9 రోజులు-9 హోమములు
కేరళలోని పాలక్కాడ్ జిల్లా, ఆలత్తూర్ మండలం, వావిల్యాపురంలోని వేదనారాయణ అధర్వణ తంత్ర పీఠము నందు జాతకులకు పరోక్షముగా మరియు సామూహికంగా శాంతి హోమములు జరిపించబడును.
21–01–2024 నుండి 29-01–2024 వరకు 9 రోజుల పాటు జాతకులకు జరుగున్న ప్రతికూల గ్రహ మహా అంతర్దశలకు శాంతి హోమములు జరిపించబడును. ఇందు నిమిత్తము ఋత్విక్ సంభావన 1,116/- ఆయుః క్షీణ గ్రహ దశలు జరుగుతున్న వారికి, గండాంతర గ్రహ దశలు జరుగుతున్న వారికి మరియు కాలసర్ప దోష నివారణకు, సంపూర్ణ ఆయుర్దాయము పొందుటకు ఆయుషు కారక ప్రతికూల గ్రహ దోష నివారణకు, వైవాహిక దోష నివారణకు, కార్యసిద్ధికి, సంతాన ప్రాప్తికి, బాలారిష్ట గ్రహ దోష నివారణకు, పితృ దోష నివారణకు ఈ శాంతి హోమములు జరిపించబడును. జాతకులు తమ యొక్క జన్మకుండలిని పరిశీలించుకొని, మీకు జరుగుతున్న గ్రహదశలను, దోషములను మాకు తెలియపరచిన యెడల, ఈ శాంతి హోమములను సామూహికముగా మరియు పరోక్షముగా జరిపించబడును. హోమాదులు సంపూర్ణముగా జరిపించిన తరువాత, యజ్ఞ ప్రసాదములు మీకు కొరియర్ లేదా పోస్టు ద్వారా పంపబడును.
గమనిక: 12 సంవత్సరములలోపు చిరంజీవులకు ఏర్పడినటువంటి బాలారిష్ట గ్రహ దోష నివృత్తి హోమములు, శాంతి హోమములు వంటి పరిహారాదుల కొరకు రావి ఆకు పై సంతానము యొక్క నామ ధ్యేయము, జన్మ నక్షత్రము, జన్మ లగ్నము వంటి వివరములు వారి తల్లిదండ్రులు స్వయంగా వ్రాసి పంపవలెను. అలాగే కాగితము పై కూడా వ్రాసి, ఆ రెండింటిని జత చేసి పంపవలెను. శిశువులు మరియు చిన్న పిల్లలు (12 ఏళ్ల లోపు) యొక్క ఫోటోలను పంపరాదు.
జనవరి 20వ తారీఖు లోపు జాతకులు తమ యొక్క గోత్ర నామములు, జన్మ నక్షత్రములు,జన్మ లగ్నము, జన్మ రాశి, జరుగుతున్న గ్రహదశ యొక్క వివరములను మాకు 9951779444 నెంబరు Whatsapp నెంబరుపై పంపగలరు. అత్యంత శాస్త్రోక్త యుక్తంగా ఈ హోమ పూజాదులు నిర్వహించబడతాయి. 9 రోజుల పాటు జరిగే హోమాదుల వివరములు:
- కాలసర్ప దోష నివారణా శాంతి హోమం & రవిగ్రహ శాంతి హోమం (రేవంత బలి) (21-01-2024)
- ఆయుష్ హోమం & చంద్ర గ్రహ శాంతి హోమం (22-01-2024)
- నవగ్రహ శాంతి హోమం & అంగారక గ్రహ దోష నివారణ శాంతి హోమం (23-01-2024)
- ఆయుః కారక గ్రహ ప్రతికూల దోష నివారణ హోమం & బుధ గ్రహ శాంతి హోమం (24-01-2024)
- వైవాహిక దోష నివారణ హోమం & గురు గ్రహ దోష నివారణ శాంతి హోమం (ఇంద్రాదిత్య హోమం) (25-01-2024)
- కార్యసిద్ధి హోమం & శుక్ర గ్రహ శాంతి హోమం (సర్పంతుల్లాల్) (26-01-2024)
- సంతాన ప్రాప్తి హోమం & శని దోష నివృత్తి హోమం (తిలకాష్ట బలి) (27-01-2024)
- బాలారిష్ట శాంతి హోమం & కేతు గ్రహ శాంతి హోమం (కాలసర్పశాంతి) (28-01-2024)
- పితృదోష పరిహార హోమం & రాహు గ్రహ శాంతి హోమం (కాలసర్పశాంతి) (29-01-2024)
ఈ 9 రోజుల శాంతి హోమములకు నమోదు చేసుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ ను నింపవలెను.
[bitform id=’4′]
Related Articles:
- కళత్ర దోషం అంటే ఏమిటి? వాటి ప్రభావాలు ఏమిటి?
- వివాహేతర సంబంధాలకు గల జ్యోతిష్య కారణాలు ఏమిటి?
- గుండె జబ్బులకు గల జ్యోతిష్య కారణాలు
- జన్మకుండలి పరిశీలన
- ద్వితీయ వివాహం-జ్యోతిష్య కారణాలు
- బంధన యోగం
జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును. గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.
#astrology #zodiac #horoscope #zodiacsigns #tarot #love #astrologer #virgo #leo #scorpio #homam #rituals #sacredfire #priest #devotion #spirituality #divineblessings #hinduism #vedicrituals #auspicious#kalasarpa dosha#pitru dosha#jathakam#jatakam#telugu