సింహరాశి గోచర ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 14, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు. 

సింహరాశి

రవి పంచమ స్థానంలో ఉండి శత్రుపీడని, రోగ భయాన్ని, అనారోగ్యమును, బాధలను, దుఃఖాన్ని కలుగజేస్తాడు. పంచమ స్థానం సంతాన స్థానం, ఆదాయ స్థానం కావడం వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో శత్రుపీడను మరియు సంతానం కారణంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల గృహంలో శాంతి లేకపోవడం, రక్త స్రావం జరగటం, జ్వర బాధలు లాంటివి సంభవించడం, కడుపు నొప్పి, కడుపులో మంట, వీరు చేసే దుర్జన సాంగత్యం వల్ల సంభవిస్తాయి. కుటుంబంలో వ్యక్తులు కలహపడతారు.

బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల యోగకారకుడై అన్నీ కార్యాల యందు జాతకునికి విజయాన్ని చేకూరుస్తాడు. స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. రాజకీయ రంగమున గాని, వ్యాపారము నందు గాని, ఉద్యోగ స్థానము నందు గాని బహు విధముల లాభములు కలుగుతాయి.

గురువు 7వ స్థానంలో ఉండటం వల్ల దాంపత్య అనుకూలనకు బుద్ధి కుశలతను ప్రదర్శించటానికి అనుకూలమైన సంఘటనలను అనుగ్రహించడం జరుగుతుంది. ఈ పక్షం రోజులలో సింహరాశి వారికి సమాజంలోనూ, ఇంట్లోనూ తమ మాటకి విలువ పెరుగును. వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది.

శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ధనలాభం, సంతానం వల్ల ధన లాభం, బంధువులతో సౌఖ్యం, పెద్దల నుండి సంతోషం కలుగుతుంది.

శని 6వ స్థానంలో ఉండటం వల్ల శత్రువుల వల్ల పీడ రోగము, భయము, దుఃఖము కలుగును.

 

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply