మిధునరాశి గోచార ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 14, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు.

మిధున రాశి

మిధునరాశి వారికి రవి 7వ స్థానమందు వైవాహిక స్థానమందు ఉండినందున (జాతకులు గుర్తుంచుకోవాల్సిన విషయం- సప్తమ స్థానం అనేది పురుషులకు వైవాహిక స్థానం, దాంపత్య స్థానం అవుతుంది, స్త్రీలకు హృదయ స్థానం లేదా మనః స్థానం అవుతుంది). దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ పక్షం రోజులు జీవన విధానం ధైన్యముగా గడుస్తుంది, అజీర్ణ వ్యాధులు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఎసిడిటీ ఇబ్బందికి గురి చేస్తుంది.

మిధునరాశి వారికి కుజగ్రహం 6వ స్థానంలో ఉండటం వల్ల రాగి, బంగారం కొనుగోలు చేయుట, పొందుట జరుగును. ఇతరులతో ప్రాణభయం, కలహభయం కలుగును. శతృవర్గం వారు లేదా వీరితో కలహించిన వారు వీరికి ఏ కీడు తలపెడతారో అని భయాందోళనలకు గురి కావడం జరుగుతుంది. శత్రువులతో విరోధాలు పెరుగుతాయి.

బుధుడు 8వ భావంలో ఉండగా, చేయు కార్యములందు జయం కలుగును. పుత్రుల వలన వారి యోగక్షేమముల కారణంగా ఆనందము కలుగుతుంది.

గురు గ్రహం 9వ స్థానంలో పితృ స్థానంలో ఉండినందున తండ్రి వల్ల ధనప్రాప్తి కలుగును. పూర్వార్జిత ప్రాప్తి అధికారుల వల్ల మేలు జరుగును. పూర్వీకుల సంబంధించిన స్థిరాస్తులు పొందేడి అవకాశం కలదు. ధనప్రాప్తి కలుగును. కళత్ర సుఖం పొందుతారు. కార్యలాభం, విద్యా సంబంధిత సంస్థల వల్ల వాటి నుండి ధన లాభం కలుగును. అధికారికంగా శక్తిని పొందుతారు. అధికారిగా ఆజ్ఞలను జారీ చేస్తారు.

శుక్రుడు ఈ మిధున రాశి వారికి ఈ 15 రోజులలో కొన్ని నిర్ణీత తేదీలలో ప్రతికూలుడు. స్త్రీ వలన ఉపద్రవములు కలుగును. ధనూరాశిలోని శుక్రుని యొక్క ప్రతికూలత వల్ల శృంగార సంబంధాలు కల్పించుకున్న స్త్రీల వల్ల సమాజంలో, గృహంలో అవమానము, అలజడి, అపవాదులు సంభవించును.

మేషరాశి గోచార ఫలితాలు

వృషభరాశి గోచార ఫలితాలు

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

 

Leave a Reply