కర్కాటక రాశి గోచర ఫలితములు

జనవరి 1, 2022  నుండి జనవరి 14, 2022 వరకు గల గ్రహస్థితుల ద్వాదశ రాశుల వారికి గ్రహ గోచార ఫలితాలు.  

కర్కాటక రాశి

ఈ రాశివారికి రవి గ్రహం 6వ స్థానంలో ఉండటం వల్ల గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది.6వ స్థానంలో ఉన్న రవి అనుకూలంగా ఉండటం వల్ల శత్రువులకు సమస్యలు ఏర్పడతాయి. శత్రువులు తాత్కాలికంగా నశిస్తారు. కొన్ని విషయాల గురించి బాధపడుతున్న వ్యక్తులకు మనఃశాంతి కలుగుతుంది.

మంగళుడు (కుజుడు) కర్కాటక రాశి వారికి ఈ పక్షం రోజులలో పంచమ స్థానంలో ఉండటం వల్ల పంచమ స్థానం సంతాన స్థానం కావడం వల్ల కొంత ప్రతికూలంగా ఉంటుంది. తమ సంతానం కోసం ఎదుర్కొనే సమాజ పరమైన వ్యక్తుల వల్ల శతృభయం ఆందోళనలకు గురి చేస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే తమ సంతానం వల్ల తమ గౌరవానికి మరియు తమ సంతానానికి ప్రాణ హాని, మాన హాని సంభావిస్తుందని బాధకు గురవుతారు. తమకు ఏదైనా అనారోగ్యాలు ఉన్నాయేమో అని కలత చెందుతారు.

బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల అది వైవాహిక స్థానం కావడం వల్ల భార్యా భర్తల మధ్య కలహాలు సంభవిస్తాయి.

గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల భరించలేని విధంగా దుఃఖం కలుగుతుంది. అనారోగ్యాలు, అత్యధిక శ్రమ కలుగుతాయి. తమ స్వాతంత్రానికి భంగం వాటిల్లుతుంది. శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఈ స్థానము రుణములకు, రోగములకు శత్రువులకు సంబంధించిన స్థానం కావడం వల్ల శుక్రుడు 6వ స్థానంలో ఈ 15 రోజుల్లో ప్రతికూలంగా ఉండటం వల్ల అన్యస్త్రీల కోసం విలాసాలా కోసం మధ్యమ మరియు మొదలగు విషయాల కోసం అనవసరమైన ఋణాలు చేయడం జరుగుతుంది. ఆకస్మికంగా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. శత్రువుల నుండి శతృపేదకు గురి కావడం జరుగుతుంది.

శనీశ్వరుడు దాంపత్య స్థానమున ఉండటం వల్ల ప్రస్తుత దశలో శని సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉండటం చేత దంపతుల మధ్య జరిగే గొడవలు, చట్టపరమైన వాటి ముందుకు వెళ్లవలసి వస్తుంది మరియు పరాయి స్త్రీల వలన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

Related Articles:

బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ద్వారా మాత్రమే మానవుడి పూర్వజన్మ పాపాలు తెలుస్తాయి. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య పరిశీలన ఆంధ్ర దేశములో శ్రీ C.V.S.చక్రపాణి గారు  ఆచరిస్తున్నారు. ఈ బ్రహ్మ తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా 12 రకాల కాలసర్పదోషాలకు, పైశాచిక కుజ దోషాలకు, సంతాన లేమికి, సర్పశాపాలకు, పితృశాపాలకు, మాతృ శాపలకు, పక్షి శాపాలకు, స్త్రీల వలన, ప్రేమ వ్యవహారాల వలన ఎదుర్కొంటున్న సమస్యలకు శీఘ్ర పరిహారాలు, పరిష్కారాలు జరిపించుకోవచ్చు. ప్రముఖ కేరళ జ్యోతిష్యులు మన్నారుశాల నాగరాజ, నాగాయక్షి సేవకులైన శ్రీ C.V.S.చక్రపాణి గారిని క్రింది నంబర్లకు సంప్రదించగలరు. పూర్తి జాతక చక్ర పరిశీలన, దోషములు, పరిహారములు, ప్రాయశ్చిత్తములు కొరియర్ ద్వారా పొందుటకు సంప్రదించండి. 

 Ph: 9846466430

Email: chakrapani.vishnumaya@gmail.com

Leave a Reply