.
- జీవిత భాగస్వామికి శారీరక బలహీనత్వం, బద్ధక లక్షణాలు ఉంటాయి.
- వివాహం గురించి, కాబోయే జీవిత భాగస్వామి గురించి జాతకులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఈ జాతకుల దంపతుల మధ్య నమ్మకం లోపించి, వీరి వైవాహిక జీవితం మొత్తం సమస్యల పుట్ట అవుతుంది.
- గురువుల నుండి ఈ అవయోగం ఉన్నవారికి ఎంతో నమ్మకమైన వారి నుండి జాతకుడికి వచ్చే సూచనలు ఏవీ కూడా జాతకులకు అనుకూలంగా ఉండవు. నమ్మకద్రోహం జరుగును.
- జాతకులు ఎన్నో పెద్ద చదువులు చదివినా కూడా వీరు చదివిన చదువుకు, చేసే వృత్తికి ఎలాంటి సంబంధం ఉండదు.
- జాతకులు తమ ప్రాణ స్నేహితులతో తప్పించి వేరే ఎవరితోనూ సన్నిహితంగా వ్యవహరించలేరు.
- జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండును.
- వీరి జాతకంలో విదేశీ నివాస యోగం ఉండి ఉంటే, విదేశాలలో ధనవంతులు అవుతారు.
- జీవిత భాగస్వామి ధనిక కుటుంబం నుండి వస్తే, వివాహం తరువాత ఈ గురుచండాల యోగం ఉన్న జాతకులకు ఎంతో సంపద వచ్చి పడుతుంది. అత్తగారి నుండి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. జాతకుల వైవాహిక జీవితంలో వీరి ఆతగారి జోక్యం ఎక్కువగా ఉంటుంది.జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
గురు చండాల యోగం అనేది ఏఏ భావాలలో ఏర్పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నాను. గమనించండి.
లగ్న భావం: లగ్నంలో గురు చండాల యోగం ఏర్పడితే, జాతకుడు యొక్క స్వభావం అనుమానాస్పదంగా ఉంటుంది. జాతకులు డబ్బు, సంపద, భోగాలు అన్నీ ఉన్న అదృష్టవంతుడు అయినా సరే, స్వార్థం, అత్యాశ వీరిలో అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా తక్కువ. అదే ఒకవేళ, లగ్నంలో ఉన్న గురువు శుభుడిగా బలంగా ఉన్నట్లైతే, జాతకుడు ఎంతో మర్యాదస్తుడిగా, వివేకవంతుడిగా ఉంటాడు.
ద్వితీయ భావం: రెండవ భావంలో గురు చండాల యోగం ఏర్పడితే, గురువు బలంగా ఉన్నట్లైతే, జాతకుడు ఎంతో సంపన్నుడు, ధనవంతుడు అవుతాడు. అదే గురువు బలహీనంగా ఉన్నట్లైతే, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన తగాదాలు, ధన నష్టం, జీవితం అంతా భారంగా మారిపోతుంది.
తృతీయ భావం: మూడవ భావంలో గురు చండాల యోగం ఏర్పడితే, జాతకుడు ధైర్యవంతుడు, నాయకుడు అవుతాడు. ఒకవేళ జన్మకుండలిలో మూడవ భావంలో ఉన్న గురువు మీద కుజుడు యొక్క చెడు దృష్టి పడితే, జాతకుడు ముక్కుసూటిగా ఉంటాడు, ఎన్నో కుట్రపూరిత ఆలోచనలు చేస్తాడు.
చతుర్థ భావం: నాలుగవ భావంలో గురు చండాల యోగం ఏర్పడినా కూడా, ఈ భావం గురువుకి శుభ స్థానం అయితే, జాతకుడికి స్వగృహం, ఆస్తులు చేకూరుతాయి. అదే ఒకవేళ గురువు ఉన్న నాలుగవ స్థానం చెడు స్థానం అయితే జాతకుడికి సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు తలెత్తుతాయి.
పంచమ భావం: గురు చండాల యోగం అనేది అయిదవ భావంలో ఏర్పడితే, ఈ అయిదవ భావంలో ఉన్న గురువు శుభుడు అయితే, జాతకుడు మంచి విద్యావేత్త అవుతాడ్, గొప్ప వివేకం కలిగి ఉంటుంది. జాతకునికి ప్రతిభావంతులైన సంతానం కలుగుతుంది. ఈ అయిదవ భావంలో గురువు నీచపడ్డ, అశుభుడు అయితే, సంతానానికి సంబంధించి చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
షష్ట్య భావం: ఆరవ భావంలో గురు చండాల యోగం ఏర్పడి, కుజుడు చెడు దృష్టి గురువు మీద పడితే, జాతకుని కుటుంబ జీవితం మొత్తం కూడా సమస్యలతో నిండిపోయి ఉంటుంది. తన సొంత మతాన్ని తానే అగౌరవపరుస్తారు. అదే ఒకవేళ ఆరవ భావంలో ఉండే గురువు బలంగా ఉన్నట్లైతే, జాతకుడు ధనవంతుడు, సంపన్నుడు కాగలడు.
సప్తమ భావం: సప్తమ స్థానంలో గురు చండాల యోగం ఏర్పడినపుడు, జాతకుని వివాహిక జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ భావం మీద శుభ గ్రహాల దృష్టి మరేది లేకపోతే వైవాహిక జీవితంలో చాలా సమస్యలు వస్తాయి.
అష్టమ భావం: జన్మకుండలిలో అష్టమ భావంలో గురు చండాల యోగంతో గురువు చెడు స్థానంలో ఉన్నట్లైతే, గురు మహాదశలో యాక్సిడెంట్లు, తీవ్ర గాయాలు, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. చెడు స్థానంలో ఉన్న రాహు మహాదశలో జాతకుడి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది.
నవమ భావం: నవమ భావంలో గురు చండాల యోగం ఏర్పడి, ఈ నవమ భావ గురువు బలంగా ఉన్నట్లైతే జాతకుడికి అన్ని వైపుల నుండి సంపద వచ్చి పడుతుంది. అదే ఒకవేళ, గురువు నీచపడితే, జాతకునికి తండ్రితో సత్సంబంధాలు ఉండవు. జాతకునికి విజయం చాలా ఆలస్యంగా చేకూరుతుంది.
దశమ భావం: దశమ భావంలో గురు చండాల యోగం జరిగినపుడు జాతకునికి డబ్బు, హోదా, వృత్తి వ్యాపారాలలో విజయం అన్నీ ఉంటాయి, కానీ జాతకునికి నైతిక విలువలు తక్కువగా ఉంటాయి. సొంత వారిని కూడా నమ్మలేడు.
ఏకాదశ భావం: ఏకాదశ భావంలో ఏర్పడే గురు చండాల యోగం శుభంగా చెప్తారు. వివిధ రూపాలలో జాతకునికి డబ్బు రావడమే కాకుండా, సొంత కష్టంతో డబ్బు సంపాదించుకుంటారు, అలాగే వారసత్వ సంపద కూడా లభిస్తుంది.
ద్వాదశ భావం: గురువుకి ద్వాదశాధిపత్యం అస్సలు మంచిది కాదు. అది కూడా గురు చండాల యోగం ఈ ద్వాదశ భావంలో కలిగితే జాతకుడు ఎక్కడ ఏమి మాట్లాడినను దారునాలు జరుగును. జాతకుని మాట ఎక్కడా కూడా నెగ్గదు. అందరికీ తల వంచాల్సి ఉంటుంది.
-C.V.S.చక్రపాణి,జ్యోతిష్య భూషణ Ph:9846466430
జన్మకుండలి పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Related articles: