loading

రత్నధారణ ఫలితములు

  • Home
  • రత్నధారణ ఫలితములు

వ్యక్తుల జన్మకుండలి పరిశీలన ద్వారా వారికి కలిగే అవయోగాలు పరిశీలించి వారికి అదృష్ట యోగములు ప్రాప్తించే విధముగా వారికి రత్నధారణ తెలుపబడుతుంది. అన్నీ రకముల జాతి రత్నములు మా పీఠమునందు మంత్ర జపములు పొందినవై సంప్రోక్షణ గావించినవై ఉండును. శ్రేష్టమైన, దోషములు లేని జాతి రత్నములు మా వద్ద లభించును. రత్నధారణ వల్ల కలిగే ఫలితాలలు ఏమిటి? ఏ విధంగా రత్నాలను జాతకులకు నిర్ధాలించాలి అన్న విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి. పూర్తిగా చదవండి. 

 

శ్రీమన్నారాయణుడు “కౌస్తుభం” అన్న పేరుగల ఒక మణిని తన వక్ష స్థలం మీద ధరిస్తాడని మహాభారతంలో చెప్పబడి ఉంది. మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది అని చెబుతారు. ప్రపంచం ఆవిర్భవించడానికి పూర్వమే మహావిష్ణువు ఈ కౌస్తుభ మణిని ధరించాడని హైందవ పురాణాలలో చెప్పబడి ఉంది. దీని ప్రకారం చూసినట్లైతే రత్నాలు భగవంతుడు ఆవిర్భవించినప్పుడే ఏర్పడ్డాయని నమ్మక తప్పదు. రత్న శాస్త్రం దాదాపు 10 వేల సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నది. వరాహ మిహరుడు వ్రాసిన “బృహత్ సంహిత” అనే గ్రంథంలో రత్నాల గురించి తెలియజేయబడిన “రత్న అధ్యాయము” అనే ప్రత్యేక విభాగం ఉందని చాలా మందికి తెలియదు. అగ్ని పురాణంలో రత్న శాస్త్ర విషయాలు ఎన్నో వివరించబడ్డాయి. కొన్ని రత్నాలను పరీక్ష చేసే పద్ధతులు సాధారణ వ్యక్తులు సైతం చేయగలరు. వజ్రాన్ని,టోపాజ్, శోభామణి, తృణకాంత మణులను సాధారణ విధానాల ద్వారా పరీక్ష చేయవచ్చు. వీటికి కావల్సిన అనగా ఈ రత్న పరీక్షకు కావాల్సినవి ఊలు వస్త్రం లేదా ప్రత్తి మాత్రమే. 

 

రత్న ధారణ చేయడం వలన మనిషి ఆలోచన విధానము వివేకాత్మకముగా ఉంటుంది. ఫలితంగా మనిషి తనకు ప్రయోజనము, కలిగించే పనులను మాత్రమే చేస్తాడు. పట్టుదల పెరుగుతుంది. ఉత్సాహవంతంగా మారడం జరుగుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో విజయాలు సాధించాలంటే మేధస్సు, పట్టుదల మరియు ఉత్సాహం, కావాలి వీటినే ప్రసాదించడానికి జ్యోతిష్య శాస్త్రం, రత్న ధారణ విధానాన్ని మానవులకు సూచించింది. 

 

నవగ్రహాలలో ఏ గ్రహ అనుగ్రహం పొందడానికి ఏ రత్నం ధరించాలో జ్యోతిష్య శాస్త్రం తెలియజేసింది. రత్న శాస్త్రంలో 84 రకాల రత్నాల గురించి వివరించబడింది. ఒక్కొక్క రత్నం ఒక్కొక్క లక్ష్య సాధన కోసం ఉపయోగిస్తారు. కొన్ని రకాల రోగాలను నియంత్రించడానికి లేదా తగ్గించడానికి రత్న ధారణలు సూచించబడ్డాయి (ఉపరత్నధారణ). కొన్ని సమయాలలో, కొన్ని రత్నాలలో ప్రకృతి సిద్ధంగా కొన్ని మలినాలు చేరతాయి. ఫలితంగా ఆ రత్నాలగుండా కాంతి ప్రవహించదు. అలాంటి రత్నాలు దోష పూరితమైనవని వాటిని వాడకూడదని చాలా మంది వదిస్తూ ఉంటారు. కానీ అది అసత్యం. రత్నం గుండా కాంతి ప్రవహించినప్పటికి వాటి యొక్క ప్రభావం ఏ మాత్రం తగ్గదని వాటిని ధరించిన వారికి శుభ ఫలితాలు తగ్గవని గ్రహించాలి. కాంతి ప్రవహించని రత్నాలలో :హాకీక్” మరియు “ఫిరోజ్” రత్నాలు ముఖ్యమైనవి. ఈ రెండు రత్నాలు అద్భుతమైన శక్తుల్ని కలిగి ఉంటాయి. 

