Retrograde Saturn in Horoscope or Natal chart effects and connection with past life.
సంవత్సరంలో దాదాపు నాలుగున్నర నెలల వ్యవధి పాటు శని వక్రగతిలో సంచరిస్తాడు. వక్రగతిలోకి వెళ్ళేముందు దాదాపు 11-12 రోజుల వరకు శని స్తబ్ధతగా ఉంటాడు. అనగా, ఏ విధమైన కదలిక ఉండదు. ఆ తరువాత శని వక్రగతిలో సంచరిస్తాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జన్మకుండలిలో శని వక్ర గతిలో ఉన్నట్లైతే, ఆ జాతకుని పై శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వక్ర శని ప్రభావం బహిర్గతంగా కనపడకపోయినా, అంతర్గతంగా జాతకుని పై ప్రభావం చూపుతుంది. ఆత్మ పరిశీలన, సహనం, క్రమశిక్షణ, బాధ్యత వంటి విషయాలలో జాతకునికి శని పాఠాలు నేర్పుతాడు. పేదరికం, బాధలు, కష్టాలు, అంగవైకల్యం, ధీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు, అప్పులు, జైలు శిక్షలు వంటి సమస్యలకు శని కారకుడు అవుతాడు. ఏ గ్రహం అయినా సరే వక్రగతిలో సంచరించినపుడు, ఆ గ్రహము ఇచ్చే ఫలితములు అన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. శని వక్రగతిలో ఉన్నపుడు తీవ్రంగా వ్యవహరిస్తాడు. జాతకంలో అత్యంత సవాలుగా ఈ శని యొక్క వక్ర స్థితి నిలుస్తుంది.

జాతకునికి నిరంతర ఆటుపోట్లు, అడ్డంకులు కలిగిస్తాడు. కానీ, వక్ర శని ప్రభావాలు కొంతమంది జాతకులకు శుభ ఫలితాలను కూడా అందజేస్తాడు. వక్ర శని యొక్క ప్రభావాలు శుభ లేదా అశుభ ఫలితాలు అనేవి, జాతకుని యొక్క జన్మ లగ్నం మరియు శని ఉన్న స్థితిని బట్టి నిష్ణాతులు అయిన జ్యోతిష్యులు నిర్ణయించగలరు.
శని వక్రగతిలో ఉన్న జాతకుల యొక్క వ్యక్తిత్వ లక్షణాలు:
- అందరితో సరిగ్గా మెలగకపోవడం, తక్కువగా మాట్లాడటం.
- కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి లేదా కలవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
- ఆత్మ విశ్వాసం లోపించడం వలన, తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేరు.
- ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తీవ్రమైన అతి జాగ్రత్తలు పాటిస్తారు.
- విధి, కర్మ, గత జన్మ కర్మల ఫలితాల పై గట్టి నమ్మకం ఉంటుంది.
- వీరి మనసులోని భావాలను, భావోద్వేగాలను ఇతరులకు తెలియనివ్వరు.
- తరచూ తాము ఒంటరి వారము అని, ఎవరూ తమని అర్థం చేసుకోరు అని భావించి, ఇతరులతో భావోద్వేగ సంబంధాలను కొనసాగించలేరు.
- ఎక్కువ మంది ఉన్నచోట మాట్లాడలేకపోవడం జరుగుతుంది.
- ఇతరులతో పోల్చుకొని తమని తాము తక్కువగా చేసుకుంటూ, మనసులో ఎంతో వేదన అనుభవిస్తారు.
- వీరి కష్టానికి తగ్గ ఫలితం అందలేదని, తమకు కష్టానికి తగ్గ గుర్తింపు దొరకడం లేదు అని నిరంతరం బాధపడుతూ ఉంటారు.
వక్ర శని వలన వృత్తి మరియు ఉద్యోగ జీవితం పై పడే ప్రభావాలు:
జన్మకుండలిలో శని వక్రగతిలో ఉన్న జాతకులు తమ వృత్తిలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. వీరికి అప్పజెప్పిన పని పూర్తి చేసిన తరువాత కూడా, ఆ పనికి ఇంకేమైనా మెరుగులు దిద్దాలా అనే కోణంలో ఆలోచించి చాలా శ్రద్ద వహిస్తారు.
- త్తి పరమైన పనిని లేదా ప్రాజెక్టును పరిపూర్ణంగా చేయాలని నిరంతర తపన పడుతూ ఉంటారు.
- కాస్త ప్రమాదం అనిపించే కొత్త ఆవిష్కరణల కంటే కూడా పాత పద్ధతులను ఎక్కువగా నమ్ముతారు.
- అనుమానాలు, సందేహాలు, జాగ్రత్తలు ఎక్కువగా ఉండటం వలన కొత్త అవకాశాలకు అలవాటు పడలేరు.
