మకరరాశి గోచార ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 31, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు. 

మకరరాశి

రవి 12వ భావంలో ధగ్ధ యోగములు కలుగజేయును. పెట్టుబడులు వృధా అగును. పై అధికారులు వీరి నుండి బహుమానము పొంది కూడా వీరి కార్యమును నిలిపి వేస్తారు. కార్యములకు భంగం కలుగును. ధన క్షయం కలుగును. ఆ తరువాత రవి మకరంలోకి ప్రవేశించడం వల్ల ఇంట్లో రోగం, అతి కష్టములు కలుగును. 

కుజుడు ఏకాదశ స్థానమందు ఉండినందున ఈ స్థానము పూర్వ జన్మ స్థానము కావడం చేత జాతకులు పూర్వజన్మమందు చేసిన సుకృతములు అనగా పూర్వజన్మలో వ్యక్తులకు వీరు చేసిన సహాయము తమ పరపతితో వ్యక్తులకు అండదండగా ఉండి వారిని రక్షించినందున ఆ ఫలితాలు ఈ పక్షం రోజుల్లో కూడా ఉపకరించును. అందుకరణంగా వీరికి చిన్న పాటి అధికారము కలిగిన వారి నుండి లాభము, ఆనందం, స్థాన లాభములు ప్రాప్తించును.

బుధుడు తను భావంలో ఉండినందున వీరి ఆలోచనల కారణము చేస్తే బంధువులతో కలహము కలుగును. అధికారులను దూషించు విధముగా మాట్లాడుట వల్ల నష్టము కలుగును. దూరదేశ సంచారము కలుగును.

గురువు ధనస్థాన మందు ఈ 15 రోజులలో కొన్ని రోజులు లాభాన్ని కలుగజేయును. ద్రవ్యాలభం, శత్రువులు క్షయం అవడం, స్త్రీ సౌఖ్యం కలుగును.

శుక్రుడు 12లో ఉన్నందున శుక్రుని అనుగ్రహం చేత పలు విధముల ద్రవ్య లాభం, వస్త్ర కొనుగోళ్ళు, స్త్రీ సౌఖ్యం కలుగును.

శని తనుభావంలో విశేష దృష్టి వల్ల భార్యా సాంగత్యం, ఆహార సౌఖ్యం, సుగంధ, శయన సామానులు కొనుగోళ్ళు- విశేష వస్త్ర ప్రాప్తి కలుగును.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply