loading

About

                  నేను, C.V.S. చక్రపాణి, జ్యోతిష్య ప్రపంచానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. గత 25 సంవత్సరముల నుండి ఎన్నో వేల మంది యొక్క జాతక పరిశీలన చేశాను. జ్యోతిష్యశాస్త్రంలో పట్టభధ్రుడు అయిన నాటి నుండి జాతక చక్ర పరిశీలన చేయటం ప్రారంభించాను. మొదటి 6 నెలల వరకు ఒక్కో జన్మకుండలి పరిశీలనకు నాకు 3 నుండి 4 గంటల సమయం పట్టేది. నా 25వ ఏట నుండి జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రముల పరిశీలన చేస్తూ, విశ్లేషిస్తూ వాటిలోని సూక్ష్మమైన మంత్ర, తంత్ర రహస్యములను తెలుసుకున్నాను. ఈ జ్యోతిష్య శాస్త్రం శాస్త్రీయమైనదా అనే సందేహంతో నాకు తెలిసిన నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు యొక్క పుట్టిన తేదీ, సమయం,స్థలం ఆధారాలతో వారి యొక్క జాతకాలను పరిశీలన చేసేవాడిని. వారికి జరిగిన సంఘటనలు, వారి జాతక పరిశీలనలో అగుపించిన సంఘటనలు ఒకే విధంగా ఫలిత నిరూపణ జరిగింది. నాకు సంపూర్ణమైన విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం పై కలిగింది. నా జాతకాన్ని పరిశీలించుకున్నాను. నాకు కలిగిన, నేను అనుభవించిన సంఘటనలు, యోగాలు, అవయోగాలు నాకు మాత్రమే తెలుస్తాయి. నా జాతక పరిశీలనలో ఫలితాలు ఖచ్చితంగా నిరూపణ అయ్యాయి.అప్పటి నుండి సంపూర్ణమైన విశ్వాసం, ప్రఘాడ విశ్వాసం నాకు జ్యోతిష్య శాస్త్రం పై కలిగాయి. మొదట్లో నాకు యోగాలు, అవయోగాలు మాత్రమే తెలిసేవి, పరిహారాలకు ఖచ్చితమైన విధానాలు నాకు తెలిసేవి కావు. భూత, భవిష్యత్, వర్తమానంలో జరిగే విషయాలను మాత్రమే తెలుపగలిగేవాడిని. తరువాతి కాలంలో క్రమేణా 15 నిమిషాలలో సంపూర్ణ విశ్లేషణకు సరిపడేది. గతించిన వారి జ్యోతిష్య పరిశీలన ఎవరు చేయరు. కానీ నేను చేశాను. ఎందుకంటే జాతకపరిశీలనలో  ఆయుర్దాయ ప్రమాణాలు చెప్పటం శాస్త్ర సమ్మతం కాదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం నా స్నేహితుడు అయిన ప్రశాంత్ వర్మ ఆకస్మికంగా 24వ ఏట వాహన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. తన యొక్క అలవాట్లు, ప్రవర్తన, గుణం అన్నీ నాకు తెలుసు. హఠాన్మరణం పొందిన నా స్నేహితుని జన్మకుండలిని నేను పరిశీలించాను. అతని జాతకంలో అల్పాయుర్దాయం కనిపించింది. అప్పుడు అతనికి ఉన్న యోగాలు, అవయోగాలు మొత్తం నాకు తెలిసాయి. అపమృత్యుదోషం మరియు అల్పాయుర్దాయ దోషానికి గల వ్యత్యాసాలు నా స్నేహితుని జాతకం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అప్పటి నుండి జన్మకుండలిలోని యోగాలు, అవయోగాలు ఖచ్చితంగా తెలుపగల జ్యోతిష్య జ్ఞానం నాకు అలువడ్డాయి. 

 

                    సంతాన రాహిత్యమునకు కొన్ని వేలమందికి కాలసర్ప దోష నివారణ పరిహారాలను, తాంత్రిక పరిహారాలను జరిపించాను. వారు సంతాన సాఫల్యం కూడా పొందడం జరిగింది. కొన్ని కొన్ని గ్రహ దోష అవయోగాలకు కేరళ మళయాళ తంత్ర శాస్త్రం ద్వారా శీఘ్రమైన కార్యసిద్ధి జరగడం నేను గమనించాను. ముఖ్యంగా మా పూర్వీకులైన వారు కేరళ జ్యోతిష్య శాస్త్రంలో ఉద్దండులు, తంత్ర శాస్త్రంలో మరియు మంత్ర శాస్త్రంలో అమోఘమైన అభ్యాసన, అనుష్టానాన్ని కలిగిన మా గురుదేవులైన “అనంత శేషన్ నంబూద్రి” గారి శిక్షణలో 9 సంవత్సరాలు తాంత్రిక పరిహారాలు అభ్యసించి, గ్రహ దోష నివారణ పరిహారములను జరిపించి సంపూర్ణమైన ఫలితాలను పొందగలుగుతున్నాము.

