కుంభరాశి గోచార ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 30, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు. 

కుంభరాశి

రవి ఏకాదశ స్థానమందు ఉండి పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యముల ఫలితము ఈ పక్షం రోజులలో కూడా ఫలింప జేయును. పూర్వజన్మలో జాతకులు వ్యక్తులకు చేసిన ఔషధ సహాయము, స్థలమును తాత్కాలికముగా (బాడుగ) దానము చేసినందున స్థాన లాభం కలుగును. ఐశ్వర్య ప్రాప్తి, రోగ శాంతి కలుగును. మంచి కార్యము చేస్తారు. ఆ తరువాత రవి మకరరాశిలోకి అనగా 12వ భావములోకి ప్రవేశించడం వల్ల కార్యహాని, ధన హాని కలుగును. 

దశమ స్థానములో కుజుడు ఉన్నందున వృత్తి, ఉద్యోగముల వలన ధనలాభం కలుగును.

బుధుడు 12వ స్థానములో ద్వాదశాశాధిపత్యాన్ని పొంది ఉండినందున ప్రతికూలుడై ధగ్ధ యోగమును కల్పించును. శత్రువుల వలన ఉపద్రవము, అనారోగ్యములు కలుగును, ఏ ఆలోచన చేసినా అది నాశనం అగును.

గురువు తనుభావంలో ఉండినందున ఉన్న ప్రదేశము విడిచి పెట్టాల్సిన పరిస్థితులు ఎదురగును. బుద్ధి మాలిన పనులు చేస్తారు. ద్రవ్య నాశనం, కలహాలు కలుగును.

శుక్రుడు ఏకాదశ స్థానంలో పూర్వజన్మమందు ఆహార పధార్థాలు దానం చేయుట వలన ఆ పుణ్యఫలం ఈ దశలో వీరికి భక్షణ సౌఖ్యాన్ని కల్పించును. సుగంధ ద్రవ్యములను పొందును. బంధువుల నుండి ఉపకరములు కలుగును.

శని 12వ భావంలో పలు విధముల ద్రవ్యలాభాన్ని కల్పించును. వస్త్ర లాభాన్ని, ఆభరణ ప్రాప్తి కలుగును.

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply