వృషభరాశి గోచార ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 14, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి రవి ఈ 15 రోజులు 8వ భావములో అనగా ధనస్సు యందు సంచరించడం వల్ల స్త్రీల వలన కలహం, ప్రభుత్వాధికారుల నుండి వచ్చేది హెచ్చరికలు వృషభరాశి వారిని భయాందోళనకు గురి చేయును. ఉష్ణప్రకోపము, బి‌పి సమస్యలు అనారోగ్యమునకు గురి చేయుట జరుగును. గతంలో జరిగిన కోర్టు లేదా చట్ట సంబంధమైన వాటి వలన తీవ్ర ఆందోళనకు గురి చేయును.

కుజుడు 7వ స్థానములో స్థితి చెంది ఉండుట వల్ల ఈ సప్తమ స్థానం పురుషులకు వైవాహిక స్థానం ఆగుట వలన స్త్రీలకు హృదయ స్థానం కావడం వల్ల భార్యతో తీవ్రమైన కలహములు సంభవించును. భర్తతో ఏర్పడు విభేదాలు కలహాలకు కారణం అన్య స్త్రీ సంబంధిత వివాదాలే కారణమగును. స్త్రీలు కొంచెం సహనముగా ఉండుట వలన దాంపత్య జీవితమునకు మేలు జరుగును. కళ్ళు మసకమసకలుగా కనబడటం, కంటిలో పొక్కులు రావడం, అజీర్ణం కాకపోవడం, గ్యాస్ సమస్యలు సంభవించును.

బుధుడు 9వ స్థానములో అనగా పితృ స్థానమందు ఉండినందున ఈ 15 రోజులలో జాతకుల తండ్రి వర్గం వారికి జాతకులకు అనారోగ్యము బాధిస్తుంది.

గురు గ్రహము 10వ స్తానమందు ఉండినందున 10వ స్థాన రాజ్య భావ, ఉద్యోగ, ఆదాయ భావమునకు అధిపతి అయినందున వృషభరాశి వారికి ఈ పక్షం రోజులలో గురువు ప్రతికూలుడు. ఇందు కారణంగా ఉద్యోగమునందు, పదవీ, అధికారములందు, మీ శతృ వర్గం వారిదే పై చేయి కావడం జరుగుతుంది, దీని వల్ల ఉద్యోగస్థానములో, అధికారములో ఆ స్థానమును కోల్పోయే అవకాశములు మెండు, ముఖ్యంగా గురువు వ్యతిరేక ఫలితములను ఇచ్చుట వల్ల పై అధికారుల వలన సమస్యలు, స్థాన నాశం సంభవించును. ఈ విషయాదుల గురించి వెచ్చించుచున్న ధనము వృధా అగును.  చేస్తున్న పనులకు ఫలితము నశించును. అఘోరీ పాశుపత యంత్ర పూజ చేయుట మేలు.

శుక్రగ్రహం అష్టమ స్థానమందు ఉండినందున వృషభరాశి వారు గృహోపకరణ వస్తువులు కొనుట జరుగును. ఈ 15 రోజులు శుక్రుడు అనుకూలుడు. స్త్రీ సౌఖ్యం, రత్న ధారణ చేయును.

వృషభరాశి వారికి శని భగవానుడు ఈ 15 రోజులు మిక్కిలి అనుకూలుడు. 9వ స్థానములో శనీశ్వరుడు అనగా పితృ స్థానంలో ఉండినందున పితృదేవతలను స్మరించుకోవడం, స్వయంపాకములు సమర్పించడం, వారి యొక్క ఆశీర్వాదం పొందడం సంభవించును. ఇందుకారణంగా ధనలాభం, దానం వలన పుణ్యఫలం మేలు జరుగును కార్యములందు సాధ్యత కలుగును. విశేషించి స్త్రీ సుఖం కలుగును. ఈ 15 రోజులలో కొన్ని దినములలో మాత్రమే రవి, కుజుడు, బుధుడు, గురువు గ్రహాలు ప్రతికూలముగా ప్రతికూల ఫలితములను వారి గ్రహ కిరణముల ద్వారా ప్రసరింపజేయుట జరుగును. వృషభరాశివారికి ఈ 15 రోజులు గడ్డుకాలమనే చెప్పాలి.

 

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

 

Leave a Reply