- అపజయం పాలవుతానేమో అన్న భయంతో ముఖ్యమైన వృత్తిపరమైన విషయాలలో నిర్ణయాలు ఆలస్యమవుతాయి.
- సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ, సహనాన్ని పెంచుకోవడం వలన ఈ జాతకులకు వృత్తి పరంగా ఎంతో అభివృద్ధి కలుగుతుంది.
అయితే వయస్సు పెరిగే కొద్దీ వీరిలో అపారమైన క్రమశిక్షణ, బాధ్యత, సహనం మరియు నమ్మకమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది.
పై అధికారులతో సంబంధాలు:
జన్మకుండలిలో వక్ర శని ఉన్నపుడు జాతకులు ముఖ్యంగా తమ పై అధికారులతో అధికమైన సమస్యలు ఎదుర్కొంటారు.
- పై అధికారులు ఈ జాతకులను అపార్థం చేసుకుంటున్నారని, తమకి తగ్గ గౌరవం ఇవ్వడం లేదు అని భావిస్తూ ఉంటారు.
- ప్రభుత్వ అధికారులతో గాని, కుటుంబంలో పెద్ద వారితో గాని, ఉద్యోగ రీత్యా లేదా వృత్తి రీత్యా పై అధికారులతో గాని విభేదాలు ఏర్పడతాయి.
- నాయకత్వ బాధ్యతలు ఈ జాతకులకు వచ్చినప్పటికి, వాటిని స్వీకరించడానికి భయపడటం.
- పై అధికారులు వీరిని విమర్శించినపుడు విమర్శలను ఎక్కువగా మనసుకు తీసుకుంటారు.
ఈ అనుభవాల ద్వారా నాయకత్వం, బాధ్యత మరియు న్యాయంగా వ్యవహరించడం నేర్చుకోవడం శని ఇచ్చే ముఖ్యమైన పాఠంగా భావించాలి.
వక్ర శని వల్ల ఎదురయ్యే సవాళ్లు:
- ఈ జాతకులకు ఏదైనా కొత్త పనిని లేదా కొత్త అలవాటుని మొదలుపెట్టేందుకు తీవ్రమైన భయం కలుగుతుంది.
- తమ మీద తమకు ఆత్మ విశ్వాసం లేకపోవడం.
- ఏదైనా కొత్త పని చేయాలంటే, దాని గూర్చి తీవ్రంగా ఆలోచించే క్రమంలో కొత్త అవకాశాలను కోల్పోతారు.
- ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉంటుంది.
- ఇతరులను నమ్మెందుకు వీరికి చాలా సందేహాలు వచ్చి, చాలా ఇబ్బంది పడతారు.
- చుట్టూ ఎంత మంది ఉన్నా సరే, వీరికి ఒంటరితనం అనే భావన కలుగుతుంది.
- బాధ్యతల ఒత్తిడి ఎక్కువగా అనిపించడం.
- మార్పులను అంగీకరించడానికి సమయం తీసుకోవడం.
- బాధ్యతలను సరైన రీతిలో తీరుస్తానో లేదో అని, ఆ బాధ్యతలనే భారంగా భావిస్తారు.
- పాత అలవాట్లు, పాత పద్ధతులకు అంటి పెట్టుకొని ఉంటారు.
ఈ జాతకులు తమలో ఆత్మ విశ్వాసాన్ని, సహనాన్ని, పట్టుదలను మెరుగు పరచుకోవడం వలన ఈ సవాళ్ళు అన్నీ కూడా బలాలుగా మారతాయి.
ఆధ్యాత్మిక ఎదుగుదల:
వక్ర శని ఉన్నవారు సహజంగానే ఆధ్యాత్మికత, యోగ, ధ్యానం, జపం, తత్వశాస్త్రం వంటి విషయాలపై ఆసక్తి చూపుతారు. ఇవి వారికి మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని మరియు జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకునే శక్తిని అందిస్తాయి.
వక్ర శని మరియు పూర్వజన్మ కర్మ సంబంధాలు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జన్మకుండలిలో వక్ర శని ఉండటం అనేది గత జన్మలో పూర్తికాని కర్మలు లేదా నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలను సూచిస్తుంది. పై అధికారుల చేతిలో తీవ్రమైన వ్యతిరేకత, అన్యాయాన్ని చూడాల్సి వస్తుంది. జన్మకుండలిలో వక్ర శని ఉన్నవారు గత జన్మలో అధికారం చెలాయించే స్థాయిలో ఉంటూ, తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉంటారు. ముఖ్యమైన బాధ్యతలను వదిలేసి ఉంటారు. ఏ విధమైన శ్రమ, కష్టం లేకుండా పనులు జరిగిపోవాలని ఆశించి, అడ్డదారులలో పనులను పూర్తి చేసిన్ వారై ఉంటారు. అన్నీ చోట్లా అసహనం ప్రదర్శించి ఉంటారు. ప్రారంభించిన పనులను మధ్యలోనే ఆపివేసి ఉంటారు. ఈ విధమైన కర్మల వలన, ఈ జన్మలో అలాంటి అవకాశాలే జాతకులకు దక్కి, జాతకులకి సహనం, బాధ్యత, క్రమ శిక్షణ, నాయకత్వ ధర్మాన్ని మెరుగుపరచుకునే విధంగా ఈ వక్ర శని జాతకునికి వివిధ రకాలుగా జీవిత పాఠాలు నేర్పిస్తాడు.
చివరగా నా 25 ఏళ్ల జ్యోతిష్య అనుభవంతో నేను చెప్పేది ఏమిటంటే, జన్మకుండలిలో శని వక్రస్థితిలో ఉంటే, జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టాలలో శుభ ఫలితాలను మరియు ఆశుభ ఫలితాలను అందజేస్తాడు. ఆ ఫలితాలు ఎలాంటివి అనేది జాతకుని యొక్క జన్మకుండలిలో జన్మ లగ్నం మరియు శని యొక్క స్థితి పై ఆధారపడి ఉంటుంది. ఎంతో ప్రసిద్ధి గాంచిన వారి జన్మకుండలిలోనూ వక్ర శని ఉన్నాడు. అదే విధంగా, ఏమి సాధించని వారి జన్మకుండలిలోనూ వక్ర శని ఉన్నాడు. ఇది నా 25 ఏళ్ళ జ్యోతిష్య అనుభవంలో నిరూపణ అయ్యింది.
వక్ర గతిలో ఉన్న శని జాతకులను తీవ్రమైన పరీక్షలకు గురి చేస్తాడు. వక్ర గతిలో ఉన్న శని పెట్టే ప్రతీ పరీక్షలో ఉన్న అంతరార్థమును అర్థం చేసుకున్న మరుక్షణం, ఆ సమస్య నుండి జాతకుడు బయటపడతాడు. కానీ అది అంత సులువు కాదు, అందరికీ సాధ్యం కూడా కాదు. జన్మకుండలిలో ఇతర గ్రహాలు జాతకునికి సహకరించినట్లైతే, వక్ర శని ఇచ్చు ఫలితాలను సులువుగా అధిగమించి, శని పెట్టే ప్రతీ పరీక్షలో అంతరార్థం అర్థం చేసుకొని, చివరకు ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. వక్రగతిలో ఉన్న శని యొక్క ఫలితాలు భిన్నంగా ఉంటాయి. జన్మకుండలిలో శని సవ్య దశలో సంచరించినపుడు ఇచ్చే ఫలితాలకు పూర్తి భిన్నంగా వక్ర శని ఫలితాలు ఉంటాయి. అందువలనే వక్ర శని ఉన్న జాతకులకు ప్రతీ పనిలో జాప్యాన్ని, గందరగోళాన్ని, ఊహించని మార్పులను ఇస్తాడు. కానీ చాలా సంధర్భాలలో, అనుభవించే కష్టాలు, పనుల్లో జాప్యాల వల్లనే జాతకుడు మరింత వివేకంగానూ, బలంగానూ తయారు అవుతాడు.
గమనిక: ఈ ఫలితాలు శని వక్ర గతిలో ఉన్న వారందరికి ఒకేలాగా వర్తించవు. వారి జన్మ లగ్నమును బట్టి, శని వక్రించిన రాశిని బట్టి, భావాన్ని బట్టి ఫలితాలు భిన్నంగా ఉంటాయి. 12 లగ్నముల వారికి, 12 రాశుల్లో శని వక్ర స్థితిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో అన్న అంశం మీకు విడివిడిగా త్వరలోనే అందజేస్తాము.
జన్మకుండలిలో శని వక్రించినట్లైతే, వాటి యొక్క దుష్ఫలితాలు తెలుసుకొని, వాటికి తగినటువంటి ప్రాయశ్చిత్త పరిహార పూజా విధానాలు పాటించి, జీవితంలో ఎదుర్కొంటున్న శని వక్రగతి, స్తంభన దుష్ఫలితాల నుండి నివారించవచ్చు. ఆనందాది యోగాలను పొందవచ్చు. అత్యంత క్లిష్టమైన మరియు ప్రధానమైన అంశమైన శని స్తంభన, వక్రగతి పరిశీలన విధానము ప్రప్రథమంగా శ్రీ మలయాళ భగవతి నాగరాజా మరియు నాగాయక్షి పీఠము వారు మాత్రమే ప్రజలకు అందజేస్తున్నారు.
వ్యక్తిగత సంపూర్ణ జన్మకుండలి పరిశీలన కొరకు https://brahmatantra.com/complete-personal-horoscope-reading/ లింకు ద్వారా నమోదు చేసుకోవచ్చును. 9846466430 నెంబరు పై సంప్రదించవచ్చును.