 

         జ్యోతిష్య శాస్త్రం మహా సముద్రం వంటిది. వాటిలో కొన్నిటిని అభ్యసించిన దశ మహావిద్యలను ఆచరించి చేయగల కార్యశీలత, తాంత్రిక విద్యలు సంపూర్ణంగా నేర్చిన మేము ఈ శాస్త్రానికి అంకితమయ్యాము. సర్పాలకు, సర్ప గ్రహాలకు అధి దేవత మరియు జాతకులకు గల అవయోగాలను హరించగల శక్తి, సామర్థ్యాలు ఉన్న నాగరాజ యక్షిణిని శాంతింపజేసే విధానాలు, సంతుష్టింపజేసే ప్రాయశ్చిత్త కర్మలు కేరళ తాంత్రికంలో మాత్రమే మేము చేశాము. అందువల్ల దీనికి అంకితమైన మేము, మా తాంత్రిక పీఠమునందు జ్యోతిష్య పరిశీలన మరియు గ్రహ దోష పరిహరాదులు ఆచరిస్తున్నాము. 

 

         జ్యోతిష్య శాస్త్రంలో నేను మెడికల్ ఆస్ట్రాలజీ విభాగంలో, తంత్ర శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో గౌరవ డాక్టరేటును స్వీకరించాను. తాంత్రిక విద్యలో తంత్ర పీఠము వారు నాకు దైవజ్ఞ రత్న బిరుదుని నాకు అందజేశారు.అదే రీతిలో రత్నశాస్త్ర నిపుణుడిగా రత్న బ్రహ్మ (Gemmologist) గౌరవ పురస్కారాన్ని అందజేశారు. ఎన్నో వేల మందికి నేను సంపూర్ణమైన జాతక పరిశీలనము చేయడం జరిగింది. గురువుల అనుగ్రహం వల్లనూ, నా జాతకంలో మంత్రానుష్టాన గ్రహలైన గురువు, రాహువుల వల్లనూ, పూర్వజన్మలో ఆచరించిన ఆధ్యాత్మిక జ్యోతిష్య రంగాల వల్లనూ నేను పరిశీలించే జాతకాలు, యోగాలు, అవయోగాలు, గ్రహ దోషాల విషయంలో 99% ఫలితాలను నేను సాధించగలిగాను. విశాఖ సమాచారం, మలయాళ మనోరమ పత్రికలలో జ్యోతిష్య శాస్త్రం పై ఎన్నో ఆర్టికల్స్ వ్రాసాను. నాగ శక్తి, తంత్ర పుస్తకములను నేను వ్రాసితిని, ఈ గ్రంథాలు తెలుగు, కన్నడ భాషల్లో మార్కెట్లో లభించును. రక్ష, కేరళ తంత్ర యుక్తి అను గ్రంథాలు ప్రచురణకి వెళ్లబోతున్నాయి. 

 

               గత 15 సంవత్సరముల నుండి కేరళ ప్రశ్నము, లకోట ప్రశ్నము, దైవ ప్రశ్నము వంటి ప్రశ్నాశాస్త్ర విధానముల ద్వారా మంత్రానుష్టాన సమయంలో జాతకుల యొక్క ప్రశ్నలకు పరిష్కార, సమాధానములు తెలుపుతుంటిని. మంత్రానుష్టానముతో చేసేడి యంత్రానుష్టాన పూజలకు అవసరమైన పంచలోహ యంత్రములను నా పీఠము నుండి అందజేయగలుగుచుంటిని. వధూ వరుల వివాహ పొంతన విషయంలో చేసే క్రియా విధానాలను గుణమేళనము విధానము ద్వారా కాకుండా వ్యక్తిగత మాంగల్య, వైవాహిక దోష పరిశీలన ద్వారా చేయుచుంటిని. గుణమేళనం ఆధారంగా చేసే ఫలితములు సంపూర్ణమైన విశ్లేషణను, ఫలితాలను అందజేయవు. 

 

రత్న ధారణ విషయంలో సంపూర్ణమైన వివరణ ఇస్తున్నాను. జాతకంలో రత్న ధారణ దేని ఆధారంగా ఏ రత్నాన్ని ధరించాలి అన్న విషయం నవమ స్థాన చేతనాధికార శక్తి అను జ్యోతిష్య అంశ పరిశీలన జాతకులకు రత్న ధారణము చేయుచుంటిని. జన్మలగ్నాన్ని అనుసరించి అనేకమైన గ్రహ అవయోగాలకు ఎన్ని వేల సార్లు పరిహరాదులు జరిపించి జాతకుల అభిమానానికి (మా పీఠము) పాత్రులమయ్యాము. నా 25 సంవత్సరాల జ్యోతిష్య శాస్త్ర అనుభంలో 75 సంవత్సరముల అనుభవాన్ని తంత్ర శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో, మంత్ర శాస్త్రంలో నేను గడించాను. శాస్త్రజ్ఞాన అనుభవం, మంత్రానుష్టాన అనుభవం, తాంత్రిక పరిహార జ్ఞాన అనుభవం ద్వారా ఇప్పటి వరకు నేను జాతకులకు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది, జరుగుతున్నది. నా ఈ జ్యోతిష్య, వాస్తు, తంత్ర శాస్త్ర విజ్ఞానం అనుభవాలు, నేను చేస్తున్న యజ్ఞ యాగాది గ్రహ పరిహారాల ద్వారా ప్రజలందరికీనూ ఉపయోగపడాలని నా ఆకాంక్ష. 

 

                                   -Dr. C.V.S.చక్రపాణి, దైవజ్ఞ రత్న, జ్యోతిష్య భూషణ

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X