loading

Month: August 2026

జీవితంలో ఎదురయ్యే కల్లోలాలకు పూర్వజన్మ కర్మలే కారణమా?

జీవితంలో ఎదురయ్యే కల్లోలాలకు పూర్వజన్మ కర్మలే కారణమా?

               ఒక వ్యక్తి పాపాలు చేశాడు అనుకుందాము. అతను చనిపోయిన తరువాత, అతనుచేసిన పాప కర్మలకు తగిన శిక్షలను నరకంలో అనుభవించాడు. నరకంలో పొందిన శిక్షల వలన, ఆ పాప కర్మకు కారణమైన అతనిలో ఉన్న దుర్గుణం యొక్క తీవ్రత తగ్గుతుంది. కాని అది పూర్తిగా అయితే మాత్రం తొలగిపోదు. ఆ దుర్గుణానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఆత్మలో నిక్షిప్తం అయ్యి ఉంటాయి. ఒక చెడుకర్మ లేదా పాపకర్మ చేసినందుకు అనుభవించిన శిక్ష వలన తనలో ఉన్న దుర్గుణం తొలగిపోదు. ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అదే విధంగా, దుర్గుణమును, దుర్భుద్ధిని సద్బుధ్ధితో మాత్రమె పూర్తిగా తొలగించగలము.

               ఉదాహరణకు, ఒక దొంగను ఎంత శిక్షించినా సరే, అతనిలో ఉన్న దొంగ స్వభావం పూర్తిగా పోదు. మళ్ళీ దొంగతనం చేస్తే, మళ్ళీ శిక్షిస్తారేమో అన్న భయంతో దొంగతనం చేయడానికి జంకుతాడేమో గాని, అతనికి దొంగ బుద్ధి పూర్తిగా మాత్రం తొలగిపోదు. అందుకే, జైలు నుండి బయటకు రాగానే, అతను మళ్ళీ కొన్ని రోజులకు దొంగతనం చేయడం మొదలు పెడతాడు. దొంగతనం చేయడం తప్పు అని ఆ దొంగకి అర్థం అయినపుడు, అనగా ఆ సద్భుద్ది కలిగినపుడు మాత్రమె ఆ దొంగ దొంగతనాలు చేయడం మానేస్తాడు. అతనికి ఒక సద్గురువు లభించి, ఆ గురువు ద్వారా నిజమైన జ్ఞానం లభిస్తే, ఆ పాప కర్మ యొక్క గుణం పూర్తిగా తొలగిపోతుంది. ఒకప్పుడు దొంగతనాలు చేస్తూ దొంగగా ఉండే వాల్మికి , నారదమహర్షి భోధించిన సత్య జ్ఞానం వలన వాల్మికి మహర్షిగా మారాడు గాని, జైలుకి వెళ్లి పోలిసుల చేతిలో శిక్షలు అనుభవించినందుకు కాదు.

               గుణం అనేది ఒక జ్ఞానం. ఇదివరకు చెప్పినట్టుగా, తప్పుడు జ్ఞానాన్ని కేవలం సరైన జ్ఞానం ద్వారానే తొలగించవచ్చు. పూజలు చేయడం ద్వారానో. జపాలు చేయడం ద్వారానో, భజనలు చేయడం వల్లనో పుణ్యం పొందవచ్చు, మనస్సును శాంతిమ్పచేసుకోవచ్చు గాని, వారిలో ఉన్న చెడు బుద్ధిని మాత్రం తొలగించుకోలేరు. కాని, ఆ పాపాలకు కారణమైన అజ్ఞానాన్ని నిర్మూలించేది మాత్రం సత్యజ్ఞానమే.

               మీకు ఇప్పుడు మనస్సులో ఒక సందేహం రావచ్చు. ఈ చెడు జ్ఞానం, దుర్బుద్ధి ఇవి కూడా కర్మే కదా? అని.

               అవును, ఇది కూడా కర్మే. సృష్టిలోని ప్రతీ అంశం కూడా ఒక విధమైన కర్మే. గుణం అనేది మనకు అవగాహన కలిగించే ఆలోచన కావచ్చు లేదా అవగాహన కలిగించే భావన కూడా కావచ్చు. అది కూడా కర్మే. ఒక కర్మ యొక్క అవగాహనను మరొక కర్మ యొక్క అవగాహన మాత్రమే తొలగించగలదు గాని భౌతిక శక్తి తొలగించలేదు. శిక్షించడం, కొట్టడం, కాల్చడం ఇవన్నీ కూడా భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే శరీరం మనస్సుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి పాప కర్మ లేక వికర్మ యొక్క జ్ఞానం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో మనస్సులో భయాన్ని కలుగజేస్తుంది గాని ఆ గుణం మూలాల నుండి తొలగిపోదు. సరైన జ్ఞానం, సత్య జ్ఞానం ద్వారా మాత్రమే దుర్గుణం అనేది మూలాల నుండి తొలగిపోతుంది.

               ఆ గుణమే తొలగిపోయినపుడు, దానికి సంబంధించిన కర్మ కూడా కనుమరుగు అవుతుంది. అందుకని, దుర్గుణాన్నిసరైన జ్ఞానంతో తొలగించుకుంటే, ఆ దుర్గుణంతో పాటు, దానికి సంబంధించిన కర్మ కూడా మూలాల నుండి కాలిపోతుంది.

“యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ।।”

భావం: ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నిటిని భస్మము చేయును.

               ఒక వ్యక్తి పాపములు చేసి నరకంలో శిక్షలు అనుభవించి, మళ్ళీ జన్మించాడు అనుకుందాము. అతను చేసిన పాపాలకు కారణమైన గుణం యొక్క అవశేషాలతోనే జన్మిస్తాడు. ఈ గుణం కలిగి ఉండటం కూడా కర్మే, కావున ఈ కర్మావశేశాలను “కర్మ శేషం” అని పిలుస్తారు. ఆ వ్యక్తి ఈ జన్మలో తనతో పాటు తెచ్చుకున్న గుణం యొక్క అవశేషాలు, అతనితో పాటు ఆ గుణం కూడా పెరిగి పెద్ద వృక్షంలా మారుతుంది. దీని వలన, ఆ వ్యక్తి గత జన్మలో ఎ విధమైన కర్మలు చేసి నరకంలో శిక్షలు అనుభవించాడో, ఈ జన్మలో కూడా మళ్ళీ అవే కర్మలను చేస్తాడు. ఈ జన్మలో చేసిన ఈ పాప కర్మలకి శిక్ష ఈ జన్మలోనే కలుగవచ్చు లేదా చనిపోయాక నరకంలో కూడా కలుగవచ్చు. ఉదాహరణకు, ఒక దొంగ దొంగతనం చేస్తున్నప్పుడే అక్కడికక్కడే యజమానికి దొరికిపోయి బాగా దెబ్బలు తినచ్చు లేదా అదే దొంగని పోలీసులు స్టేషనుకు తీసుకోపోయి కొట్టవచ్చు లేదా దొంగ ఈ రెండు చోట్ల దెబ్బలు తినడం తప్పించుకుంటే, చివరాకరికి నరకంలో అయినా దెబ్బలు తినక తప్పదు.  

మనందరికీ కూడా అనంత జన్మల నుండి చేసిన పుణ్య,పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి పేరుకొనిపోయి ఉంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే, అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు, అంతేకాక ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి, అదొక అంతులేని చక్రంలా మిగిలిపోతుంది. కానీ, మన కర్మలన్నిటినీ ఈ జన్మలోనే భస్మం చేసే శక్తి, జ్ఞానానికి ఉందని శ్రీ కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానం మరియు దానికి భగవంతునితో ఉన్న సంబంధము తెలుసుకోవటం మనలను శరణాగతి దిశగా తీస్కువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి, భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు.గత జన్మలో చేసిన కర్మకు నరకంలో శిక్షను అనుభవించి, ఆ కర్మ శేషమును ఆత్మ మళ్ళీ భూమిపైకి మోసుకొస్తుంది. ప్రస్తుత జన్మలో మన జీవితంలో జరిగే కల్లోలాలకు కారణం మనం గత జన్మలో చేసుకున్న కర్మలే కారణంగా చెప్పవచ్చు.

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 9846466430

Related Articles: 

మాటలపై బుధుడు యొక్క ప్రభావం

మాటలపై బుధుడు యొక్క ప్రభావం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధుడు జాతకుల యొక్క భావ వ్యక్తీకరణ పై, మాటల పై ప్రభావం చూపుతాడు. పంచభూతాలలో ఒకటైన అగ్ని తత్వంతో మాటలను పోలుస్తారు. మాటల వలన బంధాలను కలుపవచ్చు. అవే మాటలతో బంధాలను విడదీయవచ్చు. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ, వారిలో ఉన్న  జీవశక్తిని తగ్గించుకుంటారు.

