తులారాశి గోచార ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 14, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు. 

తులారాశి

రవి 3వ స్థానంలో ఉండటం వల్ల శత్రువులు నాశనం అవుతారు. స్థాన బలం, స్థానం వలన లాభం, ధన పుష్టి, అన్నదమ్ముల మధ్య మైత్రి ఆరోగ్యం చేకూరుతాయి.

మంగళుడు(కుజుడు)2వ స్థానంలో ఉండటం వల్ల ఆ స్థానం నేత్ర స్థానం కావడం వల్ల ఈ 15 రోజులలో ప్రతికూలంగా ఉండును. ఈ కారణం చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత భయాందోళనలకు గురి కావడం జరుగుతుంది. దొంగల వలన దొంగతనం వలన ఉపద్రవములు భయాందోళను సంభవిస్తాయి.

బుధుడు 4వ స్థానములో ఉండుట వల్ల గృహాది విషయాల వల్ల కుటుంబంలో వ్యక్తులకు మరియు మాతృ సంబంధిత బంధువులకు ధన లాభం, గృహ లాభం చేకూరుతాయి. కుటుంబం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.

బృహస్పతి 5వ స్థానంలో ఉండటం వల్ల వాహన లాభం, సంతానం వల్ల మానసిక ఉత్సాహం, బంగారు రత్నాభరణాలు పొందడం జరుగును. సంతానం కోసం వారికి రత్నాభరణాలు కొనటం కోసం ధనాన్ని వెచ్చిస్తారు. తమ సంతానం కొరకు, తమ కొరకు వాహనాలు కొనుగోలు చేయడం జరుగును.

శుక్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల 3వ స్థానం సోదర, సోదరీ స్థానం అవ్వడం వల్ల ఈ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉండటం చేత ఈ వర్గం వారి నుండి గౌరవం, మైత్రి, సహాయం, ఆధరణ ప్రాప్తించును. ఈ పక్షం రోజుల్లో తమ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. ధన లాభం ప్రాప్తిస్తుంది.  అన్నీ స్థానముల నుండి బహుమతులు ప్రాప్తిస్తాయి. వస్త్రములు కొనుగోలు చేయటం మరియు వస్త్రాలు పొందటం జరుగుతుంది. శత్రువుల నాశనం కలుగుట తథ్యం.

శని కుటుంబ, వాహన, మాతృ, స్వగృహ స్థానము నందు ఉండుట వల్ల బంధువులలో సాంగత్యం, ఇంద్రుడికి ఉన్న పదవీ హోదా వలె ఐశ్వర్యం కలుగును.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply