loading

జ్యోతిష్య పరిశీలన

  • Home
  • జ్యోతిష్య పరిశీలన

జాతకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమైన గ్రహస్థితులను జన్మకుండలి ద్వారా తెలుసుకునే విధానం, వాటికి పరిహార మరియు పరిష్కార మార్గాలు తెలుసుకునే విధానం, జన్మకుండలిలో అదృష్టాన్ని కలిగించే యోగాలు, దురదృష్టాన్ని కలిగించే అవయోగాలు,  జాతకులకు ఎలాంటి గ్రహస్థితులు ఉంటే ఏ ఏ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తమ జన్మకుండలి ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వజన్మ కర్మలు; స్వగృహ యోగం; సుఖ వాహన యోగం; సంతాన యోగం; విద్యా యోగం; వివాహ యోగం; విదేశీయాన యోగం; విదేశీ ఉద్యోగ యోగం; విదేశీ నివాస యోగం; ప్రణయ సఫలీకృత యోగం (ప్రేమ వ్యవహారాలు); శృంగార యోగం; పదవీ యోగం; వ్యాపార యోగం; వైవాహిక ఆనంద యోగం; దుర్మరణ అవయోగం; బలవన్మరణ అవయోగం; స్త్రీ మూలక విచార అవయోగం; స్త్రీ మూలక ధన ప్రాప్తి యోగం; నష్టద్రవ్య ప్రాప్తి యోగం; అదృష్ట యోగం; ఆయుః క్షీణ యోగం; పూర్ణాయుర్దాయ యోగం; దైవకృప సిద్ధి యోగం; దైవశాపం; స్త్రీ శాపం; మాతృ శాపం; పితృ శాపం; గురు శాపం; నాగ శాపం; పక్షి శాపం; బ్రాహ్మణ శాపం; మాతృ శాప అరిష్ట యోగములు; భూ చరాస్తి యోగం; అనుకూల దాంపత్య యోగం; వాహన ప్రయాణ క్షేమ యోగం; వాహన దుర్ఘటన యోగం; ఇలా మొదలైన యోగములు, అవయోగములు వలన జాతకులు పొందే ఆయురారోగ్య, ఐశ్వర్య, ఆనందాలు పొందుటకు ఉపకరించే గ్రహాల గ్రహ స్థితులను, యోగాలను పొందుటకు అడ్డుపడే గ్రహాల చెడు లక్షణాల స్థితిగతులను జన్మకుండలి యొక్క పరిశీలన (జాతక పరిశీలన) ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో ప్రతి సమస్యకు పరిహారం ఉంటుంది.  

ఈ జాతక పరిశీలన కొరకు పుట్టిన తేదీ, పుట్టిన సమయం వివరాలు ఖచ్చితంగా ఉండాలి. జాతక పరిశీలన చేసి సంపూర్ణ గ్రహదోషాలు, యోగాలు, అవయోగాలు, పరిహారాలతో సహా రాసి 7 రోజుల లోపు కొరియర్ ద్వారా పంపబడుతుంది. సంభావన 1500/-. వివరాల కొరకు 9846466430 నెంబరుకు కాల్ చేసి కనుక్కోవచ్చు. జాతకుల జన్మకుండలిని విశ్లేషణ చేయుటకు గురువర్యులకు 4-7 రోజుల వ్యవధి పట్టును. గురువర్యుల నుండి తమ జాతకమును పరీశీలించదలచిన వారు క్రింద ఇవ్వబడిన ఫార్మ్ పూరించవలసి ఉంటుంది. బుక్ చేసుకున్న 4-7 రోజుల లోపు తమ జాతకచక్రంలోని యోగాలు, అవయోగాలు, ప్రధాన అంశాలను, ప్రధాన ఘట్టాలను, గ్రహ దోష అవయోగాలకు తగిన పరిహారములు తంత్ర విధానములో తెలుసుకోవచ్చును. జాతకులు తమ జాతక పరిశీలన వివరాలను తాము పొందిన తరువాత మాత్రమే తమ సందేహాలను ఫోను ద్వారా తెలిపి సందేహ విశ్లేషణను తెలుసుకొనవచ్చును. జాతక పరిశీలనలో ప్రత్యేకంగా ఏదైనా విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన జరగాలి అనుకున్నవారు క్రింద ఇవ్వబడిన ఫారంలో చివరి బాక్సులో తమ సందేహాలను తెలుపవచ్చును. లేదా 9846466430 వాట్సప్ నెంబరు పై అయినా తెలియజేయవచ్చును.  గురువర్యులు మీ జాతకములను కొన్ని నిర్ణీత సమయాలలో మాత్రమే పరిశీలించుట జరుగును. ఇక్కడ గల ఫారంను క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే సంప్రదింపులు చేయగలరని ఆశిస్తున్నాను. జాతక పరిశీలన శాంపిల్ ఎలా ఉంటుంది అనేది ఫారం కింద ఇవ్వబడిన లింకు ద్వారా చూడవచ్చు.

    Horoscope Reading Service






    Date of Birth:

    Time of birth:

    Place of birth (పుట్టిన స్థలం):