              పూర్వం మహర్షులు, ఋషులు అందరూ కూడా నిరంతరం ధ్యానంలో ఉంటూ, తమ మాటలను నియంత్రణలో ఉంచుకుని, నిశ్శబ్దంగా ఉండేవారు. చాలా తక్కువగా మాట్లాడేవారు. అందువలన మహర్షులు, ఋషులు ఏది మాట్లాడినా, వారి నోటితో ఏది అన్నా కూడా ఇట్టే జరిగిపోయేది.

              జన్మకుండలిలో బుధుడికి  బలం లేకపోయినా, పాప లేదా శత్రు గ్రహాలతో సంగమించినా, ఆ జాతకులకు ఆలోచనా శక్తి తగ్గుతుంది. విశ్లేషించే సామర్థ్యం మందగిస్తుంది. హాస్య చతురత ఉండదు. స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం తగ్గుతుంది.

              జన్మకుండలిలో బుధుడు బలంగా ఉంటే, ఆ జాతకులు ఇతరుల యొక్క మనస్తత్వాన్ని సులభంగా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. అన్ని స్థాయిల్లో ఉన్న వారితో సులభంగా మాట్లాడగలుగుతారు. రచనలు, కవిత్వాలు వ్రాయగలరు. లెక్కలను వేగంగా చేయగలరు. అకౌంటింగ్, గణితం వంటి విషయాలలో నైపుణ్యం కలిగి ఉంటారు.

 జన్మకుండలిలో బుధుని యొక్క స్థానాన్ని బట్టి జాతకుల మాట తీరు పై పడే ప్రభావాలు:

  • బుధుడు మీనరాశిలో నీచపడతాడు. మీనరాశిలో బుధుడు జాతకులు, తాము మాట్లాడే మాటలు ఇతరులకు స్వార్థపూరితంగా కనిపిస్తాయి. తమలో ఉన్న తక్కువ స్థాయి ఆలోచనలను సైతం వ్యక్తపరుస్తారు. దీని వలన సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు.
  • జన్మకుండలిలో బుధుడు వక్రంగా ఉన్నట్లైతే, ఆ జాతకులు కొన్ని సంధర్భాలలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. మరికొన్ని సంధర్భాలలో అవివేకంగా, తెలివి తక్కువగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు అర్థంలేని విషయాలను ఎక్కువగా మాట్లాడటం వలన, సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. (జన్మకుండలిలో బుధుడు వక్రంలో ఉంటే, జాతకులకు కలిగే ప్రభావం ఏమిటి? పూర్వ జన్మ సంబంధం ఏమిటి?)
  • జన్మకుండలిలో బుధుడు స్తబ్ధతగా గాని లేదా సంధి జరిగేటపుడు అనగా (28 – ౩౦) డిగ్రీల లోపు ఉంటే, జాతకులకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచన లేకుండా మాట్లాడి, తర్వాత బాధపడతారు. పరీక్ష వ్రాసేటపుడు ప్రశ్నలకు సమాధానం గుర్తుకు రాకుండా, పరీక్ష అయిపోయాక ప్రశ్నలకు సమాధానం గుర్తుకు రావడం జరుగుతుంది. ఏదైనా వాదన జరుగుతున్నపుడు,వాదించడం సాధ్యం కానపుడు, గట్టిగా అరవడం చేస్తారు.కొంతమందికి మెదడులో రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది.
  • అష్టక వర్గ కుండలిలో బుధుడు స్థితి పొందిన రాశిలో 2 లేదా అంతకన్నా తక్కువ డిగ్రీలలో ఉన్నట్లయితే, అటువంటి జాతకులు గట్టిగా మాట్లాడేందుకు జంకుతారు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. వారిలో వారు గోనుక్కోవడం లేదా మాట్లాడలేకపోవడం జరుగుతుంది. ఈ స్థితి ఉన్న కొందరు జాతకులకు పుట్టుకతోనే స్వరపేటికలో లోపాలతో జన్మిస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు కుజునితో సంగమించిన జాతకులు, తాము ఎంతో పొగరుతో మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. తమ మాటలతో ఇతరులను రెచ్చగొట్టు స్వభావం కలిగి ఉంటారు. మాటలతో హింసించే లక్షణాలను కలిగి ఉంటారు. వీరు మాట్లాడే మాటల వలన గొడవలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ జాతకులు ఏదైనా వాదనలో పాల్గొంటే, అవతలి వారి వ్యక్తిగత విషయాలను వెలికితీయడం లేదా రెచ్చ గొట్టడం లాంటివి చేస్తూ విషయాన్ని ప్రక్కదోవ పట్టిస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు రాహువుతో సంగమిస్తే, ఆ జాతకులు ఇతరులతో వాదించే సమయంలో, అవతలి వారి గతాన్ని తవ్వి, నెగ్గే ప్రయత్నం చేస్తారు. వీరు చెప్పే మాటలను నెగ్గించుకోవడం కొరకు గట్టిగా అరుస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు శనితో సంగమించిన జాతకులు, తాము మాట్లాడేందుకు ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. ఈ జాతకులు కాసేపు మాట్లాడినా సరే,సులభంగా అలసిపోతారు.
  • జన్మకుండలిలో బుధుడు కేతువుతో సంగమించినట్లయితే, ఆ జాతకులు నిశ్శబ్దంగా ఉంటారు. వీరు చాలా తక్కువగా మాట్లాడతారు. కాని వీరు నోరు తెరిచారంటే మాత్రం, అవతలి వారు నోరెత్తకుండా మాట్లాడతారు. ఒకే ఒక్క మాటతో వాదనను ముగించేస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు రవితో సంగమించినపుడు, ఆ జాతకులకు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అయితే, బుధుడు వక్రగాతిలో ఉన్నా లేదా రాహు కేతువుతో సంగమించి ఉన్నా, రవి కంటే 14 ఎక్కువ దూరంగా ఉన్నా, అలాంటి జాతకులకు బుధాదిత్య యోగం వర్తించదు.రవి బుధ సంగమం జరిగిన జాతకులు మంచి వక్త కాలేరు. కాని వీరికి ఉన్న జ్ఞానంతో, ప్రసంగాలతో, కవిత్వాలతో ఇతరుల చేత మెప్పు పొందగలరు. గణిత శాస్త్రం, అకౌంటింగ్, తర్క శాస్త్రంలో నైపుణ్యం కలిగి ఉంటారు.
  • జన్మకుండలిలో బుధ, గురు సంగమం కలిగిన జాతకులు ఉన్నత జ్ఞానాన్ని కలిగి ఉంటారు. బహు భాషలను నేర్చుకొని అనర్గళంగా మాట్లాడగలరు. గొప్ప మేధస్సుని కలిగి ఉంటారు. గొప్ప ఉపన్యాసుకులులాగా లేదా గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారు.
  • జన్మకుండలిలో బుధుడు చంద్రునితో సంగమించిన జాతకులకు తమ మనస్సు బలహీనంగా, సున్నితంగా ఉంటుంది. వీరి జాతకంలో బుధుడు బలంగా ఉంటే వీరి బుద్ధి గెలుస్తుంది. అదే వీరి జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే, వీరి మనస్సు గెలుస్తుంది.
  • జన్మకుండలిలో బుధుడు శుక్రునితో కలసి ఉన్న జాతకులు గ్లామర్ రంగంలో ఎక్కువగా ఉంటారు. బ్యూటిషియన్లు, చర్మ వ్యాధి నిపుణులు, వెడ్డింగ్ ప్లానర్లు, ఫ్యాషన్ డిజైనర్లు వీరిలో చాలా మందికి ఈ సంగమం కలిగి ఉంటుంది. బుధ, శుక్ర సంగమంలో ఎవరికైతే శుక్రుడు బలహీనంగా ఉంటారో, అలాంటి వారు సెలూన్లు, బ్యూటి పార్లర్లలో పని చేస్తూ, తమ నైపుణ్యం అంతా ఒకరి క్రింద పని చేసి వృధా అయిపోతోంది అన్న నిరాశలో బ్రతుకుతారు.

మన చర్మాన్ని, శరీరంలోని నరములను కూడా బుధుడు నియంత్రిస్తాడు. బుధుడు నీచంలో ఉన్నా లేదా పాపత్వం పొంది ఉన్నా జాతకులు ఆత్మాహుతి ఆలోచనలు చేస్తారు. స్నేహితులను, బంధువులను ముఖ్యంగా అమ్మ తరపు బంధువులను బుధుడు నియంత్రిస్తాడు. మాటలకు, వాగ్ధాటికి సంబంధించిన సమస్యలను తొలగించుకొనుటకు క్రింది మంత్రమును 1108 సార్లు జపించాలి:-

“అశేష వాగ్జాడ్య మలాపహరిణి నవం నవం స్పష్ట సువక్ ప్రదాయినీ|

మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవప్రసన్న వదనేచమే శ్రీ||”

 

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించుకోదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Ph: 9846466430

Related Articles: