loading

Month: May 2023

అష్టమభావ దుష్పరిణామాలు

                                                         అష్టమ భావం

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అష్టమ స్థానం అనేది ఒక మర్మమైన భావంగా చెప్పబడింది. ఒక వ్యక్తి యొక్క ఆయుషు ఎంత ఉంటుంది, అతని మరణం ఎలా సంభావిస్తుంది అనే విషయాలు ఈ అష్టమ భావం మనకు తెలియజేస్తుంది కాబట్టి, ఈ భావం చాలా ముఖ్యమైన భావంగా పరిగణిస్తారు. ఈ అష్టమ భావం వల్ల అనేక బాధలు కలుగుతాయని, జాతకుని జీవితం పై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది అన్న అభిప్రాయంతో అందరూ ఈ అష్టమ భావం అంటే భయపడుతూ ఉంటారు. జన్మకుండలిలో ఉన్న ఈ అష్టమ భావ ప్రభావం పూర్తి చెడు ఫలితాలనే ఇస్తుందా లేదంటే మంచి ఫలితాలను కూడా ఇస్తుందా అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము.

Ashtama Sthana Telugu

అష్టమ భావం వలన కలిగే చెడు ఫలితాలు:

జన్మకుండలిలో అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు నీచపడి ఉన్నా, లేక పాపులు అయినా, ఆ ప్రభావం జాతకుని ఆయుర్దాయంపై పడుతుంది. దీని కారణంగానే దీర్ఘకాలిక వ్యాధులు, అంతుచిక్కని బాధలు, మానసిక అశాంతి కలుగుతాయి. ఆస్తి తగాదాలు, నేరాలకు పాల్గొనడం, ప్రభుత్వం నుండి శిక్షలు అనుభవించడం, జరిమానాలు కట్టడం, వ్యసనాలకు అలవాటు పడటం, ఆత్మీయులను కోల్పోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుటవుతాయి.

అష్టమ భావంలో పాప గ్రహం లేదా శతృ గ్రహం ఉన్నట్లైతే వచ్చే ఫలితాలు:

1) ఆయుర్దాయం తగ్గుతుంది. జాతకునికి ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి.

2) మానసిక స్థిరత్వం కోల్పోతారు.

3) ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి.

4) కోర్టు కేసులు తలమీద భారంగా కూర్చుంటాయి.

5) చట్ట వ్యతిరేక కార్యకలాపాల వలన శిక్షలు అనుభవిస్తారు.

6) మత్తు పధార్థాలకు బానిసలు అవుతారు.

7) ప్రేమ వ్యవహారాలలో చేదు అనుభవాలు ఎదురవుతాయి.

8) ఆత్మహత్య ధోరణి కలిగి ఉంటారు.

9) గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితం, అష్టమభావ రూపంలో జాతకునికి ఇహ జన్మలో ప్రాప్తిస్తుంది.

అష్టమ భావం వల్ల కలిగే శుభ ఫలితాలు

               అష్టమభావాన్ని ఎప్పుడు భయానకంగా చూడటమే మనకి ఇప్పటి వరకు తెలుసు. కానీ ఈ అష్టమ భావం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అవి ఎలా అంటే, ఈ అష్టమ భావం వల్ల జాతకునికి పూర్ణాయుర్దాయం కలుగుతుంది. ఎన్నో అవాంతరాలను, శత్రువులను అధిగమించి విజయం సాధిస్తారు. సైకాలజీ, సైన్సు, గణితం, మానవాతీత శక్తులు వంటి విద్యలలో జ్ఞానం కలిగి ఉంటారు. వారసత్వపు ఆస్తుల గురించి కూడా ఈ అష్టమ భావం తెలియజేస్తుంది. జాతకుల తండ్రి, తాత వీరిలో ఎవరైనా హఠాత్తుగా మరణించిన పిమ్మట, ఆ వారసత్వపు ఆస్తులు అన్నీ జాతకునికి రావడం వంటివి కూడా ఈ అష్టమ స్థానమే తెలియజేస్తుంది. పరిశోధనలు, గుప్త నిధులు, రహస్య శాస్త్రాలు, గనులు, బొగ్గు, సాహసాలు చేయడం, స్టాక్ మార్కెట్లు, లాటరీలు, మంత్రాలు, తంత్రాలు, ఆధ్యాత్మిక విషయాలు, కూల్చివేతలు ఇవన్నీ కూడా ఈ అష్టమ భావం సూచిస్తుంది.

సంపూర్ణ జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

అష్టమ స్థానంలో శుభ గ్రహం ఉన్నా లేదంటే శుభ గ్రహ దృష్టి అష్టమ భావం పై ఉన్నా, ఆ జాతకునికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకోని విధంగా శుభవార్తలు వింటారు.

1) పూర్ణాయుర్దాయం, మంచి ఆరోగ్యం ఉంటుంది. ధీర్ఘకాలిక వ్యాధులు కలిగినప్పటికి నయం అవుతాయి.

2) శత్రువులపై ప్రతీసారి వీరిదే విజయం.

3) కోర్టు కేసుల్లో విజయం.

4) పోయిన డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

5) ) సైకాలజీ, సైన్సు, గణితం వంటి శాస్త్రాల పై పరిపూర్ణతను సాధిస్తారు.  

6) అతీత శక్తులు, మర్మవిద్యల పై పరిశోధనలు చేస్తారు.

7) వ్యాపార భాగస్వామ్యం ద్వారా గాని, జీవిత భాగస్వామి ద్వారా గాని కలిగే ధనప్రాప్తి అంశాలను ఈ అష్టమ భావం తెలియజేస్తుంది.

8) ఆధ్యాత్మిక చింతన, యోగా, ధ్యానం వంటి వాటికి ఆకర్షితులు అవుతారు.

9) జాతకునిలో ఉన్న శృంగార విషయాలు, కోరికలు, కుండలినీశక్తి వంటి అంశాలను అష్టమ భావం సూచిస్తుంది.

10) అష్టమ భావం శుభంగా ఉంటే, సర్జరీ, హెల్త్ ఆఫీసర్, నర్సింగ్, జ్యోతిష్యం, సైకాలజీ, హీలింగ్ వంటి వృత్తులలో విజయం లభిస్తుంది.

ధీర్ఘ కాలంగా ధ్యానం చేసిన వారికి, శరీరంలో ఉన్న మూలాధార చక్రం చైతన్యం కలుగుతుంది. శరీరంలో ఉన్న శక్తిని పునరుద్ధరించి, మానసిక శారీరక ప్రశాంతతను, విశ్రాంతిని అందించి, మనసును ఉత్తేజంగా ఉంచుతుంది. పరిశోధనలు, వ్యసనాలు, కుండలినీ శక్తి, మర్మ జ్ఞానం, జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం, సంపూర్ణ ఆయుర్దాయం ఇవన్నీ కూడా అష్టమ భావం సూచిస్తుంది. వీటి మీద పూర్తి దృష్టి సారించి, పట్టు సాధిస్తే, ఆ జ్ఞానాన్ని మోక్షాన్ని ఛేదించేందుకు ఉపయోగించుకోవచ్చు.

పురుషుని జాతకంలో అష్టమ భావం తన యొక్క ఆరోగ్య పరిస్థితులు, సంభవించే ప్రమాదాలు, ఆయుర్దాయ నిర్ణయం వంటి విషయాలు తెలుస్తాయి. స్త్రీ జాతకంలో అష్టమ భావం వారి ఆయుర్దాయము, వారికి కలిగే అనారోగ్య విషయాలు మాత్రమే కాకుండా వారి జీవితంలో ప్రవేశించే భర్త, వారి ఆయుర్దాయ విషయాలు, మాంగల్య యోగం, దాంపత్య యోగం, వైదవ్య యోగం కూడా తెలుస్తాయి.

సంపూర్ణ జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

జీవితంలో కలిగే అదృష్ట విషయాలలో, సంతోష విషయాలలో ఒడిదుడుకులు ఉంటాయి. సంపద, అదృష్టం వంటి విషయాలలో చాలా వేగవంతమైన మార్పులు కలుగుతాయి. బహుమతులు, వారసత్వపు ఆస్తులు, ట్యాక్సులు, వాటి రీఫండ్లు, బోనసులు, కమిషన్లు, భరణం, అప్పులు, పెట్టుబడులు వీటన్నిటికి కూడా ఈ అష్టమ భావం ఆధిపత్యం వహిస్తుంది.

అష్టమ భావం జాతకుని సంపదని కూడా సూచిస్తుంది. అష్టమ భావం ప్రభావం వల్ల కూడా ఆకస్మిక ధన లాభాలు, ధన నష్టాలు కలుగుతాయి. షేర్లు, వారసత్వ ఆస్తులు, ఇన్సూరెన్సులలో ఆకస్మిక ధన లాభాలు, ధన నష్టాలు అన్నీ కూడా ఈ అష్టమ భావం వలన కూడా కలుగుతాయి. జాతకంలో అష్టమ భావం శుభంగా ఉండకపోతే, వారికి మానసిక ఆందోళనలు, అసంతృప్తి, పనులలో జాప్యం, అపజయాలు లాంటివి కలుగుతాయి.

ఇలాంటి ఘూడమైన విషయాలను జన్మకుండలి ద్వారా పరిశీలించుకొని, అష్టమ భావం వలన కలిగే యోగాలు, అవయోగాలను తెలుసుకొని జాతకులకు కలిగే అవయోగాల నిర్మూలన గావించవచ్చు.

ఇవి కూడా చదవండి:

  1. గురు చండాల యోగం ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలను జాతకుడు ఎదుర్కొంటాడు?
  2. కాలసర్ప దోషం ఉన్నవారు నివృత్తి హోమం ఎలా జరిపించుకోవాలి?
  3. దుష్ట శక్తుల నుండి కాపాడుకునేందుకు, శత్రు నాశనం జరిగేందుకు జాతకుడిని అనుగ్రహించే ప్రత్యాంగిరా హోమం యొక్క వివరాలు. 
  4. జాతకంలో దోషాల వలన దంపతుల మధ్య విభేధాలు కలిగి విడాకుల వరకు తీసుకెల్లే గ్రహస్థితులు ఏవి?
  5. దంపతులలో ఒకరు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని, బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులకు జాతకంలో ఏ విధమైన గ్రహస్థితులు కారణం అవుతాయి?

జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు. జాతక చక్ర పరిశీలన కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

నాగ శక్తుల గురించి, సర్ప సంబంధ గ్రహాల పూర్తి వివరణ కొరకు, సర్ప మంత్రముల కొరకు నేను రచించిన “నాగ శక్తి” అనే పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ గ్రంధం కావాల్సిన వారు Amazon ద్వారా ఇక్కడ క్లిక్ చేసి కొనవచ్చు.

Ph: 9846466430

Whatsapp: wa.me/919846466430

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X