 

రత్న ధారణ వలన నిజంగా ప్రయోజనం ఉంటుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. రత్న ధారణ వల్ల మనిషికి ప్రయోజనం ఎలా కలుగుతుంది అన్న విషయాన్ని శాస్త్రీయంగా వివరిస్తాను. ఈ ప్రపంచంలో వివిధ రూపాలలో ఉండే శక్తికి మూలస్త్తానమ్ సూర్య భగవానుడు. ఈ సూర్యుడి యొక్క శక్తి పంచభూతములలోనూ, నవగ్రహాల లోనూ దాగి ఉంటుంది. ప్రతి రత్నము కూడా సూర్యుని నుండి వచ్చే శక్తిని తన లోకి తీసుకొని, ఆపై ఏ గ్రహానికి అయితే చెందిందో ఆ గ్రహానికి చెందిన శక్తిగా మారుస్తుంది. మానవులు రత్నాలను ధరించడానికి ఉపయోగించే ఉంగరాలు లేదా లాకెట్ రూపంలో ఉండే లోహం (బంగారం/వెండి/పంచలోహం) రత్నానికి మరియు మనిషి శరీరంలో ఇతర భాగాలకు మధ్య అనుసంధానంగా (కనెక్షన్) పనిచేస్తుంది. ఒక మనిషికి ఏ గ్రహం యొక్క శక్తి తక్కువ అవుతుందో ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని లేదా ఉపరత్నాన్ని ధరించినట్లైతే ఆ రత్నం, సూర్యుని శక్తిని తనలోకి తీసుకొని ఆపై ఆ శక్తిని జాతకునికి కావల్సిన గ్రహ శక్తిగా మార్చి జాతకుడికి అందిస్తుంది. 

 

రత్న శాస్త్రం జ్యోతిష్య శాస్త్రాలలో ఒక భాగంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో లోతైన పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే సరైన రత్నాన్ని సూచించగలరు. కొంతమంది జ్యోతిష్యులు (సిద్ధాంతులు) అర్థ రహితమైన  లేదా ప్రమాదకరమైన రత్నాల కలయికను తమ అమాయక ఖాతాదారులకు సూచిస్తున్నారు. ఉదాహరణకు: ఒక సిద్ధాంతి తన వద్దకు వచ్చిన వ్యక్తికి పగడం మరియు ముత్యం కలిపి ఉంగరంలో పొదిగించి ధరించమని సూచించాడు. వాస్తవానికి పగడానికి అధిపతి కుజుడికి, ముత్యానికి అధిపతి అయిన చంద్రుడికి మధ్య గ్రహ శతృత్వం ఉంది. అందువల్ల పగడాన్ని మరియు ముత్యాన్ని కలిపి ధరించడం వల్ల జాతకునికి అనేక రకాల కొత్త సమస్యలు వస్తాయి. కొంతమంది నవరత్నాల ఉంగరాలు ధరించడం వల్ల, ఎవరో కొద్ది మందికి తప్ప మిగిలిన చాలా మందికి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయని గ్రహించాలి. వ్యక్తుల జాతకంలోని గ్రహ స్థానాల స్థితిగతులను, నీచ, స్వక్షేత్ర, శతృ దృష్టులను పరిశీలించాలి. లగ్న, నక్షత్ర, రాశి, నవాంశలను, దశాంశలను క్షుణ్ణంగా పరిశీలించి రత్నధారణను చెప్పవలెను. అంతేగానీ, తరచూ మారే గ్రహ స్థితులను ఆధారంగా చేసుకొని రత్నధారణ నిర్ణయము చేయరాదు. రత్న ధారణ శాస్త్ర నియమాలతో శాస్త్ర బద్ధంగా ఉండాలి. రత్నముకు జపము మరియు దానము చేయవలెను. నియమిత వారములలో, నియమిత సమయాలలో సూచించబడిన వేలుకు ధరించవలెను. ఈ విధంగా అన్నియూ శాస్త్ర నియమాలతో కూడి ఉండిన పద్ధతిని ఆచరించి రత్న ధారణ చేయడం వలన ఖచ్చితమైన ప్రయోజనములు పొందగలరు. 

 

జాతక పరిశీలన: 

 

జన్మకుండలిని పరిశీలించి ఆరూఢ పథం ద్వారా మరియు కేరళ జ్యోతిష్య నిఘూడ విధానాలా ద్వారా జాతకులకు భూత, భవిష్యత్, వర్తమానములలో జరిగే సంఘటనలీ, కలిగే యోగాలు, అవయోగములు, వారి ప్రాప్తించెడి బంధములు, ఆస్తులు పొందుట, పితృదోషము, వైవాహిక దోషములు, వాటి వలన కలిగే దుష్పరిణామాలు, గురు చండాల యోగము పరిశీలన, వాటి వలన కలిగే ప్రతికూల సంఘటనలు, వాటికి నివారణా మార్గాలు, వైవాహిక దోషం కారణంగా కలిగే వైధవ్య దోషములు, ఆలస్య వివాహ దోషములు, వాటికి పరిహారములు,ఆదాయ క్షయం, ఉద్యోగ అస్థిరత, ఉద్యోగం పొందలేకపోవడం, ఉన్న ఉద్యోగంలో సమస్యలు ధీర్ఘ కాలిక రోగముల వలన కలిగే శరీర బాధలకు గ్రహ దోష పరిహరాదులు, కేరళ తాంత్రిక విధానంలో ప్రైహారాలు తెలిపి, వాటికి పరిహరాదులు జాతకులకు నిర్వహించుట జరుగును. పితృదోషం వలన కలిగే అపశ్రుతులు, స్థిరస్తులు, పిత్రార్జితము కోల్పోవుట, స్వగృహ ప్రాప్తి, వాహన గండములు, వాటికి నివారణా మార్గములు, విద్యా హీనత, పరిష్కారములు, ఈ విధంగా జాతకుని యొక్క జీవిత విశేషములు గ్రహ స్థితులు, వాటి ఫలితములు, మొత్తం అన్నియూ క్షుణ్ణంగా పరిశీలించి తెలుపబడుతుంది. వ్యక్తుల జాతకపరిశీలన ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారములు ఖచితముగా తెలుపగలము. 

 

ph: 9846466430

 

email: chakrapani.vishnumaya@gmail.com

Follow us on Facebook

Latest Topics

Subscribe to our newsletter

Please wait...
Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
X