కాలసర్పశాంతి
వ్యక్తుల జీవితంలో ప్రమాదాలను కలిగించే యముడు, వరుణుడు, రాహువు, కుజుడు గ్రహాలు జన్మకుండలిలో ప్రతికూలంగా ఉన్నట్లైతే కొన్ని గ్రహ మహాదశలలో వాహన దుర్ఘటనలు, పిడుగుపాటు ప్రమాదాలు, జలగండాలు, ధీర్ఘ కాలిక రోగాలు ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. తంత్రశాస్త్రంలో ఒక భాగమైన యమవిధిబలి, వారుణాస్త్ర హవనం అనేటువంటి తంత్ర పరిహారాదులు అవయోగాలను, దోషాలను నిర్మూలిస్తాయి. మానవులకు ప్రమాదాలు, మృత్యు గండములు, వాహన దుర్ఘటనలు ఏ సమయంలో సంభవిస్తాయో అందరికీ తెలియదు. అందువలన ఈ కుజ, రాహు, యమ, వరుణ గ్రహాల వల్ల సంభవించే దుష్ఫలితాలకు ముందుగానే కొన్ని తంత్ర పరిహారాదులు ఆచరించడం వలన జరగబోవు ఉపద్రవాల బారీ నుండి తప్పించుకోవడం సాధ్యమవుతుంది. క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్యూరు, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలకు తంత్ర విద్యల ద్వారా నివారణ చర్యలు చేయవచ్చును. పైన పేర్కొన్న సమస్యలే కాకుండా, చర్మ సంబంధిత రోగాలు, రాహు కుజ పీడా దోషాలను నివారించడానికి నవనాగమండలం, మండకాళి హవనం, శేషనాగ తంత్ర పరిహారాల ద్వారా దోష నివారణ జరిపించవచ్చును. ఈ పరిహారాదులు జూలై 12,13,14 తేదీలలో ఆంధ్ర రాష్ట్రంలోని నారాయణవనం మండలంలోని శ్రీ మలయాళ భగవతి శ్రీ నాగరాజస్వామి నాగాయక్షి పీఠం, అరణ్యమలై నందు జరుగును.
కాలసర్ప దోషాలను సమూలంగా నిర్మూలన చేయగల శక్తి తంత్ర శాస్త్రంలో ఆశ్లేష బలి అనే సర్ప సంస్కార శ్రాద్ద బలి విధానానికి మాత్రమే ఉంది. వ్యక్తులకు జన్మతః ప్రాప్తించిన కాలసర్పదోషాలకు నివారణగా ఆశ్లేషబలి నిర్వహించడం జరుగుతుంది.
నాగదోషం, సర్పశాపం వంటి దోషాలకు నివారణ ఆశ్లేష బలి పూజ మాత్రమే. సాధరణంగా కాలసర్పదోష శాంతి పూజ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల వారు నిర్వహించడం, ఆచరించడం అనాదిగా జరుగుతూ వస్తుంది. అయితే, ఈ ప్రక్రియ మంత్ర క్రియా విధానం కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ ప్రక్రియను ఎప్పుడు చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలు సర్ప తంత్రంలో వివరణాత్మకంగా చెప్పబడ్డది.
ఆ నియమాలు ఏవనగా:
- కాలసర్పదోషం ఉన్నవారికి మాత్రమే కాలసర్పబలి, కాలసర్పశాంతి, ఆశ్లేషబలిని జరిపించాలి.
- జన్మకుండలిలో కాలసర్పయోగాన్ని కలుగజేసి ఆ దోషం ద్వారా నవగ్రహాలలో కొన్ని గ్రహాలు వ్యక్తులకు అవయోగాలను కలుగజేస్తాయి. ఈ అవయోగాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఆ గ్రహాల ద్వారా దుష్ఫలితాలను కనబరచడం జరుగుతుంది. కాలసర్పయోగాలకు కారణభూతమైన గ్రహాలకు వివిధ రకాలైన పరిహారాలు సర్పతంత్రంలో ప్రస్తుతించబడ్డాయి. కాలసర్పదోషాలను పరిశీలించి వారికి ఏ విధమైనటువంటి మంత్ర తంత్ర విధానాలను వినియోగించాలో ఋత్వికులకు తప్పక తెలిసి ఉండాలి. ఆశ్లేషబలిలో ఎన్నో రకాల మంత్ర తంత్ర విధి విధానాలు ఉన్నాయి. దోషానికి తగినట్టుగా పరిహార క్రియలు, మంత్ర వినియోగము ఉన్నాయి. అనుష్టాన ఆవాహ ముద్రలు, క్రియా విధానాలు శాస్త్రానుసారంగా ఆచరించాలి. సర్పశాంతి పరిహార క్రియలో కర్తలు, ఋత్వికులు సర్పముద్రలతో మాత్రమే ఆవాహన చేయాలి. ఋత్విక్కులు తాము సర్పముద్రలను ఆచరిస్తూ కర్తల చేత కూడా ఆ ముద్రలు చేసేలా తెలియజెప్పాలి.
- సర్పక్షేత్రములలో సర్పసంబంధిత అనుష్టాన ఆలయంలో గాని, నదీ పరీవాహక ప్రాంతాలలో గాని మాత్రమే ఈ పరిహారములు జరిపించాలి.
- సర్పశాంతిని జరిపించే ఋత్వికులు మడిని ఆచరిస్తూ, మంత్ర విధానాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. జ్యోతిష్య శాస్త్రంలో గల 36 రకాల కాలసర్పదోషాలను తెలుసుకొని వాటికి తగినటువంటి తంత్ర క్రియ విధానాలను మాత్రమే ఆచరించాలి. జాతకులకు కలిగినటువంటి కాలసర్పదోష అవయోగాలకు మాత్రమే ఋత్విక్కులు మంత్ర తంత్ర క్రియా విధానాలు పాటించాలి. ఈ క్రియా విధానంలో శ్రద్ద అత్యంత అవసరము. కర్తలు, ఋత్వికులు సంకల్పమును అధికంగా కలిగి ఉండాలి.
- సర్ప నక్షత్రాలలో మాత్రమే ఈ కాలసర్పశాంతిని నిర్వహించాలి. కాలసర్పశాంతిని చేయకోరదలచిన వారు వారి జన్మ నక్షత్రమునకు, జన్మ లగ్నమునకు షష్ట్య, నవమ స్థాన శుద్ధి తప్పక చూడవలెను.
- సర్ప విసర్జిత కుబుసమును సర్ప ప్రేత శాంతి కొరకు ఖచ్చితంగా వినియోగించవలెను.
- శ్రీ నాగరాజస్వామి మరియు నాగాయక్షి దేవతా మూలమంత్ర జపమును కర్తలు తప్పక జపించవలెను. కాలసర్పశాంతి క్రియ పూర్తి అయిన తరువాత శ్రీ నాగరాజస్వామి, నాగయక్షి కొయ్య లేదా లోహ విగ్రహమును ప్రసాద రూపములో స్వీకరించి, గృహమునకు తీసుకొనిపోయి వారి పూజా మందిరములో ప్రతిష్టించవలెను. కర్తలు ఈ కార్యక్రమం పరిహార క్రియలో సాంప్రదాయ శ్వేతవర్ణ దీక్షా వస్త్రములు తప్పక ధరించవలెను మరియు వస్త్ర యజ్ఞోపవీతమును ధరించవలెను. సర్పశాంతి పరిహార క్రియలో ప్రధానంగా నాలుగు రకాల యజ్ఞగుండములను ఉపయోగించవలెను. క్షేత్రపాలక ఆవాహన అనుమతిని పొందవలెను. ప్రాయశ్చిత్త జపమును చేసుకోవలెను.
శ్రీ నాగరాజస్వామి, నాగయక్షి క్షేత్రములో ఈ పరిహారములు జూలై 12, 13, 14 తారీఖుల్లో నిర్వహించ-బడుతున్నాయి. సర్ప ప్రత్యధిదేవతలు క్షేత్ర పాలకులుగా ఉండిన ఈ క్షేత్రంలో నాగరాజస్వామి, నాగయక్షి అమ్మవారు అధిష్టానమై ఉన్నారు. ఈ ప్రాంగణంలోగల పీఠంలో నాగరాజస్వామి అనుగ్రహము, శరణు పొందదలచి ఇచ్చట పరిహరాదుల క్రియలు నిర్వహించుచున్నారు. జూలై 12, 13, 14-2025 ఈ మూడు రోజులు కాలసర్పశాంతి పరిహారాది క్రియలు మలయాళ సర్ప తాంత్రిక విధానంలో నిర్వహించబడును. ఈ కాలసర్పశాంతి పరిహారాదులు జరిపించుకొదలచిన వారు చెల్లించవలసిన ఋత్విక్ సంభావన-25,000/-.
వ్యాపారాదులు నిర్వహిస్తూ నష్టములను ఎదుర్కొంటున్న వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు జన్మకుండలిలో వైవాహిక పీడా దోషము కలిగి ఉన్నవారు, సంతాన ప్రాప్తి పొందగోరువారు, ఉద్యోగ, పదవీ ప్రాప్తిని పొందగోరువారు, అందులో విశేషాభివృద్ధిని పొందగోరువారు, వివాహ ప్రాప్తి పొందగోరువారు, గ్రహమహాదశ పీడా దోషములకు పరిహారములు చేయించుకొదలచినవారు, భూ, గృహ చట్ట సంబంధిత వివాదాలలో పరిష్కారము కొరకు వేచి ఉన్నవారు, అనుకూల కార్యసిద్ధిని పొందగోరువారు జూలై 12,13,14 తేదీలలో పరిహారాదులు మా పీఠమునందు జరిపించుకోగలరు.
గమనిక: జూలై 12, 13, 14 వ తేదీలలో పరిహారాలు జరిపించుకోవాలి అనుకున్న వారు మరిన్ని వివరాలకు, తమ పేర్లను నమోదు చేసుకొనుటకు 9846466430 నెంబరుని సంప్రదించగలరు.
మరిన్ని వివరాలకు 9846466430 నెంబరును సంప్రదించగలరు.